Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
ఎనుబదిరెండవ అధ్యాయము - అబ్దఫలనిర్దేశము మార్కండేయ ఉవాచ :- భగవాన్ వాసుదేవశ్చ తధాసంకర్షణః ప్రభుః | ప్రద్యుమ్న శ్చానిరుద్ధశ్చ కృతాదీనాంచ దైవతాః ||
1 తథా ఖండయుగా నీహ ద్వాద శోక్తాని భూషతే ! | షష్ఠా బ్దేచ వివర్తన్తే పంచాబ్దాని పృధక్ పృధక్ ||
2 తేషాం తవ ప్రవక్ష్యామి దైవతాం స్తు పృధక్ పృధక్ | విష్ణుర్భృహస్పతి శ్శక్రో వహ్నిస్త్వష్టా తధైవచ ||
3 అహి ర్బుధ్నశ్చ పితరో విశ్వేదేవా నిశాకరః | ఇంద్రాగ్నీచై వనా సత్యౌ భగశ్చైవ మహా బలః ||
4 ఇతి ద్వాదశ తేప్రోక్తాః షుయా ఖండ యుగేశ్వరాః | ఆథ షష్ట్యబ్ద నామాని నిబోధ గదతో మమ ||
5 వర్తమానే తధా కల్పే షష్ఠే మన్వంతరే గతే | తసై#్యవచ చతుర్వింశే రాజన్ త్రేతాయుగే తదా ||
6 యదా రామేణ సమరే నగణో రావణో హతః | లక్ష్మణన తథా రాజన్ ! కుంభకర్ణో నిపాతితః ||
7 మాఘ శుక్లం సమారభ్య చంద్రార్కౌ వాసవర్క్ణగౌ | జీవయుక్తౌ యదా స్యాతాంషష్ట్యబ్దాది స్తదా స్మృతః ||
8 ప్రభవో విభవ శ్శుక్లః ప్రమోదశ్చ ప్రజాపతిః | సైష్ణవే తు యుగే పంచప్రోక్తా స్సంవత్సరా శ్శుభాః ||
9 అంగిరాః శ్రీముఖోభావో యువాధాతా తధై వచ | అబ్దా జీవయుగే పంచ యేషామాద్యాశ్శుభాస్త్రయః ||
10 ఈశ్వరో బహుధాన్యశ్చ ప్రమాథీ విక్రమో వశః | శక్రాబ్దాః పంచనిర్దిష్టాః యేషామాద్యా పుభౌ శుభౌ ||
11 వహ్నిః స్వభాను స్తరణో వారిద శ్చ తథా7వ్యయః | ఆగ్నేయాః పంచ నిర్దిష్టాః ద్వితీయం తే ష్వశోభనమ్ ||
12 సర్వజిత్ సర్వధారీ చ విరోధీ వికృతిః ఖరః | త్వాష్ట్రే పంచయుగే తేషాం ద్వితీయం తు శుభప్రదమ్ ||
13 నందనో విజయ శ్చైవ జయః కామశ్చ దుర్ముఖః | అహిర్బుధ్న్యే యుగే పంచ యేషా మాద్యాః హితాస్త్రయః ||
14 హేమమాలీ (హేవలంబీ) విలంబీ చ వికారీ శర్వరీప్లవః | పైత్ర్యే పంచయుగే తేషాం పంచమశ్చ శుభప్రదః ||
15 శోకకృచ్ఛుభకృత్ క్రోధీ విశ్వావసు పరావసూ | వైశ్వే పంచ శుభాః వైషా మబ్దౌ రాజన్ ! ద్విపంచమౌ ||
16 ప్లవంగః కీలకః సౌమ్యస్సోమ్యో రోధకృదేవచ | సౌమ్యే పంచ శుభా వేషాం ప్రథమానంతరా వుభౌ ||
17 ధావనం మధనం వీరం రాక్షసం చాలనం తధా | ఇంద్రాగ్ని దేవతే పంచ సర్వ ఏవ శుభప్రదాః ||
18 పింగళః కాల యుక్తశ్చ సిద్ధార్థో రౌద్ర దుర్మతీ | ఆశ్వినే7 పి యుగే పంచ చతుర్థస్తేషు శస్యతే ||
19 దుందుభ్యంగారకౌ రక్తః క్రోధ శ్చాపి క్షయ స్తధా | భాగ్యే పంచ శుభాస్సర్వే విశేషేణ తు పంచమః ||
20 మార్కండేయుడనియె. భగవంతుడగు వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు ననువారు కృత త్రేతా ద్వాపర కలియుగములకు దేవతలు. అట్లే పండ్రెండు ఖండయుగములు చెప్పబడినవి. అయిదు సంవత్సరములు ఒక ఖండయుగము మొత్తమరువది సంవత్సరములకు బండ్రెండు ఖండయుగములు. వానిదేవతలు వరుసగా విష్ణువు బృహస్పతి శక్రుడు (ఇంద్రుడు) వహ్ని త్వష్ట అహిర్బుద్న్యుడు పితరులు విశ్వేదేవులు చంద్రుడు ఇంద్రాగ్నులు అశ్వనీదేవులు భగుడు ననువారు. ఇక నరువది సంవత్సరముల పేర్లు. ఇప్పుడు జరుగుచున్న కల్పమందు ఆఱవ మన్వంతరము గడువగా, నాకల్పమందే యిరువది నాల్గవ త్రేతాయుగమునందు రామునిచే సగణముగ రావణుడు హతుడయ్యెను. లక్ష్మణునిచే కుంభకర్ణుడు నిహతుడయ్యెను. మాఘ శుక్లపక్షము మొదలుకొని చంద్రసూర్యులు వాసవదేవతాకమయిన (జ్యేష్ఠ) నక్షత్రమందుగురునితో గూడినతఱినరువది సంవత్సరముల లెక్క ఆరంభమగును. అరువది సంవత్సరముల పేర్లు. ప్రభవ విభవ శుక్ల ప్రమోద ప్రజాపతి యను నీయైదును శుభదమలు. విష్ణుదేవతాకమయిన ఖండయుగమునందు సంవత్సరములు. అంగీరస శ్రీముఖ భావ యువధాతయను నైదును బృహస్పతి దేవతాక ఖండయుగమందలి సంవత్సరములు. ఇందుతొలి మూడును శుభప్రదములు. ఈశ్వర బహుధాన్య ప్రమాథి విక్రమ వశ అనునవి శక్రదేవతాక ఖండయుగ సంవత్సరములు. ఇందులో తొలిరెండును శుభదములు. వహ్ని (చిత్రభాను) స్వభాను తారణ వారిద అవ్యయములు అగ్నిదేవతా కఖండయుగసంవత్సరములు. వానిలోరెండవది శోభదముగాదు. సర్వజిత్తు సర్వధారి విరోధి వికృతి ఖర అనునవి త్వష్టృదేవతాక ఖండయుగసంవత్సరములు. అందురెండవది శోభనము. నందన విజయ జయ మన్మథ (కామ) దుర్ముఖ అనునవి అహిర్చుధ్న్య దేవతాకములు! ఇందు తొలుత మూడును హితవరములు హేమమాలి విలంబి వికారి శార్వరి ప్లవయనునవి పితృదేవతాకములు. ఇందై దవది శుభదము. శోభవత్తు శుభకృత్తు క్రోధి విశ్వావసు పరావసులు వైశ్వదేవతాకములు ఇందు రెండవది యైదవదియు శుభములు. ప్లపంగ కీలక సౌమ్య సోమ రోధకృత్తు సోమదేవతాకములు, ఇందుయొదటిది తరువాతిది శుభదములు. ధానవ మథన వీర రాక్షస ఆనలననునవి యింద్రాగ్ని దేవతాకములు. అన్నియు శుభప్రదములే. పింగల కాలయుక్త సిద్ధార్థ రౌద్ర దుర్మతి అశ్వినీ దేవ తాకఖండయుగమందలి యబ్దములు. అందు నాల్గవది శుభము. దుందుభి అంగారక రక్త క్రోధక క్షయ అనునవి భగదేవతాక ఖండయుగమందు సంవత్సరములు. ఇవన్నియు శుభప్రదుములే. అందులో నైదవది విశేష శుభదము. అతః పరం చారవశా ద్ధేవాచార్మస్య పార్థివ ! | ద్వాదశాబ్దాధిపాం స్తుభ్యం కధయామి ఫలాన్వితాన్ ||
21 ఆగ్నేయ కక్షగే జీవే వర్షం స్యా ద్వహ్ని దైవతమ్ | అహితం త ద్వినిర్దిష్టంగో ద్విజాగ్న్యుజీవినామ్ ||
22 సౌమ్య రౌద్రో పగే జీవే సౌమ్యవర్ష ముదాహృతమ్ | ఈతయ స్సకలా యత్ర చానానావృష్టి భయం తధా ||
23 ఆదిత్య పుష్యగే చాబ్దో విజ్ఞేయో గురు దైవతః | శుభంకరో హితో లోకే క్షేమారోగ్య సుభిక్షదః ||
24 సార్ప పైత్ర్యో పగే జీవే పైత్ర్యం వర్ష ముదాహృతమ్ | హార్దం వృష్టి ప్రదం లోకే శివసౌభిక్ష్యకారకమ్ ||
25 ఫాల్గునిద్వయ హస్తస్థే వర్షం భాగ్యముదాహృతం | చౌర ప్రాబల్యకం ఘోరం నారీ దౌర్బల్య కారకమ్ ||
26 చిత్రాస్వాతి గతే జీవే త్వాష్ట్రః సంవత్సర శ్శుభః | శూక ధాన్య క్షయ కర శ్శిబి ధాన్య వివర్ధనః ||
27 ఇంద్రాగ్ని దైవతం జీవే విశాఖా మైత్రసం యుతే | యజ్ఞక్రియా ప్రవృత్తానాం హితం ముదిత మానవమ్ ||
28 జ్యేష్ఠా మూల గతే జీవే శాక్త మబ్ద ముదాహృతమ్ | శూక ధాన్య క్షయ కరం భూతానాం భయ వర్ధనమ్ ||
29 ఆషాఢా ద్వయు గేజీవే వైశ్వదేవ ముదాహృతమ్ | నా7శుషం నశుభం లోకే రాబ్ఞాం విగ్రహ కారకమ్ ||
30 విష్ణు వాసవ సంస్థేతు వైష్ణవం పరికీర్తితమ్ | క్షేమ సౌబిక్షదం లోకే పాషండి పరిపీడనమ్ ||
31 ప్రోష్ఠపదా ద్వయగతే జీవే వారుణ సంస్థితే | పూర్వ ధాన్యప్రదం త్వాజం పశ్చాద్ధాన్య వినాశనమ్ ||
32 పౌష్ణాశ్వి యామ్యగే జీవే వర్షం స్యా దశ్విదై వతం | సువృష్టి క్షేమదంలోకే సర్వాతంక వివర్జితమ్ ||
33 ఇటుపై గురుచారముంబట్టి ద్వాదశాబ్దాధిపతులను ఫలప్రదులను దెల్పెద. గురుడు ఆగ్నేయ కక్షయందున్న తరి వహ్ని దేవతాకమయిన సంవత్సరమని పిలువబడును. గోబ్రాహ్మణాగ్న్యప జీవులకది యహితము. సౌమ్య రౌద్రరాసులందు గురుడున్నపుడు సౌమ్యవర్షమనబడును. అందీతిబాధలన్నియు గల్గును. అనాపృష్టి భయమెక్కువ. అదిత్యపుష్యరాశులందు నక్షత్రములందు గురుడుండిన సకులవత్సర గురుదేవతాకము. క్షేమారోగ్య సుభిక్షముంనుగూర్చును. సార్వపౌత్ర్యములందు గరుడున్న సంవత్సరము పైత్ర్యము. పితృదేవతాకము. హృదయానందకరము. సువృష్టిప్రదము