Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

ఐదవ అధ్యాయము

లోకవర్ణనము

మార్కండేయ ఉవాచ :

భూలోకః ప్రథమో రాజన్‌ ! శృణుష్వగదతో మమ | పాతాలేనతు తత్తుల్యమూర్ధ్వతః పరికీర్తితః || 1

వాయుస్కంధా వినిర్దిష్టాస్తేతు సప్తమహాత్మభిః | ఏకైకం నియుతాః పంచ యోజనానాం ప్రకీర్తితమ్‌ || 2

పశవః పక్షిణః కీటాః మనుష్యాః కిన్నరా స్తథా | యక్షరాక్షస గంధర్వాః పిశాచాః భూమిగోచరాః || 3

సర్వ ఏతే వినిర్దిష్టాః అన్నాదా భూమిగోచరాః | విద్యాధరాణాం ప్రథమం వాయుమార్గః ప్రకీర్తితః || 4

ద్వితీయః సిద్ధ విద్యానాం తృతీయస్తు గరుత్మతామ్‌ | చతుర్థో వాయుమార్గస్తు గంధర్వాణాం ప్రకీర్తితః || 5

వినాయకాః పంచమగాః షష్ఠేచ కరిణాం గణాః | యేషాం శీకర తోయేన చావశ్యాయః ప్రకీర్తితః || 6

సప్తమేచ మహాభాగ ! సిద్ధాస్తిష్ఠన్తి యాదవ ! | తస్యోపరిష్టాదపరః తావదేవ ప్రమాణతః || 7

భువర్లోక ఇతి ఖ్యాతో యత్ర తిష్ఠన్తి దేవతాః | మన్వంతరాధికారేషు యే భవిష్యా మహీపతే! || 8

తస్యోపరిష్టా దపర స్తావదేవ ప్రమాణతః | స్వర్లోకో వసతిర్యత్ర ప్రాయశః పుణ్యకర్మణాం || 9

సోమపానాంచ దేవానాం శక్రాదీనాం మహీపతే | మహర్లోకః స్థితిర్యత్ర దేవతానాం మహాత్మనామ్‌ || 10

మార్కండేయుడనియె : భూలోకము మొదటిది. అది పాతాళమునకు పైన అదే ప్రమాణములో నున్నది. ఈలోకమునకు వాయుస్కంధములు (అరలు) ఏడు గలవని మహాత్ములు చెప్పినారు. ఒక్కొక్కదాని ప్రమాణము పదిలక్షల యోజనములు. ఇందు గనిపించు జీవులు పశువులు పక్షులు కీటకములు మనుష్యులు కిన్నరులు యక్షులు రక్కసులు గంధర్వులు పిశాచులు ఈ భూతములన్నియు నన్నాదములు. (అన్నముందినునవి). మొదటి వాయుమార్గము విద్యాధరులది. రెండవయర సిద్ధవిద్యులది. మూడవది గరుత్మంతులది, నాల్గవది గంధర్వులది. అయిదవది వినాయకులది. ఆరవది గజగణములది. ఆ ఏనుగుల తొండము నుండి వెడలు తుంపురులే మంచు అని పిలువబడును. ఏడవది సిద్ధులది. ఆ భూలోకమునకు మీద యదే కొలతలో భువర్లోక

* వి.ధ.పు-2

మున్నది. అందు దేవతలున్నారు. వారు మన్వంతరాధికారులు కాబోవుదురు. దానికిమీద యదే ప్రమాణములో స్వర్లోకమున్నది. ఇందు తరచుగ పుణ్యకర్ములు నివసింతురు. సోమపీథులు ఇంద్రాదిదేవతలు తమ తమ అధికార సమాప్తియందు సిద్ధులై మహర్లోకమందుందురు.

వినివృత్తాధికారాణాం సిద్ధానాం నృప సత్తమ ! | తస్యోపరిష్టాదపరస్తావదేవ ప్రమాణతః || 11

జనలోకస్థితిర్యత్ర గవాం పార్ధివ సత్తమ | తిష్ఠన్తి బ్రహ్మణో రాత్ర్యాం యత్ర జీవాస్సమంతతః || 12

తస్యోపరిష్టాదపర స్తావదేవ ప్రమాణతః | తపోలోకః స్థితిర్యత్ర ప్రాణశానాం మహాత్మనాం || 13

తస్యోపరిష్టాదపర స్తావదేవ ప్రమాణతః | సత్యలోకః స్థిర్యత్ర బ్రహ్మణః పరమేష్ఠినః || 14

ఇత్యేతే కథితాః సప్తతవలోకా మహాత్మనాం | ఏతావానేవ సవితు ర్విచరన్తి మరీచయః || 15

ఏతేషులోక సంజ్ఞోక్తా తస్మాదేవ మనీషిభిః | తస్యోపరిష్టాదపర స్తావదేవ ప్రమాణతః || 16

స్థానం రుద్రస్య కథితం రుద్రతేజో విరాజితమ్‌ | బ్రహ్మలోకో పరిష్టాత్తు రుద్రలోకో మహత్తమః || 17

యోజనానాం సహస్రాణి పంచభిర్నిబిడం మతమ్‌ | ఆదిత్య మందిరం ప్రోక్తం యదేతద్దివి దృశ్యతే || 18

యదేత ద్దృశ్యతే నీలం తమస్తత్‌ పృథివీపతే ! | తమసస్తు పరేపారే రుద్రలోక స్స్వయం ప్రభో ! || 19

రుద్రత్వం సమనుప్రాపై#్త స్తత్రభ##క్తైర్మహానఘ ! | క్రీడన్నాస్తే మహాదేవః సపత్నీకో వృషధ్వజః || 20

తస్యోపరిష్టాదపర స్తావదేవ ప్రమాణతః | అగమ్య స్సర్వదేవానాం విష్ణులోకః ప్రకీర్తితః || 21

తస్యో పరిష్టాత్‌ బ్రహ్మాండః కాంచనో దీప్తి సంయుతః | భువర్లోకేతు వసతి ర్మహర్లోకే ప్రకీర్తితా || 22

స్వర్లోకే వసతిర్విష్ణో ర్వైకుంఠస్య మహాత్మనః | నృవరాహస్య వసతి ర్మహర్లోకే ప్రకీర్తితా || 23

ఆమహర్లోకము మీద నదేప్రమాణమున జనలోకమున్నది' అది గోవులుండు స్థానము. బ్రహ్మ యొక్క రాత్రియందక్కడ జీవులుందురు. దానిమీద యదే ప్రమాణములో తపోలోకముగలదు. అక్కడ మహాత్ములు ప్రాణాధీశ్వరులుందురు. ఆమీదిది సత్యలోకము, పరమేష్ఠియగు బ్రహ్మ యక్కడనుండును. ఈ యేడులోకములు నూర్ధ్వలోకములు. ఇంత వరకు సూర్యరశ్మి ప్రసారముండును. అందువలననే వీనికి లోకములను పేరువచ్చినది, ఆమీద నదే కొలతలో రుద్రలోక మున్నది. అది రుద్రతేజోమయము. బ్రహ్మలోకమునకది పైది. అది యైదువేల యోజనముల విరివిగలది. ఆదిత్యమందిరమను పేర గనిపించు నీలవర్ణమైన చీకటిప్రదేశమది. ఆచీకటికవ్వల రుద్రలోకమున్నది. రుద్రసారూప్యమందిర భక్తులక్కడనుందురు. వారితో మహాదేవుడు వృషధ్వజుడు రుద్రుడు పత్నితో విహరించుచుండును. దానిమీద నదేప్రమాణములో నెల్లదేవతలకుం జొరరాని విష్ణులోకమున్నది. దానికిమీద బ్రహ్మాండము కాంచనము (బంగారపుది) దీప్తిమంతమైనదికలదు. భువర్లోకమందు వామనమూర్తి యున్నాడు. స్వర్లోకమందు వైకుంఠుడు విష్ణువున్నాడు. మహర్లోకము నృవరాహస్థానము. జనలోకము నృసింహస్థానము.

నృసింహస్య తథాప్రోక్తా జనలోకే మహాత్మనః | త్రివిక్రమస్య వసతి స్తపోలోకే ప్రకీర్తితా || 24

లోకా స్సంతానకా నామ సత్యలోకే ప్రకీర్తితాః | ఏతేషు దేవం పశ్యన్తి దేవాస్సేంద్ర పురోగమాః || 25

తపసా మహతా రాజ& ! భక్తాశ్చ సతతం ప్రభుమ్‌ | రుద్రస్థానో పరిష్టాత్తు విష్ణోస్థానం మయోదితం || 26

న కశ్చిదేనం శక్నోతి ద్రష్టుం దేవవరం హరిం | న తత్ర సూర్యస్తపతి చంద్రమా న విరాజతే || 27

తేజసా తస్య దేవస్య సతుదేశో విరాజతే | తస్యో పరిష్టా దారభ్య యావదన్తం మహీపతే ! 28

ప్రోక్తం వరాహ స్థానస్య తత్రమానం నిబోధమే | యోజనానాంచ షట్కోట్యః త్రింశచ్చ నియుతాన్యథ || 29

ఏతావచ్చైవ భూతానాం వసతిః పరికీర్తితా | ఏతావదేవ చంద్రస్య తలముక్తం సమంతతః || 30

ఏతేషుదేవం పశ్యన్తి దేవాస్సేంద్ర పురోగమాః | తపసా మహతారాజన్‌ ! భక్తాశ్చసతతం ప్రభుం || 31

దాహ్యతే7ండం దశగుణం త్వద్భిస్తు పరివారితమ్‌ | ఆపో దశగుణనైవ బాహ్యత స్తేజసా వృతాః || 32

