Sri vishnudharmothara Mahapuranam-1 Chapters
అరువదినాలుగవయధ్యాయము - స్వాధ్యాయ కాలకథనము
శంకర ఉవాచ--
అదౌదేశే తధారామ ! ప్రయత స్సుసమాహితః | స్వాధ్యాయే నార్చయేద్దేవం ప్రయతే నాన్తరాత్మనా || 1
తాపత్కార్యం ద్విజశ్రేష్ఠ ! స్వాధ్యాయం విధివత్సదా | యావదస్తంగతో రామ ! సవితా దీప్తదీధితిః || 2
తత న్త్వస్తం గతే సూర్యే స్వాచా న్తస్సుసమాహితః | ప్రవిశ్య దేవతావేశ్మ నైరాజ్యం కర్మ కారయేత్ || 3
పాదపీఠా న్తకం కర్మ కృత్వాప్రాగుక్త మంజసా | అర్ఘ్యమాచమనీయంచ దత్వాపాద్యంచ భార్గవ ! || 4
స్థాలీ మక్లి న్ననై వేద్యా దార భ్యాభిహితంతతః భ్యాభిహితంతతః కర్తవ్య మనుయాగాన్తం ప్రయత స్సుసమాహితః || 5
కృత్వా೭నుయాగం విధివత్ ప్రవిశ్య సురమందిరమ్ |
స్వాధ్యాయస్యానుసంధానం తతః కుర్యా త్సమాహితః || 6
యోగకాలముపాదాయ పశ్చాత్కుర్యా ద్విసర్జనమ్ | కృత్వా విసర్జనం యుక్తస్తిస్టే ద్యామ మతంవ్రతః || 7
యోగా దన న్తరం స్వప్యా దేవంయుక్తస్య భార్గవ ! స్వయంకాలో೭పిసతతం యోగమధ్యే ೭భిధీయతే || 8
స్నానార్హకత్వం యదినాస్తితస్యయమే విబుద్ధస్తు తథాచతుర్ధే |
యుంజీత యోగం రిపుకాలభూతం యోగేన బుద్దిస్సముపై తిసర్గం || 9
ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే మహాపురాణ ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శంకరగీతాసు స్వాధ్యాయ కాలకథనం నామ చతుషష్టితమో೭ధ్యాయః
శంకరుడనియె. తొలుతచక్కని ప్రదేశమందు ప్రయతుడై మనసు నిలిపి నిలుకడగల మనస్సుతో స్వాధ్యాయముచే హరి నర్చించు వలెను. తేజోదీప్తుడగు సూర్యుడన్తమించుదాక స్వాధ్యాయము యధా విధిగ జేయవలెను. సూర్యుడస్తమించినంత జక్కగ నాచమించి మడితో దేవతార్చన గృహముల బ్రవేశించి స్వామికి నీరాజనమీయవలెను. లోగడచెప్పిన పాదపీఠాంత మర్చనగావించి అర్ఘ్యము అచమనము పాద్యము మొదలయిని ఉపచారములు చేసి స్థాలీదుక్లిప్న నైవేద్యమిత్యావగా తెల్పిన పూజావిధానము అనుయోగము తుదదాక నెఱపి అను యోగముగూడ చేసి (హోమమన్నమాట) ఆమీద స్వాధ్యాయమను సంధానము సేయవలెను. యోగకాలముందరసి (తరువాత సేయవలసిన యోగకాలము వచ్చినది) దేవతా విసర్జన మోనరింపనగును. విసర్జనముచేసి మనసును సమహీతము సేసికొని తొట్రుపడక యొక్కజాము యోగముపూని యుండ వలెను. యోగానంతరము పరుండవలయును. ఇట్లు యోగనిష్ఠుడైన వాని యోగమద్యస్థితియందుకూడ యిది యోగకాలమనియే చెప్పబడును. రేయి కడపటి (నాల్గవ) జామున లేచిన యతనికి స్నానముచేయు నర్హత లేనిచో రిపుకాలమందగు యోగము నభ్యసింపవలెను. అయోగము వలన బుద్ధి సర్గముం బొందును. అవృత్తిముఖమన్నమాట.
ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమున శంకరగీతలందు స్వాధ్యాయకాల కథనమను నరువది నాల్గవయధ్యాయము.