Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నలుబది నాల్గవ యధ్యాయము - సాల్వుని ధర్మ ప్రసంగము మార్కండేయ ఉవాచ : ఏవముక్త స్తదా సాల్వో రాహుణా భీమవిక్రమః | జగాద భ్రాతరం వాక్యం సారభూత మహేతుమత్ ||
1 సాల్వ ఉవాచ : అసారే గ్రహ! సంసారే నిత్యే సతత యాయిని | భవక్షయే మతిః కార్యాభవో పకరణషువా || జన్తవ స్త్రివిధా లోకేత్రిధా యేషాం విచేష్టితమ్ ||
2 తామసా రాజసా శ్చైవ సాత్వికాశ్చ గ్రహేశ్వర ! | భవక్షయే యే విముఖాః భవోపకరణషుచ || 3 లోకద్వితయ విభ్రష్టా స్తామసాస్తే ప్రకీర్తితాః | భవక్షయ మతి భ్రష్టాః భవోపకరణ స్తితాః || 4 రాజసాస్తే వినిర్దిష్టాః మధ్యస్థా స్సర్వ జన్తుషు | భవోపకరణ దైత్య ! షుతిర్యేషాం నవిద్యతే || 5 భవక్షయే మతి ర్యేషాం సాత్వికాస్తే వ్రకీర్తితాః | తామసత్వా న్మయాదైత్య ! మతిః పూర్వం భవక్షయే || 6 నకృతా; తేన తప్యామి రాజ్య తంత్ర మనుష్ఠితమ్ | మన్వంతరే೭పి సంపూర్ణే మృతిర్యేషాం గ్రహోత్తమ! || 7 ఉద్విజ న్త్యేవ తే మృత్యోర్మహ న్మృత్యు కృతం భయమ్ | అవశ్యం దైత్య ! మర్తవ్యం సర్వేణహ శరీరిణా || 8 సో೭హం మోక్ష పరిభ్రష్టః కామయే కేశవా ద్వధమ్ | ఇష్టం యజ్ఞైః తపస్తప్తం రిపూణాం మూర్ధని స్థితమ్ || 9 మర్తవ్యే చధ్రువే రామాన్మరణం కామయామ్యహమ్ | సంప్రాప్య కేశా న్మృత్యుం గతిం ప్రాప్స్యా మ్యనుత్తమామ్ || 10 భూయో రాజ్య మవాప్స్యామి నాక భ్రష్టో గ్రహోత్రమ! | వివాస్య వాసవం స్వర్గాత్ పరిభూయ పునఃపునః || 11 కథం సంధిం కరిష్యామి తేనా ೭హం జీవితప్రియః | ప్రణామం దేవరాజస్య కేశవా స్మరణం వరమ్ || 12 సమీక్ష్య సాధు పశ్యామి కేశవా స్మరణం రణ | శ##క్రేణ కృత సంధానం పాతాల నిలయంతథా || 13 త్యక్ష్య న్తిమాం దైత్య గణాః వృద్ధంపతి మి వాంగనాః | దివిభూమౌ తథా స్వర్గే పాతాలే గగనే జలే || 14 దేహినాం మృత్యు రభ్యేతి తస్య నా೭స్తి పలాయనమ్ | సర్వేక్షయాన్తాః నిచయాఃపతనాఃన్తాసముచ్ఛ్రయాః || 15 సంయోగా విప్రయోగాన్తాః మరణా న్తం హి జీవితమ్ | ఆవశ్య భావిన్యర్థే೭స్మిన్ సర్వేషాం గ్రహ! సర్వదా || 16 పుణ్య భాజో హి మరణం సంగ్రామే యదిజాయతే | సో೭హం క్షత్రియ ధర్మేణ సంపూజ్య సమరే హరిమ్ || 17 తస్మా న్మృత్యు మనుప్రాప్య గతింప్రాప్స్యామి శోభనామ్ | నై వేద్యైః పుష్ప ధూపాద్యైః నతథాపూజితోహరిః || త్రోష మాయాతి దైత్యేంద్ర ! స్వధర్మేణ యథా నృణామ్ | భ్రాత్త్రా జ్యేష్ఠేన యద్వాచ్యం సుహృదా హిత మిచ్ఛతా || 19 తదుక్తో೭స్మి త్వయా నాథ ! దైవాత్తన్మే నరోచతే | సత్వం గచ్ఛ మహాభాగ ! దివి ద్రష్టా೭సి మాం పునః || దేహా న్తరమను ప్రాప్తం గ్రహ ! దివ్యేన చక్షుషా | మార్కండేయ ఉవాచ : ఇత్యేవ సాల్వస్య నిశమ్య వాక్యం కాలానురూపంచ తథా విదిత్వా | నకించి దుక్త్వైవ జగామ రాహు ర్దివం మహాత్మా జగతాం ప్రధానః || 21 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే-ప్రథమఖండే-మార్కండేయ వజ్రసంవాదే సాల్వవాక్యం నామ చతుశ్చత్వారింశ త్తమో೭ధ్యాయః || మార్కండేయుడనియె: ఇట్లురాహువుతెలుప సాల్వుండుసోదరుని (అన్న)తో సారభూతముగ హేతువాదరహితముగనిట్టుపలికెను. ఓ గ్రహమా ! సారహీనమయిన సంసారము నిత్యము జనన మరణ ప్రవాహ రూపము. సమ్యక్ సరతీతి సంసారః (ఎడతెగక పారునది యన్నమాట) కావున భవ క్షయము నెడ (పుట్టుకలేకుండు స్థితియెడల అనగా పుట్టినం బూవు నిక్కము గావున మరణము లేకుండుట యందు) మనసుంచ వలయును. లేదా సంసార సాధనములయిన విషయములందు మనసుంచ వలయును. జంతువులు మూడు విధములయిన చేష్టలను బట్టి తామసులు, రాజసులు, సాత్వికులుగా మూడు రకములయి యుండును. (1) భవక్షయమునెడ (సంసార నాశనమునెడ) సంసార సాధనముల యెడ విముఖులయినవారు తామసులు. వారిహలోక పరలోకములు రెండింటి నుండి భ్రష్టులు. (2) సంసార క్షయమునెడ మనసుంచక సంసారోపకరణమందు (విషయ సుఖమందు) మనసుంచిన వారు రాజసులు. సర్వజీవులందు వారు నడిమి వారు. (3) సంసార సాధనమందు మనసులేక భవక్షయమందు దలంపుగల వారు సాత్త్వికులు. నా మనసు తామసమైనందున మున్ను సంసార క్షయమందు నిలుపబఢలేదు. దాన నే నుడికి పోవుచున్నాను. దాననే రాజ్యతంత్రానుష్ఠానమునం బడితిని. మన్వంతర కాలము బ్రదికియు మృత్యువునకు బెదరిపోవుదురు. చావు భయము చాల పెద్దది. శరీరియైన వాడు తప్పక చావవలసినదే. మోక్షభ్రష్టుడనైన యా నేను కేశవుని వలన జావుకోరుకొనుచున్నాను. యజ్ఞములుసేసినాను. తపస్సుగావించితిని. శత్రువుల నడినెత్తి నిలిచితిని. చావవలసినది తప్పనప్పుడు ఆ చావు రాముని వలన గావలయునని కోరుచున్నాను. కేశవుని వలన జావొంది అత్యుత్తమ గతింబొందగలను. స్వర్గ భ్రష్టుడనై తిరిగి రాజ్యము పొందెదను. ఇంద్రుని స్వర్గము నుండి వెడలగొట్టి అవమానించి బ్రతుకగోరు నేను వానితో నెట్లుసంధిచేసుకోగలను? దేవరాజునకు నమస్కారము. కేశవుని వలన మరణము మంచిది. లెస్సగ నాలోచించి చెప్పుచున్నాను. రణమందు కేశవుని వలన జావు మేలు. ఇంద్రునితో సంధి సేసికొని పాతాళమందుండు నన్ను అంగనలు ముదుసలి మగనిని వలె విడిచి లేచిపోవుదురు. అంతరిక్షమందు భూమియందు స్వర్గమంను పాతాళమందు గగనమందు నీటను ఎక్కడున్నను దేహధారులకు చావువచ్చును. దానికి పలాయనము లేదు. (అది పారిపోదన్నమాట) పెరుగుటలెల్ల విరుగుటకే. మిడిసిపాటెల్లె నడిచిపాటునకే. కలయికకు తుది యెడ మగుటయే. జీవితమునకు కడ మరణమే గదా ! ఇది అందరకునవశ్యము కాగలదై యుండగా యుద్ధమందుమరణముకలిగినవారుపుణ్యాత్ములు గదా ! ఆ నేను క్షత్రియ ధర్మముచే సమరమందు హరింబూజించి, యాతని వలన జావొంది శోభనగతిం బొందెదను. మానవుల స్వధర్మముచే సంతుష్టుడగునట్లు దూపదీపాదులచే నైవేద్యములచే పూజింపబడి హరి యంతగా సంతోషింపడు. హితవుగోరిన సుహృత్తు (మంచి హృదయముగల మిత్రుడు) పెద్దన్నయునైన వానిచే నేది చెప్పవలసినదో యా మాటను నీవు నాకు జెప్పితివి. దైవవళమున నాకది రుచింపకున్నది. అట్టి నీవు మహానుభావుడవు చనుము. స్వర్గమందు దివ్యదేహమింకొకటి పొందిన నన్ను దివ్య దృష్టితో నీవు చూడగలవు. అన సాల్వుని మాట విని యది కాలాను రూవమనియు నెఱింగి యించుకేని పలుకకయే రాహువు మహానుభావుడు జగత్ర్పధానుడు దివమ్మున కేగెను ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ప్రధమఖండమున సాల్వుని ధర్మ ప్రసంగమను నలుబదినాల్గువ యధ్యాయము.