Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ముప్పది ఎనిమిదవ యధ్యాయము - శుక్రసాల్వ సంవాదము

మార్కండేయ ఉవాచ :

రత్నచిత్రాం సువిపులాం సమాసాధ్య సభాం తదా ! సింహికా తనయఃసాల్వః శుక్రం వచన మబ్రవీత్‌ || 1

సాల్వ ఉవాచ :

దృశ్యన్త ఏతే భగవ న్నుత్పాతాః ఘోర దర్శనాః | ఆచక్షాణా మహాయుద్ధం వినాశమపిదారుణమ్‌ || 2

రిపుం న చైవ పశ్యామో యేన యుద్ధం భవిష్యతి | సర్వజ్ఞత్వా ద్భవాన్వేత్తి తన్నః ప్రబౄహి పృచ్ఛతామ్‌ || 3

శుక్ర ఉవాచ :

ఆరాధ్య దేవం బ్రహ్మాణం తపసా సింహికాపురా | త్రిదశేభ్యో హ్యవధ్యత్వం స్వసుతానా మలబ్ధ సా || 4

వరదాని కృతోత్సాహైర్భవద్భి ర్విద్యయా మమ | నిర్జితా స్త్రి దశాస్సర్వే శంకరం శరణం గతాః || 5

తేన యుష్మ ద్వధార్థాయ విష్ణుర్మానుషరూప ధృక్‌ | జమదగ్ని సుతో రామః ప్రేషితో రణకర్కశః || 6

సదాదేవో మహాతేజాః మానుషం సతు సాంప్రతమ్‌ | మనుష్యాచ్చ భయం మోరం బుద్ధ్యస్వాసురసత్తమ! 7

సాల్వ ఉవాచ :

భగవన్‌ ! సర్వదేవానా మీశ్యరో మధుసూదనః | తస్మా త్పతరం దేవం నాన్యం కంచన శుశ్రుమ || 8

కిమర్థం స మహాతేజాః శంకరస్య మహాత్మనః | ఆజ్ఞాకారీ భృగుశ్రేష్ఠ ! సైంహికేయం జిఘాంసతి || 9

శుక్ర ఉవాచ :

యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి దానవ ! | అభ్యుత్థాన మధర్మస్య తదాత్మనం సృజత్యసౌ || 10

కదాచిద్దైత్య దేవేషు కదాచిన్మనుజేషుచ | కదాచి దథ తిర్యక్షు జ్ఞాత్వాకార్యబలాబలమ్‌ || 11

యదా భవతి దేవేషు దేవవచ్చేష్టతే తదా | తిర్యక్షు చ యదా దేవ స్తిర్యగ్వ చ్చేష్టతే తదా || 12

యదా భవతి మానుష్యే తదా భవతి మర్త్యవత్‌ | మానుష్యంరూప మాసాద్యతపసా త్రిపురాంతకమ్‌ || 13

ఆరాధయామాస హరం స్వదేహే పరమం నృప ! | సతు దేవవరస్యాజ్ఞాం పురస్కృత్య మహాతపాః || 14

యుష్మ ద్వధార్థమాయాతి రామేణ కృత లక్ష్మణః | తస్మాచ్ఛక్రేణ సంధానం భవతో మమ రోచతే || 15

త్రివిష్టపంచ దేనానాం భవ త్వసురసత్తమ ! | పాతాలనిలయా యూయం నివసధ్వం గత జ్వరాః || 16

అహం నివారయిష్యామి శంకరేణ చ భార్గవమ్‌ | అన్యధా నివిశధ్వంచ మనుష్యేణ నిరాకృతాః || 17

మార్కండేయ ఉవాచ :

ఏవముక్తాస్తు శుక్రేణ బుద్ధా దైతేయ దానవాః | ఊచు ర్వాక్యం సుసంరబ్ధా శ్శుక్రం భృగుకులోద్వహమ్‌ || 18

