Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల ఏబదియేడవ అధ్యాయము - నిశోపభోగవర్ణనము మార్కండేయ ఉవాచ - ఆథరాజ గృహాఖ్యంతు నగరం యే విసర్జితాః |గంధర్వా దదృశుస్తత్ర పుర శ్రియ మనుత్తమామ్ ||
1 చంద్రసా పత్న్య భూతాని గృహముఖ్యాని సర్వశః | దదృశుర్బహు రత్నాని బహు ధాన్య ధనానిచ ||
2 పురోద్యానాని రమ్యాణి దదృశుశ్చ సమంతతః | అలంకృతాని వాపీ భిర్ద్రుమషం డైశ్చ యాదవ ||
3 ఉద్యానేషు విచిత్రేషు నర ముఖ్యానుగా మినామ్ | పశ్యంతి తత్ర సంఘాని గంధర్వాః పానపాయినామ్ || 4 వల్ల కీనాం నినాదేన గీతేన మధురేణచ | ఏకతామి వసం యాతం చారు షట్పదశింజితమ్ || 5 వేశ్యాశ్చైవో పనృత్యంతి క్వ చిత్త త్రచ కాముకాన్ | క్వచిత్సా భరణాః సుప్తాః కాంతైః సహమ దోత్కటాః || 6 సుప్తానాం నరనారీణాం గంధర్వా స్తత్రచేష్టితమ్ | దదృశుర్బహుదారాణాం మాయాచ్ఛాదిత విగ్రహాః || 7 గాయంత్యన్యేరు దంత్యన్యే హసంత్యన్యే తథైవచ | ఆశ్లిష్యంతి తథైవాన్యే మదమత్తాః పరస్పరమ్ || 8 భాషంతే కేచిదవ్యక్తం విహ్వలార్తాః పదే పదే | శయనే భ్రమమాణౖశ్చ క్వచిదస్థితదృష్టయః || 9 కామినీ స్కంధ విన్యస్త బాహవశ్చ తథా పరే | కలహం చక్రిరే చాన్యేస్తువంత్యన్యే నిరర్థకమ్ || 10 స్థలమాన పదాయాంతి స్థానం హృద్యనవస్థితమ్ | ఆహ్వయంతి గణాన్కేచి త్ర్పణమంతి తధాపరే || 11 ఏవం సర్వజనాకీర్ణే నగరే గీతనాదితే | దదృశు ర్గృహ ముఖ్యేషు నరనారీ విచేష్టితమ్ || 12 మార్కండేయు డనియె. రాజగృహమను నగరమునకు బంపబడిన గంధర్వులక్కడ పరమోత్తమనగర సౌందర్యముం జూచిరి. అక్కడ గృహరాజము లంతట చంద్రునికిసపత్నములు (సాటివి) బహురత్నములు బహు ధనధాన్యములు పురోద్యా నములెల్లడ పరమ రమ్యములు బావులతో తరుషండములతో నలంకృతములు. ఆ విచిత్రోద్యానములందు నరోత్తములను వెంటజను వారి (ననుచరులయొక్క) సంఘముల మద్యపానము సేసిన వారిని వారుగనిరి. చక్కని తుమ్మెద ఝంకారము వీణధ్వనితో మధుర గీతముతో (శ్రుతిగలిసినట్లు) ఏకమైనట్లుండెను. అక్కడ కాముకులముందొక చోట వేశ్యలు నృత్యముసేయుచున్నారు ఒకచోట మదోత్కటలై యాభరణములతోడనే కాంతులతో నిద్రవోవుచుండిరి. గంధర్వులు తమరూపములను మాయంగప్పుకొని బహుదారులయిన=అనేకమంది భార్యలుగల పురుషులయొక్క అనేకులకు భార్యలయినవారి స్త్రీలయొక్క శృంగారచేష్టలను. దిలికించిరి. కొందరు పాడుచున్నారు కొందరు రోదించుచున్నారు కొందరు నవ్వుచున్నారు. మదమత్తులై యొండొరులం గౌగలించుకొనుచున్నారు. పదము పదమున (క్షణ క్షణము) కామవివశులై కొందఱవ్యక్త సంభాషణము లొనరించుచున్నారు. బెదరుచూపులం గొందరు తల్పముల ందట్టిట్లు దొరలుచున్నారు. కామినుల కంఠములంబాహువుదగిలించి (కంఠాశ్లేషముసేయుచు) కొందరు వృథాకలహమాడుచున్నారు. కొందరూఱక పొగడుచున్నారు కొందఱడుగులు దడబడ (పడుచు లేచుచు) అనికోనిచోటికేగుచున్నారు కొందరు గుంపులను బిలుచుచున్నారు కొందరు ప్రణమిల్లుచున్నారు. ఇట్లు సర్వజన సమ్మర్దము గీతప్రతిధ్వనితమునై ననగరమందు మహాభవనములందు నరనారీ చేష్టితమునిట్లు చూచిరి. సంచోద్యమానా దూతీభి స్త్వరాకృత మృజాః స్త్రియః | యాంతి కాంతా సుసంభ్రాన్తా మదపాన సముత్సకాః || 13 పపుఃకాశ్చి త్ర్పియైంసార్ధం పానం మదసమీరణం | పాయ యంత్యః పరాః కాంతాన్ భోజయంత్యపరాః ప్రియాన్ || ప్రాసాదేషు విచిత్రేషు తథా వాతాయనేషుచ | రతిశ్రాంతా స్తథా సుప్తాః కాశ్చిత్కాంతైః సహస్త్రియః || 15 కిచిద్గౌరీ ప్రియం శ్యామమాలింగ్య శయనే స్థితా | ఉత్పల స్రగివాభాతియుక్తా జాతి స్రజాసహ || 16 గౌరీగౌర సమాశ్లిష్టా కాచిదాభాతిసుందరీ | ఆలింగితా చంద్రకరైశ్చం దకాంతశిలా యథా || 17 శ్యామాశ్యామ సమాశ్లిష్టా కాచిదాభాతి పార్థివ ! పయోదపం క్తిర్గగనే యథా పార్థివసోదకా || 18 అలీకసుప్తమ ప్రౌఢా కాచిచ్చుంబయతే ప్రియమ్ | ప్రియేణ గాఢ మాశ్లిష్టా విలక్ష ముదితా೭భవత్ || 19 కాచిచ్చవనితా ప్రౌఢా కర్పూరరజసా స్వయమ్ | అవాకిరతి కాంతాంగం రతిస్వేద పరిప్లుతమ్ || 20 పశ్యేమాం తారకాం చంద్రోహ్యంకే నాలింగ్య తిష్ఠతి | ఇత్యాహదయితం కాచిత్ర్పౌఢారతిసుఖార్థినీ || 21 కాచిదూరుపరామర్శాద్విదిత్వా సురతార్థినీ | కాంతే నాలింగితా గాఢం ముదితే నరిరంసునా || 22 కాంతేన కాచిద్దష్టౌష్ఠీ చుంబనాయార్పితేముఖే | నయాస్యేతవవిశ్వా సంభూయశ్చే దన్యథాకృథాః || 23 కాచిత్ర్పసుప్తా కాంతేన పరామృష్టారతార్థినీ | కాంత మాలింగితాత్యర్ధం త్యక్త నిద్రాస సంభ్రమా || 24 దూతికలు ప్రేరేప పురుషులు స్నానాదులు తొందరగ సేసి మదపాన సముత్పుకులై సంభ్రమమున కాంతల యెడకు జనుచున్నారు. కొందరు మదవతులు ప్రియులతో మత్తుమాటలాడుచు (లేదామదభరిత (మంద) వాయువులు వీచుచుండ) పానము సేయు చున్నారు. కొందరుప్రియలం ద్రాగించుచున్నారు భోజనములు సేయించుచున్నారు విచిత్ర ప్రాసాదములందు వాతాయనములందు కిటికీలందు రతిశ్రాంతలై స్త్రీలు కాంతులతో నిదురపోవుచున్నారు. ఒక గౌరి గౌరవర్ణశు భవర్ణయైనస్త్రీ శ్యాముడైన ప్రియుని (నల్లని వానిని) పాన్పుపై కౌగిలించికొని జాజిపూలమాలతో గూడిన నల్లగలువపూల మాలవలె భాసించెను. అట్లే గౌరియొకతె గౌరశరీరుని నాయకుని గౌగలించికొని చంద్రకిరణములతోడి చంద్రకాంతమణివోలెదీపించెను. శ్యామయొకతె శ్యామలమూర్తి నాలింగనముసేసి నింగిని సజలజలదపం క్తివోలె రంజిల్లెను. దొంగని ద్రవోవుప్రియునొక అప్రౌఢ (మధ్యమనాయిక) ముద్దువెట్టెను. ఆ ప్రియుడుగాఢా లింగనము సేయ విలక్షముదితయయ్యెను. మైమరపుగలుగునంతగ నానందపడెను. ఒక్క ప్రౌఢాంగన రతి వలనిచెమటందడిసిన కాంతునిమేనిపై కప్పురము వెదజల్లినది. రతిసుఖముకోరి యొకప్రౌఢ చూడుచూడు; ఇదిగో చంద్రుడీతారకను (చక్కనిచుక్కను) అంకముచే=తొడలతో గౌగలించుకొనుచు (అంకము=చంద్రుని కళంకమని శ్లేష) నిలిచినాడు ఒకతె తొడలురాయుచు తాను సురతార్థినియైయున్నట్లు గ్రహించి ముదమందిన రతిక్రీడార్థియైన వల్లభునిచే బిగ్గ గౌగలించుకొనబడెను. ఒకతె ముద్దుపెట్టుటకు తన మొగ మందీయ ప్రియుడు పెదవి కొఱుక నింకొకమారింకొక తీరునం జేసితివేని నిన్ను నమ్మనని బెదరించెను. (నేనుముద్దిడనీవు ముద్దిడుట సబబుకాని సబబుతప్పి యింకొకతీరున ననగా పెదవి కొఱకితవి నీవు విశ్వాస పాత్రుడవుగావని వలపుగినుకందెప్పినదని భావము) ఒక సుందరి నిద్రవోయి ప్రియునిచే లేపబడి రత్యర్థినిగావున తాను సంభ్రమముతో (తొట్రుపడుచు) నిద్రవీడి సుందరుని గట్టిగగౌగలించికొలెను. ఇత్యేవమసి విశ్వస్తా న్సైనికాంస్తాన్యుదాజితః | హర్తుం నశేకుర్గంధర్వా భరతస్యసమాశ్రయాత్ || 25 ఏషాంపురా సన్నిహితః సవిష్ణుర్మహానుభావో రఘువంశగోప్తా | తేషాంపురే నాస్తి భయం నరేంద్ర గంధర్వయక్షాసుర పన్నగే భ్యః || 26 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయవజ్రసంవాదే నిశోపభోగవర్ణనోనామ సప్తపంచాశదుత్తర ద్విశతతమో೭ధ్యాయః ఈ విధముగ విశ్వసించి యుద్ధమిప్పుడు లేదని నమ్మకముతో పరామరికనున్నను యుధాజిత్తు భరతునాశ్రయించిన కత ననా సైనికులను గంధర్వులు హరింపలేరైరి. మహానుభావుడు విష్ణువు రఘువంశరక్షకుడై యెవరి పురమంరు (శరీరమందు) సన్ని హితుడైయుండును వారిపురమందు శ్లేషగంధర్వయక్షా సురపన్న గులవలన భయముండదు. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమందు నిశోపభోగ వర్ణనమను రెండువందల యేబది యేడవ యధ్యాయము.