Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల ముప్పదిరెండవ అధ్యాయము - మహిషాసురవధ శైలూషః : స్కందస్య శరణం ప్రాప్తాన్ గ్రహాన్ శ్రుత్వా శతక్రతుః | యశ్చకార మహాభాగ తన్మమాచక్ష్వ పృచ్చతః || నాడాయనః : స్కందస్య శరణం ప్రాప్తాన్ శ్రుత్వా శతమఖో య¸° | దేవ దేవగణౖస్సార్ధం స్కందో యత్ర వ్యవస్థితః ||
2 స్కందం దేవేశ్వరో దృష్ట్వా ! దీప్తతేజ స్సమ ద్యుతిమ్ | తుష్టావ రాజశార్దూల ! ప్రయత స్సుసమాహితః ||
3 శక్రః : దేవదేవం సమస్యామి కుమారం వర మచ్యుతమ్ | కార్తికేయం దురారాధ్యం వహ్నితేజః సముద్భవమ్ ||
4 ఉమాశంకరజం భీమం గంగయా జఠరే ధృతమ్ | శక్తిహస్తం విశాలాక్షం షణ్ముఖం దీప్త తేజసమ్ ||
5 భక్తాను కంపినం దాంతం బ్రహ్మణ్యం వరదం ప్రభుమ్ | కాక పక్ష ధరం శాంతం శిఖండక విభూషితమ్ ||
6 రక్తాంబరం మహాబాహుం మయూర వరగామినమ్ | ఘంటాప్రియం గణాధ్యక్షం మహాబల పరాక్రమమ్ ||
7 దేవసేనా పతిం దేవం సర్వలోక హి తేప్స యా ! షష్ఠ్యాం తు శుక్ల పక్షస్య యేచ త్వాం భౌమవాసరే ||
8 కృత్తికా స్వర్చయిష్యన్తి యథాలాభం పృథక్ | న తేషాం దుర్లభం కించిత్ భవిష్యతి సురోత్తమ !
9 ద్వియోగే ద్విగుణం తేషాం ఫలం స్కంద ! భవిష్యతి | త్రియోగే పూజనం కృత్వా భవతః సురసత్తమ ||
10 అక్షయం ఫల మాప్స్యన్తి నాత్ర కార్యా విచారణా | వైశాఖమాసా దారభ్య పంచమ్యాం య ఉపోషితః ||
11 భవన్తం పూజయేత్ షష్ఠ్యాం సంవత్సర మతంద్రితః | పుత్రార్థీ లభ##తే పుత్రాన్ ధనకామో ధనాని చ ||
12 మృత శ్చ ప్రాప్నుయా త్స్వర్గం త్వయి తుష్టే హరాత్మజ ! స్తోత్రేణ చ మదీయేన యే స్తోష్యన్తి తవ ప్రభో ! ||
13 లోకద్వయే೭పి తే కామాన్ ప్రాప్స్యన్తి మనసేప్సితాన్ | స్కందః : పితామే దైవతం శక్ర ! మహాదేవః ప్రతాపవాన్ || తస్యాజ్ఞయా కరిష్యామి యన్మాం వక్ష్యతి వాసవ ! | నాడాయనః : తతః ప్రాదురభూత్తత్ర దేవదేవ స్త్రిలోచనః || 15 అభ్యసించ త్కుమారం చ బ్రహ్మణా సహితః ప్రభుః | సేనాపత్యేన దేవానాం సో೭భిషిక్త స్తదా ప్రభో ! || 16 జఘాన మహిషం నామ దానవం దేవ కంటకమ్ | మహిషేన సమాన్ వీర్యే జఘానాయుతశో೭పరాన్ || 17 బహుత్వా ద్దానవాన్ వీరః స్కందః పర బలార్దనః | యదా హంతుం న శక్నోతి తదా దేవ స్త్రిలోచనః || 18 జఘాన మనసా తత్ర తతః శూల వరాయుధః | జఘాన దానవా సన్యాన్ శతశో೭థ సహస్రశః || 19 భక్తానుకంపీ భగవాన్ త్రినేత్రో దేవారి సంఘాన్ వినిపాత్య సంఘే | కృత్వా త్రిలోకీం చ తదా ప్రహృష్టాం జగామ కైలాసగిరిం మహాత్మా || 20 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మహిషవధోనామ త్రయస్త్రింశదుత్తర ద్విశతతమోధ్యాయః || స్కందుని శరణొందిన గ్రహముల వార్తవిని శతక్రతువు (ఇంద్రుడు) ఏమిచెసె నానతిమ్మని శూలూషుండడుగ నాడాయనుడనియె స్కందుని శరణందిన గ్రహముల వార్తవిని దేవగణము నాతడున్న చోటికేగి తేజోమూర్తియై యున్న యాకుమార స్వామిని నియమవంతుడై స్తుతించెను కృత్తికా కుమారుని అగ్ని తేజస్సు వలన బుట్టిన వాని ఉమాశంకర సంభవుని గంగ కడుపులో ధరింపబడిన వానిని శక్తిహస్తుని భక్తాను గ్రహకరుని బ్రహ్మణ్యుని వరదుని జునపాలు ధరించిన వారు నెమలిపురం గైసేసిన వానిని రక్తవస్త్రధారిని అఱమోములవానిని మయూరవాహనుని ఘంటాప్రియుని గణాధీశుని దేవసేనాపతిని కార్తికశుక్ల షష్టి మంగళ వారము నిన్నెపరర్చింతురు వారికి దుర్లభ##మైన దేకొంచెము లేదు. త్రియోగమందు (కార్తిక మాసము శుద్ద షష్ఠితిది మంగళవారము కలిసి వచ్చుట త్రియోగము) షణ్ముఖుని పూజించిన వారికీఫల రెట్టింపు గల్గును. వైశాఖమాసము మొదలు కొని పంచమినాడుపవాస ముండి షష్ఠినాడు నిన్నొక సంవత్సరము పూజించిన పుత్రధనార్థుల కవితప్పక లభించును. అతడు స్వర్గమునందును. ఈస్తోత్రముచే నిన్ను స్తుతించు వరిహమందు వరమందు కోరినవెల్ల బడయగలరు. అని యింద్రుడన కుమారస్వామి మాతండ్రి శంకరుడే నాకు దైవము. నీవిపుడేమంటి పదియెల్ల మాతండ్రియాన నొనరించెదనినియె. అనినంతనే త్రిలోచనుడు సాక్షాత్కరించి బ్రహ్మతోగూడి కుమారుని దేవ సేనాధీశ్వరునిగా నభిషేకించెను. అభిషిక్తుడై స్వామి దేవకంటకుని మహిషాసురుని గూల్చెను వానితో సమబలులైన వాని యను యాయుల ససురుల వేలమందిని సంహరించెను. కుమారు డెవ్వరిని జంపలేక పోయె వారిని త్రిలోచనుడు సంకల్ప మాత్రమున శూలముచే సంహరించెను. భక్తాను కంపి భగవంతుడు త్రినయనుడు దేవారి కూదముల గూల్చి ముల్లోకము నానందభరితముం జేసి కైలాంస గిరికేగెను. ఇది శ్రీ విష్ణుధర్మోత్తరే మహాపురాణమందు ప్రథమఖండమున మహిషాసురవధయను రెండువందలముప్పదిమూడవ అధ్యాయము.