Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల అరువదితొమ్మిదవ అధ్యాయము - శ్రీరామచంద్ర భరతసమాగమము మార్కండేయుః- ఆ థా షాఢస్య మాసస్య శుక్ల పక్షావ సానికమ్ || ఉత్సవం త్రిదశేం ద్రాణాం సమాప్తం దిన పంచకం ||
1 క్షీరోద శేష శయనే భగవాన్ మధుసూదనః | యోగ నిద్రాం తథా భేజే లోకానాం హితకామ్యయా ||
2 భరతో೭ ప్యుత్సవం కృత్వా పూజయిత్వా జనార్దనమ్ | మహీదానం తథా కృత్వా నక్తా శీ దినపంచకమ్ ||
3 చాతు ర్మాస్యే నివృత్తే చ మదుమాంసస్య భక్షణాత్ | విసర్జయా మాస గృహాత్ పూయిత్వా మహీపతీన్ || 4 ఉక్త్వా బహువిధైః సాంత్వైః పరిష్వజ్య సుపీడిత్ | గంధర్వ నగరా వాపై#్త ర్విభజ్య ధన సంచయైః || 5 సంపూజ్య వర్షారా త్రౌతు స్వకీయం సైనికం జనమ్ | సంమంత్ర్య ప్రేషయా మాస సోత్కంఠం దయితాజనే || 6 ప్రేషయ త్వా జనం ప్రాయాత్ కించి చ్ఛేష స్వసైనికైః | ఉవాస మాతుల గృహే భరతో దేవ రాజవత్ || 7 అవసచ్చతురో మాసాన్ ప్రీత్యా రాఘవసత్తమః | తతః కార్తిక మాసస్య శుక్ల పక్షావ సానికమ్ || 8 ఉత్సవం విపులం చక్రే సంప్రాప్య దిన పంచకమ్ | ప్రబోధం దేవదేవస్య త్రిదశానాం మహోత్సవే || 9 తేషు దత్వా మహాదానం కార్తిక్యాచ విశేషతః | పూజయిత్వా జగన్నాథం శంఖ చక్ర గదాధరమ్ || 10 శుభేదినే సు నక్షత్రే పూజయిత్వా ద్విజోత్తమాన్ | సాంవత్సరం పురస్కృత్య స్థపతీం శ్చ స రాఘవః || 11 సింధో రుభయ పార్శ్వే తు స చకార పురద్వయమ్ | పుష్కరం పుష్కరావత్యాం తక్షం తక్షశిలాం ప్రతి || 12 ఆరంభం పురయోః కృత్వా సో೭భిషిచ్య సుతావుభౌ | పురద్వయే మహారాజ! విధివ ద్భూది దక్షిణః || 13 పుష్కరే పుష్కరం పుత్రం తక్షంచ యాదవ! మార్కండేయుడనియె. అవ్వల నాషాఢ శుక్లపక్షముచి వర జరుగనగు దేవతలమహోత్సవ మైదురోజులుజరిగి పూర్తియయ్యెను. పాల్కడలిలో శేషతల్పశాయి భగవంతుడు మధుసూదనుడు లోకహితము నెంచి యోగనిద్రం జెందెను. భరతుడును నుత్సవము సేసి యవ్విష్ణువుం బూజించి భూదానము సేసి యైదు నాళ్లు నుపవసించి చాతుర్మాస్యమందు మధుమాంస భక్షణము మాని యుండి సహాయ భూతులై వచ్చిన రాజులందరిని బూజించి పంపి వేసెను. ఆ పంపునపుడు బహు విధములైన సాంత్వన వచనములు వలికి తనతోడి యుద్ధమున మిగుల బాధలందిన వారిం గౌగలించుకొని గంధర్వ నగరము నుండి తెచ్చిన ధనరాసులను విభజించి వారికిచ్చి వర్షర్తు రాత్రి తన సైనిక జనములను బూజించి యాలోచన నెఱపి తనకై యుబలాటపడు నంతఃపుర జనమునకు సందేశము పంపెను. పంపి తన సైనికులు కొలది మందితో మాతుల గృహమందు దేవేంద్రునట్లు నివసించెను. అటనమితప్రీతితో నాల్గు మాసములుండెను. కార్తికము రాగ శుక్ల పక్షావ సానికమైన (కార్తిక పూర్ణిమం జరుగ దగిన) మహోత్సవమునైదురోజులు జరిపించెను. అది దేవదేవుని ప్రబోధసమయము (మేల్కొను సమయము) దేవతల కది మహోత్సవము. అందు మహాదానములిచ్చి జగన్నాధు శంఖ చక్రగదా ధరునర్చించి శుభనక్షత్ర శుభదిన మందు ద్విజోత్తములం బూజించి సాంవత్సరుని (జ్యౌతిషికుని) పురస్కరించి కొని స్థపతులను (శిల్పులను) బూజించి సముద్రము రెండు పార్శ్వములందు పురములను నిర్మింప జేసెను. పుష్కరావతియను దానం బుష్కరుని తక్షశిలయందు తక్షుని తన కుమారులను నగరారంభము చేసిన తరువాత పట్టాభిషిక్తులం గావించెను. పురద్వయే సమాకీర్ణే వణిగ్భి ర్ర్బాహ్మణౖ స్తథా || 14 శిల్పి భిశ్చ మహారాజ! నానా శిల్పోన జీవిభిః | గృహపుత్ర సమాకీర్ణే దేవాయతన భూషణ || 15 ప్రతిష్ఠి తే తదా రాజ్యే పుత్రయో ర్భరత స్తదా | ధన రత్నా ೭ శ్వ నాగైశ్చ విభజ్య తనయా వుభౌ || 19 యుధాజితి పరీదాయ గతే సంవత్సరే తథా | అతీతే కార్తికే మాసే నక్షత్రేతు గుణాన్వితే || 17 జగామ భరతః శ్రీమాన్ రామం ద్రష్టుం నరాధిప | సో೭ను యాతః సుతైర్వీరో మాతులేన యుధాజితా || 18 తీరే స్వధామ్న స్తౌ పుత్రౌ మాతులంతు యుధాజితమ్ | విసర్జయామాస గృహాన్ పరిష్వజ్య చ పీడితమ్ || 19 ఆ రెండు రాజధానుల వర్తకులతో బ్రాహ్మణులతో శిల్పులతో నానా శిల్పోద్యోగులతో దేవతా గృహములతో సుప్రతిష్ఠమైన రాజ్యమందు ధన రత్న హయనాగములతో విభాగము గావించి పుత్త్రులిద్దఱిని యుధాజిత్తుని సంరక్షణ మందప్పగించి జ్యోతిష్కుడు ననిన తర్వాత కార్తికము గడువ శుభమాసమందు శుభ నక్షత్రమందు శ్రీ మంతుడు భరతుడు శ్రీరామచంద్రుం దర్శింప నేగెను. కొడుకులు మేనమామ యుధాజిత్తు నతనిననుగమించిరి. తన యింటి నుండి నదీతీరమునకు వచ్చిన తరువాత తన కొడుకులను యుధాజిత్తును గౌగలించుకొని బాష్పనయనుడై వారి గ్పహములకు బంపించెను. భరతః సాశ్రునయనో బలేన చతురంగిణా | స్తోకేన కాంచనాంగేన రథేన చ తథా య¸° || 20 సంరుధ్యచ రథాంస్తేతు గచ్ఛన్తం భరతం తదా | దదృశుః దీన మనసః కించిదాగత విభ్రమాః || 21 ముహుర్ముహుః పరావృత్య భరతః కథమప్యగాత్ | పరస్పర మపశ్యన్తః త్వరా వన్త స్తథా గతాః || 22 భరతో೭పి తథా దేశాన్ సరాంసి సరిత స్తథా | గ్రామ పత్తన సంగాద్యాన్ వ్యతిక్రమ్య పురీం య¸° || 23 అథా ససాద చాయోధ్యాం దీర్ఘకాల ప్రవాసకః | ప్రవిశ్య నగరం తత్ర పతాకాధ్వజ సంకుమల్ || 24 సుధా వదాత భవనం సిక్తం చందన వారిణా | కృతం రామాజ్ఞయా సర్వం పూజితామర బాలకమ్ || 25 నిర్య¸° పురత స్తస్య చతురంగ బలాన్వితః | రామాజ్ఞయా మహాతేజాః నాగరై స్సహ లక్ష్మణః || 26 అవ్వల నల్పాల్పమైన చతురంగ బలముంగొని కాంచనాంగమైన రథముపై కొడుకులు మేనమామయు రథమెక్కి చన భరతుడు దీన మనస్కుడై (దిగులుగొని) ఇంచుకగ వచ్చిన తొట్రుపాటున మాటిమాటికి వారి వంక వెనుదిరిగి చూచుచు నెట్లో ముందునకు జనెను. వారును నితడును నొండొరుల వంక జూచికొనుచు నాపైని కనుమఱుగైనంత వారు ముందునకుసాగిరి. భరతుడును దేశములు సరస్సులు నదులు గ్రామపత్తన నదీసంగమాది ప్రదేశములం గడచి పురికరిగెను. దీర్ఘకాల ప్రవాసము సేసిన యతడయోధ్య నగరముం బ్రవేశించి పతాకాధ్వజ సంకులము సున్నము వెల్లల భవనములతో చందనోదకములం దడుపడుచు రామాజ్ఞచే దేవతారాధనములెల్లెడ జరుపబడియున్న యారాజధానిం బ్రవేశించెను. రామచంద్ర ప్రభువుముందు చతురంగ బలములతో రామాజ్ఞచే నాగరులతో (పుర ప్రజలతో) లక్ష్మణుడు ముందుజనెను. భరతం లక్ష్మణో దృష్ట్వా చిరకాల ప్రవాసకమ్ | అబ్యవాదయత ప్రీత్యా శిరః కృత్వా మహీతలే || 27 భరతో మూర్ధ్న్యుపాఘ్రాయ సంపరిష్వజ్య పీడితమ్ | సర్వత్ర కుశల ప్రశ్నం తత్ర కృత్వా యథావిధి || 28 యథార్హం పూజయామాస జనం నగరవాసినమ్ | కుశల ప్రశ్న యోగేన స్మిత పూర్వాభి భాషిణా || 29 సతేన జన బృందేన పూజ్యమానో ముహుర్ముహుః | వివేశ నగరం శ్రీమాన్ భరతో నాగధూర్గతః || 30 విమాన హర్మ్య ప్రాసాద గవాక్షక గతేన తు | స్త్రీజనేన మహాతేజాః వీక్ష్యమాణస్తు సస్పృహమ్ || 31 ఆససాద మహాతేజాః నరేంద్ర ద్వారమాయతమ్ | తత్ర వాదిత్ర నాదో೭ భూన్మహా న్కలకల స్తథా || 32 రాజద్వార మథాసాద్య సో೭వరుహ్య గజోత్తమాత్ | ఆదాయ లక్ష్మణం పాణౌ ప్రవివేశ తదా సభామ్ || 33 తత్ర సింహాసనే రామం సదదర్శ మహాభుజమ్ | చందనే నాను లిప్తాంగం సర్వాభరణ భూషితమ్ || 34 సంపూర్ణ చంద్రవదనం నీలోత్పల దళేక్షణమ్ | దృష్ట్వైవ రామం భరతః కృత్వా భూమిగతం శిరః || 35 నిపపాత మహాతేజాః లక్ష్మణన వివేషతః | రామో೭పి భరతం దృష్ట్వా సముత్థాప్య మహాభుజమ్ || 36 జగ్రాహ పీడితం కంఠే ముర్ధ్న్యుపాఘ్రాయ చాసకృత్ | ఆదిదేశా సనం తస్య పృష్ట్వా కుశల మవ్యయమ్ || 37 నివేద్య రత్న ముఖ్యాని గంధర్వాణాం సరాఘవః | రామాయ ధర్మ నిత్యాయ యథా భేజే వరాసనమ్ || 38 పృష్ట స్స రామేణ నివేదయిత్వా వృత్తం యథావత్ పురుష ప్రవీరః | విసర్జిత స్తేన గృహాయ గత్వా సంపూజయామాస తదా స విష్ణుమ్ || 39 స్వప్నే తథో వాస స రామపాదౌ చాసాద్య వీరః సమరేష్వజేయః | రామో೭పి రాజ్యం సహితం తు తేన చకార సమ్యజ్ నిహతారి పక్షః || 40 తత శ్చతుర్థే పరి వత్సరేతు | శుశ్రావ రామః పురయోః ప్రతాపమ్ || 41 కృత్వా సుతాభ్యాం భరతస్య విష్ణోః | ముదంచ లేభే పరమాం ప్రహృష్టః || 42 ఏషో೭ద్య ప్రోక్తో విజయో మయాతే రణాజిరే రాఘవ నందనస్య | శ్రోతస్య మేత న్నియమేన పుంసా విజ్ఞాన ధర్మార్థ యశో೭భిరామమ్ || 43 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శ్రీరామచంద్ర భరత సమాగమో నామ ఏకోనసప్తత్యుత్తర ద్విశతతమో೭ధ్యాయః. లక్ష్మణ స్వామి చిరకాల ప్రవాసము చేసి వచ్చిన భరతుంజూచి ప్రీతి శిరస్సు ధాత్రికి వచ్చి యభివందనము సేసెను. భరతుడు తమ్ముని శిరము మూర్కొని గాఢముగ గౌగిలించుకొని యన్నిటం గుశలప్రశ్నముయథావిధిగ సేసి యథార్హముగ నగర వాసి జనమును బూజించి కుశల ప్రశ్నములతో చిఱునవ్వు మున్నుగ పలుకరించి యీ జన బృందము మఱిమఱి సేయు పూజలందకొని గజముపై గూర్చుండి చని అయోధ్యా నగర ప్రవేశము గావించెను. విమాన హర్మ్య ప్రాసాదములందు గవాక్షము లందు గ్రమ్ముకొని స్త్రీ జనము సాభిలాషముగ వీక్షింప నమ్మహా తేజస్వి సువిస్తృతమైన రాజద్వారముం దరిసెను. అక్కడ మంగళ వాద్య కలకలము పెద్దగ నయ్యెను. రాజద్వారములం దరిసి భద్ర గజముం దిగి లక్ష్మణుని చేతం జేకొని యప్పుడు సభలో బ్రవేశించెను. అక్కడ నతడు సింహాసనమందు మహాభుజుని రాముని జూచెను. చందనము నొడలెల్ల పూయబడి సర్వాభరణ భూషితుడై సంపూర్ణ చంద్రవదనుడైనల్లగలువం బోలిన కన్నులతో నున్న యా ప్రభువునుచేరి భరతుడవనిపై దలవంచి యట వ్రాలెను. లక్ష్మణుడు నట్లగావించెను. రాముడును భరతునిం జూచి యమ్మహాభుజుని పైకి లేపి కంఠముగొని గట్టిగ గౌగలించెను. పలుమారులు శిరమ్ము మూర్కొని కుశల మడిగి యా తమ్ముని కాసనము సూపెను. భరతుడు గంధర్వులం గెల్చి తాదెచ్చిన యాయా రత్నముఖ్యములని (మేలైన వస్తువులనేక విధములయిన వానిని) ధర్మనిత్యుడగు రామునికి నివేదించి యుత్తమాసన మధిష్ఠించెను. పురుష ప్రవీరుడు రఘువీరుడు. భరతుడు రాముడడుగ జరిగినదెల్ల వినిపించి యా యన్నచే బంపబడిన గృహమున కేగి యప్పుడు విష్ణువుం బూజించెను. బొంది సమరములందజయ్యుడైన వీరుడు భరతుడు రామపాదములను మెళకువలోనే కాదు స్వప్నమందును సందర్శించు చుండెను. శ్రీ రామ చంద్ర ప్రభువును నాతనితో శత్రుల నెల్ల నిగ్రహించి రాజ్యము సేసెను. ఆవ్వల నాల్గవ పరివత్సర మందు శ్రీరాముడు ఆ యిద్దఱు కొడుకుల వలన సాక్షాద్విష్ణువైన భరతుని కొడుకువలన నా రెండు పురముల ప్రతాపమును వినెను. విని ప్రహృష్టుడై పరమానందమందెను. వజ్రనృపతీ! ఈ రాఘవనందనుడగు భరతుని యొక్క రణాంగణ విజయ వృత్తము నేను నీకు వచించతిని. మానవుడు విజ్ఞాన ధర్మార్థము యశోభిరామమైన యాకథ నియమముతో వినవలసినది. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున మార్కండేయ వజ్రసంవాదమునందు శ్రీ రామచంద్ర భరత సమాగమమను రెండువందలయఱువదితొమ్మిదవ అధ్యాయము.