Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటతొంబదియవ అధ్యాయము - అనేకవిష్ణుప్రాదుర్భావము శక్రః : అస్మిన్ మన్వంతరే భ##ద్రే గరుడస్య చ సంభవః | మయాదృష్ట మతీతేషు కథం గరుడవాహనః ||
1 అసురాన్ ఘాతయామాస భవిష్యేషు తథైవచ | గరుడం తు సమారుహ్య ఘతయిష్యతి తత్కథమ్ ||
2 మన్వంతరాంతే సర్వేషాం క్షయో యస్మాత్ర్పకీర్తితః | తస్మా దేతన్మమాచక్ష్వ కుశలాహ్యసి ధార్మికా || 3 శాంబరాయణీ : దేవానామసురాణాంచ ప్రతిమన్వంతరం యథా | సంభవస్త్రిదశ##శ్రేష్ఠ ! గంధర్వాణాం తథా స్మృతః || నాగానాం రాక్షసానాంచ యక్షాణా మథ పక్షిణామ్ | సుపర్ణానాం తత్ర శక్ర! ప్రాణినా మప్యశేషతః || 5 సువర్ణానాం ప్రధానస్తు తత్ర మన్వంతరే తదా | సదైవ రాజన్ ! భవతి గరుడః పతతాం వరః || 6 వాహనత్వే తథాతస్య దేవేశస్య ప్రపద్యతే | ప్రాదుర్భావాణ్య థోక్తాని యథా విష్ణోర్మయా తవ || 7 తథైవ తస్యజ్ఞేయాని గరుడస్య మహాత్మనః | దేవాస్తు కృతకర్మాణః శక్ర ! మన్వంతర క్షయే || 8 త్యక్తాధికారా గచ్ఛన్తి పరలోక మితః పభో ! తల్లింగాశ్చ తథా మంత్రా సై#్తరేవ సహితాస్సురైః || 9 సమూమశ్చైవ మంత్రాణాం దేవస్త్రి దశపూజితః | శరీరీ బ్రహ్మసదనే సతు నిత్యః ప్రకీర్తితః || 10 యావజ్జీవతి వై బ్రహ్మా సర్వలోక నమస్కృతః | తదా తు పురుషం బ్రహ్మా దేవదేవం ప్రపద్యతే || 11 త్యక్త్వా శరీరం దేవో೭పి పురుషం ప్రతిపద్యతే | పురుషో೭పి మహాసృష్టిం మహాభూతగణం తథా || 12 కరోతి తద్వదేవేహ దేవః ప్రాగ్వచ్ఛత క్రతో! ఏవం సర్వమిదం నిత్యం త్వనిత్యం వాతవేరితమ్ || 13 నా೭సతో విద్యతే భావో నాభావో విద్యతే సతః | ఉభయోరపి దృష్టో೭న్తస్త్వనయో స్తత్వదర్శిభిః || 14 అవినాశితు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ | వినాశ మవ్యయస్యాస్య న కశ్పత్కర్తు మర్హతి || 15 తస్యా೭ వినాశినః శక్ర ! సూక్ష్మస్యాపి మహాత్మనః | ప్రాదుర్భావ సహస్రాణి సమతీతా న్యనేకశః || 16 భూయశ్చైవ భవిష్యన్తి నాత్రకార్యా విచారణా | వైవస్వతే೭స్మిన్ దేవేశ ! యథా మన్వంతరే శుభే || 17 ప్రాదుర్భావాని దృష్టాని మయాతస్య మహాత్మనః | వరాహం వామనం చైవ తథా శక్ర ! త్రివిక్రమమ్ || 18 నారసింహం తథా మాత్స్యం కూర్మం హంసం తథైవచ | నృవరాహం తథా రామం రామం చ సురసత్తమ ! 19 మాంధాతారం పృథుంచైవ కార్తవీర్యార్జునం తథా | ధాతారం చ తథా మిత్రం చాంశు మర్యమణం తథా || 20 పూషణం చ భవన్తం చ వరుణం భగమేవచ | త్వష్టారం చ వివస్వంతం సవితారం తథైవ చ || 21 విష్ణుం చంద్రమసం రుద్రం బ్రహ్మాణం యమమేవచ | హుతాశనం వైశ్రవణం శేషం నాగేశ్వరం తథా || 22 గ్రహముఖ్యం బుధంచైవ ఆపః ఖం పృథివీ తథా | వాయుస్తేజశ్చ దేవేశ ! తథైవాన్యాని వాసవ 23 ప్రాదుర్భావ సమస్రాణి తస్యదృష్టాని యానితే | మన్వంతరే ష్వతీతేషు తస్యా೭తీతా ప్యనేకశః || 24 భవిష్యన్తి భవిష్యేషు శతశో೭థ సహస్రశః | మన్వంతర మథాసాద్య చైవమేకం తథా తవ || 25 ప్రాదుర్భావ మిదంప్రోక్తం ద్విగుణం ద్విగుణం యతః | ప్రాదుర్భావా స్యశేషేణ వాసుదేవస్య చక్రిణః || కస్సమర్థో భ##వేద్వక్తు మిహ వర్షశ##తైరపి. 26 ఏకస్సదేవో భువనస్య గోప్తా వరః పురాణః పురుషోమహాత్మా | తస్యాంశ మాత్రం భువనం సమగ్రం భాగాస్త్రయ స్తస్య సవర్ణనీయాః . 27 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే అనేక విష్ణుప్రాదుర్భావ వర్ణనంనామ నవత్యధిక శతతమో೭ధ్యాయః. ఇంద్రు డిట్లడిగెను : కల్యాణి! శాంబరాయణీ ఈ మన్వంతరమందుగదా గరుడుడుదయించుట నేను జూచితిని. అతీత మన్వంతరములందు గరుడవాహనుడెక్కడున్నాడు. గరుడునెక్కి యసురుల లోగడ జంపెను. ముందను జంపగలడంటివి. ఇదెట్లు కుదురును. మన్వంతరము తుద నందరు క్షయింతురని చెప్పబడినదే. నీవు ధర్మికవిషయకుశలవు. కావున నానతిమ్మన శాంబరాయణి యిట్లనెను. ప్రతి మన్వంతరమందును దేవాసురులు గందర్వులు నాగులు పక్షులు గరుడులు మున్నగు సశేష ప్రాణులు పుట్టుచునే యుండును. సుపర్ణుల కధీనాథుడు కూడ యట్లేమన్వంతరమందెల్లపుడు పుట్టుచునేయుండును. ఆయన దేవదేవుడగు విష్ణునకు వాహనమగుచునేయుండును. అదేవిధముగా విష్ణువుయక్క యవతారములను నేను నీకు జెప్పితిని. అట్లే మహాత్మడగు గరుడుని యవతారములు. దేవతలు తమపని నిర్వహించికొని మన్వంతరక్షయమందు స్వాధికారములను విడిచి యట నుండి పరలోకమున కేగుదురు. ఆయా దేవతా లింగములైన మంత్రములు గూడ యా దేవతలో వారేగుదురు. ఆయా మంత్రములు సమూహ స్వరూపుడు దేవతా పూజితుడైన దేవుడు శరీరియై మూర్తిధరించి బ్రహ్మసదన మందుండును. అతడు నిత్యుడని కీర్తింపబడినాడు. సర్వ లోకనమస్కృతుడైన బ్రహ్మ జీవించుయున్నంతకాలము అదేవదేవుడైన పురుషుని బొందియుండును. బ్రహ్మ కాలా న్తమందాతడు శరీరము విడిచి యాపురుషుని యందు జేరును. ఇంద్రా! అపురుషుడును మహాసృష్టిని మహాభూతగణమును ముంగటి యట్ల యిహముందదే రూపమున సృష్టించును ఇట్లే సర్వము నీకు నిత్యము అనిత్యమునుంగా రెండుతెఱగులని నీకూ దెల్పితిని. లేనిదాని కునికిలేదు. ఉన్నదానికి లేమి లేదు. ఈ రెండింటికిని తుదిచూచినారు. తత్త్వదర్శులైనవారు. దేన నీ యెల్లనిండినదది నశింపనిదని యెఱుంగుము. అవ్యయమైన (అవినాశియైన) దీని కెవ్వడును వినాశముం గూర్చజాలడు. అయవినాశి వస్తువు సూక్ష్మము. మహానుభావయు ఆ పురుష వాచ్యమైన వస్తువున కనేక సమస్ర ప్రాదుర్భావములైనవి. ఇంకను ముందు కానున్నవి. అందు విమర్శ చేయదగదు. ఈ వైవస్వత మన్వంతర మందో పుణ్యురాల! ఆ మహాత్ముని యవతారము లేను జూచితిని. వరాహము వామనము (త్రివిక్రమమన్నమాట) నారసింహము మాత్స్యము కూర్మము హంసావతారము నవరవాహము రామము (పరశురామము) రామము (దశరథరామము) మాంధాత పృథుచక్రవర్తి కార్తవీర్యార్జునము ధాత (బ్రహ్మ) మిత్ర అంశు, అర్యమ పూష వరుణ భగత్వష్ట వివస్వంతులను సవిత విష్ణువు చంద్రుడు రుద్రుడు బ్రహ్మయముడు అగ్ని వైశ్రవణుడు (కుబేరుడు) శేషుడు (నాగేంద్రుడు) గ్రహముఖ్యుడైన బుధుడు జలము పృథివి వాయువు తేజస్సు మఱియుంగలవి యన్నియు నా దేవదేవుని పురుషోత్తముని యవతారములే. వాని నెల్ల నేను జూచితిని. అతీత మన్వంతరములందెన్నో గడచినవి. ముందు రానున్నవి. మన్వంతర మొక్కొక్కటి ననుసరించి వాసుదేవునవతారము రెట్టించి రెట్టించి వచించితిని. వందఏండ్లైన హరి సర్వావతారముల నెవ్వడు వచింప సమర్థుడు? ఆదేవుడొక్కడే భువనగోప్త (లోక రక్షకుడు) పురాణ పురుషుడు మహాత్ముడు సర్వభువన మాయస యొక్క భాగము మాత్రము. ఆయన తక్కిన మూడు భాగములు వర్ణింప నలవి గానివి. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున విష్ణు ప్రాదుర్భావ విశేషవర్ణనమను నూటతొంబదియవ యధ్యాయము.