Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
డెబ్బదవ అధ్యాయము - అయశ్శంకు వధ మార్కండేయ ఉవాచ : సన్నద్ధం దానవగుణం పతాకాశతసంకులం | నానాప్రకారవాదిత్రం సింహనాద బలోద్ధతం ||
1 దృష్ట్వా రామో మహాతేజాః సజ్జం చక్రే మహద్ధనుః | శ##రైస్సంచదయామాస దైత్యసైన్యం మహాబలమ్ || 2 అభ్రచ్ఛాయేవ సంజజ్ఞే రామ ముక్తై శ్శిలీ ముఖైః | తిర్యగూర్వ మధశ్చైవ శ##రైర్వ్యాప్తం సమంతతః || 3 చాపమండల మధ్యస్థః పరివేషీన భాస్కరః | దృష్టమాత్రేణ సైన్యానాం చక్షూం ష్యవహర ద్రణ || 4 శరాంధకారే మగ్నాస్తే దానవా దుష్టచేతసః | రామ సందర్శనా దేవ దృష్టే೭ర్కే కౌశికా యధా || 5 స దానవానాం వ్యసృజన్ రామో భాతి శిలీముఖాన్ | సదా నవానాం మధువత్ కుసుమానాం శిలీముఖః || 6 శరాంధకారే మహతి మగ్నో మతిమతాం వరః | మాయాం కృత్వా తదాగ్నేయీం తం దదాహ శరోత్కరమ్ || 7 శరాంధకార గహనా న్నిష్ర్కాంతా స్తే దితే స్సుతాః | భార్గవం కోష్టకీ కృత్య రణ బిభిదు రంజసా || 8 ప్రంచండై దర్ధనారాచై ర్వత్సదంతై స్సచూచుకైః | వరాహ కర్ణె ర్ఖర్లైశ్చ క్షురపై#్ర శ్చటకాననైః || 9 తోమరైర్బిండి పాలైశ్చ పాషాణౖ ర్లగుడై శ్శుభైః | భ##డ్గైః ప్రాసై స్తధా చక్రై ర్గదా ముసల కంపనైః || 10 పరిఘై రాయసై స్త్రిశూలై స్త్రిశూలై శ్శక్తిభి స్తధా | స బాధ్యమానో೭పిరణ దైత్య నాధాయుధోత్కరైః || 11 న వివ్యధే మహాతేజాః హుతాహుతి రివానలః | యదాశస్త్ర ప్రహారై స్తం న శేకు స్సమరే ద్విజమ్ || 12 హంతుం దైత్యవరా యుద్ధే చక్రు రస్త్రం మహత్ ! అయ శ్శంకు ర్మహా తేజా రాజా దైత్యగణస్య యః || 13 సమేతై ర్దానవై స్సార్ధం రామం రణ కృతక్షణమ్ | శ##రై స్సంఛాదయామాస దివ్యాస్త్ర ప్రతిమంత్రితైః || 14 అసై#్ర రస్త్రాణి సంవార్య దానవేంద్రస్య భార్గవః | చిచ్ఛేద సశరం చాపం రుక్మదండం తథా ధ్వజమ్ || 15 సారధేశ్చ శిరః కాయాత్ శిరస్త్రాణ విభూషితమ్ | ఏతత్కృత్వా రణ కర్మ దక్షిణన స పాణినా || 16 జగ్రాహ పరశుం తీక్‌ణ్ష దైత్యకాయ విదా రణమ్ | పద్భ్యామాక్రమ్య వేగేన సమరే రధకూ బరమ్ || 17 నిర్జీవాన్ పాద వేగేన కృత్వా తురగ సత్తమాన్ | గదయాచ రథస్థస్య దానవేంద్రస్య సంయేగే || 18 జహార నశిరస్త్రాణం శిరో జ్విలిత కుండలమ్ | ఆయ శ్శంకౌ హతే దైత్యే భార్గవం సమరే తదా || 91 సర్వే దైత్యగణాః క్రుద్ధాః ఛాదయామాసు రంజసా ! ఆస్త్ర పుంజం రణ ఛిత్వా తేషాం భృగుకులోద్భవః || 20 రణ చిఛేద గాత్రాణి శిరాంసి చ మహా తపాః | క్షణ మాత్రేణ రామో೭పి దైత్యదేహ సమాకులాం || 21 శోణితౌఘ నదీం చక్రే కేశ##శై వాల శాద్వలామ్ | బాణ మీనాం చాప నక్రాం ఛత్ర హంసావళీం తధా || 22 ప్రేత లోకార్ణవ గమాం భీరు కల్మష వర్దినీం | హస్తిశీర్షోపలాం రౌద్రాం చారు తత్పుచ్ఛ పన్నగామ్ || 23 మార్కండేయుడనియె. దానవసైన్యములు పతాకలెత్తి నానాప్రకార సమర వాద్యములు మ్కోయించుచు సన్నద్ధములగుట గని రాముడు విల్లెక్కిడి బాణవర్షముచే నరిసేనలంగప్పివైచెను. అంతట నిండిన యయ్యలుగులచే క్రిందమీద నలుదెసల మబ్బు గమ్మినట్లయ్యెను. చుట్టుగుడికట్టిన సూర్యుడట్టు ధనుర్మధ్యమందు రాముడుతేజరిల్లుచుండెను. రామబాణాంధకార నిమగ్నులై దానవులు రామదర్శనమయినంతన సూర్యదర్శనమున గుడ్లగూబలట్లీందరు నంధులైరి. ఆరాక్షనులకై బాణములజిమ్ముచున్న యా పరశురాముడు నూతనకుసుమమ లకై తుమ్మెరలను సృజించుచున్న వసంతునివలెనొప్పెను. ఆ బుద్ధిమద్వరుడు గాఢబాణాంధకారమున మునిగి అగ్నిసంబంధ మయిన మాయను కల్పించి శరజాలమును దహించెను. దైత్యులంతట శరాంధకారమునుండివెలువడి నలుమూలలగ్రమ్మి రణమం దారమునొక ముక్కోణమున నిరికించి ప్రచండములయిన అర్ధనారాచములు చూచుకములతోడి వత్సదంతములు పరాహకర్ణములు భల్లములు =బల్లెములు క్షురప్రములు తోమరములు లగుడములు బిండిపాలములు కత్తులు కంపనములు చటకాననములు = పాషాణములు ప్రాసములు=గుదియలు చక్రములు గదా ముసల కంపనములు పరిఘలు ఇనుపశూలములు త్రిశూలములు శక్తులు ననునాయుధములచే గృచ్చిరి పొడిచిరి చీల్చిరి కోసిరి క్రుమ్మిరి రొప్పిరి. దైత్యనాథుల యాయుధముల బాధకెంతగురియయిననామహా తేజస్వి యాహుతులు వ్రేల్చినకొలది మంటలెగయు ననలమట్లువ్వెత్తుగ ప్రజ్వలింపమొదలిడెను. సమరమందాద్విజుని శస్త్రప్రహారములచే జంపనేరక పోయి యప్పుడాతనిం హతముసేయునొక మారణాస్త్రము దయారుచేసిరి. దైత్యగణాధిపుడు. ఆయశ్శం కుడనుపేరివాడు విజృభించు సమంత్రకమయిన దివ్యాస్త్రములచే రణోత్సవమహోత్సాహియై రాముని గప్పివైచెను. వాని యస్త్రములను ప్రత్యస్త్రములచే వారించి వాని సారథియొక్క బంగారు దండమును జెండాను ఖండించెను. శిరస్త్రాణముతోడి శిరస్సును నరకివైచెను. ఇట్లు మహాద్భుత రణప్రక్రియ జరిపి కుడిచేత దైత్యశరీరవిదారణమైన పదునెక్కిన పరశువుంగైకొని పాదముల సమరమందతి వేగమునదూకి రథకూబరమాక్రమించి పాదవేగముచే నుత్తమాశ్వములను నిర్జీవములంగావించి రథమందున్న దానవేంద్రుని శిరస్సును శిరస్త్రాణముతో జ్వలితకుండలములతోడి దానిం దెగనేసెను. అయశ్శంకుడు హతుడుగాగానే దైత్యగణములు క్రుద్ధులైయొక్కుమ్మడి నారామునినస్త్రపుంజములంగప్పివైచిరి. భృగుకులోద్వహుడదియెల్లజించి చెండాడి వారిదేహములను తలలcడొల్లనే నెను. అమ్మహావీరుడు క్షణమాత్రములో కేశ##శైవాల శాద్వలము (కూలినరాక్షసులజుట్టునాచుగడ్డిగ గ్రమ్ముకొన్నదియు) బాణములను మీనములు ఛత్రములు (వెలిగొడుగులు) అనుహంసలును తెగిన యేనుగుల కుంభస్థలములను పెనురాతిబండలను వానితోకలను వన్నగములను బహురైద్రమై భీరులకు కల్మషమును (చిత్తకాలుష్యము) బెంచునదియగు ప్రేతలోకమనెడి సముద్రములో వెళ్లిపడు నదియునైన ఘనదైత్య దేహసమాకులితయైన శోణితౌఘమహానదింబోనరించి క్షణమాత్రలోదరణియెల్ల ముంచెత్తెను. ఏవం విధే೭పి సంవృత్తే రణ కర్మణి దానవాః | తం రామ మక్షతం దృష్ట్వా హత శేషాః ప్రదుద్రుపుః || 24 మయ తార ప్రభృతయః పురంచ వివిశు స్తదా | పలాయమానాన్ సమరే న జఘాన స భార్గవః || 25 కించిచ్ఛేషేషు దైత్యేషు వినివృత్తస్తదా రణాత్ | హత దైత్యాయుత గణోరామో ೭శ్మనగరం య¸° || రామ ప్రవేశే నగరం వరుణస్యాజ్ఞయా తదా | పతాకా ధ్వజ సంబాధం కృతం దేవైర్విశేషవత్ || 27 నాగైశ్చ దానవైశ్చైవ సిక్తం చందన వారిణా | ధూప పుంజ సముత్‌క్షిప్తం కుసుమోత్కర మండితం || 28 తతశ్చ సుమహా తేజా వరుణస్తు వినిర్గతః | పుత్రపౌత్రైః పరివృతో రామ ప్రగ్రహ కారణాత్ || 29 సంపూజ్యమానం వరుణోరథ మారోప్యచ స్వకమ్ | ప్రవేశయామాస పురం బహు తూర్య పురస్కృతమ్ || రామ ప్రవేశే చ తదా నృత్యంతో ೭ప్సరసాంగణాః | గంధర్వ ముఖ్యా గాయన్తి సంస్తువంతి చ వందినః || స ప్రవిశ్యాథ నగరం వరుణస్య తధా గృహమ్ | ఉవాస తత్ర ధర్మాత్మా వరుణన సుపూజితః || 32 ధర్మాణా మాగమం కృత్వా వరుణా త్స సుతా త్తదా || 33 ఏవం స రామః పరవీరఘాతీ సంప్రాప్య యాదోగణ నాధ వేశ్మ | ఉవాస పుత్రై ర్వరుణస్య సార్ధం సంపూజిత స్తేం జలేశ్వరేణ || 34 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే మహాపురాణ ప్రథమఖండె మార్కండేయ వజ్రసంవాదే అయశ్శంకవధోనామ సప్తతితమో೭ధ్యాయాః ధారుణముగ నారణము నడచిన సతండక్షతుడై యుండుటగని హతశేషులగుదానవులు మయుడు తారుడు మొదలగువారు పారిపోయిరి. పురమందుజొచ్చిరి. అతడా పారుచున్న వారింజంపకుండెను. అత్యల్పసంఖ్యలో దైత్యులు మిగుల నపుడు రణము నుండి మరలి యశ్మనగరమునకు విజయము సేసెను. అక్కడ వరుణునానతినానగరమున రామప్రవేశమహోత్సవము పదాకా ధృజశోభనముగ నిర్వర్తింపపడెను. నాగులు దానవులు గూడనందు బాల్గొనిరి. చందనోదకములం రాజమార్గములు దడిపి పూల మాలలంకరించిరి. ధూప వ్రజముల ఘుమఘుమలునించిరి. అంతటనమ్మహాతేజస్వి వరుణుడు పుత్రపౌత్రులతోగూడ బయలుదేరి రామునికి స్వాగతమిచ్చి స్వీకరింపనెదురేగి తన రథము పైనెక్కించికొని నానా మంగళతూర్యములు మొరయ తన పురమందు బ్రవేశింపజేసెను. రాముని నగర ప్రవేశవమహోత్సవమందు అప్సరోగణమాటలాడిరి గందర్వవరులు పాటపాడిరి వందిమాగధులు పొగడిరి అతడు వరణుని నగరమున అతనిగృహముం బ్రవేశించి కొడుకులతోడి యాతని పూజగొని సపుత్రకుడగువరుణునినుండి ధర్మముల యాగమము గావించి యటవసించెను. సర్వజలాధిపతి వరుణుని కొడుకులు పూజింప నుండెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమ ఖండమందు అయశ్శంకవధయను డెబ్బదియవ అధ్యాయము.