మార్కండేయు డనియె : సింహికాపుత్రుడు సాల్వుడు రత్నచిత్రము సువిశాలమునైన సభకువచ్చి శుక్రునితో నిట్లనియె : భగవన్‌ ! ఇదుగో ఘోరములైన నుత్పాతములు ఘోరయుద్ధముయొక్క రాకడను ప్రాణులపోకడను సూచించు మహాదారుణములైన యుత్పాతములు కానవచుచున్నవి. యుద్ధ మెవ్వరితో రానున్నదొ యా శత్రువా కనిపింపడు. తాము సర్వజ్ఞులు కావున మీరెరుంగుదురు అడుగుచున్నాముగావున మాకది యెఱింగింపవలయును. అన శుక్రాచార్యుండిట్లనియె మున్ను బ్రహ్మదేవుని ఆరాధించి సింహిక దేవతలవలన తన బిడ్డలు చావకుండునట్లు వరముం బొందెను. ఆవరదానమున మీరుత్సాహముగొని నేనిచ్చిన విద్యచే దేవతలను జయింప నాదేవతలు శంకరుని శరణొందిరి. అందుచే మిమ్ములం జంప విష్ణువు మానుషాకారముంగొని జమదగ్ని కుమారుడై పుట్టినాడు. ఆతడే పరశురాముడు. ఆతడు రణములందతి కర్కశుడు. శంకరుడే మీమీది కాతనిం బంపినాడు. ఆ దేవుడే యిపుడు మానుషరూపమైయున్నాడు. ఓ అసురవరా ! వానివలన మీకిపుడు ఘోరభయమేర్పడినదని యెరుంగుము. అన సాల్వుండిట్లనియె. భగవంతుడా ! సర్వదేవతలకధీశ్వరుడు మధుసూదనుడు అతనికంటె మరి దైవమున్నాడని వినలేదు. అట్టి మహాతేజస్వి శంకరుని యాజ్ఞ శిరసావహించుట యెందులకు? అతడు సైంహికేయునిం గూల్చుట యేమన శుక్రుండు ఎప్పుడెప్పుడు ధర్మమునకు గ్లాని=వాడుపాటు అధర్మమున కధ్యుత్థానము (దయ) వచ్చునో యప్పుడీశ్వరుడు తనను దానే సృజించుకొనును. అవతరించునన్నమాట. ఒకతరి దైత్యులందు దేవతలందు ఒకప్పుడు మనుష్యులందు ఒకనాడు పశుపక్ష్యాదులందు కార్యముయొక్క బలాబలముల నెరింగి యీశ్వరుడు వచ్చుచుండును. దేవతలందవతరించినపుడు దేవుడట్లు తిర్యక్కులందు (పశుపక్ష్యాదులందు) యావిర్భవించినపుడు తిర్యక్కులట్లు చేష్టించును మనుష్యలందవతరించినయెడ మనుష్యుడట్లు వర్తించును. మనుష్యరూపమంది తపస్సుచే త్రిపురాంతకుని హరుని తన దేహమందే యారాధించెను. ఆ దేవేశుని వలన వరమునంది పరశురాముడుగా రూపొంది మిమ్ము వధింపనిపుడు రాబోవుచున్నాడు. కావున మీరిపుడింద్రునితో సంధిచేయుట నా కిష్టము. ఓ అసురేశ్వర ! త్రివిష్టపము (స్వర్గము) ఇపుడు దేవతలదేయగుంగాక ! మీరు పాతాళమునందు బాధలు లేకుండ సుఖముండుడు. నేను శంకరునితో భార్గవుని నివారించెద. నా మాట యిది కాదందురేని మనుష్యునిచేత నోడిపొండు. అనిని చైతేయదానవృద్ధులు మిక్కిలి సంరంభించి (ఉద్రిక్తులై) భృగుకులోద్ధారకుని (శుక్రుని), గూర్చి యిట్లనిరి.

దైత్యా ఊచుః :

ఏకత్రాధిష్ఠితం సర్వం జగత్‌ స్థావర జంగమమ్‌ | యద్యస్మాత్ర్పతియుధ్యేత నభీస్తత్రాపి విద్యతే || 19

తే కథం మానుషా ద్భీతాః నాకం త్యక్ష్యామ శత్రవే | శంకరం తం విజేష్యామోయే నాసౌ ప్రేషితో ధ్విజః || 20

శుక్ర ఉవాచ :

ఏకత్ర పిండితం సర్వం జగత్‌ స్థావర జంగమమ్‌ | ఏత్ర భగవాన్‌ విష్ణుః జగతఃసోతిరిచ్యతే || 21

