Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువదల ముప్పదిఎనిమిదవ అధ్యాయము - బలిరావణసమాగమము వజ్రః- శ్రుత్వా కాలాంగ దహనం బ్రాహ్మణన స మీరితమ్ | కిం పప్రచ్ఛ తదా బ్రహ్మన్ ! శైలూషో మృత్యుచోదితః || మార్కండేయః- శ్రుత్వా కాలాంగ దహనం బ్రాహ్మణనస మీరితమ్ | రావణసై#్యవ చరితం భూయః పప్రచ్ఛ తం తదా || శైలూషః- చరిత స్యావశేషం యద్దశ గ్రీవస్య రక్షసః | త దహం శ్రోతు మిచ్ఛామి తత్రమే సం శయో మహాన్ || నాడాయనః- తతో೭ స్య నగరం భూయః పరి చక్రామ రావణః | సదదర్శ తదా తత్ర ప్రాసాదం సర్వకాంచనమ్ || ముక్తా జాల పరిక్షిప్తం తథా విద్రుమ తోరణమ్ | గారుడేన చ రక్తేన సమన్తా త్కృత వేదికమ్ ||
5 వైడూర్య రుచిర స్తంభం పద్మరాగ ప్రభోజ్జ్వలమ్ | ఇంద్రనీల ప్రభాచ్ఛన్నం నిర్యూహ శత శోభితమ్ ||
6 మహాభువన సంబాధం మహోద్యాన విభూషితమ్ | సుఖారోహణ సోపానం దీర్ఘికా శత సంకులమ్ ||
7 సర్వర్తు కుసుమైః వృక్షైః సమన్తా దుపశోభితమ్ | సర్వాసన యుతం రమ్యం మహేంద్ర భవనాధికమ్ ||
8 తంతు దృష్ట్వా గృహంరాజప్రహస్తం వాక్య మబ్రవీత్ | ప్రహస్త ! శీఘ్రం జానీహి ! కస్యేదం భవనోత్తమమ్ || 9 ఏవముక్తః ప్రహస్తస్తు ప్రవివేశ గృహోత్తమమ్ | వజ్రనృపతి బ్రాహ్మణుని వలన నాడాయనుని కాలాంగదహనము (యముని శరీరదహనకథ) విని శైలూషుడు (గంధర్వ రాజు) మృత్యుచోదితుడై మఱియే మడిగెనుడువుమన మార్కండేయు డిట్లనియె. విప్రునివలన నీకథవిని రావణచరిత్ర నాలించి శైలూషుడు దశగ్రీవుని కడమ చరిత్రము వినగోరెదనన నాడాయనుం డిట్లనియె. అవ్వల నితని నగరము జుట్టుదిరిగి (కుబేరనగరమును) అక్కడ సర్వ స్వర్ణమయమైన యొక ప్రాసదముం జూచెను. అందు ముత్యాల జాలరు లంకరింపబడి వ్రేలుచున్నవి. పవడ పుస్తంభములు ఎఱ్ఱని గారుడమణులు తాపిన వేదిక లెటు చూచినను వైడూర్యములు పొదిగిన స్తంభములు ఇంద్రనీల పద్మరాగ ప్రభాపుంజ మంజుల మా సౌధము వందల కొలది నిర్యూహములచే (వాకిళ్ళు- ద్వారములచే) మహాభవన సమ్మర్దము. మహోద్యాన విభూషితము. చాల సుఖముగ నెక్కదగిన మెట్లుగలది. వందల కొలది దిగుడు బావులు గలది. సర్వర్తుకుసుమములైన తరువులతో నెల్లెడ సొంపుగల్కుచున్నది. సర్వవిధరమ్యాసనము. దేవేంద్రభవనము మించినది. ఆ గృహముంగని రావణుడు ప్రహస్తమంత్రితో ఇది యెవ్వని భవన రాజమో శీఘ్రముగ తెలిసికొనుమన ప్రహస్తుడా గృహములో బ్రవేశించెను. సంప్రాప్తాయాం చ కక్షాయాం భిన్నాంజనచయోపమమ్ || 10 సర్వాభరణ సంవీతం సర్వలక్షణ లక్షితమ్ | గృహీత్వా లోహముసలం ద్వారదేశే వ్యవస్థితమ్ || 11 దదర్శ పురుషం భీమం జ్వాలా మండల దుర్దశమ్ | తం తు దృష్ట్వా తథా భూతం స వివేశ దశాననః || 12 సమాప్తాయాం కక్షాయాం స దదర్శ త మేవహి | తమువాచ మహాతేజాః నిశాచర గణశ్వరః || 13 యుద్ధార్థ్యహ మను ప్రాప్తో యుద్ధాతిథ్యం ప్రయచ్ఛమే | అథవా తస్య శంస ! త్వం గృహే యో೭ స్మిన్ వ్యవస్థితః || తతో రాక్షసరాజస్య పురుషో వాక్య మబ్రవీత్ | తిష్ఠ త్యస్మిన్ గృహేరాజా దానవానాం బలిర్బలీ || 15 తేన