Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటతొంబదిఎనిమిదవ అధ్యాయము - హేతివంశ వర్ణనము వజ్రః : అజః షండః పిశాచౌద్వౌ భూసాల కిపిశా సుతౌ | పిశాచీ బ్రహ్మధానాఖ్యా తత్రాజస్య సుతా మతా ||
1 పిశాచీ యాతుధానాఖ్యా షండస్య తనయా మతా | అజశ్చ రాజ షండశ్చ నిశీథే క్షుధితావుభౌ ||
2 బహిర్భృత్యౌతు సహితౌ దృష్ట వన్తౌ నరేశ్వర! రాక్షసం క్షుధితాకారం పతంతం క్షుధితం నిశి ||
3 గృహీతః స పిశాచాభ్యాం క్షుధితాభ్యాం యదాబలీ | పృష్ట స్స తాభ్యాం యత్నేన దృష్ట్వా తస్య తదా బలమ్ ||
4 జగాద భూమిప శ్రేష్ఠ! చోభయో ర్జన్మ కారణమ్ | జన్మ కర్మచ తౌ తస్య శ్రుత్వా పిశిత భోజనౌ ||
5 దదతుః కన్యకే తస్య రాక్షసస్య నరాశినః | భార్యా ద్వయస్య వంశౌ ద్వౌ రాక్షసస్య ప్రకీర్తితౌ ||
6 బ్రహ్మధానాన్వయే తస్య బ్రహ్మధానా నిశాచరాః | యాతుధానాన్వయే తస్య యాతుధానాః ప్రకీర్తితాః ||
7 మార్కండేయుడిట్లు చెప్పదొడంగెను : కపిశ కొడుకులు అజుడు షండుడు నను వారిద్దరు పిశాచులు. అజుని కూతురు బ్రహ్మధాన యనునది పిశాచి. యాతుధానయను పిశాచి షండునికూతురు. ఆజుడు షండుడు నొక రేయి మిక్కిలి యాకలిగొనిరి. ఇద్దరుంగలిసి వెలికేగి యా రాత్రి క్షుధితాకారుడై (ఆకలి రూపై) మీదబడు నొక రాక్షసుని క్షుధితుడనువానిం జూచిరి. వాడు బలశాలి. పిశాచు లిద్దరిచే బట్టుకొనబడి వాని బలముచూచి నీవెవ్వడవని ప్రశ్నింపబడెను. ఓ రాజేంద్రా ! వాడా యిద్దరకు తన జన్మ కారణము చెప్పెను. వాని జన్మకారణము విని యా పిశితాశనులు (మాంసభుక్కులు = రాక్షసులు) ఆ నరభక్షకుని కిద్దర కన్యల నిచ్చిరి. ఆ రాక్షసుని కా భార్య లిద్దరివలనగలిగిన వంశములు రెండు. బ్రహ్మధాన యొక్క వంశమువారు బ్రహ్మధానులను రాక్షసులు. యాతుధాన యొక్క వంశమువారు యాతుధానులని పిలువబడిరి. బ్రహ్మధానాన్వయే జాతానాదౌ వక్ష్యామి రాక్షసాన్ | యజ్ఞహా నిర్ధని క్షేవా బ్రహ్మపూతో7థ నిఘ్నవాన్ ||
8 శ్వాన కృత్కుంతల సర్పో బ్రహ్మధానాత్మజాః స్మృతాః | తేషా మన్వయ సంభూతాః శతశో7థ సహస్రశః ||
9 శ్లేష్మాతక వనస్థానాః కథితా బ్రహ్మరాక్షసాః | హేతిః ప్రహేతి రుగ్రశ్చ పౌరుషాదో వధస్తధా ||
10 విద్యుత్ స్ఫూర్జశ్చ వాతశ్చ నసో వ్యాఘ్ర స్తథైవచ | సుసకృచ్చ కరాలశ్చ యాతుధానాత్మజా దశ || 11 సూర్యస్యాను చరా హ్యేతే సహతేన భ్రమన్తి వై | తేషామన్వయ సంభూతా యాతుధానాః ప్రకీర్తితాః || 12 హేతి ప్రహేతి వంశౌ ద్వౌ తవ వక్ష్యామి యాదవ! | హేతి పుత్రః స్మృతో లంకుర్యస్య సాల కంటంకటాః || 13 సంధ్యాసుతా స్మృతా భార్యాసుకేశస్తత్సుతః స్మృతః | మాలీ సుమాలీ చతథా మాల్యవాంశ్చ మహాబలః || 14 సుకేశ తనయా హ్యేతే దేవాసుర భయం కరాః | తపసా తైస్సమారాధ్య దేవ దేవం జనార్దనమ్ || 15 వీర్య మప్రతిమం ప్రాప్తం లంకాచైవ మహాపురీ | సుమాలి తనయా తత్రకైకసీ నామ రాక్షసీ || 16 భార్యా విశ్రవసః పుత్రోయస్యా రావణ సంజ్ఞకః | త్రిలోక విజయీతస్య రావణస్య దురాత్మనః || 17 సుమాలీ వసునాయుద్ధే ధరేణ వినిపాతితః | మాలీచ దేవ దేవేన కేశ##వేన నిపాతితః || 18 బ్రహ్మధాన వంశ జాతులయిన రాక్షసులం దొలుత జెప్పెద. యజ్ఞహులు (యజ్ఞధ్వంసకులు) నిర్ధనిక్షేపునైన బ్రహ్మపూతుడు నిఘ్నవంతుడు శ్వానకృత్తు కుంతలుడు సర్పుడు బ్రహ్మధాన పుత్రులు. వారి వంశీయులు వందలు వేలు పుట్టిరి. శ్లేష్మాతక వనస్థానులు బ్రహ్మరాక్షసులని చెప్పబడిరి. హేతి ప్రహేతి ఉగ్రుడు పౌరుషాదుడు వధుడు విద్యుత్‌స్ఫూర్జుడు వాతుడు నసుడు వ్యాఘ్రుడు సుసకృత్ కరాలుడు ననువారు యాతుధాన పుత్రులు పదిమంది. వీరు సూర్యానుచరులు. సూర్యునితోకూడ తిరుగుచుందురు. వారి వంశీయులు యాతుధానులని పేరందిరి. హేతి ప్రహేతి వంశములు రెంటిని నీకిక తెల్పెద. హేతి కొడుకు లంకుడు. వాని పరంపర సాలకంటకటు లనబడిరి. సంధ్యాసుత వాని భార్య. ఆమె కొడుకు సుకేశుడు. మాలి సుమాలి మహాబలుడగు మాల్యవంతుడు సుకేశుని కొడుకులు దేవాసుర భయంకరులు. వారు తపస్సుచే దేవదేవుని జనార్దనునారాధించి అప్రతిమ వీర్యము బడసిరి. లంకానగరముంగూడ పొందిరి. సుమాలి కూతురు కైకసి యను రాక్షసి విశ్రవసుని భార్యయయ్యె. ఆమె కొడుకు రావణుడు. ఆతడు త్రిలోకవిజయి. ఆ దురాత్ముడు రావణునికి వసువుతో జరిగిన యుద్ధములో సుమాలి ధరునిచే గూల్పబడెను. మాలి యనువాడు విష్ణునిచే విహతుడయ్యెను. మాల్యవాం స్తత్ర వర్షాత్మా జీవత్యద్యాపి యాదవః | శ్రావితౌ భ్రాతరౌయేన పురా దేవరణోత్సుకౌ || 19 హితం ధర్మ్య శుభంవాక్యం నచతౌ తస్య చక్రతుః | తేనతౌ నిధనం ప్రాప్తౌ రాక్షసౌ సమరద్వయే || 20 సంశ్రావితస్తేన తథైవ వాక్యం సరావణో నామ విరోధకాలే | ఉల్లంఘ్య వాక్యం నిధనం జగామ ధర్మేస్థిత స్యాప్రతిమ ప్రభావః || 21 ఇతి శ్రీవిష్ణుధర్మత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే హేతివంశ వర్ణనం నామ అష్టనవత్యధిక శతతమో7ధ్యాయః. మాల్యవంతుడు వర్షస్వరూపుడై యిప్పుడును బ్రతికియున్నాడు. వాని సోదరులు దేవతలతో బోర నుత్సాహపడినారని యింతమున్ను వినిపించితిని. వారు మాల్యవంతుని యొక్క హితము ధర్మము శుభమునైన మాటప్రకారము చేసినవారుగారు.అందుచే వారు రెండు రణములందు మరణించిరి. ఆవిధముగానే మాల్యవంతుడు రావణునికిని విరోధసమయమున హితముసెప్పెను గాని ఆసమానప్రభావుడతడును నా ధర్మవర్తనుని మాట వినిపించుకొనక మరణమందెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున హేతివంశవర్ణనమను నూటతొంబదియెనిమిదవ యధ్యాయము.