Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
డెబ్బది మూడవ అధ్యాయము - కాలసంఖ్యావర్ణనము వరుణ ఉవాచ : లఘ్వక్షర సమామాత్రా నిమేషః పరికీర్తితః | అతస్సూక్ష్మతరః కాలో నోపలభ్యో భృగూత్తమ ! ||
1 నోపలభ్యంయథాద్రవ్యం సుసూక్ష్మం పరమాణుతః | ద్వౌనిమేషౌతృటిః జ్ఞేయాప్రాణోదశ తృటిస్స్మృతః ||
2 వినాడికాతు షట్ ప్రాణాః తాష్షష్టిర్నాడికా మతా | అహోరాత్రంచ తాష్షష్ట్యా నిత్యమేతైః ప్రకీర్తితమ్ ||
3 త్రింశన్ముహూర్తాశ్చ తధా అహోరాత్రేణ కీర్తితాః | తత్ర పంచదశ ప్రోక్తా రామ ! నిత్యం దివాచరాః ||
4 ఉత్తరాంతు యదా కాష్ఠాం క్రమాదాక్రమతే రవిః | తదా తథా భ##లేద్వృద్ధి ర్దివసస్య మహాభుజ! ||
5 దివసశ్చ యధా రామ ! వృద్ధిం సమధి గచ్ఛతి | తదాశ్రిత ముహూర్తానాం జ్ఞేయా వృద్ధిని స్తదా తథా ||
6 దక్షిణాంచ యదా కాష్ఠాంక్రమా దాక్రమతే రవిః | దివసస్య తదా హావిఃజ్ఞాతవ్యా నిత్యమేవతు ||
7 క్షియ న్తే దినహానౌతు తన్ముహూర్తా స్తధైవచ | రాత్ర్యా శ్రితాశ్చ వర్ధన్తే రాత్రివృద్ధౌ తదా తధా ||
8 యదా మేసం సహస్రాంశు స్తులాంచ ప్రతిపద్యతే | సమరాత్రి దినః కాలో విషువచ్ఛబ్ద వాచకః ||
9 తత్రదానం స్వల్పమతి మహద్భవపి భార్గవ ! | శ్రాద్ధం జప్యం హుతందత్తం యచ్చాన్యత్సుకృతం భ##వేత్ ||
10 సూర్య సంక్రమణ స్యాన్తే సౌరమాస స్సమాప్యతే | సౌరమాస ద్వయం రామ ! ఋతురిత్య భిధీయతే ||
11 ఋతుత్రయం చాయనం స్యాత్ తద్ధ్వయంచ సమాస్మృతా | దేవతానా మహోరాత్రం సచరామ ! ప్రకీర్తితః || 12 మేషాది షట్కగే సూర్యే తేషాం దివస ఉచ్యతే | తులాది షట్కగే సూర్యే తేషాం రాత్రిః ప్రకీర్తితా || 13 పితౄణాం చాంద్ర మాసేన అహోరాత్రో7 భిధీయతే | కృష్ణ పక్షాష్టమీ మద్యే తేషాం రాత్ర్యుదయ స్మృతః || 14 శుక్ల పక్షాష్టమీ మధ్యేతేషా మన్త మయ స్తధా | ఆర్ధరాత్రః పౌర్ణ మాస్యాం పితౄణాం సముదాహృతః || 15 కృష్ణపక్షావసానేచ తేషాం మధ్యాహ్న ఉచ్యతే | కృష్ణపక్షక్షయే తస్మాత్తేషాం శ్రాద్ధం ప్రదీయతే | కృష్ణపక్షక్షయే శ్రాద్ధం యశ్చ నిత్యం కరిష్యతి | సతతం తర్పితాస్తేన భవన్తి పితరో7వ్యయాః | 16 సమాశ##తై ర్ద్వాదశభిః దివ్యైః తిష్యయుగం స్మృతం | ద్విగుణం ద్వాపరం జ్ఞేయంత్రేతా త్రిగుణముచ్యతే || 17 చతుర్గుణం కృతం ప్రోక్తం పిండితం చాంద్ర సఖ్యయా | చతుర్యుగం సహస్రాణి రామ ! ద్వాదశ కీర్తితమ్ || 18 అతః పరం యుగావస్థాం నిబోధ గదతో మమ | చతుష్పాత్సకలో ధర్మస్తథా బ్రహ్మోత్తరం జగత్ || 19 శ్వేతవర్ణో హరిర్దేవో