తేజో దశగుణనైవ బాహ్యతః పవనేనచ | వాయుర్దశ గుణనైవ గగనేన తథావృతః || 33

ఆకాశంచ దశ##ఘ్నేన మనసా బాహ్యతో వృతమ్‌ | మనశ్చ బుద్ధ్యా సకలం వృతం రాజన్‌ ! దశఘ్నయా || 34

ఆత్మనా చావృతాబుద్ధి ర్దశ##ఘ్నేన సమన్తతః || అవ్యక్తేన తథైవాత్మా దశ##ఘ్నేనైవ చావృతః || 35

అవ్యక్తః పురుషేణాథ త్వనన్తే నావృతో7నఘ ! | ఏవం విధానా మండానా మవ్యక్తః పురుషోత్తమః || 36

తిర్య గూర్ధ్వమధ స్సంఖ్యా వక్తుం రాజన్‌ ! నశక్యతే | అనన్తత్వాత్‌ ప్రధానస్య పురుషస్య మహాత్మనః || 37

ఏకరూపా స్తథైవాండా స్సర్వ ఏవ నరాధిప ! తుల్యదేశ విభాగశ్చ తుల్య జంతవ ఏవ చ || 38

దేశే దేశే సమానాయే అండేషు నృపసత్తమ ! సుఖదుఃఖే సమేతేషాం జీవితం మరణం తథా || 39

సర్వాండానాం సమాజ్ఞేయా కాలసంఖ్యా నరాధిప ! పౌరుషస్య దినస్యాన్తే సర్వే హ్యండ నివాసినః || 40

ఏకో7ప్యనన్తో రాజేంద్ర ! నాన్తరేవ ప్రకీర్తితః |

అయం మయోక్తోనృప ! సన్నివేశః సంక్షేప మాత్రేణ చరా చరస్య |

వ్యాసేనచైవం పరికీర్త్యమానః సమాప్యతే నైవ కదా చిదేవ || 41

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్ర సంవాదే లోకవర్ణనం నామ పంచమో7ధ్యాయః.

తపోలోకము త్రివిక్రమస్థానము. సత్యలోకమునందు సంతానకములను లోకములు గలవు. ఇంద్రాదిదేవతలు తపస్సు చేసి భక్తులై పరమేశ్వరు నిందు దర్శింతురు. రుద్రస్థానమునకుమీద విష్ణుస్థానమున్నది. ఈ హరి నెవ్వడుగాని దర్శింపజాలడు. అక్కడ సూర్యుడు తపింపడు. చంద్రుడు విరాజిల్లడు. ఆయన తేజస్సు చేతనే యా ప్రదేశము దీపించును. ఆదిమొదలుకొని తుది దాక గల ప్రదేశము వరాహస్థానము. దాని ప్రమాణము ఆరుకోట్ల ముప్పదిలక్షల యోజనములు. ఇంతవరకే భూతములుండు ప్రదేశము. ఇంతవరకే యిది చంద్రతలమనంబడును. వీనిలో నింద్రాదిదేవతలు మహాతపస్సుచే భక్తులును దేవుని దర్శింతురు. ఈ బ్రహ్మాండము వెలుపల పదిరెట్లు నీటితో చుట్టుకొన్నది. ఆ జలములు దానికి పదిరెట్లు తేజస్సుచే నావరింపబడినవి. తేజస్సునకు పదిరెట్లు వాయువుచేతను, వాయువునకు పది రెట్లయిన యాకాశముచేతను నావృతమయియున్నది. ఆకాశమునకు బదిరెట్లు వెలుపల మనస్సుచేత నావరింపబడినది. దానికి పదిరెట్ల వెలుపల బుద్ధిచే నావృతము. దానికి పదిరెట్లమీద ఆత్మచే నావరింపబడినది. దానికి మీద పదిరెట్లు అవ్యక్తమావరించియున్నది. ఆ అవ్యక్తము అనంతపురుషునిచేత ఆవృతము. ఈలాటి యండములకు మీద అవ్యక్తుడు పురుషోత్తముడనబడు పరమాత్మ అడ్డము నిలువు క్రిందు సంఖ్య చెప్పవశముగాదు. ప్రధానుడు మహాత్ముడునైన పరుషుడనంతుడు. ఆయనయొక్క యొకేరూపములు సర్వబ్రహ్మాండములు. ఇందు దేశవిభాగము సమానము జంతువులు సమానమే. ఆయా దేశ##దేశములందు బ్రహ్మాండములందున్న వారి సుఖ దుఃఖములు వారి జీవితము మరణము సమానమే. సర్వాండముల కాల గణనము సమానమే. పౌరుష దినము చివర (పురుషుని పగటి చివర) నందరు నయ్యండమున వసింతురు. ఆపురుషుడనంతుడు. ఒక్కడేయైనను ననేకముగా గీర్తింపబడుచున్నాడు. ఈ బ్రహ్మాండసన్నివేశము నేను సంక్షేపించి చెప్పితిని. వ్యాసభగవానులు దీనిని గీర్తించిరి. ఇది యెన్నడునేని ముగియదు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమ ఖండమున లోకవర్ణనము అను ఐదవ అధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters