Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ముప్పదియొకటవ యధ్యాయము - కార్తవీరుడు వనములను దహించుట మార్కండేయ ఉవాచ : ద్విజరూప మథాస్థాయ దేవదేవో೭పి భాస్కరః | మాహిష్మతీం య¸° శీఘ్రం నగరీం రత్నమాలినీమ్ || 1 సతత్ర దదృశే వీరం కార్తవీర్యార్జునం నృపం | యజమానం సుదోర్దండం కల్పవృక్ష మివాపరమ్ || 2 పూజితః కార్తవీర్యేణ బ్రాహ్మణో నృప మబ్రవీత్ || 3 బ్రాహ్మణ ఉవాచ : మహాశనం మాంజానీహి బ్రాహ్మణం క్షుధయార్దితమ్ | ప్రయుచ్ఛ తస్యమే తృప్తిం త్వమేకో హైహయోత్తమ|| 4 అర్జున ఉవాచ : కేనాన్నేన భ##వే త్తృప్తిః ; కిమన్నం విదధామితే | తన్మమాచక్ష్వ భగవ& ! సుఛందేనైవ మాచిరమ్ || 5 ఆదిత్యం మాం విజానీహి స్థావరా& భోక్తు ముద్యతమ్ | పప్రచ్ఛతాని సర్వాణి మమ పార్థివ పుంగవ || 6 అర్జున ఉవాచ : స్థావరం భూగతందాతుం శక్తిర్నాస్తి మమా೭నఘ | కథంహి స్థావరా దగ్ధుంశక్యా మానుష్య తేజసా || 7 ఆదిత్య ఉవాచ : రథస్థః స్థావరశ్రేష్ఠ ! శరా& ముంచ ! యద్ధృచ్ఛయా | తేష్వహం ప్రజ్వల& రాజ& ! భక్షయిష్యామి పాదాపా& || 8 తావదేవ త్వయా కార్యం నృపతే ! శర మోక్షణమ్ | యావత్ నప్రజ్వలిష్యామి ముక్తేష్వపి శ##రేష్వహమ్ || 9 మార్కండేయ ఉవాచ : ఏవముక్త్వా గతేసూర్యే. కల్పయిత్వా రథోత్తమమ్ | చిక్షేప సశరా& రాజా యత్ర తత్ర ద్రుమోత్కరమ్ || 10 తేక్షిప్త్వా హైహయేశేన శాతకౌంభోజ్వలా శరాః | జజ్వల& నృపశార్ధూల ! జ్వలయంతో వర ద్రుమా& || 11 దుందుభి స్వన నిర్ఘోషో విస్ఫులింగ గణాకులః | ఆలోలార్చి ర్మహావేగః సర్వసత్వ భయంకరః || 12 నిదహన్ వృక్షపుంజాని తప్తకాంచన సుప్రభః | జ్వాలానూలీ తదా భాతి సర్వతః పావకః క్షితౌ|| 13 వనేషు దహ్యమానేషు తాపతృష్ణార్ది తా మృగాః | జలాశ##యేషు చిత్రేషు గతచ్ఛాయాగ్ని కేషుచ || 14 దదాహాగ్ని స్తదా వృక్షా& యావదిఛా జగత్పతేః | బభూవా೭థ ప్రశాంతార్చిః కృత్వాల్వఘీం వసుంధరామ్ || 15 న జ్వజ్వాల తథావహ్ని కృతవీర్య శ##ర్వేష్వపి | కృతకార్యం తదాగత్వా కార్తవీర్యో దివాకరమ్ || 16 వినివృత్య రథం పశ్చాత్ యావన్మాహిష్మతీం పురీమ్ | స గచ్ఛన్నేవ దదృశే వసిష్ఠం సర్వ తేజసమ్ || 17 తేనశప్తోవనె దగ్ధే స్వకీయే నృపపుంగవః | యస్మాత్త్వయా వనం దగ్ధం మమ పార్థివ శాసన ! || 18 తస్మాచ్చేఛిద్యతే బాహూ& బ్రాహ్మణ శ్శం సిత వ్రతః | తేన శాపేన విప్రస్య రామః క్షత్రియ నందనః || 19 తస్య బాహువనం సర్వం చిచ్ఛేద భృగునందనః || 20 వజ్ర ఉవాచ : రామస్తు కస్మి& సబభూవ వంశే కథంచరాజ్ఞస్తు మహాబలస్య | చిఛేద దోర్ధండవనం నృవీరః సర్వం సమాచక్ష్వ భృగు ప్రధాన! || 21 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే-ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే వనదాహోనామ ఏకత్రింశత్తమో೭ధ్యాయః. మార్కండేయుడనియె : సూర్యుడు బ్రాహ్మణ రూపమున మహిష్మతి నగరమునకేగెను. అక్కడ కార్తవీర్యార్జునుంజూచెను. అతడనేక యజ్ఞములాచరించినవాడు మహావీరుడు. రెండవ కల్పవృక్షమా యనునట్లు గొప్పదాత. అతనిచే పూజితుడై బ్రాహ్మణుడిట్లనెయె : నే నాకలిగొన్నాను. తిండిపుష్టికలవాడను. నీవొక్కడవ నాకు దృప్తిగ నన్నముపెట్టుము. అన విని యర్జునుడు మీకు తృప్తికలిగించు నన్నమేది తెలుపుమన నా విప్రుడు నేనాదిత్యుడను. స్థావరములను దిన నుద్యమించినాను. వానినాకొసంగుము. అన భూమియందలి స్థావరభూతము నిచ్చు శక్తి నాకు లేదు. మనుష్య తేజస్సుచేత గిరి వృక్షాది స్థావరములు దహింపనెట్లు శక్యమగును. నావిని ఆదిత్యుండు '' ఓ పార్థివ శ్రేష్ఠా ! నీవు రథమందు నిలిచి లీలామాత్రముగ బాణములను వదలుము. వానియందు నేను రగుల్కోని యా చెట్లందినివైతును. బాణముల వదలునంతవంకే నీ చేయవలసినది. ఆమీద పని నాది. అనిపలికి సూర్యుడరుగ, నా రాజు రథమెక్కి నిలిచి చెట్లున్నచోట నెల్ల బాణములను విసరెను. మేలిమి బంగారమున దేజరిల్లు నయ్యమ్ములడవింగల వృక్షముల మండించి మంటలం జిమ్మ మొదలిడెను. అగ్నిజ్వాలలెగయ నలుదెసల నలముకొని నిప్పురవ్వ లెగయదుందుభి స్వన గంభీరఘోషమున నెల్లెడ గ్రమ్మి వనములం గాల్చినంత నీటిపట్లు నీడతలగి నిప్పులంబొరవ జగదీశ్వరుని యిచ్చ యెంతవరకో యంతదాక వృక్షములం గాల్చెను. మంటలు తగ్గ వసుంధరం జులకనచేసి యామీద కార్తవీర్యార్జునుని బాణములందు గూడ వెలుంగక యుపశమించి పోయెను. కార్తవీర్యుడట్లు తావచ్చిన పని చక్కబెట్టు సూర్యుని దరికేగి యాపై తేరు మరల్చికొని మాహిష్మతీ నగరమున కేగుచు సర్వతేజస్వియైన వశిష్ఠుని దర్శించెను. తనకోపమున వనము దగ్ధమగుటకా ముని కోపించి యో పార్థివ ! నా యాశ్రమ ప్రాంతవనము నీవు కాల్చితివిగావున నీ బాహువులనొక వ్రతనిష్ఠుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు కాల్చివేయును లెమ్మని శపించెను. ఆ బ్రాహ్మణశాపముచే క్షత్రియునికిం బుట్టిన వాడు పరుశురాముడు భృగుమహర్షి కుమారుడు (భార్గవుడు) కార్తవీర్యార్జునుని బాహువనమును నరకెను. అనవిని వజ్రుడా రాముడేవంశమున బుట్టెను? మహాబలుడైన కార్తవీర్యార్జునుని బాహువన మెట్లునరకె, నది తెలుపుమన మార్కండేయుడు కథ నానతిచ్చెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున కార్తవీర్యార్జునకృతారణ్యదహనమను ముప్పదియొకటవ యధ్యాయము.