Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల పదునేడవ అధ్యాయము - మాలిరాక్షస వధ తతః ప్రావ ర్తత రణం స్వస్థయో ర్బలయో స్తయోః | నానా ప్రహరణో దగ్ర భుజయో ర్జయ మిచ్ఛతోః ||
1 తదా బలాభ్రసంఛన్నే గగనే ఖడ్గ విద్యుతి | తస్మి న్నేవ క్షణ జాతో భానుమాన్ నృప విద్యుతిః ||
2 చలత్ఖడ్గ లతా విద్యుత్సము ద్యోతిత విగ్రహాత్ | రక్తవృష్ఠిః పపాతో ర్వ్యాం బలమేఘాను విగ్రహాత్ ||
3 తతః శోణీత వర్షేణ సిచ్యమానే మహితలే | గ్రావ వృష్టి ర్మహత్యాసీ చ్చాదితం భూతలం యయా ||
4 ఆసి దగమ్యా వసుధా శోణి తౌఘ పరిప్లుతా | రజస్వలేవ యువతి స్తథా తత్ర నరాధిప || 5 స్ఫురమాణా విదృశ్యన్తే బాహవ శ్చందనోక్షితాః | ఖడ్గ ప్రహార పతితాః పంచ శీర్షా ఇవోరగాః || 6 స్ఫురమాణా విదృశ్యన్తే బాహవ శ్చందనోక్షితాః | ఖడ్గ ప్రహార పతితాః పంచ శీర్షా ఇవోరగాః || 7 నిపతద్భి స్తథా ఛత్రై శ్ఛామరై ర్వ్యజనై స్తథా | విచ్ఛిన్న వాహనం గైశ్చ ఖ మాసీత్సంకులం తథా) || 8 కిరీటైః కుండలై ర్హారైః కేయూరై రంగదై స్తథా | పాత్యమానైః ఖ మభవ ద్రశ్మి పుంజ విరాజితమ్ || 9 క్షురప్ర విని కృత్తాని రుధిరాక్తే మహీతలే | లుఠన్తి నాగహస్తాని భోగి భోగ నిభానిచ || 10 అదృష్ట్వా పతితానీహా శిరాంసి వసుధాతలే | హత్వా వంశాన్ ఖ మాజగ్ము రన్వేష స్త ఇవాసవః || 11 శరీరై ర్భూతలం ప్రాప్తా దివం ప్రాప్తాః శరీరి భిః | అన్తరిక్షే వినిహితా లోకత్రయ జిగీషవః || 12 ఛిన్న రాక్షస మూర్ధానో దశ ద్రుధిర బిందవః | న్యపత న్నుత్తరా దేవ శ్యేనై రుపహృతాశయాత్ || 13 శ్వేనానాం భ్రమతాం తత్ర రాక్షసామిష లిప్సయా | బభూవ స దృశం రూపం శీర్షాణాం భ్రమతాం తథా || 14 నికృత్తాంగ నిపాతేన పతితా బహవ స్తథా | సుషుపు ర్గాం సమాలింగ్య క్రవ్యాదా రుధిరావిలాః || 15 నిపతన్ మత్త మాతంగ ప్రస్ఫుర త్కుంభ నిర్గతా | ముక్తాఫలై ర్జహాసోర్వీ శూరా లింగననిర్వృతా || 16 హత కుంజర దంతాగ్ర వినగ్నాంగా స్తురంగమాః | ఆ సేదుః సుచిరే ణోర్వీం సభసీవ గతా సవః || 17 సంప్రాప్త రుధిరాం భూమిం రక్తాస్యాస్తు నిశాచరాః | యయు శ్శరీరై ర్నిహతాః సమరే రుధిర ప్రియాః || 18 వర్తమానే తథా భియే యుద్ధే భీరు భయంకరే | లోకపాల శరవ్రాత నిర్భిన్నా రజనీచరాః || 19 దు ద్రువు ర్భయ సంవిగ్నా స్తదా రామ దిశోదశ | విప్రద్రుతం బలం దృష్ట్వా రాక్షసానాం దివౌకసైః || 20 సుమాలి ర్మాల్యవ ద్గుప్తో మాలీ దేవానథా బ్రవీత్ | ఆగస్త్యులనిరి. స్వసములై యున్న యాదేవరాక్షస బలములకు నానా విధాయుధోగ్రభుజులై జయముగోరి పోరువారి పెద్ద రణమయ్యెను. అపుడు సైన్యమను మబ్బులు