Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

రెండువందల ముప్పదిరెండవ అధ్యాయము - శాంతిప్రక్రియలు

నాడాయనః : 

అభ్యంగోత్సాదనం స్నానం ధూపో రక్షావలి ర్ఘృతమ్‌ | నేత్రాంజనం ప్రధవనం నవ గ్రహ హరాః క్రియాః || 1

సర్పగంధా వచా కుష్ఠ ముస్తా క్షేపణచందనైః | సక్షీర మూత్రై ర్విపచే త్తైలం సర్వగ్రహాపహమ్‌ || 2

బిల్వమధ్యం బ్రహ్మదత్త గవాక్షీ బృహతీఫలమ్‌ | ఉత్పాదన మిదంశ్రేష్ఠం శ్లక్ష్నపిష్టం జలేన తు || 3

ఉశీర కుష్ఠ మంజిష్ఠా దేవదారు మనశ్శిలాః | శ్రీవేష్టక స్తథా కౌన్తీ హరితాలైల వాలుకే || 4

ఏతచ్చూర్ణీకృతం సర్వం పంచగవ్యాంశ మిశ్రితమ్‌ | సర్వగ్రహ ప్రశమనం స్నాన మాయుష్య ముత్తమమ్‌ || 5

సర్షపాశ్చ ఖురం కుష్టం ఘృతం భల్లాతకం వచా | పూతీక మజమోదా చ ధూపః సర్గగ్రహా పహాః || 6

శస్త్రం వా రోచనం శస్తం సువర్ణం మణి మౌక్తికమ్‌ | విషం సవత్సాం ధేనుం చ మత్తం భాగం తథైవ చ || 7

పూర్ణం కుంభం చ మంత్రాశ్చ వీణా చందన మేవచ | మయూర వక్షా న్రజతం సమార్గణగుణం ధనుః || 8

భల్లాతకాని సర్పిశ్చ రక్షార్థం ధరయే ద్గృహే | పుషై#్ప ర్ధూపై స్తథా గంధైః భ##క్ష్యై ర్నానానిధై స్తథా || 9

పూర్ణ కుంభై స్సకుల్మాషైః గోరసై శ్చందనేనచ | ధూపై రన్న ప్రకారై శ్చ బలిః కార్యో విజానతా || 10

నాడాయనుండనియె. అభ్యంగము ఒడలు పట్టుట స్నానము ధూపము రక్షా బలిఘృతము నేత్రాంజనము అనునీ తొమ్మిది నవగ్రహ శాంతిక్రియలు సర్పగంధ=వచ (వస) కుష్ఠము ముస్తా=తుంగముస్త అనువానితో చందనముతో ఆవుపాలు గోమూత్రముతో గాచిన తైలము సర్వగ్రహ దోషహరము. మారేడు గుంజు బ్రహ్మదత్త గవాక్షీ =మల్లి (పెద్దటేకు) బృహతీ ఫలము =వాకుడు గుంజు నీటితో మెత్తగా నూరిన నలుగు బిండి ఉశీర (వట్టివేరు) కుష్ఠము=సుగంధి పాలచెట్లు మంజిష్ఠి దేవదారు మనశ్శిల (మణిశిల) శ్రీవేష్టకము కాంతి హరితాళము (అరిదళము) ఏలవాలుకము=నూగుదోస ననువాని చూర్ణము సేసి పంచ గవ్యముల భాగములతో గలిపిన ముద్దతో స్నానము సర్వగ్రహప్రశమనము. ఆయుష్యమునుగూడ. సర్షపములు (అవాలు) ఖురము = కుష్ఠము సుగంధిపాలచెట్టు ఘృతము భల్లాతకము (జీడిగింజలు) వస పూతీకము అజమోద అనువాని ధూపము సర్వగ్రహావహము. శస్త్రముగాని గోరోచనము గాని మేలిమి బంగారము మణి మౌక్తికము విషము సవత్సాగోదానము మదించిన మేక పూర్ణ కుంభము మంత్రములు వీణ చందనము నెమలి రెక్కలు వెండి అమ్ములతో అల్లెత్రాటితోడి విల్లు భల్లాతకములు నల్లజీడి గింజలు సర్పిస్సు (నెయ్యి) గ్రహదీక్ష కొఱకింట నుంచు కొనవలెను. పుష్పములతో ధూపదీపములతో గంధములతో నానావిధ భక్ష్యములతో కుల్మాషములతోడి పూర్ణ కుంభములతో గోరసములతో గంధముతో దూపముంతో నానా విధాన్నములతో బలి యొనరింప వలెను.

కాయస్థాం జటిలాం వీరాం వయస్థాం నకులీ ద్వయమ్‌ | జయాం చ విజయాం చైవ మానాం పర్పట కంబరీమ్‌ || 11

మర్కటీం సూవరీం ఛత్రా మతిఛత్రా పలంకషామ్‌ | రామాం పూత నకాం కేశీం మారటాం కటుకాం వచామ్‌ || 12

చౌరకాం విష్ణు దత్తాంచ వృష్టి కాండీం చ చూర్ణయేత్‌ | పురాణ మేభి ర్విపచేత్‌ ఘృతం తోయే చతుర్గుణ || 13

మహా పైశాచకం నామ సర్వగ్రహ నివారణమ్‌ | రసాంజనం త్రికటుకం మంజిష్ఠా సమనశ్శిలా || 14

సమాని ఛాగ మూత్రేణ పిష్ట్వా వర్తింతు కారయేత్‌ | ఛాయా శుష్కంతు తం కుర్యాత్‌ అంజన గ్రహనాశనమ్‌ || 15

శ్వేత జ్యోతిష్మతీం వ్యోషం వస్త్ర సేత్రేణ వేష్టితమ్‌ | ఛాయా శుష్కే పునః పిష్టం జ్ఞేయం ప్రశమనం హితమ్‌ || 16

సంపూజనం దేవగురు ద్విజానాం భక్తిః పరా చక్రగదా ధరస్య |

యేషాం న తేషాం ప్రభవన్తి దోషాః గ్రహోద్భవాః భూమిపతిప్రధాన !

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే గ్రహబాధా ప్రతిషేధోనామ ద్వాత్రింశ దుత్తర ద్విశతతమోధ్యాయః.

కాయస్థ=ఉసిరిక జటిల=జటామాంసినీ రా = త్రిలింగములలో కర్కాటకేశ్వరి గ్రంధితగరపుచెట్టు క్షిరకాకోలినేల ఉసిరి కూతురుబుడమ అరటి గుమ్ముడు కుక్కమేడి వయస్థా = బూరుగు నకులీద్వయము = జాటామాంసి చవ్యమను సుగంధ్రద్రవ్యము యేలక ఉసిరిగతి పృతీగ జయ = విజయమానా నెల్లికూర తక్కెడు చెట్టు కరక్కాయ పర్పటము = కంబరిమూలంలో పర్పట కంబరీ అని సమానంగా ఏకవస్తువుగా ఉంది ఛత్ర = 1. పిన్నసదాప 2. కొత్తిమిరి 3. నేలతాడి మర్కటి = 1. నూగుదోస 2. నూలగొండి 3. తీగ క్రాణుగచెట్టు సూకరీ అతిచ్ఛత్ర పలంకష రామ = చక్రవర్తికూర పూతని = కరక కేవీమారటా = కటుకా వచ = దీనికి ఉగ్రగంధయనియు పేరు వచ = (వస) చౌరక = చరపుష్టి?

విష్ణుదత్తా వృష్టి కాండీ = నల్లనిది అను వీనిని చూర్ణముచేసి నిలువయున్న ఆవుపేతిలోవేసి నాల్గు రెట్లు నీళ్ళు పోసి కాచినది మహాపైశాచికమను పేరది సర్వ గ్రహ నివారణము. రసాంజనము త్రికటుకమలు (శొంఠి పిప్పలి మిరయాలు) మంజిష్ఠ మనశ్శిల సమముగ గ్రహించి మేక మూత్రముతో నూరి మరల చేసిన ముద్ద గ్రహప్రశమనము. హితమును. భక్తితో దేవగురు ద్విజుల యొక్క చక్రగదాధారుడైన విష్ణువు యొక్క పూజనెవ్వరు సేయుదురు. వారికి గ్రహదోషము లేనియుం గలుగవు.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తరమున మహాపురాణమందు ప్రథమఖండమున గ్రహశాంతి ప్రక్రియా నిరూపణమను రెండు వందలముప్పది రెండవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters