Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల ఏబదినాల్గవ అధ్యాయము - గంధర్వ ప్రేషణము శైలూషఉవాచ : శ్రుతమేతన్మయా సర్వం యత్త్వయోక్తం పునః పునః |
ప్రణిపాత మహంకర్తుంన శక్తోభరతాయతు ||
2 ఉద్యచ్ఛేదేవ ననమేదుద్యమశ్చెవ పౌరుషమ్ | అద్యసర్వ నిరుద్యోగం వనమే చేహకస్యచిత్ || 2 అతిక్లేశేనయే೭ర్థాఃస్యుర్థర్మ స్యాతి క్రమేణచ | అరేర్వా ప్రణిపాతేన మాస్మతేషు మనఃకృథాః || 3 అజ్ఞాఫలం యదా రాజ్యం ప్రణిపత్యతదాపరమ్ | కింనోరాజ్యేన కర్తవ్యం సామాన్యజన ధర్మిణా || 4 ప్రణిపత్య నరః శత్రుం మానీ శౌండీర్య వర్జితః | కథంశక్నోత్యవస్థాతుం భార్యాదృగ్విషయేష్వపి || 5 అరేర్వా ప్రణిపాతస్య సంగ్రామేమరణస్యచ | యదంతరంతద్భవతి బ్రహ్మహత్యాశ్వమేధయోః || 6 మార్కండేయఉవాచ : శైలూషవచనం శ్రుత్వా తదానాడాయనోద్విజః | జగామ స్వగృహాయైవ హతంమత్వాజనేశ్వరమ్ || 7 నాడాయనేతదాయాతే రాజాగంధర్వ సత్తమాన్ | సమాహూయబ్రవీ త్కాంశ్చిత్కాంశ్చిత్తత్ర కృతాంజలీన్ || 8 అవజ్ఞాయనరః శత్రుంక్షి ప్రమేవవినశ్యతి | తస్మాత్కార్య మవజ్ఞానంనకదా చిదరాతిషు | కేచిదయోధ్యాంగచ్ఛన్తు గందర్వాబలదర్పితాః || 9 ఆనయంతుస్త్రియః శీఘ్రం తత్రగత్వాచమాయయా | యేముఖ్యాః సైనికాస్తస్య భరతస్యసమత్విషః || 10 సైనికానాంస్త్రి యస్తేషాంకృత్వా ప్రముఖతో రణమ్ | ఏవం వినమసాంతేషాం కర్తాస్మి కదనం మహత్ || 11 ఘాతయిష్యామి భరతం హతసైన్య మనంతరమ్ | శిబిరంచాపరే యాన్తు భరతస్య సువిద్వషః || 12 నిఘ్నన్తుయోధాన్యం సుప్తాన్రా త్రౌతస్యసహస్రశః | హతసైన్యం హనిష్యామి తతో೭హంభరతం రణ || 13 రాజ్ఞోగృహంత థైవాన్యే ప్రవిశంతుమహాబలాః | నిఘ్నంతు తత్రసంసు ప్తాన్సైనికాంస్తు యుధాజితః || 14 హతసైన్యం హనిష్యామి భరతం సయుధాజితమ్ | అదృశ్యైర్మాయయా గత్వాగంధర్వైర్బలదర్పతైః || 15 యథోక్తమే తత్కర్తవ్యం వచనం మమసత్వరైః | శైలూషుడనియె. మఱల మఱల నీవు సెప్పినదిది యెల్ల విన్నాను. భరతునకు బ్రణిపాతము సేయుటకు నేను శక్తుడను గాను. కళ్లు మూసుకొని యుద్యమింపవలసినదే దండము పెట్టగూడదు. ఉద్యమమనగా పౌరుషము. ఇపుడు సర్వనిరుద్యోగముగ (చేతులు ముడిచికొని) నేనెవ్వనికిని దండము పెట్టను. అతి క్లేశముచేత ధర్మాతిక్రమణముచేత శత్రువుని కాళ్ళమీద పడుటచేత ప్రయోజ నములు కలుగును (కలుగుగాక). వానిపై మనసుంపకుము. రాజ్యము ఆజ్ఞాఫలము. శాసించిపొందవలసినదెపుడైనదో (అడుకొనవలసి నది గాదన్న మాట) అపుడు శత్రునకు ప్రణమిల్లి (పాదాలమీదబడి) చేకొన్నదియా సామాన్యజనధర్మముగల ఆ రాజ్యముతో మనమేమి చేయవలయును? అభిమానవంతుడు శౌండీర్యము విడిచి (శౌర్యము విడిచి) శత్రువునకు మ్రొక్కి మానవుడు కట్టుకొన్న పెండ్లాము దృష్టి లక్ష్యములందేని యెట్లు నిలువ శక్తుడగును. (సాధారణముగ మానిమలు తేజశ్శాలిని ప్రతాపవంతుని ఎక్కువగ నాదరింపదలతురు. తేజోహీనుని దద్దమ్మను దర్మపత్నియేని యీసడించునది దుస్సహమన్న మాట) శత్రువునెడ విధేయతకు రణమందు చావునకు నెంతయంతరమో (ఎడమో) బ్రహ్మహత్యకు అశ్వమేధమునకంత యంతరమున్నది. శైలూషునివచనమాలించి ద్విజుడు నాడాయణుడు ఱనింగ గడతేరినవాడయనుకొని తన యింటికే చనెను అతడట్లేగ గంధర్వపతి గంధర్వోత్తములం బిలిపించికృతాంజలులైన కొందఱింగొందఱిం గూర్చి యిట్లు పలికెను. మానవుడు శత్రువును అవమానించి యాక్షణము నశించును. అందువలన పగతుర యెడ నెన్నడు పరాభవము సేయరాదు. కాందఱయోధ్యకేగుడు. బలదర్పితులు మీరటకేగి శీఘ్రమ మాయచేసి యచటి స్త్రీలను చెరపట్టి కొనిరండు ఆభరతునియొక్క సేనానాయకులతనితో సమతేజస్వులెవరో వారి స్త్రీలను సైనికుటయెదుటబడి పోరొనరించి లాగికొనరండు. ఇందుచే మతిచెడిన వారితో నేను పెనుకదనము సేసెదను. సైన్యము హతమారిన తరవుఆత భరతుని నే జంపెదను. వేఱ కొందరు భరతునిశిబిరమునకు వెళ్ళుడు. అట్లేరేయినిద్రలోనున్న యోధులను వేలమందినిజంపుడు. సైన్యమీల్గిన భరతునాపైననేనిం జంపెదను. అట్లే మఱికొందఱు మహాబలశాలులు రాజగృహముంజొరబారుడు. అక్కడ నిద్రవోవుచున్న యుధాజిత్తు సైనికుల హతమార్పుడు. సైన్యము హతమైన భరతుని యుధాజిత్తుతోగూడ నేలగూల్చెదను. గంధర్వులు బలదర్పితు లదృశ్యులైయీచెప్పిన నామాట సత్వరము కావింపవలయును. ఏవముక్తాస్తు గంధర్వాః ప్రణిపత్య మహీపతిమ్ || 16 రాజాజ్ఞాం శిరసాగృహ్య జగ్ముస్త్వరత విక్రమాః | దినశేషేణ సంప్రాప్య యథోద్దిష్టం మహీక్షితా || 17 వ్యచేష్టన్ని శిరాజేంద్రయథాజ్ఞప్తం చికీర్షవః | విసర్జ యిత్వాగంధర్వాన్ శైలూషో೭ప్యథసత్వరః || 18 ఆజ్ఞాపయత సైన్యానిశ్వోయుద్ధమితి పార్థిన | జగామచాస్తం సవితా కమలాని విశీలయన్ || 19 ఛాదితేతమసాలోకే ప్రవృత్తా యామినీతథా || గంధర్వరాజో೭పితదా విజహ్రే స్త్రీభిఃసహాంతః పురమేత్యసాకమ్ | గంధర్వ పుత్రాశ్చతథా విజహ్రుః శ్వోయుద్ధమిత్యేవ వివృద్ధ దర్పాః || 20 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండేయ మార్కండేయ వజ్రసంవాదే గంధర్వ ప్రేషణం నామ చతుష్పంచాశదుత్తర ద్విశతతమో೭ధ్యాయః ఇట్లానతీబడి గంధర్వులు మహీపతికి బ్రణమిల్లి రాజాజ్ఞను శిరసావహించి త్వరిత విక్రములై దినశేషమునకు (ప్రొద్దుగుంకునంతకు) రాజుద్దేశించిన చోటుచేరి రాజునాజ్ఞను నిర్వహింప పనిబూనిరి శైలూషుడును గంధర్వులంబంపి వెంటనే రేపు యుద్ధ మని సేనల కానయిచ్చెను. రవి కమలములను వాడించుచు నస్తంగతుడయ్యెను. చీకటిగ్రమ్మ రాత్రి ప్రవర్తించెను. అప్పుడు గంధర్వ రాజును నంతఃపురమున కేతెంచి యంగనలతో విహరించెను. గంధర్వ కుమారులును రేపయుద్ధమని దర్పముప్పొంగ నటవిహరించిరి. ఇది గంధర్వ ప్రేషణము రెండువందల యేబది నాల్గవ యధ్యాయము.