స న శక్యో యుధాజేతుం నైవ దేవో మహేశ్వరః | తేయూయం ప్రాకృతీం బుద్ధిః త్యక్త్వా సర్వేమహాసురాః |

సంధింకురుత దేవేన శ##క్రేణామిత్ర ఘాతినా || 22

శక్రకార్యే సదోద్యుక్తో దేవదేవో జనార్దనః | యేన దైత్యా వినిహతాః పూర్వే పూర్వతరాశ్చ యే || 23

శంబరో నముచి శ్శంబుః కార్తవీర్యః కృతాగమః | హిరణ్యకశిపుః కేశీ హిరణ్యాక్షో మదోత్కటః || 24

మధుశ్చ కైటభ##శ్చైవ విటో ధూమోతి కోపనః | హయగ్రీవో నిసుందశ్చ సుద శ్చంద్రార్కలోచనః 25

చంద్రార్క మర్దనశ్చైవ చంద్రహర్తా రణప్రియః | సూర్య శత్రుర్జితా మిత్రో యజ్ఞహా యజ్ఞతాపసః || 26

మేఘనాదో మహారోమా మేఘవాదో భయానకః | దశగ్ర వః శతగ్రీవో మహాగ్రీవశ్చ దానవః || 27

కాలః కాలకేయశ్చ కాలనేమిః సులోచనః | కాలశ్చ కాలకల్పశ్చ మకరాక్షో జనాన్తకః || 28

అంతః కేశ మనో భీమో దేవాన్తక నరాన్తకౌ | క్రోధహా బహునేత్రశ్చ మహాకాలో జలాన్తకః || 29

ఏకలవ్య స్స చాధారో దుర్ముఖో దుర్ధరో వడిః | ఇందు తాపన రంభౌచ రణచండ హరప్రి¸° || 30

కిరీటీ గజవక్త్రశ్చ మహాసాలో విలోహితః | హ్రాదా నుహ్రాద ప్రహ్రాద వృక్షర క్షర దారుణాః || 31

శతభ శ్శలభ##శ్చైవ కూపనశ్చ మహాసురః | విప్రచిత్తి శ్శివ శ్శంకు రయ శ్శంకు స్తథైవచ || 32

అయశ్శిరా అశ్వశిరా భీమ దక్షో గుహాశయః | వేగవాన్‌ కేతు మానుగ్రః సోగ్ర విగ్రో మహాసురః || 33

పుష్కరః పుష్కల శ్చైవ సాల్వోశ్వపతి రేవచ | కుంఖో నికుంభ శ్వతదా సంగ్రహో గగన ప్రియః || 34

ఏతే చాన్యేచ విఖ్యాతాః దైతేయా స్సమరోద్ధతాః సర్వే లబ్ధవరా శ్శూరాః సర్వేచ గత మన్యవః || 35

సర్వై స్త్రిదశ రాజ్యాని కారితాని బలోద్ధతెః | తే హతా స్తేన దేవేన వాసవ ప్రియ కామ్యయా || 36

కేచి న్మనుష్యరూపేణ తిర్యగ్రూపేణ చాపరే | కేచిచ్చ దేవరూపేణ నిహతా భూరి తేజసా || 37

చదాచరజగమ్మెల్ల యొక్కచోట నధిష్ఠితమైయున్నది. ఏది యెవనితో ఢీకొనునో యది యట్లనే జరుగును. అక్కడ భయపడవలసినపనిలేదు. అట్టి మేము మనుష్యమాత్రుని కడలిపోయి నాకమును (స్వర్గమును) శత్రుని కెట్లు వదలెదము? ఈ బ్రాహ్మణ డెవ్వనిచేత బంపబడెనో ఆ శంకరునే మేము గెల్చెదము అని విని శుక్రాచార్యుండు ఒకచో స్థావరజంగమాత్మక జగతైల్ల పిండితమైయున్నది. ఇంకొకచో నావిష్ణువు భగవంతుడై జగత్తునకతీతుడె యున్నాడు. అతనిని మహేశ్వరదేవుడు గెలువనే లేడు. కావున మీరు ప్రాకృతబుద్ధిని విడిచి మహాసురులందరు నమిత్రఘ్నుడగు శక్రునితో సంధిసేసికొనుడు. ఇంద్రుని పనియందు దేవదేవుడు జనార్దనుడు నిరంతర ముద్యమించియుండును. మీ పూర్వలు పూర్వతరులెల్లరు నాతనిచే మడిసిరి. శంబరుడు నముచి శంబువు మంచి యాగమవేత్త కార్తవీర్యుడు హిరణ్యకశిపుడు కేశి మదోద్ధతుడైన హిరణ్యాక్షుడు మధు కైటభులు విటుడు అ కోపనుడు ధూముడు హయగ్రీవుడు విసుందుడు సుందుడు చంద్రార్కలోచనుడయిన చంద్రార్కమర్దనుడు రణప్రియుడగు చంద్రహర్త సూర్యశత్రువు అమిత్రఘాతి యజ్ఞఘ్నుడు యజ్ఞతాపనుడు మేఘనాధుడు దశగ్రీవుడు శతగ్రీవుడు మహాగ్రీవుడు కాలకుడు కాలకేయుడు కాలనేమి సులోచనుడు కాలసముడు కాలుడు మకరాక్షుడు జనాంతకుడు ఆంతుడు కేశమనుడు భీముడు దేవా తక నరాంతకులు క్రోధహుడు బహునేత్రుడు మహాకాలుడు జలాంతకుడు ఏకలవ్యుడు ఆధారుడు దుర్ముఖుడు దుర్దరుడు వడి ఇందుతాపనుడు రంభుడు రణచండుడు హరప్రియుడు కిరీటి గజవక్త్రుడు మహాసాలుడు విలోహితుడు హ్రాదుడు అనుహ్రాదుడు ప్రహ్రాదుడు వృక్షరక్షర దారుణులు. శతభుడు శలభుడు కూపనుడు విప్రచిత్తి శివుడు శంకురయుడు శంకువు అయశ్శిరుడు అశ్వశిరుడు భీమదక్షుడు గుహాశయుడు వేగవంతుడు కేతుమంతుడు ఉగ్రుడు సోగ్రవిగ్రుడు పుష్కరుడు పుష్కలుడు సాల్వుడు అశ్వపతి కుంభుడు నికుంభుడు శతదుడు సంగ్రహుడు గగనక్రియుడు నను వీరు మరియితరులు ప్రఖ్యాతిగన్న దైతేయులు యద్ధోద్యతులు. వరలాభముగలవారు శూరులందరు మన్యుదూరులు. వీరు దేవరాజ్యమేలిరి. వీరందరిని నింద్రుని ప్రియమొనరింప హరి సంహరించెను. కొందరు మనుష్యరూపమున పశురూపమున కొందరు దేవరూపమున కొందరు మహాతేజస్వియగు హరిచే మడిసిరి.

సాల్వ ఉవాచ :

జానామి తస్య మాహాత్మ్యం దేవదేవస్య శార్గిజః | అహం స్వమరణం మత్వా తేన యో త్స్యామి భార్గవ || 38

విశిష్టా న్మరణం శ్రేష్ఠం న హీనా ద్విజయో రణ | విష్ణోః కర వినష్టానాం భూయో రాజ్యం భవిష్యతి || 39

మార్కండేయ ఉవాచ :

ఇత్యేవముక్తస్త్వసురాధిపేన భృగుప్రధానో భగవాన్‌ శుక్రః |

జ్ఞాత్వా స దైత్వాన్‌ సకలాన్‌ వినష్టాన్‌ జగామ కాష్ఠామపరా మభీష్టమ్‌ || 40

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శుక్రసాల్వ సంవాదో నామ అష్టత్రింశత్తమోధ్యాయః.

అన విని సాల్వుడు-దేవదేవుడు శార్గి(శార్గ ధనుర్ధారి హరి) యొక్క మహిమ నేనెరుంగుదును. భార్గవ ! నేను నా చావు నెరింగి వానితో బోరనున్నాను. హీనునివలన గెలుపుకంటె విశిష్టుని (మహాశూరుని) వలన యుద్ధమరణము మేలు. విష్ణువు చేతిలో నఫష్టులైనవారికి తిరిగి రాజ్యము వచ్చును. అనవిని శుక్రాచార్యుండా దైత్యులందరు వినష్టులైరనియే తెలిసి తనకు నచ్చిన మరియొక దెసకు జనియెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున శ్రుక్రసాల్వ సంభాషణమను ముప్పదియెనిమిదవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters