Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నాల్గవ అధ్యాయము

పాతాళవర్ణనము

మార్కండేయ ఉవాచ :

జాలాంతరగతే భానౌ యత్‌ సూక్ష్మం దృశ్యతే రజః | ప్రథమంతత్‌ ప్రమాణానాం త్రసరేణుం

ప్రచక్షతే || 1

త్రసరేణవో7ష్టౌ విజ్ఞేయా లిక్షై కా పరిమాణతః | తా రాజసర్షపాస్తిస్రప్తా స్త్రయో గౌరసర్షపాః || 2

సర్షపాః షడ్యవో మధ్యే అంగుళం చ తదష్టకమ్‌ | ద్వాదశాంగుళక శ్శంకుస్తద్ద్వయం హస్త ఉచ్యతే || 3

తచ్చతుష్కంధనుః ప్రోక్తం క్రోశోధనుస్సహస్రికా | క్రోశద్వయంచ గవ్యూతిః యోజనం తచ్చతుష్టయమ్‌ || 4

యోజనానాం ప్రమాణన చాయుతానాం శతత్రయమ్‌ | అయుతానాం చ పంచాశ చ్ఛేషస్థానం మనోహరమ్‌ || 5

స ఏవలోకే వారాహః కథితశ్చ స్వయం ప్రభుః | వారాహరూపీ భగవాన్‌ శతరూప ధరస్తథా || 6

తత్రా77స్తే భగవాన్‌ విష్ణు ర్భక్తైస్సహ మహాత్మభిః |

లోకో7య మండ సంలగ్న శ్ఛత్రాకారః ప్రకీర్తితః || 7

స్వయం ప్రభుర్వీతరజా స్సర్వ దుఃఖ వివర్జితః | ఏకా న్తభావో పగతాస్తం ప్రయాన్తి హరింజనాః || 8

సర్వాధస్తా దయంలోకః కథితస్తే మనోహరః | తస్యోపరిష్టా దవర స్తావదేవ ప్రమాణతః || 9

కాలాగ్నిరుద్రలోకస్తు కథ్యతే7గ్ని సమర్చితః | ఏక ఏవ స తత్రాస్తే స్వప్రభా భాస్వరాత్మకః || 10

తస్మాత్‌ సముత్థితో వహ్నిర్జగత్ర్పాప్తే దినక్షయే | భస్మసాత్‌ కురుతే సర్వం యచ్చేంగం యచ్చ నేంగతే || 11

తస్యోపరిష్టాదపర స్తావదేవ ప్రమాణతః | పాతాళనామా పాతాలః ప్రథమః పరికీర్తితః || 12

యోగమాయాం సమాస్థాయ ద్వితీయా మాస్థిత స్తనుమ్‌ | సర్వతో భగవానాస్తే శేషమూర్తి ర్జనార్దనః || 13

రుక్మభౌమ స్స పాతాలో ధృతో రుద్రస్య తేజసా | తస్మిన్‌ స భగవానాస్తే శేష పర్యంక మాస్థితః || 14

నిత్యం తాలధ్వజో వాగ్మీ వనమాలా విభూషితః | ధారయన్‌ శిరసానిత్యం రత్నచిత్రాం ఫణావళీమ్‌ || 15

లాంగలీ ముసలీ ఖడ్గీనీలాంబర విభూషితః | స్తూయమాన స్స గంధర్వైర్నాగై రృషివరై స్తథా || 16

మార్కండేయుడనియె:- సూర్యుడు కిటికీరంధ్రమునుండి ప్రకాశించునపుడు సుసూక్ష్మమైన రజస్సు (పరాగము) కనిపించును. అపరాగలేశము త్రసరేణువు. అది కొలతలకు మొదటిది. 8 త్రసరేణువులు = ఒక లిక్ష. 3 లిక్షలు = ఒక రాజ సర్షపము. 3 రాజ సర్షపములు = ఒక గౌర సర్షపము. 6 గౌరసర్షపములు = ఒక యవ, 8 యవలు = ఒక అంగుళము, 12 అంగుళములు = శంకువు. 2 శంకులు = ఒక హస్తము (మూర) 4 హస్తములు = ధనుస్సు, వేయి ధనస్సులు = ఒక క్రోశము, 2 క్రోశములు = 1 గవ్యూతి, 4 గవ్యూతులు = ఒక యోజనము, 800 వేల యోజనములు = శేషస్థానము. అది చాలరమ్యమైనది. ఆ శేషస్థానమునకే వారాహమని లోకవ్యవహారము. ఆ వరాహమూర్తి భగవంతుడు నూరురూపముల దాల్చి భక్త మహాశయులగూడి యా పాతాళమందున్నాడు. ఈ లోకము అండముతోగూడి గొడుగున్నట్లున్నది. అక్కడ రజోగుణరహితుడు సర్వదుఃఖహరుడు హరి ఏకాంతభావమును బొంగి స్వయముగా ప్రభువై వసించుచున్నాడు. అ ప్రభువు దగ్గరకు జనులేగుదురు ఈ లోకముల సర్వలోకములు కడుగున నున్నది. చాల సుందరమైనది. నీకిది యెరింగించితిని. దానికిమీద యదే కొలతలో మరి యొక లోకము గలదు. కాలాగ్ని రుద్రలోకమని యది పిలువబడును. అది అగ్నిచే నర్చింపబడుచు. అక్కడ స్వప్రభలచే వెలుంగుచు నొక్కడే ( యగ్ని) యున్నాడు. అయన నుండి లేచిన యగ్ని దినక్షయమందు (బ్రహ్మ కల్పమందు) చరాచర జగత్తును భస్మము సేయును. అది ఇంగము (కదలిక) చైతన్యము(అదితాను ఇంగమునందదు) తాను దేనికిని కదలదు యన్నిటిని గదలించును. అ అగ్నికి మీద యదే ప్రమాణమున పాతాళమను పేర ప్రథమ పాతాళమున్నది. అక్కడనే యోగమాయ నాధారముసేసికొని భగవంతుడు విష్ణువు ద్వితీయ శరీరముగొని శేషమూర్తియై యున్నాడు. అ పాతాళము స్వర్ణభూమి. రుద్రతేజముచే నది ధరింపబడును. దానియందు భగవంతుడు శేషపర్యంకమందున్నాడు. ఆయన తాళధ్వజుడు (తాడి చెట్టు జెండా గుర్తు గలవాడు) మంచి వక్త. పద్మమాల ధరించును. రత్నాలచే రంగురంగులీను పడగలను తలందాల్చును. అయన చేతిలో నాగలి రోకలి కత్తియు నుండును. అతడు నీలాంబరధారి. గంధర్వులు నాగులు ఋషీశ్వరులు నాయనను స్తుతించుచుందురు.

తస్యోపరిష్టాదపర స్తావదేవ ప్రమాణతః | సుతల సంజ్ఞః పాతాల శ్శిలాభాస స్సమంతతః || 17

బలిస్తు భగవాన్‌ తత్ర బహిస్తిష్ఠతి సంయతః | రమ్యం పురవరం తస్య విష్ణునా నిర్మితం స్వయమ్‌ || 18

నివాసం దేవారాజస్య విశిష్టం తత్పురోత్తమమ్‌ | సావైష్ణవీ కలాప్రోక్తాయయేదం ధార్యతే జగత్‌ || 19

ఫణషు తస్య విశ్రాంతా మిలితా చ శుభా7శుభా | తత్రాస్తే స మహాభాగశ్శ్రియా పరమయాయుతః || 20

తముపాసన్తి సతతం గంధర్వాప్సరసాంగణాః | తత్రాస్తే దేవదేవస్య మూర్తిః కృష్ణస్య చాపరా || 21

తస్యోపరిష్టా దపర స్తావదేవ ప్రమాణతః | ఆభాసతల ఇత్యేవ పాతాలో నీలమృత్తికః || 22

తృతీయ స్సతు విఖ్యాత స్సురభిర్యత్ర తిష్ఠతి | దిగ్ధేనవ స్తథా తత్ర చతస్రశ్చ తథా స్థితాః || 23

సుభద్రా వహ్ని రూపాచ విశ్వరూపా తథైవచ | రోహిణీ చ మహాభాగా యాభిర్వృత మిదం జగత్‌ || 24

తాసాం క్షీరేణ సర్వాసాం వృతః క్షీరార్ణవః ప్రభో | పాతాల మధ్యే తస్మింస్తు పురం విష్ణోర్మనోరమమ్‌ || 25

యత్రాస్తే భగవాన్‌ విష్ణుః శేషపర్యంకగ స్సదా | అగ్నిజ్వాలా పరిక్షిప్త స్సహలక్ష్మ్యా పరంతప || 26

తస్యోపరిష్టాదపర స్తావదేవ ప్రమాణతః | పీత భౌమ శ్చతుర్థస్తు గభ స్తితల సంజ్ఞితః || 27

తత్రాస్తే భగవాన్‌ విష్ణుర్దేవో హయ శిరోధరః | శశాంక శత సంకాశ శ్శాతకుంభ విభూషణః || 28

పురంతత్రైవ విఖ్యాతం గరుడస్య మహాత్మనః (ప్రహ్లాద స్యాసురేంద్రస్య బాష్కలేశ్చ మహాత్మనః ||) 29

తస్యోపరిష్టాదపర స్తావదేవ ప్రమాణతః | మహాతలేతి విఖ్యాతో రక్త భౌమస్తు పంచమః || 30

సరోవరం తస్యమధ్యే యోజనానాం దశాయుతం | జంగమా జంగమై స్సర్వై ర్జలజైశ్చ వివర్జితమ్‌ || 31

తత్రా రూపేణ వసతి కూర్మరూపధరో హరిః | తస్యోపరిష్టాదపర స్తావదేవ ప్రమాణతః || 32

షష్ఠశ్చైవ మహారాజ ! నామ్నా భీమతలస్తుసః | తత్రాపి సరసీ దివ్యా యోజనానాం శతం గతా ||

తస్యాం చ వసతే దేవో మత్స్యరూప ధరో హరిః || 33

సప్తమః కృష్ణభౌమస్తునామ్నాభీమతలస్తుసః | తత్రాస్తే కపిలో దేవః వాసుదేవస్స్వయంప్రభుః || 34

తత్రాశ్మనగరం నామవరుణస్యపురం స్మృతమ్‌ | తథాదానవవీరాణాంనగరాణి పృథక్‌ పృథక్‌ || 35

విరోచనస్య కుంభస్య నికుంభస్య హరస్యచ | శంబరస్య కరాలస్య నరకస్య హయస్యచ || 36

హయగ్రీవస్య సుందస్య ఘసస్య ప్రఘసస్యచ | బలేఃపురవరం చాత్రయోగీశస్య తథాపరమ్‌ || 37

యత్రస్థమేనం దదృశే రావణో లోకరావణః | తథాపురవరం తత్రవిష్ణో రమిత తేజసః || 38

ఆయనకుమీద యదేప్రమాణములో సుతలమను పాతాళమున్నది. అది యంతట శిలారూపము. దాని వెలుపల భగవంతుడు బలి నియమితుడై వసించును. ఆయన రాజధానినక్కడ విష్ణువు స్వయముగ నిర్మించెను. ఆ పురము చాలగొప్పది. ఆయన నివాసము. ఈగజత్తు ధరించు నాశక్తి వైష్ణవీకళ##యే. ఆ కళ యా శేషుని పడగలమీద విశ్రమించియున్నది. అది శుభాశుభ మిలితము. అక్కడ శ్రీ శక్తితో నామహానుభావుడు విష్ణువున్నాడు. గంధర్వాప్సరోగణము లాతనిని నిరంతర ముపాసించుచుందురు. అక్కడ దేవేదేవుడగు కృష్ణునియొక్క మరియొక మూర్తి యున్నది. దానికిమీద నదే ప్రమాణములో ఆభాసతలమను పాతాళలోకము నల్లని మృత్తికతో నున్నది. అక్కడ సురభి (కామధేనువు) ఉన్నది. అది మూడవ పాతాళము. అక్కడ నాల్గు దిగ్ధేనువులు (నాల్గు దిశలందు నాల్గావులు గలవు అవి సుభద్ర వహ్ని రూప విశ్వరూప రోహిణి యను పేరుగలవి. వానితో జగమెల్లయావరింపబడియున్నది. వాని పాలసముద్రమేర్పడినది. ఆ పాతాళము నడుమ విష్ణుపురము చాల చక్కనిదున్నది శేషపర్యంకమందక్కడ విష్ణువున్నాడు. ఆయన అగ్నిజ్వాలలచే నావరింపబడియుండును. లక్ష్మి యాయనతో నుండును. దానికిమీద నదే ప్రమాణమున పసుపుపచ్చని రంగుతో భూమియున్నది. అది నాల్గవ పాతాళము. గభస్తితలమని దానికి బేరు. అక్కడ విష్ణుభగవానుడు హయగ్రీవమూర్తియై యున్నాడు. నూరు చంద్రబింబములట్లు దీపించును. మేలిమి బంగారు భూషణముల ధరించును. అక్కడనే గరుడుని పురము ప్రసిద్ధమైయున్నది. (అసురేంద్రుడు బాష్కలి యను నామాంతరముగ) మహానుభావుడు ప్రహ్లాదుని యొక్క రాజధాని యది. దానికిమీద నదే ప్రమాణములో మహాతలమను ప్రసిద్ధిగల ఎఱ్ఱని ప్రదేశమున్నది. అది యైదవ పాతాళము. దాని నడుమను నూరువేల యోజనముల వైశాల్యముగల సరోవరమున్నది. స్థావరజంగమభూతము లక్కడ లేవు. అందు తామరపూవులునుండవు. అక్కడ కూర్మమూర్తి హరి రూపము లేకుండ వసించును. దానికిమీద నదే ప్రమాణమున భీమతలమను నాఱవ పాతాళమున్నది. అక్కడగూడ దివ్య సరస్సు నూరు యోజనముల వైశాల్యమున నున్నది. అందులో మత్స్యమూర్తియై హరి యున్నాడు. అది నల్లని భూమితో భీమతలము అను నేడవ పాతాళము. అందు కపిలావతారమూర్తి వాసుదేవుడున్నాడు. అక్కడ వరుణుని రాజధానియశ్మనగరమను పేర నున్నది. అక్కడ దానవీరుల నగరములు వేరవేరనున్నవి. ఆ వీరులు విరోచనుడు కుంభుడు నికుంభుడు మారుడు శంబరుడు కరాలుడు నరకుడు హయుడు హయగ్రీవుడు సుందుడు ఘసుడు ప్రఘసుడు ననువారు. యోగీశ్వరుడయిన బలియొక్క నగరమిక్కడ నున్నది. లోకరావణుడు (లోకముల నేడిపించినవాడు) రావణుడిక్కడనున్న బలిని దర్శించెను.

లక్ష్మీసహాయో యత్రాస్తే చాగ్నేయాంబర సంవృతః |

తిస్రః కోట్యస్తు యత్రాస్య భక్తానా సుమహాత్మానామ్‌ || 39

శంఖచక్ర గదా పద్మ ధారిణాం పీతవాససామ్‌ || 40

నీలోత్పల సువర్ణానాం విష్ణోస్సదృశ తేజసామ్‌ | విష్ణో స్సుతానాం దృష్టానాం సతతం భూరి వర్చసామ్‌ || 41

తత్రస్థో దృష్టవాన్‌ దేవో పౌలస్త్యో రావణః పురా | పురీ భోగవతీ తత్ర తథా వాసుకి పాలితా || 42

నాగానాంచ పురాణ్యత్ర తథైవచ పృథక్‌ పృథక్‌ | పద్మస్య ధృతరాష్ట్రస్య విరక్తస్య కురోస్తథా || 43

తక్షకసై#్యల పుత్రస్య తథా కర్కోటకస్యచ | ధనంజయస్య శంఖస్య తథైవాశ్వతరస్యచ || 44

కందలస్య సురాసస్య సుముఖస్య గయస్యచ | దిశాం గజానాంచ తథా తత్రస్థానం పృథక్‌ పృథక్‌ || 45

యేషాం స్కంధగతా భూమిః సశైల వనకాననా | విరూపాక్షస్య నాగస్య మహాపద్మస్య చాప్యథ || 46

తథా సుమనస శ్చాత్ర రుద్రస్యచ మహాత్మనః | పంచాయుత పరీమాణా భూమి స్సర్వేషు పార్థివ ! || 47

పాతాలేషు వినిర్దిష్టా పఠితాంతర వర్తినీ | అండస్యార్ధ మిదం ప్రోక్తం అధస్తాత్తు ప్రమాణతః || 48

తిస్రః కోట్యస్తు రాజేంద్ర ! నియుతాని తథా దశ | సంచాన్యాని మహీపాల ! భూమి పుష్ట్యా మహానఘ ! 49

పంచాయుత పరీమాణాః పుష్టిర్భూమేః ప్రకీర్తితా | భూమే రధోపరిష్టాచ్చ అండస్యార్ధ మథాపరమ్‌ ||

ఏతావ దేవ నిర్దిష్టా భూమిపాల | ప్రమాణతః | 50

చంద్రార్కభాసారహితం నృవీర ! స్వయం ప్రభేదం కథితం మయైతత్‌ |

పాతాలపూగం వివిధ సురమ్యం | శృణుష్వలోకా& గదతో మమాన్యా& || 51

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే-ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే పాతాళవర్ణనం నామ చతుర్థో7ధ్యాయః.

అక్కడ లక్ష్మీసమేతుడైన విష్ణువుయొక్క పురమున్నది. అది యగ్నిమయమైన యాకాశముచే నావరింపబడియున్నది. మహానుభావులు మూడుకోట్లమంది విష్ణుభక్తులు (వైష్ణవులు) శంఖచక్రగదాపద్మధారులు పీతాంబరులు విష్ణువువలె నీలోత్పలశరీరులు విష్ణువు కుమారులు మహావర్చస్వులు అక్కడ నెల్లపుడు వసింతురు. పులస్త్యబ్రహ్మకుమారుడు రావణు డక్కడ గనబడినాడు. వాసుకి పాలనలోనున్న భోగవతి యను పురమక్కడనున్నది. పద్ముడు ధృతరాష్ట్రుడు విరక్తుడు కురువు తక్షకుడు ఏలపుత్రుడు కర్కోటకుడు ధనంజయుడు శంఖుడు అశ్వతరుడు కందలుడు సురాసుడు సుముఖుడు గయుడు ననువారి స్థానములు వేర్వేర నక్కడ గలవు. దిగ్గజములకు వేర్వేర నక్కడ స్థానములున్నవి. విరూపాక్షుడు నాగుడు మహాపద్ముడు సుమనుడు రుద్రుడునను వారి మూపులందు సశైలవనకాననయైన భూమియున్నది. అది యేబదివేల యోజనముల విశాలమైన మహాభూమి. బ్రహ్మాండ కటాహముయొక్క క్రింది సగభాగమిది మూడుకోట్లపదునైదు నియుతముల ప్రమాణముగలది. అక్కడ సూర్యచంద్రుల కాంతి ప్రసారముండదు. ఇది పాతాళముల యొక్క వివిధమయి సురమ్యమైన ప్రదేశము తెల్పితిని. ఇక మీద నితర లోకములంగూర్చి చెప్పెద నాలింపుము.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తరమహాపురాణమున ప్రథమ ఖండమున పాతాళవర్ణనము అను నాల్గవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters