Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

తొంబదియార అధ్యాయము - అనులేపకథనము

వజ్ర ఉవాచ :

సర్వేషాం తు సమాచక్ష్వ గంధమాల్యం తధై వచ |

ధూపం బ్రహ్మన్‌ ! స యనైవేద్యం పానంచైవ పృథక్‌ పృథక్‌ || 1

హోమద్రవ్యం తధా మంత్రం దక్షిణాశ్చ భృగూత్తమ! |

ఏక స్త్వం సర్వవిద్‌ బ్రహ్మన్‌! బ్రహ్మావా జగతాం పతిః || 2

మార్కండేయ ఉవాచ :

ధ్రువస్థాన నివిష్ఠానాం దేవానాం చ మహీపతే! | సర్వాసాం చందనం దేయం నిత్యమేవ పృథక్‌ || 3

సూర్యాయ కుంకుమం దేయం కర్పూరం శశినే తథా |

భౌమాయ చందనం రక్తం చాగురుం శశిజాయ చ ||

జీవాయ చందనం దేయం కుంకుమేన విమిశ్రితమ్‌ | శుక్రాయ చందనం శ్వేతం సౌరాయచ మృగోద్భవమ్‌ || 5

కుంకుమేన యుతం దద్యాద్దానవాయ మృగోద్భవమ్‌ | అగురుం కుంకుమం చోభౌ సుదే¸° ధూమకేతవే || 6

కుంకుమం కృత్తికానాంతు రోహిణీనాం మృగోద్భవమ్‌ |

ఇల్వలానాం చ కర్పూరం రౌద్రే నాగమదం తధా || 7

ఆదిత్యస్య ప్రదాతవ్యా వుభౌ కుంకుమచందనౌ | ఉశీరచందనౌ దేయా వాశ్లేషా పైత్ర్యయో స్తథా || 8

ప్రియంగు చందనౌ దే¸° తధా భాగ్యస్య పార్థివ! అర్యవ్ణుశ్చ ప్రదాతవ్యౌ చందనౌ శ్వేత రక్తకౌ || 9

సావిత్రస్య ప్రదాతవ్యం కుంకుమం పృథివీ పతే |

త్వాష్ట్రస్య చందనం దేయం కుంకుమం చమృగోద్భవమ్‌ || 10

జాతీఫలయుతం దేయం వాయవ్యస్య చ చందనం | విశాఖా యాః ప్రదాతవ్యం కుంకుమం చందనం తధా || 11

తురుష్క సహితం దేయం తథా మైత్రేయచందనమ్‌ |

జ్యేష్ఠాయాశ్చ ప్రదాతవ్యం చందనం కుంకుమం తధా || 12

మూలాయ శింశుపా సారం తధా దేయం మృగో ద్భవమ్‌ |

ఆప్యాయ కుష్ఠ సంయుక్తం దాతవ్యం చందనం భ##వేత్‌ || 13

వైశ్వదేవాయ మృగజం చందనా గురుణీ తధా | బ్రహ్మాయ చందనం దేయం వైష్ణవాయా గురుం తధా || 14

జాతీలవంగౌ దాతవ్యౌ సుపిష్టౌ వాసవాయ తౌ | వారుణాయచ కర్పూర మాజాహి ర్బుధ్న్యయో స్తధౌ || 15

పౌష్ణాయ చందనం రక్త మాశ్వినాయ తధా సితమ్‌ |

యామ్యాయాగురు సంయుక్తం తధా దేయం మృగోద్భవమ్‌ || 16

సమాన దేవ నక్షత్రం కథితం చ త్వయా దిశం | ఉత్తరాయ స్తథా దేయే చందనాగురుణీ శుభే || 17

సాగరాణాం ప్రదాతవ్యం సర్వేషా మేవ చందనమ్‌ | అలాభేతు తధా దేయం సర్వేషా మేవ చందనమ్‌ || 18

మంగల్యం తత్పవిత్రం చ దేవానాం దయితం చ తత్‌ |

ధార్యం చ దేయం తద్రాజన్‌! తత్ర లక్ష్మీః ప్రతిష్ఠితా || 19

యద్యద్గ్రహస్యాభిహితం మయైత దృక్షస్యవా భూమిపతి ప్రధాన! |

తద్దేవతాయాశ్చ తదేవ దేయం దిశ స్తధా నాత్ర విచారణాస్తి || 20

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే అనులేప కథనం నామ షణ్ణవతి తమోధ్యాయః

వజ్రుడు గ్రహనక్షత్రమలకు సమర్హములైన గంధమాల్య ధుపదీప నైలేద్య పానాది సామగ్రిని వేర్వేర హోమద్రవ్యము మంత్రము దక్షిణము నానతిమ్ము : నీ వొక్కడవ యిది సర్వము నెరింగినవాడవు. జగత్పతి బ్రహ్మయునన మార్కండేయుడనియె: ధ్రువస్థానమందున్న దేవతల కందరకు వేర్వేర నిత్యము గంధము నొసంగవలెను. సూర్యునకు కుంకుమము (కుంకుమ పువ్వు) చంద్రునికి పచ్చకర్పూరము కుజునికి ఎఱ్ఱచందనము బుధునకు అగరు గురునకు కుంకుమపువ్వుతో చందనము (మంచి గంధము) శుక్రునికి తెల్లగంధము శనికి కస్తూరి కుంకుమపువ్వుతో గూడినది. రాహువునకు కస్తూరి కేతువునకు అగురు కుంకుమ పువ్వు రెండును గలిపి యీయవలెను. కృత్తికలకు కుంకుమపువ్వు రోహిణికి కస్తూరి ఇల్వలకు కర్పూరము రౌద్రమునకు నాగమదము ఆదిత్యునకు కుంకుమ చందనములు రెండును ఆశ్లేషకు మషుకు వట్టివేరు చందనమును భాగ్యమునకు ప్రియంగు చందనములు అర్యవ్ణుమునకు తెలుపు ఎరుపు చందనములు సావిత్రమునకు కుంకుమపువ్వు త్వాష్ట్రమునకు చందనము, కుంకుమపువ్వు కస్తూరి వాయవ్యమునకు జాజికాయతో చందనము విశాఖకు కులకుమ చందనములు మైత్రమునకు తురుష్కనహిత చందనము జ్యేష్ఠకు చందన కుంకుమములు మూలకు శింశపాసారము కస్తూరి, అప్యమునకు (పూర్వాషాడకు) కుష్ఠచందనములు వైశ్వదేవమునకు కసూరి చందనము అగురు బ్రాహ్మమునకు చందనము వైష్ణవమునకు అగురును వాసనమునకు చక్కగా నూరినజాజిలవంగములమద్ద, కారుణమునకు పచ్చకర్పూరము అజ-అహిర్బుధ్న్యములకు పౌష్ణమునకు (రేవతికి) రక్తచందనము అశ్వినికి తెల్లచందనము యామ్యమునకు (భరణికి) అగురుతోకస్తూరి, ఒకదానితదో నొకటిసరియైన దేవత నక్షత్రము దిక్కుతెల్పినాము. ఉత్తరదిశకు చందనాగురులు సర్వసాగరములకు చంనము, అయాద్రవ్యలు లభించనప్పుడందరికి చందనము నొసంగవలెను. గంధము మంగల్యము పవిత్రము దేవతల కిష్టము. అదితానుధరింప నయినది. సమర్పింపదగినదికూడ. గంధమందు లక్ష్మిప్రతిష్ఠితయైనది. ఏదియేది గ్రహమునకు జెప్పితినోయదే నక్షత్రమునకు నక్షత్రాధిదేవతకును దిక్కులకును దిగ్దేవ తలకునుగూడ సమర్పింపదగినది. ఇందు విచారణలేదు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రధమఖండమున అనులేపకథనమను తొంబదియారవ యధ్యాయము

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters