Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
డెబ్బదియెనిమిదవ అధ్యాయము - బాలప్రభావకథనము వజ్ర ఉవాచ : సప్తమస్తే మహాబాగ ! జాతస్య దివస స్త్వయమ్ | వర్తతే బ్రహ్మణో బ్రహ్మన్ ! తత్ర మన్వంతరక్షయే ||
1 కథం కాల న్త్వయానీతః పురాకల్పక్షయే తదా || ఏ తన్మే సంశయం ఛిన్ధి ! త్వం సమః పరమేష్ఠినః ||
2 మార్కండేయ ఉవాచ : నౌగతేన మయానీతః కాలో మన్వంతర క్షయే | భూయో భూయో మహాభాగ ! దేవదేవ ప్రసాదతః ||
3 కల్పక్షయ మనుప్రాప్య దాహ కాల ఉపస్థితే | జనలోక గతేనాథ కాలోనీత స్సవై మయా ||
4 దాహకాలే తదా వృత్తే ప్రలయాంభోధి సంప్లవే | జనలోకాదహం భ్రష్టః పతితో ధరణీతలే ||
5 నూనం తసై#్యవ దేవస్య సా మాయా భీమ విక్రమా | ఏకార్ణవే భూమితలేపతితస్యా೭పి మే నృప ! 6 జీవితం న పరిభ్రష్టం నూనం తస్య ప్రభావత || తదా೭హం నష్టవిజ్ఞానః పతితో೭ంభసి దారుణ || 7 ఉహ్యమానో೭ంబుకల్లోలై రితశ్చేతశ్చ యాదవ! | అపశ్యమానో జగతీం సశైల వనకాననామ్ ||
8 నిర్వేదం జీవితే దీర్ఘే తదా ప్రాప్తో೭స్మి శత్రుహన్ ! | సో೭హమార్తో೭థ నిర్విణ్ణ స్తస్మిం స్తూదక సంప్లవే ||
9 పశ్యామి జలమథ్యస్థం విపులే వటపాదపం | మహాశాఖం ఘనచ్ఛాయం స్నిగ్ధపల్లవ శోభితమ్ ||
10 త మహం బాహుభి ర్గత్వా తస్మి న్న్యగ్రోధపాదపే | (శాఖాన క్తంతు పశ్యామి సవితారం తథోజ్జ్వలమ్ ||
11 దివ్యం పశ్యామి పర్యంకం సర్వరత్నోప శోభితమ్) | పర్యంకే తత్ర పశ్యామి బాలం కమల లోచనమ్ ||
12 అతసీపుష్ప సంకాశం పీత వాసస మచ్యుతమ్ | పద్మపత్రాభ చరణం తదాకారకరం తధా ||
13 అలంకృతం చాభరణౖః శిఖండైక విభూషితమ్ | ఏకం సాహస్ర మధ్యస్థం భ్రాజమాన మివ శ్రియా
14 సమాం దృష్ట్వా తదా బాలః స్మిత పూర్వ మువాచహ | యదిశ్రాన్తో ೭సి ధర్మజ్ఞ ! విగ్రహం వదనేన మే ||
15 ప్రవిశ్య విశ్రమ స్వా ೭ద్య యావద్వా రుచితం తవ | ఏవ క్తస్య సంజాతా వ్రీడా యదుకులోద్వహ ! ||
16 తతో೭హ మవశస్తస్య ప్రవిష్టో నృప విగ్రహమ్ | జగతీం తత్రపశ్యామి సశైల వనకాననామ్ ||
17 యధా పూర్వం మహాభాగ ! నగరాకార శాలినీం | దేవ దైత్యోరగా కీర్ణాం సముద్ర వర భూషణామ్ ||
18 నృప రాష్ట్ర సమాకీర్ణాం వణిగ్భి రుపశోభితామ్ | ద్విజా೭ధ్యయన సంఘష్టాం వర్ణాశ్రమ సమాకులామ్ ||
19 సరిత్పర్వత వృక్షాఢ్యాం యజ్ఞోత్సవ సమాకులాం | తాం దృష్ట్వా కౌతుకం జాతం తస్య బాలస్య కర్మణా ||
20 ద్రష్టు మిచ్ఛామి తస్యాంతంభ్రమమాణ స్తత స్తతః | యదా నాసాదయా మ్యత్ర తస్యబాలస్య చేష్టితమ్ ||
21 పూర్ణేయుగ సహస్రే೭పి తమేవాహం తదా శిశుం | సంప్రాప్తశ్శరణం రాజన్ ! అహం భాప్యర్థ చోదితః ||
22 తతో೭హం వదనా త్తస్య నిర్గత శ్శశి సన్నిభాత్ | యదా తస్యోదరే೭పశ్యం త్రైలోక్య సచరాచరం || 23 తథా పశ్యామి సకలం బహి ర్భూమిపసత్తమ | తతో೭హం పతిత న్తస్య పాదయో స్సుమహాత్మనః || 24 వజ్రుండు మన్వంతరక్షయందు బ్రహ్మకు పట్టిన నీ కేడవరోజు మునుపటి కల్పము క్షయించినతరువాత నీవు నీ కాలమెట్లు వెళ్ళించితివో బ్రహ్మకు సమానుడవుగావున నాసందేహము వోప నెరింగింపుమన మార్కండేయుడనియె. మన్వంతరము తుద నేనానౌకలోనే కాలముగడిపితిని. దేవదేవునను గ్రహమువలన కల్పాంతస్థితిలో జగమ్ములన్నియు దహింపబడు సమయము వచ్చినపుడు మరలమరల (అనేక కల్పములు) నేను జనలోకమ్యదుండి కాలమువెళ్ళించితిని. జగత్తులదాహకాలము గడచి ప్రలయసముడ్రము ముంచెత్తినతటి నేనా జనలోకమునుండి భ్రష్టుడనెయవనితలమందు బడితిని. అట్లుపడినపుడుకూడ నాజీవితము పోకుండుడ యదినిక్కముగానాదేవదేవుని ప్రభావమే. అనుగ్రహామే. అత్తడి విజ్ఞానము నష్టమయి (తెలివితప్పి) యాదారుణప్రశయ జలమందువెత్తుగలేచు నాకొరటములచే నిట్టట్టు గొట్టుకొనిపోబడి సశైలవనకాసనమైన భూమికనబడక ఛీ! ఈదీర్ఘ జీవితమెందులకని నిర్వేదించితిని. ఆ జల ప్రలయమందట్లు నేనార్తుడనై యుండి యంతలో నొక సువిశాలమైన మఱ్ఱిచెట్టు నానీటినడుమ గాంచితిని. దాని కొమ్మలు లెక్క కిముడవు. నిగనిగమెరయు నాకులతో మబ్బుగ్రమ్మినట్లుండెను. నేనా నీటనీదుచు దాని దరికేగి యాకొమ్మపై మిగుల నుద్దీపించుసవితను (సూర్యుని) జూచితిని. అక్కడ సర్వ దివ్యరత్నోపశోభితమైన యొకపర్యంకమును (శయ్యను) జూచితిని. ఆబాలుని మేను ఆతసీ పుష్పమట్లు నిగనిగ నల్లగా మెరయుచున్నది. పీతాంబరములు ధరించి యున్నాడు. తామరరేకులట్లున్నవి యాచిన్న వాని యడుగులు. అరచేతలట్లే యెఱ్ఱగనున్నవి. అనేకాభరణములలంకరించుకొన్నాడు. నెమలిపింఛెమింపు నించుచున్నది. కోటిసూర్యుల నడుమ యొక్కడై తేజరిల్లు శ్రీకళలతో నాబాలుంగంటిని. అపిల్లవాడు ననుజూచి చిరునవ్వు మన్నుగ ఓదర్మజ్ఞా! నీవలసియుంటివేని నీ ముఖము చాచి నా విగ్రహమందు (శరీరమందు) ప్రవేశించి యంతసేపు విశ్రాంతి గైకొనుమనియె. దానికేసు సిగ్గుపడితిని. అవ్వల నేను జేయగలదిలేక యాయన మేనం బ్రవేశించికిని. అలోన నేనుసశైలి వసకానన యైన జగతిని(భూమిని) చూచితిని. ఆ భూమి మున్నట్లు నగరమురతో నట్లు యొప్పుచుండెను. దేవదైత్య నాగకులములందలముకొనియున్నారు. సముద్రములు చుట్టుకొనియున్నవి. రాజధానులు వ్యాపారులతో వేదపన్నులగు బ్రాహ్మణుల యథ్యాయన ఘోషములతో వర్ణాశ్రమ విభాగములతో సరిత్తులు సరస్సులు గిరులు తరువులతో యజ్ఞోత్సవములతో నున్న యధారణింగని యాబాలుని చెయిదమునకు నేనెంతో మురిసితిని. ఆబాలుని కరములు చూతమని ముచ్చట పడి యట్టిట్టు తిరుగులాడి యాబాలుని క్రీడావిలాసము యొక్క పరమావధి గాసలేనైతిని. అట్లు వేయియుగ ములు గడచిపోప నాశిశువు దరికేనేనల్లన నేగి భావ్యర్థ ప్రేరణలు బట్టి యాతనినే శరణందితిని. అశిశు కడుపులలో చరాచరములగు ముల్లోకములందిలకించి చంద్రబింబమట్లున్ను యాబాలుని నెమ్మోము వెలుపడి వెలికి వచ్చితిని. వెలుపలను నేనదియెల్లయట్లనే చూచి యామహాత్ముని పాదములపై బడినాడను. తత స్సో೭న్తర్హితో బాల స్సహతేనై వశాఖినా | ఏవంమయా తస్య విశానరేంద్ర ! సంప్రాప్య పుణ్యంజఠరేహినీతా ! మహా శరీరస్య మహానుభావ ! మహా ప్రమేయస్య పితామహస్య || 25 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే మహాపురాణ ప్రధమఖండే మార్కండేయ వజ్రసంవాదే బాల ప్రభావ కధనం నామ అష్టనప్తతి తమో೭ ధ్యాయః || అంతలో నాబాలుడా చెట్టుతో సంతర్హితుండయ్యెను. ఇట్లాచిన్ని కుర్రడుగానున్న యమ్మహాశరీరధారి యప్రమేయుడు నైన పితామహుని యొక్క కడుపులో నేనొక్క రేయి గడపితిని. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము నందు ప్రథమ ఖండమున బాలప్రభావ కథనమను డెబ్బది యెనిమిదవ యధ్యాయము.