Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటతొంబదితొమ్మిదవ అధ్యాయము - చ్యవనజననము మార్కండేయః : ప్రహేతి తనయో రాజన్! పులోమానామ విశ్రుతః |
క్రోధదృష్ట్యాతు యశ్శీఘ్రం చ్యవనేన వినాశితః |
1 వజ్రః : చ్యవనేన కిమర్థం వై పులోమా రాక్షసో హతః | కథం చభృగు శార్దూల తన్మమాచక్ష్వ పృచ్ఛతః ||
2 మార్కండేయః : పులోమ్నోదావేంద్రస్య ద్వేకన్యే భువి విశ్రుతే | పులోమా భృగవేదత్తా శచీదత్తాచ వాసవే || 3 కన్యాభావే రుదన్తీతు కదాచిద్యదు నందన! | పులోమా ముక్తవాన్ రాజన్! పులోమా దానవేశ్వరః || 4 హేరక్షః! కన్యకా మేతాం గృహ్ణీష్వ రుదతీం బలాత్ | ఏతస్మిన్నేవ కాలేతు పులోమ్నో భవనా7జిరే || 5 ఛిద్రాన్వేషీ దురాచారః పులోమా స వ్యతిష్ఠత | అనుసృత్యచ జగ్రాహ తాంకన్యాం చారులోచనామ్ || 6 నిర్భర్త్స్య తందురాచారం పులోమా దానవోత్తమః | కాలేన ప్రదదౌ కన్యాం భృగవే తాం సుమధ్యమామ్ || 7 అన్తర్వ త్నీంతు రహితాం భృగుణా తా మనిన్దితామ్ | అగ్ని హోత్రగతాం దృష్ట్వా పులో మా7గ్నిమథాబ్రవీత్ || 8 పౌలోమీ యది మత్పూర్వా సేయం పావకశంసమే | తా మగ్ని రబ్రవీత్తస్య సేయం పత్నీ భృగోశ్శుభా || 9 ఏవమగ్నేః భృగోః శ్రుత్వా తాం జహారసరాక్షసః | తస్యాం తు దృశ్యమానాయాం గర్భః కుక్షేః తదా చ్యుతః || 10 చ్యవనా చ్చ్యవనో నామ బభూవ స మహాతపాః | దృష్టమాత్రస్తు తేనా7సౌ పులోమా భస్మసాద్గతః || 11 పులోమాశ్రునిపాతేన నదీజాతా వధూవరా | వహ్నిశ్చ సర్వభక్షత్వం భృగుశాపాదుపాగతః || 12 హుతాశనస్తు సంక్రుద్ధ శ్శాపం ప్రాప్యద్విజోత్తమాత్ | లోకకార్యరతి ర్బ్రహ్మా స్వయం వచన మబ్రవీత్ || 13 వహ్నే! తవార్చిభిః స్పృష్టం శుచి సర్వం భవిష్యతి | శుచిభూతం తతః పశ్చాద్భక్షయిష్యత్య సంశయమ్ || 14 ఏతత్తవోక్తం చ్యవనస్య జన్మ నాశస్తథా రాక్షస పుంగవస్య ! వహ్నేశ్శు చిత్వం చతథార్చిషాంవై వంశం పులోమో7థ నిబోధ రాజన్! 15 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్ర సంవాదే చ్యవనోత్పత్తి వర్ణనం నామ సవనవత్యధికశతతమో7ధ్యాయః. మార్కండేయుడు చెప్పదొడంగెను. ప్రహేతికొడుకు పులోముడు. ప్రసిద్ధుడు. చ్యవనమహర్షి క్రోధదృష్టికి గురియై నశించెనన వజ్రనృపతి యాకథతెలుపుమన మార్కండేయుడిట్లనియె. పులోముడను దానవపతి కిద్దరు కూతుండ్రు జగత్ప్రసిద్ధలు. అందు పులోమ భృగుమహర్షికి శచి యింద్రునికి నీయబడిరి. కన్యగా నున్నపుడొకతరి నేడ్చుచున్న పులోమనుజూచి దానవపతి పులోముడు ఓ రక్షస్సూ ! ఈ యేడ్చుచున్న కన్యను బలిమియై గొనిపొమ్మనియె. ఇదేసమయమున పులోమునింట దురాచారుడొకడు పొరపాటును వెదకుచుండెను. ఆట్లనుసరించుచునే దురాచారుని బెదిరించి యాదానవుడు ఆ సుందరిని పట్టుకొనెను. కొంత కాలమునకామెను భృగువునకిచ్చెను. ఆమె గర్భవతికాగా భృగువులేనపుడు అగ్నిహోత్రసన్నిధినున్న యా పవిత్రురాలిని జూచి యగ్నితో నిట్లనియె. ఇది నాకూతురు పౌలోమియేనా? ఓ పావక ! నాకుదెల్పుమన నగ్ని యీమెయే యిపుడు భృగువు భార్యయైనదని చెప్పెను. ఈమాటవిని యా రాక్షసుడామెనెత్తికొని పోయెను. చూచుచుండగనే నంత యామెగర్భమందున్న శిశువు కడుపులోనుండి చ్యుతుడయ్యెను. అందువలన మహాతపస్వి యతడు చ్యవనుడని పేరొందెను. అతడుచూచినంతనే పులోముడు భస్మమయ్యెను. ఆటుపై పులోమ కంటనీరుగురియ నది నదియయ్యెను. భృగుశాపముచే నగ్ని సర్వభక్షకుడయ్యెను. హుతాశనుడు అగ్ని యాభృగుడను నుత్తమ బ్రాహ్మణునివలన శాపముపొంది కోపమునొందెను. ఆయననుగని బ్రహ్మ లోకకార్యము జరుగవలెనను నాసక్తితో నో వహ్నీ ! నీ జ్వాలలచే స్పృశింపబడినదెల్ల శుచియగును. శుచిభూతమైన దానినాతరువాత నీవు భక్షింతువు. దాన సందేహమక్కర లేదనెను. పులోమ రాక్షసుని నాశనము చ్యవనుని జననము అగ్నిజ్వాలలయొక్క శుచిత్వము నీకుదెల్పితిని. ఇక పులోముని వంశమును వినుము. ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున చ్యవనజననమను నూటతొంబదితొమ్మిదవ అధ్యాయము.