చేద్యోత్స్యసే వీర ! ప్రవిశేదం గృహో త్తమమ్ | యోద్ధుం నార్హసి తేన త్వం స మహాత్మా మహాబలః || 16 బ్రహ్మణ్య శ్చ శరణ్య శ్చ శూర స్సత్య పరాక్రమః వీరో బహుగుణో పేతో బలవాన్ దృఢవిక్రమః | బాలార్క ఇవ తేజస్వీ సమరేష్వని వర్తకః || 17 ప్రియంవదః సంవిభాగీ గూఢ సాక్ష్యాయ తత్పరః | ఏవముక్తో దశగ్రీవః ప్రవివేశ గృహోత్తమమ్ || 18 అథ సందర్శనా దేవ బలినా సు మహాత్మనా | శీఘ్ర ముత్సంగ మారోప్య పృష్ట స్త్వాగమనం తతః || 19 తస్యో వాచ మహాతేజాః రావణో రాక్షసాధిపః | శ్రుతం మయా మహాభాగ ! బద్ధస్త్వం కిల విష్ణునా || 20 అతడు తొలి వాకిటికిరాగా నూరిన కాటుకవలెనున్న సర్వాభరణములు దాల్చిన సర్వలక్షణ లక్షితుడైన యొకనిని ఇనుప రోకలి పట్టుకొని ద్వారమందున్న భయంకరునినొక్క నరుని జ్వాలా మండలముచే దుర్నిరీక్ష్యుని జూచి దశకంఠుడాకక్ష్యం బ్రవేశించెను. ఆ వాకిలి తుదిని మరల నా పురుషునే చూచెను. నిశాచర గణశ్వరుడు మహాతేజస్వి వానింగని యుద్ధము కోరివచ్చితిని. నాకు యుద్ధాతిథ్యమిమ్ము లేదా చెప్పు మీ యింటిలోనున్న వానిని అవ్వల నా పురుషుడ రాక్షస రాజుతో దానవరాజు బలియైన బలి యీ యింట నున్నాడు. ఓ వీరుడ ! వానితో బోరగలవేని యీ యింట బ్రవేశింపుము. అతనితో నీవు పోర నర్హుడవుగావు. అతడు మహాత్ముడు మహాబలుడు బ్రహ్మణ్యుడు శరణ్యుడు శూరుడు సత్యపరాక్రముడు వీరుడు బహుగుణ సంపన్నుడు బలవంతుడు దృఢవిక్రముడు మధుర ప్రియ వచనుడు పురుషార్థములను ననువిభాగము చేసి యనుభవించువాడు లేదావిచక్షణశీలుడు గూఢసాక్ష్య తత్పరుడు. (రహస్య మంత్రాలోచన పరుడన్నమాట) ఇట్లుబలుక విని రాక్షసుల ఱడాలోనం బ్రవేశించి. ప్రవేశించి మహానుభావ ! విన్నాను నీవు విష్ణువుచే గట్టబడినట్లు నేనునీ బంధ మోచనముగావింప సమర్థుడను సంశయము వలదు. అనిన బలి నవ్వి యిట్లనియె. సో೭ హం మోచయితుం శక్తో బంధనా త్త్వాం న సంశయః | ఏవముక్త స్తతో హాసం బలి ర్ముక్త్వేద మబ్రవీత్ || 21 ఏతేమేకుండలే దివ్యే మహారత్నో పశోభితే | అనయోరేక మానీయ చాత్రోపవిశ! మాచిరమ్ || 22 అత్రోపవిష్టస్య చ తే వ్యాఖ్యాస్యే విష్ణు విక్రమమ్ | ఏవముక్తో దశగ్రీవః కుండలా నయనే తతః || 23 చకార పరమం యత్నం న శశాకచ శత్రు హా | యదా చలయితం స్థానా న్న శశాక స కుండలమ్ || 24 ప్రస్విన్న సర్వగాత్రస్తు సందష్ట దశస చ్ఛదః | భ్రుకుటీ సంకట ముఖః పరం విస్మయ మాగతః || 25 ఉత్సంగే తదవస్థే తు బలి! కృత్వేద మబ్రవీత్ | ఇదిగో నా కుండలములివి. దివ్యములు అమూల్యరత్న శోభితములు. ఇందొకటి గొనితెచ్చి యక్కడ గూర్చుండుము. అలసింపకు. ఇక్కడ నీవుపవేశించిన తర్వాత నీకు విష్ణు విక్రమము చెప్పెదను. అనవిని దశగ్రీవుడు కుండలముంగొనిరానెంతేని యత్నము సేసెను. కాని తేజాలడయ్యెను. అతడు కుండలమునున్నతా పండు కదల్పనైన జేతగానివాడై యయ్యెడ నొడ లెల్ల ముచ్చెమటలు వోసి పెదవులు గొరికికొని కనుబొమ్మలు ముడిపడిన మొగముతో మిక్కిలి యాశ్చర్యపడెను. ఆ యవస్థలో బలి వానిందన తొడపై నునిచికొని యిట్లనియె. హిరణ్యకశిపుర్నామా೭ భవన్మే ప్రపితా మహః || 26 యదా బభూవ తస్యేమే కుండలే వై బభూవతుః | ఏతాభ్యాం కుండలా భ్యాంతు సో೭భూ త్పూర్వం విభూషితః || 27 ఊర్వో రారోవ్య నఖరైః కరై స్తేన విదారితః | కథ మద్య మహాభాగం తం త్వం జేతుం వ్యవస్యసి || 28 స ఏవ పురుషః శ్యామో ద్వారి తిష్ఠతి నిత్యశః | ఏతేన దానవేంద్రా శ్చ తథాన్యే బల దర్పితాః || 29 వశం నీతా బలవతా పూర్వపూర్వ తరాశ్చ యే | బద్ధశ్చాహ మనేనైవ కాలో೭యం దురతి క్రమః || 30 క ఏనం పురుషం లోకే పంచ యిష్యతి రాక్షసః | లోక త్రయస్య సర్వస్వ కర్తా హర్తా తథైవ చ || 31 సంహర త్యేష భూతాని స్థావరాణి చరాణి చ | పున శ్చ సృజతే సర్వ మనాద్యన్తో మహేశ్వరః || 32 ఇష్టం చైవ హుతంచైవ తపస్తప్తం తథైవ చ | సర్వస్యేవహి లోకేశో ధా తా గోప్తా న సంశయః || 33 సర్వదేవ మయశ్చైవ సర్వభూత మయ స్తథా | సర్వలోక మయశ్చైవ సర్వజ్ఞాన మయ స్తథా || 34 సర్వరూపీ మహారూపీ మహాబాలో మహాభుజః | స్మృత్వా స్తుత్వా తథేష్ట్వాచ సర్వ మస్మా దవాప్నుయాత్ || 35 ఏతచ్ఛ్రుత్వా చ వచనం రావణో నిర్య¸° తదా | న చ తం పురుషం తత్ర దర్శ రజనీచరః || 36 సమేత్య రక్షో೭ధి పతిః సహాయః చచార భూయః పృథివీం సమగ్రామ్ | న చాప్యసౌ కశ్చి దపశ్యతా೭న్యం లోకేషు ధీరం త్రిదశారి ముఖ్యః || 37 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే బలిరావణ సమాగమోనామ అష్టత్రింశదుత్తర ద్విశతతమో೭ధ్యాయః || మా తాత పితామహుడు హిరణ్యకశివుడనుపేరి వాడుండెను. ఈ కుండలములాతనికి జెందియుండెను. వీనిని నతడు సింగారించుకొనువాడు. నీవన్నావే యాతడు (విష్ణువు) అతనిందన తొడలపై నెక్కించుకొని గోళ్లచే జీల్చె. అట్టి మహాభాగుని నీ వెట్లు గెలువ సమకట్టితివి? అతడే నల్లని యా పురుషుడే ద్వారమందు నిత్యముండును. బలవంతుడు వీనిచే బలదర్పితులు దానవేంద్రులు పెక్కురు స్వాధీనముసేసికొనబడిరి ముందటి వారంతకు ముందటి వారెందరో లొంగిపోయినారు. వీనిచేతనే నేను బంధింప బడినాను. కాలము గడుప శక్యముగానిది. రాక్షస ! ఈ మగవాని నెవ్వడు లోకమందు వంచింప గలవాడు. ముల్లోకముల కితడు కర్త హర్తయును చరాచర భూతముల నీతడు సంహరించును. మఱల సృజించు వీనికాది లేదు. తుదలేదు. మహేశ్వరుడీతడు. ఇష్టము (యజ్ఞములాచరించుట) హుతముహోమములు సేయుట తపస్సు తపించుటయు నను నీ యంతకు నితడు ధాతయు (చేయువాడు) గోప్త యును (రక్షించువాడును) సంశయములేదు. సర్వదేవమయు డీతడు సర్వభూతమయుడును సర్వలోకమయుడు సర్వజ్ఞానమయుడు, సర్వరూపిమహారూపి మహాబలుడు మహాభుజుడు. ఇతనిం దలచికొని స్తుతించి యజించి సర్వము నీతనివలన బొందవలయును. అని విరి రావణుడప్పుడు వెళ్లిపోయెను. నిశాచరుడతడా పురుషునచ్చట గానకపోయెను. రక్షోధిపతి వెనుకవచ్చి సహాయుడై సమగ్ర పృథివిందిఱుగాడి మరియొక్క ధీరు నెవ్వనిం (దనతో బోరగల వానిని) గన డయ్యెను. ఇది శ్రీ విష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రథమఖండమున బలిరావణ సమాగమమను రెండువందల ముప్పదియెనిమిదవ అధ్యాయము.