జ్ఞాన నిత్యాశ్చ మానవాః | చత్వార్యబ్ద సహస్రాణి తేషామాయుః ప్రకీర్తితమ్ || 20 సమాస వీర్యాశ్చ నరా స్తత్ర నాస్త్య ధరో త్తరమ్ | త్రిపాద విగ్రహోధర్మో రామ ! త్రేతాయుగే తదా || 21 కేశ##వే రక్తతాం యాతే నరా దశ శతాయుషః | యజ్ఞేశుభే ప్రవర్తన్తే నిత్యం హింసాత్మ కేషుచ || 22 జగత్ క్షత్రోత్తరం చైవ తదాభవతి భార్గవ ! | ద్విపాద విగ్రహోధర్మః పీతతాముచ్యుతే గతే || 23 సమాశ్శతాని చత్వారి తదా జీవన్తి మానవాః | యుద్ధశౌండా మహోత్సాహా లోకా వైశ్యోత్తరా స్తదా || 24 జాయన్తే శాస్త్ర భేదాశ్చ మతిభేదా స్తధైవచ | స్వల్పమాయుర్నృణాం బుద్ధ్వా విష్ణుర్మానుష రూపధృక్ || 25 ఏకమేవ యజుర్వేదల చతుర్ధా వ్యభజత్ పునః | తస్య శిష్య ప్రశిష్యాశ్చ వేదమేకం పునః పునః || 26 శాఖాభేద సహస్రేణ విభజ న్తి ద్విజోత్తమాః | ఏకపాద స్థితే ధర్మే కృష్ణతాం కేశ##వే గతే || 27 ధర్మభేదే సముత్పన్నే దేవతానా మనిశ్చయే | సవిద్యతే తదా రామ ! ఆయుషస్తు వినిశ్చయం || 28 గర్భస్థాశ్చ మ్రియన్తే7త్ర బాల్య ¸°వనగా స్తథా | శూద్రో త్తర స్తదా లోక స్తిష్యేభవతి భార్గవ ! || 29 సురప్రతిష్ఠా ధర్మశ్చ తథా భవతి భూతలే | పాపిష్ఠో వర్ధతే రామ ! ధర్మిష్ఠః క్షీయతే తదా || 30 రాజానః శూద్ర భూయిష్ఠాః చౌరా శ్చార్థోప జీవినః | బ్రాహ్మణా స్సర్వభక్ష్యాశ్చ భవన్తి భృగునందన ! || 31 ధర్మనిష్ఠశ్చిరం రాజా న తదారామ ! జీవతి | తస్మిన్ కాలే సుకృతినాం భక్తిర్భవతి కేశ##వే || 32 తేషా మల్పేన కాలేన తోష మాయాతి కేశవః | ధన్యాః కలియుగే రామ ! తపస్తప్స్యన్తి మానవాః || 33 తపసా7ల్పేన తే సిద్ధిం ప్రాప్స్య న్తీతిచ నిశ్చయః | చతుర్యుగైక సప్తత్యా మన్వన్తర మిహోచ్యతే || 34 కల్పస్తురామ విజ్ఞేయో మనవస్తు చతుర్దశ | అది మధ్యాంతరాలేషు మనూనాం భృగుసత్తమ ! || 35 కృతమాస ప్రమాణన సంధిర్భవతి మానద ! | చతుర్యుగ సహస్రంతు కల్పమాహు ర్మనీషిణః || 36 కల్పశ్చ దివసః ప్రోక్తో బ్రహ్మణః పరమేష్ఠినః | తావతీ చ నిశా తస్య యస్యాం శేతే స భార్గవ ! || 37 ఏవం విధై రహోరాత్రైద్దిన మాసాది సంఖ్యయా | పూర్ణం వర్షశతం సర్వం బ్రహ్మా భార్గవ జీవతి || 38 బ్రహ్మా77యుషా పరిచ్ఛిన్నః పౌరుషో దివస స్స్మృతః | తావతీచనిశా తస్యయస్యేదం సకలం జగత్ || 39 ఎవం విధా యేదివసా వ్యతీతా న చాగతా యేచ మహామభావ ! అనాది సత్వా త్పరమేశ్వరస్య హ్యానంత్య భావాశ్చ తథా త్వసంఖ్యాః || 40 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే వరుణ రామ సంభాషణ కాల సంఖ్యా వర్ణనం నామ త్రిసప్తతి తమోధ్యాయః. వరుణుడిట్లనియె : లఘ్వక్షరోచ్ఛారణకాలము (ఒక మాత్రకాలము) నిమేషము. దీనికంటె సూక్ష్మతరమైన కాలము పరమాణవుకంటె సుసూక్ష్మమయిన ద్రవ్యమువలె లెక్కకుదొరకదు. రెండు నిమేషములు త్రుటి. పది త్రుటులు ప్రాణము. ఆరు ప్రాణములు వినాడిక. అరువది వినాడికలు నాడిక. అరువది నాడికలు అహోరాత్రము. అహొరాత్ర మొక్కదాని యందు ముహూర్తములు ముప్పది. అందు పదునైదు పగటిముహూర్తములు మరి పదునైదు రాత్రిముహూర్తములు. రవి యుత్తర దిశకు నడచినకొలది పగలు పెరుగును. పగలు పెరిగినకొలది యా పగటి ననుసరించిన ముహూర్తములు పెరుగును. సూర్యడు దక్షిణదిశకు నడచినకొలది పగలు తరిగి రాత్రి పెరుగును. పగలు తరగినకొలది రాత్రి ముహూర్తములు పెరుగును. సూర్యుడు మేషరాశినిగాని చులారాశినిగాని చేరినపుడు రేయింబవళ్లు సమానమున నుండును. ఆ సమరాత్రిందివమైన కాలము విషువత్తు అనుపేర పుణ్యకాలమగును. అప్పుడు దానమత్యల్పముగ నిచ్చినను మహత్పుణ్యమగును. శ్రాద్ధము జప్యము హుతము మరి యే సుకృతమేని యత్యధిక ఫలప్రదాయకమగును. సూర్య సంక్రమణముచివర సౌర మాసము సమాప్తిచెందును. రెండు సౌర మాసము లొక ఋతువు. మూడు ఋతువు లొక అయనము. రెండయనము లొక సంవత్సరము. మేషాదిరాసు లారింట సూర్యుడున్న యాకాలము (ఉత్తరాయణము). దేవతలకుదివసము (పగలు). తులాదిషడ్రాసులందు సూర్యుడున్న కాలము వారికిరాత్రి. మన చాంద్రమానముననైన నెల పితృదేవతలకొక్క అహోరాత్రము. కృష్ణపక్షమునందష్టమీ తిథి నడును వారికిరాత్రి యారంభమగును. శుక్లపక్షాష్టమీ తిథి మధ్య యందు వారి కస్తమయకాలము. పౌర్ణమాసి పితృదేవతలకు అర్ధరాత్రము. కృష్ణపక్షము చివర వారికి మధ్యాహ్నకాలము. అందువలననే కృష్ణపక్ష క్షయ (అమావాస్య) మందు వారికిశ్రాద్ధము పెట్టనగును. ఆ సమయమం దెవ్వడు వారికి శ్రాద్ధము తప్పకపెట్టునో దాన నాతని పితృదేవతలు నిత్యమును దృప్తినందింపబడినవారు కాగలరు. పండ్రెండు వందల దివ్యవర్షములు కలియుగము. (తిష్యయుగము) దానికీ రెట్టింపు ద్వాసరము. మూడు రెట్లు త్రేతాయుగము. నాలుగురెట్లు కృతయుగము. పండ్రెండు వేలదివ్యసంవత్సరములు చతుర్యుగము (నాల్గుయుగముల కాలము మహాయుగమన్నమాట). ఇటుపై కృతాదియుగ వ్యవస్థ తెలిపెదవినుము : కృతయుగమందు ధర్మము నాల్గుపాదములతో సమృద్ధముగ నడచును. జగత్తంతయు బ్రహ్మోత్తరము. బ్రాహ్మణ పురస్సరముగానుండును. (వేదైకప్రమాణమని కూడ చెప్పవచ్చును). విష్ణువు శ్వేత వర్ణుడై యుండును. మానవులు జ్ఞాననిత్యలు. నాల్గువేల సంవత్సరములు వారి యాయుష్కాలము. నరులందరు సమానబలశాలురు. హెచ్చుతగ్గులులడవు, త్రేతాయుగ మున భర్మము త్రిపాద స్వరూపము. విష్ణువు రక్తవర్ణుడు. నరులు వేయేండ్లాయువు గలవారు. హింసాత్మకమయిన శుభ##మైనయజ్ఞములాచరింతురు. ఆయుగమందు జగత్తు క్షత్రోత్తరము (క్షత్రియు డగ్రగామిగా గలది). ద్వాపర యుగము ద్విపాదధర్మలక్షణము. పీతవర్ణముతో విష్ణువుండును. నాల్గువందలేండ్లు పరమాయుర్దాయము. మానవులు యుద్ధశౌండులు మహోత్సాహులు. వైశ్యులగ్రగాములు. శాస్త్రభేదమతిభేదము లీయుగములం దెచ్చుగా నుండును. ఆయువు స్వల్పమని గమనించి విష్ణువు మానుషరూపధారియై (వ్యాసుడై) యవతరించి ఒకటియైయున్న యజుర్వేదమును నాలుగు భాగము లొనరించేను. ఆయన శిష్యులు ప్రశిష్యులు వేదమునొక్కదానిని సహస్రశాఖాభేదములగావింతురు. హరి నల్లనిరూ పొందిన కలియుగమైన అసమయమందు ధర్మ మొక్కపాదమునుండి ధర్మభేదమేర్పడి దేవతానిశయము నశ్రించును. ఆయుర్దాయ మింతయని నిశ్చయింపవలనుగాదు. గర్భము లోనే శిశివులు మరణింతురు. బాల్య ¸°వనములందు మరణములు సరేసరి. శూద్రోత్తరముగా మానవులు నడతురు. దేవతా ప్రతిష్ఠలు చేయుటయే ధర్మముగా సాగును. (గుడులు గోపురములు కట్టుటయే పరమధర్మమగును) పాపిష్ఠుడు వృద్దిలో నుండును. ధర్మిష్ఠుడు తరుగులో నుండును. పాలకులు శూద్రభూయిష్ఠులు దొంగలు అర్థమాత్రోపజీవులు. బ్రాహ్మణులు సర్వభక్షకులు. పరి పాలకుడు ధర్మనిష్ఠుడైనచో నత డెక్కువకాలము బ్రతుకడు. అట్టి కలియుగమందు సుకృతులకు (పుణ్యకర్మలకు) విష్ణుభక్తి యేర్పడును. అట్టి భక్తులయెడ విష్ణువు స్వల్పకాలముననే సంతుష్టుడగును. పరశురామ ! కలియుగములో దపస్సుచేయవారెవ్వరో ధన్యులు కొందరుమాత్రమే. వారందరల్పమాత్రముచే సిద్ధిని నందుదురు. ఇది నిశ్చయమైన విషయము. డెబ్బదియొక్క చతుర్యుగములు (మహాయుగములు) ఒక్క మన్వంతరము ఒక కల్పము. ఇందు మనువులు పదునల్గురు. ఈమనువుల మొదట మధ్యమందు చివర సంధికాలముండును. నాల్గువేల యుగములు కల్పము. అది బ్రహ్మకొక పగలు. అంతే కాల మాయనకు రాత్రి. ఆందాయన శయించును. ఈ విధముగ నూరేండ్లు బ్రహ్మ జీవించును. బ్రహ్మయొక్క యాయుర్దాయము ఒక పౌరుష దివసము. రాత్రియును. ఇక్కడ పురుషుడనగా పరమేశ్వరుడు. విష్ణువు పరబ్రహ్మయని చెప్పవలెను. ఇట్టివెన్ని రేయింబవళ్ళు గడచెనో గడచునో ఆయనకు పరమేశ్వరునకు లెక్కింపవలనుపడవు. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున కాలసంఖ్యావర్ణనమను డెబ్బదిమూడవ యధ్యాయము.