గ్రమ్మిగగన మెల్ల కత్తులు మెఱపులట్లు మెరయు నాక్షణమందు భానుమంతుడు (సహస్రకిరణుడు) విశేషద్యుతి మంతుడయ్యెను. చలించు ఖడ్గలతలనెడి విద్యుల్లతలచే నుద్ద్యోతించు సేనయనెడి మేఘముయొక్క విగ్రహము నుండి (ఆకృతినుండి) యవనిపై రక్తవర్షము గురిసెను. రక్తవర్షముచే దడిసిన మేదినీతలమునందు భూతలమెల్ల గప్పుడునట్లు పెను రాళ్ల వర్షముపడెను. రక్త ప్రవాహములందడిసి రజస్వలయైన వనితవోలె నగమ్యమయ్యెను. (బహిష్టమైన స్త్రీ ముట్టరానిదగుట ప్రసిద్దము) యోధుల బాహువులు లోగడ చందనము పూసికొన్నవి ఖడ్గ ప్రహారముల దెగిపడి యైదుతలలపాములట్లు రణభూమిందీపించుచుండెను. వారి మొగములు రక్తములతోడి పలువరుసలు వంటకుపయోగించు దానిమ్మపండ్లట్లు భాసించినవి. తెగికూలు గొడుగులు చామరములు చామరములతో తెగిపడిన వాహనాంగములతో నాకసము సంకులమయ్యెను. కూల్పబడు కిరీటములు కుండల ములు హారములు కేయూరములు జాజుబందులు (అంగదములు) భుజకీర్తులతో నాకసము కిరణపుంజములతో రంజిల్లెను. కత్తులందెగి ఏనుగుతొండములు పాముపడగలం బోలె రక్తము మడువుగట్టిన పుడమిపై దొరలాడుచున్నవి. ఇక్కడ నేలపై బడిన తలలంగానక కూలిన భటుల ప్రాణములు వంశ ములంగూర్చి వెదుకబోయెనాయన్నట్లాక సమున కరుగుదెంచినవి. నడిమింట నిహాతులైన వీరుల శరీరములు భూతలముల బొందినవి. శరీరులు(జీవులు) దిపముంబొందిరి. ఈ విధముగా వారు లోకత్రయముం గెలువగోరిన వారట్లు తోచిరి. తెగిన రాక్షసులకు మస్తకములు రక్తపు జుక్కలం రాలుచుండ పడినచోటునుండి డేగలెత్తికొనిపోవ సుత్తర దెసగా క్రిందబడిపోయినవి రాక్షసుల మాంసము పీకికొని దినగోరి యచట నెగురు డేగలకును తెగిపడచున్న భటుల తలలకును సామ్య మేర్పడెను. అంగములు తెగిపడుటచే రక్తపుమడువులందడిసి క్రవ్యాదులు (పచ్చిమాంసము దిను రాక్షసులు) పెక్కుమంది యయ్యెడంబడి పుడమిం గౌగలించుకొని (పెద్ద) నిదురవోయిరి. శూరుల గౌగలింతలం మిక్కిలి తనివందినదివోలె కూలిపడు మదపుటెనుగుల బిట్టదరు కుభస్థలమునుండి చెదిరిపడు ముత్యాలతో నవని నవ్వుచుండెను. (ఒక శృంగార నాయికవలె నుండెనన్న మాట) యోధులు విరిచిన దంతములకొనలు మేనం గ్రుచ్చికొన్న గుఱ్ఱములు ప్రాణములవాసి చాలాసేపటికి సభోమాసమందట్లవనింబడినవి. రక్తముఖలయిన రాక్షసులనిలో శరీరముతెగి రుధిర ప్రియులై (రక్తదాహముతోనట్లు) రక్తసిక్తమైన భూమింబొందిరి. పిరికివాండ్ర కతిభయంకరమైన యుద్దమట్లు జరుగుచుండ లోకపాలుర బాణములదెగిన రాక్షసులు జడిసిపోయి పదిదెసలకుంబారిపోయిరి. దేవతల ఢాకకు బెదరిపారు రాక్షససేనంగని సుమాలియు మాలియు మాల్యవంతునిచే (గుప్తుడు) రక్షితుడయ్యెను. అటుపై మాలి దేవతలపైకి పర్విడెను. కిర ఞ్ఛరౌఘై ర్విమలై శ్శైలధౌతై శ్శిలాశితై ః || 21 సానుజేన రణముక్త్వా శరవృష్ఠి ర్దురాసదా | సంఛాదయా మాస దిశః ప్రదిశ శ్చ దివౌకసామ్ || 22 యథాశక్తి శరవ్రాతాన్ వారయన్తో ೭పి దేవతాః | రాక్షసేంద్ర శ##రైర్భిన్నాః కేశవంశరణం యయుః || 23 స నివార్య తదా సర్వం దేవసైన్యం పతత్రిణా | ప్రత్యుద్య¸° యుధో యోధాన్ ధనుషా సపతత్రిణా || 24 ఏతస్మిన్నేవ కాలేతు రక్షసాం పీన వక్షసామ్ | వినివృత్తం బలం సర్వ మమరైః సమరోత్సుకమ్ || 25 త ద్బలం సకల చక్రేశ##రైః శార్జ ప్రచోదితైః | ఛాదయా మాస సమరం గోభి స్సూర్య ఇవానిశమ్ || 26 నానా ప్రహరణోదగ్ర గర్జమానో జనార్దనమ్ | సంఛాదయాస తదా సర్వైః ప్రహరణోత్కరైః || 27 సంఛాద్యమానై సైర్ఘోరైః కేశవో రజనీచరైః | జహార శీర్షాణి తదా తేషాం సన్నత పర్వభిః || 28 రథ నీడే ధనుర్న్యస్య మాలీ రాక్షస పుంగవః | సుపర్ణం తాడయామాస గదయా భీమవేగయా || 29 గదా ప్రహారాభిహత స్తార్‌క్ష్యః పరపురం జయః : పరాజ్ముఖం రణా చ్ఛక్రే వేదనార్తో జనార్దనమ్ || 30 పరాజ్ముఖే తదా తార్‌క్ష్య పరివృత్తాననో హరిః | శీర్షం జహార చక్రేణ రాక్ష సేంద్రస్య మాలినః || 31 సకుండలం చారుకిరీటం జుష్టం నిశాచరే శస్య శిరః పృథివ్యామ్ | నిపాతితం వీక్ష్య ముదాన్వితాస్తా నార్యో బభూవు బభూవు స్త్రీదశోత్తమానామ్ || 32 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే శైలూషం ప్రతి నాడాయనాను శాసనే మాలి రాక్షసపద వర్ణ సంనామ సప్తదశోత్తర ద్విశతతమో ೭ధ్యాయః || నూనెరాచి మెరుగు పదునుపెట్టబడిన రాళ్ళనుగూడ జీల్పగల బాణములచే దమ్మునితోగూడ యని యందు శరవర్షముగురిసి దేవతల దిక్కులను మూలలను గుప్పివై చెను. వెల్పులు యథాశక్తిగ బాణజాలమును వారించియు రాక్షసేంద్రుని యలుగులం దెగి నారాయణుని శరణందిరి. ఆయన యయ్యెడ దేవసేన నాగుడని వారించి గరుడునెక్కి ధనువెత్తి యెదరు సనెను. ఇదే సమయమున బలిసిన రోమ్ములు గల రాక్షసులసేన యుద్ధోత్సుకమైనది దేవతలచే మరణింపబడెను. దానినెల్ల శార్‌జ్గ ధనుర్ము క్తములచే బాణములచే కిరణములచే సూర్యడట్లు గప్పవడజేసెను. నానా విధాయుధములూనియుగ్రముగ గర్జించుచు రాక్షసులు హరిం గప్పిరి. అట్లు రాక్షసులచే గ్రమ్మబడి సన్నతపర్వములైన బాణములచే హరి వారితలలు డుల్లనేసెను. రాక్షసపతి మాలి యరదము మొగసాల విల్లుంచి గదయెత్తి సుపర్ణుని గొట్టెను. గదాభిఘాతము దిని గరుడుండు వేదనకు సుడిసి యుద్ధమునుండి పెడమొగము పెట్టెను. అయ్యెడ తార్ష్యుండు పరాజ్ముఖుడయినంత మోమువెనుకకు ద్రిప్పి హరి రాక్షసరాజగు మాలి శిరస్సును జక్రముచేదెగసేసెను. కుండల ములతో చక్కని కిరీటముతో గూడిన యా నిశాచరేశ్వరుని తల యిలకుంబడగొట్టుటచూచి గూడి వేల్పు ముదితలు ముదమునంగూడిరి. ఇది శ్రీవిష్ణుధరోత్తర మహాపురాణము ప్రథమ ఖండమున మాలివధర్ణనమను నూటపదునేడవ యధ్యాయము. రెండు వందల పదునెనిమిదవ అధ్యాయము - రాక్షసపాతాళ ప్రదేశము అగస్త్యః : హతే మాలిని దేవేన సాన్త్వితః పక్షిరా డసౌ : జమార పక్షవాతేన నివృత్తో రక్షసాంబలమ్ || 1 తే తార్‌క్ష్య పక్ష బాతేన శుష్కపర్ణ చయో యథా | ద్రుతా రాక్షస శార్దూలా స్తదా రామ దిశో దశ || 2 అవింద మానా స్తే శర్మ వాసుదేవ యార్దితా ః | పాతాల తల మాసేదుః సర్వ ఏవ || పృథక్ పృథక్ || 3 త్రిదశాన్ సాంత్వయి త్వాచ విష్ణు స్త్రీ దశ పూజితః | అస్తర్ధానం య¸° తత్ర సర్వేషా మేవ పశ్యవతామ్ || 4 లంకా ೭ పి శూన్యా రాజేంద్ర! దత్తా వైశ్రవణాయసా| స్వయం విశ్రవస స్తస్య రావణన హృతా బలాత్ || 5 విభీషణా య సాదాత్తా త్వయా హత్వాచ రావణమ్ | రామ విష్ణుః సముత్పన్న స్త్వం వధాయేహ రక్షసామ్ || 6 త్వయైన యుద్దే నిహతా యే తు మాతుల సంకటాః | పౌలస్త్య రాక్షసా యేతు తేహతాః సాంప్రతంత్వయా || 7 హన్తాన విద్యతే రామ ! రక్షసాం కేళవం వినా | దృష్ట్రో೭స్మి భాషిత శ్చేతి ప్రయ¸° స యథాగతమ్ || 8 ఆగస్త్యులనిరి మాలి కూలినత రువాత హరి కుశల ప్రశమువేసి యాదరించిన తరువాత మరలివెళ్ళి గరుత్మంతుడు తన రెక్కలగాలిచే రాక్షస సైన్యమును భారగొట్టెను. వారు రెక్కలగాలికి ఎండుటాకుంట్లెగిరిపోయిరి. పరిదిశలకుంబారి విష్ణువువలని జరుపున సుఖముగానక వేర్వేరునందరును బాతాళమును జేరిరి. దేవపూజగొని విష్ణువు వేవతలను స్వస్థులంజేసి యందరుచూచుచుండ నక్కడ నంతర్ధానమందెను. శూన్యమైపోయినలంక కుబేరునకీయబడినది. అది రావణునిచే బలాత్కారముగా లాగికొనబడినది. నీవు రావణునింజంపి దానిని విభీఆషణునకిచి%్‌చతివి. నీవు రాక్షసవధకై యవని నవతరించితివి. వీచే మున్ను గూలిన మాతలసంకటులు పౌలస్త్యులు రాక్షసులు వారేయిపుడు నీచేగూలిరి. రాక్షసులంజంపువాడు హరికంటే మరిలేడు, నిన్ను జూచితిని. నీతో మాట్లడితిని. అని వచ్చిన దారి నగస్త్యులు చనిరి. నాడాయనః : ఏవ ముక్త్వా తతో೭గస్త్యో యథాగిత మరిందమః | తస్మా ద్యుద్ధం నమో రాజన్ ః అద్యవై తవ రోచతే || ఉత్సాహ శక్త్యా సంపన్నో మం%్‌రత శక్త్యాచ రాఘవ | ప్రభు శక్త్యా తథా యుక్తో దేవ శక్త్యా తథై వచ || 10 సాధు సాధ్యేషు కార్యేషు కః కుర్యా ద్విగ్రహం బుధః | కేవలం కోవ మస్థాయ విగ్రహం నృప దోషదమ్ || 11 కామ క్రోధౌ జితౌ యేన తేనాత్మా విజిత స్తథా ః : యేనాత్మా విజిత స్తేన విజేతేయం వసుంధరా || 12 రాజ్ఞో ೭విజిత చిత్తస్య పరచక్ర జయం కుతః | న చక్రస్య జయం కర్తుం శక్నోత్య విజితేంద్రియః || 13 నా ೭వజ్ఞా కస్య చిత్కారా%్‌య బలోవా బహుమన్యతే | నిత్యం లోకే హి దృశ్యనై శ##కైభ్యంః శక్తి మత్తరాః || 14 యథా శక్తి చికీర్షన్తి యథా శక్తి చికీర్షణ్తి యథా శక్తిచ కుర్వతే | న కబచి దవ మన్యన్తే నరాః పండిత బుద్దయః || 15 ద్వా నిమై కంటకౌ తీక్‌ష్ణౌ శరీర పరిశోషణౌ | యశ్చా ೭ధనం కామయతే యశ్చ కుప్యత్య నీశ్వరః || 16 ద్వావిమౌ పురుషో లోకే స్వర్గం స్యోపరి తిష్టతః | పభుశ్చ క్షమయా యుక్తో దరిద్రశ్చ ప్రదాన వాన్ || 17 కః కుర్యాద్దుర్భలే క్రోధం స్వభావా దేవ నిర్ణితే | బల వత్యపి కః క్రోధం కుర్యా త్ర్పాణ హరం నరః || 18 అపహార ప్రవృత్తస్య కోపస్తే జస్వితోచ్యతే | యస్మాత్తస్మాద్భుధైః కోపం కోపం కృత్వా వినిర్ణతః || 19 త్రివిధంనరక సేద్యం ద్వారం నాశన మాత్మనః | కామః క్రోధ స్తథా లోభ స్తస్మా దేత త్త్రయం త్యజేత్ || 20 అనుబంధం చ సంప్రేక్ష్య విపాకం చైవ కర్మణామ్ | ఉత్ఠాన మాత్మన శ్చైవ తతః కర్మ సమాచరేత్ || 21 నరాజ్యం లబ్దమి త్యేవం వర్తితవ్యం చ సాంప్రతమ్ | శ్రియం హ్యవినయో హన్తి జరా రూప వమి వోత్తమమ్ || 22 త్వక్త్వా జనపదే వాసం యాహి రాజన్: హిమాచలమ్ | అవిషహ్య తమం హత్యా రావణం లోకరావణమ్ || లంకాం త్వక్త్వా ధనాధ్యక్షం పశ్యకైలాస మాశ్రితమ్ || 23 సరావణో రాఘవ సాయకార్తః త్యక్త్యా శ్రియం భూమిపతే విపన్నః | ధనాధిపో೭ద్యాపి విశాల కీర్తిః కరోతి రాజ్యం క్షణదా చరాణామ్ || 24 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే రాక్షస పాతాళ ప్రవేశ వర్ణనం నామ అష్ఠాదశోత్తర ద్విశత తమో೭ధ్యాయః. నారాయణుడనియో.రాజా! అగస్త్యుడిట్లు సెప్పివెళ్ళెను. కావున నీవు యుద్దము సేయుట నాయభిమతముగాదు. రాఘవుడు త్సాహ శక్తి మంత్రశక్తి క్తియుం ప్రభుక్తి క్తియుంగల్గియునా%్‌నడు. ఆపైని దేవశక్తియుంగలవాడు. తెలిసినవాడు. సులభసాధ్యములయిన పనులందు విగ్రహము (పేచీ) నెవ్వడు కొనితెచ్చుకొనును. కేవలం కోపముచే తగవులాట రాజదోషప్రదము. కామ క్రోధములం గెలిచిన వాడాత్మను (మనస్సును)గెలిచినవాడే. ఆత్మ విజయము చేసినవాడే యెల్లవసుమతిం నెల్లజయించును. చిత్తముం గెలువనివానికి శత్రుచక్ర జయ మెక్కడిది? విజితేంద్రియుడుగాని వాడు చక్రజయము (రాజ్యచక్రముం) సేయలేడు. బలవంతుడైన నెవ్వని బరాభవింపరాదు. అందువలన నందరిచేత దాను బహుమానితుడగును (గౌరవింపబడును) లోకమందు శక్తిమంతులను మించిన శక్తి మంతులు గనబడుదురుగదా! తమ శక్తికి దిగినట్లు చేయనెంతురు. శక్తికి దగినట్లు సేయుదురు. జ్ఞానము తెలిసిన వాండ్రెవ్వరి నవమానము చేయనెంచరు. తమ శక్తికి దగినట్లు చేయనెంతురు. శక్తికి దగినట్లు సేయుదురు. జ్ఞానము తెలిసిన వాండ్రెవ్వరి నవమానము చేయనెంచరు. శరీరము శోషింపజేయు కరకుముండ్లివిరెండు. నిర్ధనుడై కోరికలు గోరువాడు అసమర్థుడై క్రోధమూనువాను (అ ప్రయోజకునికి ఆహాంకారమెకు%్‌కవయని లోకములో వాడుక) స్వర్గముపై నుండువానీ యిద్దరు. ప్రభువై క్షమ (ఓరిమి) గలవాడు దరిద్రుడై దానగుణముగలవాడు. వాడు నిజముగనే యోడిపోయియున్న దర్భలునిపై నెవ్వరు కికనుసూపును? అట్లే తనకు ప్రాణాంతకుడుగా నున్న ప్రబలుపై నెవ్వడు కోపముంజూపును? ఎదుటివాని క్రోధము పోగొట్టువానికోపము తేజస్విత్వము ( ప్రతాపము) అనిపించు కొనును. కావున బదులు (తెలిసినవారు పండితులు) కోపించి కోపమును గెలిచిరి. నరక ద్వారము ఆత్మనాశనము. అది మూడు విధములు. కామము, క్రోధము, లోభము ననునీమూడును. కావున దీనిందప్పి కొని తిరుగవలయును. కర్మానుబంధమును కర్మ విసాకమును జక్కగ గనిపెట్టి తన ఉత్థానమును (న్నత దశను)గూడ నెరిగి యాపైని పని నారంభింపవలెను. ఇప్పడు రాజ్యము చేజిక్కినది మనకేమని ప్రవరి%్‌తంపరాదు. ఎగిరిపడరాదు. అట్టి ఎగిరిపాటు ముదిమి ముచ్చటయైన రూపును జెరచినట్లు శ్రీని(సంపదను) జెరచును. రాజా! పలె%్‌లపట్టు విడచి లేదా జనప్రదేశమువిడిచి హిమాచలమునకుః జనుము. ఓర్వరాని రావణుని లోకములకు రావణుని(ఏర్పడించువానిని)చంపి లంకను విడిచి కైలాసముంజేరిన ధనాధ్యక్షని కుబేరునింజూడుము. ఆ రావణుడో రాఘవభాణములగూలి సంపదను బాసి విపన్నుడైనాడు. నేటికిని కుబేరుడు విశాలకీర్తియై నిశాచరుల (రాక్షసుల) రాజ్యమునేలుచునా%్‌నడు. ఇది శ్రీ విష్ణుదర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున రాక్షసపాతాళవర్ణనమను రెండువందల పదునెమ్మిదవ అధ్యయము. రెండువందల పంతొమ్మిదవ అధ్యాయము - కుబేరాఖ్యానము శైలూషః : కథనం వైక్రవణ దత్తా పురాలంకా ద్విజోత్తమ ! | కథం చాప హాతా తస్య రావణన మహాత్మనాః || 1 చరితం రావణస్యాహం శ్రోతు మిచ్చమి తత్వతః | త్రైలోక్యం విజితం యే తనసా పౌరుషేణ చ|| 2 నాడాయనః : బ్రహ్మణో మాససః పుత్రః పులస్త్యో విదిత స్తథా | తస్యాసీ ద్విశ్రవానామ పుత్ర సై#్త్రలోక్య విశ్రుతః || పౌత్రీ బృహస్పతేః పత్నీ భరద్వాజసుతా శుభా | బభూవ తస్య రాజేంద్రః నామ్నా వై దేవ వర్ణినీ || 4 తస్యాం స జనయా మాస పుత్రం వై శ్రవణం ప్రభుమ్ | ఆరాధిత స్సుతపసా ప్రాదా త్తస్య పితామహః || 5 యక్షేశత్వం ధనేశ్వతం లోక పాలత్వ యేవచ ః పుష్కం చ తథా యానం కామగం కామరూపిణమ్ || 6 పుత్రం లబ్దవరం రాజన్ : విశ్రవా అభ్యభాషత | త్రికూటే పర్వత శ్రేష్టే నిర్మితా విశ్వ కర్మణా|| 7 లంకా నామ పురి రమ్యా దేవరాజ కృతే పురా | హృత్వాతాం దేవరాజస్య సుకేశ తనయైః పురాః || 8 ఆయాసితా మహారాజ: తేషాం జేష్టం తు మాలినమ్ | నిపాత్య వాసుదేవేన తేతు విద్రావితా స్తతః || 9 పాతాల తల మాశ్రిత్య తే వస న్తీహా నిర్భయాః || 10 తాం త్యం లంకాం సమాసాద్య వసయక్ష సమన్విత ః | ధర్మేణ పాలయన్ రాజ్యం సతతం రాక్షసేశ్వరః 11 ధర్మే తే దీ యతాం బుద్ధిః సర్వావస్థస్య సర్వదా | ధర్మా ధర్థశ్చ కామశ్చ ధర్మమూల మిదం జాగత్ || 12 శ్రుత్యవా పితు ర్వాక్య మదీన సత్వో లంకాం సమాసాద్య ధనాధి నాధః | ధర్మేణ లోకం సతు రంజయాన చకార రాజ్యం క్షణదా చరాణామ్ || 13 ఇతి శ్రీ విష్ణధర్మోత్తరే ప్రథమఖండే శైలూషం ప్రతి నాడాయనాను శాసనే లంకా కథాయాం వై శ్రవణాఖ్యాస వర్ణనం నామ ఏకోన వింశ త్యుత్తర ద్విశత తమో ೭ధ్యాయః. శైలూషుడు ఓ విప్రోత్తమ ! కుబేరుని మున్నులకంటీ%్‌లయబడెను. అది రావణునిచే నెట్ల నపహరింపబడెను? రావణుని కథ యాథార్థము నేను వినవలయును. అతడు తపస్సు చేస పౌరుషము చే ముల్లోకములు గెలిచినవాడుగదా! యన నాడా యనుడిట్లు సెప్పదొడంగెను. బ్రహ్మమానస పుత్రుడు పులస్త్యుడన బ్రసిద్దుడు. వానికొడుకు. త్రిజగత్ర్పసిద్దుడు. ఆని పౌత్రి (కొడుకు కుమారులు కూతురు) భరద్వాజనికూతురు దేవనర్ణినియను పేరిది యావిశ్రయసుని భార్య, ఆమె యందాతడు వైశ్రవణుడను పభువుం గనెను. అతుడు తపసు చేనారాధింప పితామహుడు బ్రహ్మ యక్షాదిపత్యము ధనాధిపత్యము లోకపాలకత్వమును నొసంగెను. కామరూపము కామగమునైన పుష్పకమును యానముంగూడయిచ్చెను. ఇట్లు వరలాభమొందిన కొడుకుంగని విశ్రవసుడు త్రికూట పర్వతరాజ మందు విశ్వ కర్మ యింద్రునికై నిర్మించిన రమ్యమైన లంకాపురికాలదు. ఇంద్రుని యాపురము దానిని సుకేశ తనయుతో గూడనరిగి హరింపబడి కష్టాలపాలు సేయబడినది. వారిలో జేష్ట్యడగు మాలిని విష్ణువేచే గూలనేయించెను. అవ్వల దరుమలబడిన యా రాక్షసుల పాతాళమందు నిర్భయులైయునా%్‌నరు. నీ వాలంకకేగి యక్షుతోయటవసింపుము.రాజ్యమును సధర్మముగ బాలింపుము. ఏ యవస్థలో నున్నను నీయొక్క బుద్దినెవేళ నైన ధర్మమునందుంపుము. ధర్మమువలన అర్థమ కామముగల్గును. ఈ జగము ధర్మూలము, తండ్రిమాటవిని ధనాధినాథుడు లంకంజేరి ధర్మము లోకమును రంజింపజేయుచు రాక్షసులరాజ్యమును బాలించెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమ ఖండమున లంక కథయందు కుబేరాఖ్యానమను రెండువందల పందొమ్మిదవ యధ్యాయము.