మంగళప్రదము. సుభిక్షప్రదము. పూర్వోత్తరఫల్గుని హస్త యనువానియందు గురుడున్న వర్షము భాగ్యసంవత్సరము. అపుడు చోరబాధప్రబలముగానుండును. అతిఘోరము. స్త్రీలకు దౌర్బల్యము గూర్చును. చిత్రా స్వాతినక్షత్రములందు గురుడున్న నది త్వష్టృదేవతాక సంవత్సరము. తోపధాన్యక్షయమును శిబిధాన్య పృద్ధిని చేయును. గురుడు విశాఖామైత్ర సంయుతుడైన సంవత్సరమ ఇంద్రాగ్ని దేవతాకము-యాగకర్తలకు హితకరము. మానవులు సంతోషముతో నుందురు. జ్యేష్ఠమూలనక్షత్రమందు బృహస్పతియున్నది శాక్తసంవత్సరమనంబడును. శూకధాన్యక్షయముసేయును. భూతభయంరరముగూడ. పూర్వాషాఢ ఉత్తరాషాడయను వానియందు గురుడున్న వైశ్వదేవయనబడును. (విశ్వేదేవతాకమన్నమాట) అది యశుభము కాదు శుభమునుగాదు. రాజులు యుద్ధములు సేయుదురు. విష్ణు (శ్రవణ) వాసవ (ధనిష్ఠ) నక్షత్రమురందు గురుడున్న నది వైష్ణవ సంవత్సరము. క్షేమము సుభిక్షము గూర్చును. పాషండుజన పీడాకరము. ప్రోష్ఠపద-వారుణ నక్షత్రములందు గురుడున్న సంవత్సరము అజము (అజదేవతాకము) పూర్వ ధాన్యసమృద్ధిని ఉత్తర ధాన్యనాశనమునుజేయును. దేవగురుడు పౌష్ణ-అశ్వి యామ్య నక్షత్రములందున్న సంవత్సరము అశ్విదైవత సంవత్సరము. విశ్వదైవతము. సువృష్టి క్షేమప్రదము. సర్వాతంక జర్జితము (విఘ్న రహితము). చైత్రశుక్ల సమారంభే జగతాం జగదీశ్వర ! | సర్వం చక్రే తదా రాజన్ ! తత స్తస్మిన్ సదాదినే ||
34 సంవత్సరేశః క్రియతే బ్రహ్మణా తు సదాగ్రహః | నాగోయజ్ఞ శ్చ ధర్మజ్ఞ ! గంధర్వ శ్చ తధైవచ ||
35 సప్త ఛిన్నేతు యఃశ్లేషః కలిపాత సమాగణ | ఆదిత్యాది స్సబోద్ధవ్యో గ్రహ స్సంవత్సరాధిపః ||
36 ఆదిత్యేన సహానన్తో నాగోభవతి భూమిప! | చిత్రాంగద స్తు గంధర్వో దీర్ఘభద్రో నిశాచరః ||
37 సౌమ్యేన వాసుకి ర్నాగః పూర్ణభద్రో నిశాచరః | చిత్రసేన శ్చ గంధర్వః సమాశ్చామీ ప్రకీర్తితాః ||
38 భౌమేన తక్షకో నాగో మణిభద్రో నిశాచరః | తదా చిత్రరధో నామ గంధర్వశ్చాభిషిచ్యతే ||
39 బుధేన నాగః కర్కోటో యక్షభద్రో నిశాచరః | తుంబురు ర్నామ గంధర్వః సమాప్వాస్వభిషిచ్యతే ||
40 జీవేన నాగః పద్మస్తు దీర్ఘబాహు ర్నిశాచరః | గంధర్వశ్చ మహాతేజా స్తధా శాలిశిరః ప్రభుః ||
41 మహాపద్మస్తు శుక్రేణ నాగోభవతి భూపతే | నారద శ్చైవ గంధర్వో మహాబాహు ర్నిశాచరః ||
42 సౌరేణ నాగః శంఖస్తు మహాకర్ణో నిశాచరః | ఊర్ణాయు శ్చైవ గంధర్వః సమాస్వాస్యభిషియ్యతే ||
43 అతః పరం ప్రవక్ష్యామి సమారూపం మహీపతే ! | గ్రహ స్వామి భవం తుభ్యం శేషా స్సర్వే తదాశ్రయాః ||
44 తీక్ష్ణర్క స్స్వల్ప మత్స్యశ్చ గత మేఘో7తి భాస్కరః | బహునాగ వ్యాధి గణో భాస్కరాబ్దో రణాకులః ||
45 బహు వర్షో7తి సస్యశ్చ గవాం క్షీరప్రదాయకః | చంద్రా బ్దః కామినా మిష్టః చిత్యంకిత మహీతలః ||
46 అగ్ని తస్కర రోగాఢ్యో నృప విగ్రహ దాయ కం | గత సస్యో బహు వ్యాలో భౌమాబ్దో బాలహా భృశమ్ ||
47 విప్ర క్షత్రియ సస్యానాం జనానాంచ కలాభృతాం | బుద్ధిప్రదో7బ్దో బౌద్ధస్తు బహు సస్యాకరః క్షితౌ ||
48 బహుయజ్ఞో7తి సస్యశ్చ గోగజాశ్వహిత స్తధా | బహు వృష్టి ప్రద స్సౌమ్యో జీవాబ్దో ద్విజ పుష్టిదః
49 సస్యాఢ్యో ధర్మ బహులో గతాతంకో బహూదకః | కామినాం కామదః కామః సితాబ్దో నృప శర్మదః ||
50 దుర్భిక్షమరకాన్రోగాన్ కరోతి పవనస్తధా | శ##నైశ్చరాబ్ద శ్శోకాంశ్చ విగ్రహాణిచ భూభుజామ్ ||
51 క్రమేణ పరివర్తన్తే పంచ యాదవ ! వత్సరాః | తేషా మధిపతీన్ వక్ష్యే నామాని చ ఫలాని చ ||
52 పంచ భ##క్తే తు యచ్చేషం తిష్ఠే దబ్ద గణ గతే | సంవత్సరాద్య స్సంజ్ఞేయో నిత్యం సంవత్సరో బుధైః ||
53 ఆద్య స్సంవత్సరో నామ ద్వితీయః పరివత్సరః | ఇడాఖ్యశ్చ తృతీయో7త్ర చతుర్థశ్చాను వత్సరః | ఇద్వత్సరాఖ్యః కధితః తధా చైవా7త్ర పంచమః || 54 సంవత్సరో7గ్నిః పరివత్సరో7ర్కః ఇడాభిధానో భగవాన్ శశాంకః | బ్రహ్మా స్వయంభూ దనువత్సరో7పి ఇద్వత్సరః శైలనుతా పతిశ్చ ||
55 వృష్టి స్సమాఖ్యే కధితా ద్వితీయే ప్రభూతతోయా కధితా తృతీయే | పశ్చాజ్జలం ముంచతి యశ్చతుర్థః స్వల్చోదకం పంచమమబ్ద ముక్తమ్ ||
56 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే అబ్దఫల నిర్దేశోనామ ద్వ్యశీతి తమో7ధ్యాయః చైత్రశుక్ల పాడ్యమినుండి బ్రహ్మ సృష్టి ప్రారంభమంతయుంజేసెను. ఆయన యొక్కక్క గ్రహమును సంవత్సరాధి పతిగా గావించును. ఆ గ్రహముతోపాటు నాగుడు యజ్ఞును గంధర్వుడు నను వారు తోడుగ నుందురు. మొత్తము అరువది సంవత్సరములను నేడింట విభజింపగా వచ్చు శేషము ననుసరించి వరుసగా యాదిత్యాదు లధిపతులుగా నుందురు. ఆదిత్యునితో అనంతుడను నాగుడు చిత్రాంగదుడను గంధర్వుడు దీర్ఘభద్రుడను నిశాచరుడు నుందురు. సోముతో చంద్రునితో (సౌమ్యునితో) వాసుకి (నాగుడు) పూర్ణ భద్రుడు (రాక్షసుడు) చిత్రసేనుడు (గంధర్వుడు) నుందురు. కుజునితో తక్షకుడు ( నాగుడు) మణిభద్రుడు (రాక్షసుడు) చిత్రరధుడు (గంధర్వుడు) నుందురు. బుధునితో కర్కోటుడు యక్షభ్రదుడు తుంబురుడు నుందురు. జీవునితో (గురునితో) పద్ముడు దీర్ఘబాహువు శాలిశిరుడు నుందురు. శుక్రునితో మహాపద్ముడనునాగుడు మహాబాహు వనునిశాచరుడు నారడడు గంధర్వుడు నుందురు. శనితో (సౌరునితో) శంఖుడనునాగుడు మహాకర్ణుడనునిశాచరుడు, అనుగంధర్వుడు ఊర్ణాయువు సంవత్సరాధిపుడుగ అభిషేకింపబడును- ఈపైని సంవత్సరస్వరూపముంజెప్పెద. అది గ్రహస్వామి వలన నేర్పడును. మిగతా నాగుడు మొదలయిన వారు ఆ సంవత్సరాధిపతి నాశ్రయించుకొని యుండువారే - భాస్కరాబ్దము వర్షసస్య తీక్ష్నసూర్యకము స్వల్పమత్స్యము. మేఘశూన్యము ప్రకాశమానము నాగ (సర్ప) బహుళము వ్యాధి ప్రచురము రణాకులము. చంద్రాబ్దవర్షసస్యగోక్షీరసమృద్ధము, కాముకులకు ప్రీతికరము భూమియెల్లచితులతో నిండియుండును. భౌమాబ్దము అగ్నితస్కరరోగాకులము రాజయుద్ధ సమ్మర్ధము. సస్యశూన్యము క్రూరమృగప్రచారము బాలఘాతుకము. బుధాబ్దము విప్రక్షత్రియ సస్యసంపదలకు కళలకు బుద్ధికి సస్యములకు వృద్ధిప్రదము. జీవాబ్దము (బృహస్పతి సంవత్సరము) యజ్ఞబహుళము సస్యసమృద్ధము గోగజాశ్వములకు హితకరము బహువృష్టి ప్రదము. ద్విజులకు పుష్టిప్రదము. శుక్రాబ్దము సస్యసమృద్ధము ధర్మబహుళము నిరాంతకము (బాధ లేమియు లేకుండుట) ఉదక సమృద్థము. కాముకులకు కామవర్ధనము. రాజులకు సుఖప్రదము. శ##నైశ్చరాబ్దము దుర్భిక్ష మారక రోగకారకము. శోకకారణము. రాజ కలహ సంకులము. ఈ విధముగా నైదేసి సంవత్సరములు పరివర్తనము పొందుచుండును. వాని అధిపతులను పేరులను, ఫలములను చెప్పెద. సంవత్సము పరివత్సరము ఇడావత్సరము అనువత్సరమునకు ఇద్వత్సరము ననునవి. సంవత్సరమునకు అగ్ని పరివత్సరమునకు అర్కుడు (సూర్యడు) ఇడావత్సరమనకు చంద్రభగవానుడు అనువత్సరము స్వయంభువైన బ్రహ్మ ఇద్వత్సరమునకు పార్వతీపతియునధిపతులు వర్షము జల సమృద్ధి. పూర్వభాగ జలసమృద్ధి. ఉత్తర భాగ జల సమవృద్ధి. ఉత్తర భాగ జల సమవృద్ధి. స్వల్పోదకము ఇది క్రమముగా సంవత్సరాదు లైదింట గానవచ్చు ఫలితములు. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమ ఖండమున అబ్ద ఫల నిర్దేశమను ఎనుబది రెండవ యధ్యాయము