Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల నలుబదిఐదవ అధ్యాయము - విరహిణీవర్ణనము - అద్భుత ఘట్టము! మార్కండేయఉవాచ : ఆజ్ఞప్తాయేత్వయోధ్యాయాం గంధర్వాస్తేన భూభుజా ||
అయోధ్యాంతే సమాసేదుర్ని శీథేలఘు విక్రమాః ||
1 మాయాచ్ఛన్నశరీరాశ్చ విచేరుస్తే మహీపతే | అయోధ్యాయా మహారాజ పరాంచ దదృశుః శ్రియమ్ ||
2 శశాంక కరశుభ్రాణి బహుభౌమాని యాదవ | దదృశుర్గృహముఖ్యాని శతశో೭థ సహస్రశః ||
3 సర్వరత్నోపపన్నాని శయనాసనవంతిచ | సువర్ణదామ చిత్రాణి ముక్తాజాల చితానిచ ||
4 ప్రజ్వలద్భిర్మహా దీపైర్దీపితాని సమంతతః | బహుమాల్యాని ముఖ్యాని దీపోద్గారేణ పార్థివ || 5 ప్రవిష్టా గృహముఖ్యేషు దదృశుస్తేషు మానవాన్ | చందనాగురుదిగ్ధాంగాన్ సర్వాభరణ భూషితాన్ || 6 క్రీడమానాన్సహస్త్రీభిద్ధి విదేవగణానివ | భరతానుగతానాంచ సైనికానాం గృహేషుచ || 7 స్త్రీణాంభర్తృ విహీనానాం దదృశుర్బాలచేష్టితమ్ | కాచిన్నలే భేశయనే నిద్రాముద్భ్రాంతలోచనా || 8 ఆకులంశయనంచక్రే కాచిద్భూయో వివర్తనైః | మృణాల శయనేకాచిత్ కదళీపర్ణసంస్తరే || 9 చందనం దంద్రపాదేషు మృణాళవలయేషుచ | కామాగ్ని నాశాశ##క్తేషు కాచిచ్చక్రేతథా రుషమ్ || 10 అశ్రుధారాని పతితాః కామాగ్ని పరిదీపితే | అంబరీషేతథా నాశం కస్యాశ్చిద్యాతి వక్షసి || 11 కాచిన్ము మోహశయనే వర్ణయంతీ సఖీజనే | లబ్ధనిద్రాతదా దైవాత్ కాంత సంభోగజంసుఖమ్ || 12 తాలవృంతాని లైఃశీతై ర్వీజ్యమానా సఖీజనైః | దహ్యతాభ్యధికం కాచిత్స్వనిః శ్వాసవినిః సృతైః || 13 స్వప్నే೭పికాంత సంయోగ కారిణీహి సఖీమమ | దైవాన్మయిహతానిద్రా సాపికాచిదభాషత || 14 కేయూరస్థాన సంప్రాప్తావ రాంగదవిభూషణా | కామక్షామవపుః కాచిజ్జగామ సఖిశోచ్యతామ్ || 15 దత్త ధ్యానతయాకాంతే శోచ్య మానా సఖీజనైః | అవిజ్ఞానా త్తథాకా చిన్నా భాషత సఖీజనమ్ || 16 చిత్ర భిత్తి గతం కాంతం కాచిచ్చాని మిషేక్షణా | బభూవ చిత్రన్యస్తేవ పశ్యంతీ విగతక్రియా || 17 మార్కండేయుడనియె ఆరాజయోధ్యకు పంపిన గంధర్వులు తేలికనెగిరి యర్ధరాత్రి యటజేరి మాయా శరీరులై చరించి అయోధ్యాపుర సౌందర్యముం జూచిరి. అందు లోగిళ్లు చంద్రకిరణ సమానములు తెల్లనివి. పెక్కు వాకిండ్లుగలవి. వందలు వేలు. సర్వరత్న సమృద్ధములు. ఇక్కడ రత్నములు మణులనవచ్చును. అదికాక యా యా వస్తువులలో మేలిరకములు గోరత్నము అశ్వరత్నము భార్యారత్నము పుత్రరత్నము లిత్యాదులునుగావచ్చును. చక్కని శయనములు (తల్పములు-పాన్పులు సోఫాలు) మొదలయిన యాసనములుగలవి. బంగారు జాలరులు ముత్యాల పేరులతో నింపుగొన్నవి చక్కనివి దీపములచే నెల్లెడ వెలుగందినవి. దీపోద్గారముచే బహుళములయిన దీపమాలికలందలంకరింపబడెను. పాదరసపు బుడ్లు అమరించినందున వానియందు దీప కాంతులు ప్రసారముయి చూడముచ్చటగొల్పుచుండె నన్న మాట. ప్రతిష్ఠా గృహశ్రేష్ఠములందుమసలు జనులు చందనాగురులిప్తాంగులు సర్వాభరభూషితులు రమణీమణులంగూడి చదరంగము మొదలయిన వాడుచు స్వర్గపురమందు దేవగణములట్లు విలసించుచుండిరి. భరతవెంబడిం జనిన సైనికుల యిండ్లలో భర్తలు దరిలేని భామినులయొక్క (ప్రోషిత భర్తృకలయొక్క) హావభావములను దిలకించిరి. ఒకతె తల్పమందు వ్రాలి బెదరు చూపుల జూచుచు నిదురవోదయ్యె. ఒకతెఱవ నిద్రపట్టక యట్టిట్టు దొరలి దొరలి పానుపు చెదరిపోజెసెను. ఒక భామిని తామరతూండ్ల పక్కపైని యరటాకుల సెజ్జపైపరుండి కుములుచు చందనము చంద్రకిరణములు తామరతూటి చుట్టలునుం గామాగ్ని నార్పజాలవైనంత వానిపై రోషపడెను. జడిగా కన్నీరు కురిసి కామాగ్నిం గ్రాగిన ఱొమ్మునంబడి కాలినమంగలము పైనట్లింకిపోవు చుండెను. ఒక ముగ్ధ దైవికముగ యించుక నిద్రపట్టి యందనుభవించిన కాంతుని సంఖోగ సుఖమును సఖీజనమునకు వర్ణించి చెప్పుచు తల్పమున మూర్ఛపోయెను. ఒక సుందరి సఖీజనము తాటాకు విసనకర్రల చేగొని విసరు చుండ తన వేడినిట్టూర్పులచే దానంతముందుకంటె మిక్కిలిగ వేగింపబడెను. ఒక విరహిణి కలలోనైన నావల్లభుని సంగతింగూర్చు చుండెడిది నానెచ్చెలి యానిద్రనుగూడ దైవము మాయముసేసినాడు. అంగదములు కేయూరములు పెట్టుకొనిచోటికి వచ్చినంతగా కామవశమున మిక్కిలి చిక్కిపోయిన మేనితో నొక కామిని చెలిమికత్తె లారాటపడవలసిన దైనది. కాంతునదేపనిగ తలపోయుచు మైమరచి సఖురాండ్రలమటింప వలసినదైయండి వారుపడు నారాట మించుకైన తెలియక వారితో నేమియుం బలుకకుండెను. ఒక కొమ్మ యెదుట చిత్తరువునందున్న కాంతుని ఱప్పలిడక చూచుచు చిత్తరువునం బొమ్మవలె నిశ్చేష్టయయ్యెను. ఇతి గంధర్వ ముఖ్యానాం పశ్యతాం రజనీముఖే | నాసీత్త్స్రీ హరణ శక్తిః ప్రభావా ద్రాఘ వస్యచ || 18 హితేచ్ఛు రాసాం సయదా నివిష్టో దేవేశ్వరశ్చ క్రధరో నృరూపీ | తతః ప్రభావో నబభూవ తేషాం హర్తుంస్త్రి యశ్చారు శశాంక వక్త్రాః || 19 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే విరహిణీ వర్ణనంనామ పంచ పంచాశదుత్తరద్విశతతమో೭ధ్యాయః. ఆ రేయి తొలిజామున నీవిధముగ నున్న అయోధ్యా నగరాంగనలం గను నా గంధర్వ వీరులకు జాలిచేతను రాఘవుల ప్రభావము చేతనుగూడ యాయబలలహరించికొనిపోగల శక్తిలేక పోయెను. ఆ అయోధ్యా పురవాసులకు మేలుగోరి దేవాధినాథుడు చక్రధరుడు నరరూపమున నెప్పుడవతరించెను దాననా గంధర్వులకు పరమ సుందర చంద్రబింబాననా బృందమును హరించుకొనిపోవు ప్రభావము లేదయ్యెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున విరహిణీవర్ణనమను రెండువందల యేబదియైదవ అధ్యాయము.