Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము

(ప్రథమ ఖండము)

ఆంధ్రానువాదసహితము

అ ను వా ద కు లు :

గురుశిశువు శ్రీ కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు

ప రి ష్క ర్త :

విద్వాన్‌ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రీ

వ్యాకరణ విద్యా ప్రవీణ, సాహిత్య విద్యా ప్రవీణ, వేదాంత విశారద

ప్ర కా శ కు లు :

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టు

గురుకృప

1-10-140, అశోక్‌నగర్‌, హైదరాబాదు-500020.

ప్రథమ ముద్రణము సర్వస్వామ్యములు ప్రకాశకులవి.

1985 మూల్యము : 72-00

ప్రతులు : 2000

ప్రతులకు : ముద్రణ :

శ్రీ వేంకటేశ్వర అర్షభారతి ట్రస్టు, ఇంటర్నేషనల్‌ ఎంటర్‌ పై#్రజెస్‌,

గురుకృప, 1-1-385,

1-10-140/1, అశోక్‌నగర్‌, గాంధీనగర్‌,

హైదరాబాదు-500020. హైదరాబాదు-500 380.

ఓమ్‌.

శ్రీ చంద్రమౌళీశ్వరాయనమః

శ్రీ కాంచీకామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకరాచార్యస్వామి మఠః

కాంచీపురం 631-502

శ్రీ శ్రీ కామకోటి పీఠాధీశ్వర శ్రీ జగద్గురు శ్రీమజ్జయేంద్రసరస్వతీ శ్రీ పాదైః

అనుగృహీతం శ్రీముఖమ్‌.

సువిదిత మేతత్‌ యదస్మాకం భారతీయసనాతనధర్మస్య ముఖ్యం ప్రమాణం వేదా ఇతి| వేదానామర్థం తాత్పర్యంచ సర్వేషాం కృతే ప్రతిపాదయితం ప్రవృత్తాని ఇతిహాసపురాణాని| ఏతేషు చాస్మాకం వైదికోధర్మః అనాదిరితి ప్రతిపాద్యతే | చరిత్రసంబంధినో విషయాః బహవః ప్రతిపాదితాః పురాణషు| ఇమే విషయాః అస్మత్పూర్వతనానాం ఆచార్యాణాం ఋషీణాంచ కౌశలం దీర్ఘదృష్టితాంచ జ్ఞాపయంతి ఇత్యత్ర న విమతిః.

అష్టాదశసంఖ్యాకాని పురాణానీత్యప్యస్తి ప్రసిద్ధిః | తేషా మేషాం పఠనేన తథా తదర్థబోధేనచ అత్రత్యా విషయాః సమ్యక్‌ జ్ఞాయంతే ఇత్యేవ న అపితు అస్మదీయపాతకానా మప్యున్మూలనం చ భవతీతి నిశ్చప్రచమ్‌|ఏతేషాం పురాణానాం సర్వజన సాధారణతయా బోధాయ ప్రవచనం తథాఅదసీయమూలశ్లోకానాం ప్రాదేశికలిప్యాం లలితలలితసామాన్యభాషాయాం అనువాదేనసహ ప్రకటీకరణంచర్వేషామపిశ్రేయసే కలయతే | ఏతాదృశ ముత్తమోత్తమం ధార్మికం కార్యం భాగ్యనగర (హైదరాబాదు)నివాసీ భక్తాగ్రేసరః శ్రీమాన్‌ పి. వెంకటేశ్వర్లు మహోదయః స్వకీయ మనల్పం ధనం వ్యయీకృత్య కరోతీ త్యేతస్మిన్‌ కార్యే శ్రీకల్లూరి వెంకట సుబ్రహ్మణ్యదీక్షితాః శ్రీజంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిణః ఇత్యాదయః పండితాః భాగం వహంతీతిచ జ్ఞాత్వా అతీవ మోదామహే వయమ్‌.

ఏవమేవాయం వెంకటేశ్వర్లు మహాభాగః ఇతరాణ్యపి మహాపురాణాని అచిరేణకాలేన ప్రకటీకృత్య శ్రేయోభాగ్భవతు. తథా ఏతేషాం పురాణానాం పఠనేన తదర్థపరిజ్ఞానేనచ సర్వే7ప్యాంధ్రమహాజనాః కృతకృత్యాః పుణ్యభాజశ్చ భవేయు రిత్యాశాస్మహే.

ఇతి నారాయణస్మృతిః

శ్రీః

శ్రీ విష్ణుధర్మోత్తరమహాపురాణ సమర్పణ పంచరత్నమ్‌

శ్రీమదిత్యాదిబిరుదావళీ విరాజమాన శ్రీకామ్రాక్షీసమేత శ్రీమదేకామ్రనాథశ్రీకాంచీక్షేత్రే

శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీజగద్గురు శ్రీమచ్ఛఙ్కరభగవత్పాదాచార్యాణాం

అధిష్ఠానే సింహాసనాభిషిక్త శ్రీమచ్చంద్రశేఖరేన్ద్రసరస్వతీసంయమీన్ద్రాణాం శ్రీకరకమలసంజాత

శ్రీజయేన్ద్రసరస్వతీ శ్రీపాదానాం శ్రీకరకమల సంజాత శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్రసరస్వతీ శ్రీచరణానాం కర కమలయోః సాష్టాంగప్రణామపూర్వకం సమర్ప్యతే

శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణసంస్కృతమూలాస్మదాంధ్రానువాదగ్రంథరూపో7యంపూజాత్నపుష్పోపహారః

శ్రీ శంకర విజయేంద్ర శ్రీ చరణభ్యః సమర్ప్యతే భక్త్యా

విష్ణుపురాణం ధర్మోత్తర మిద మాంధ్ర్యా మనూదితం మూలేన.

శ్రీ కాంచీ కామకోటి పీఠమునధిష్ఠించి యున్న శ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ శ్రీ చరణుల కీ విష్ణుపురాణ ధర్మోత్తరఖండ మాంధ్రీకరింపబడి, సంస్కృత మూలముతో సమర్పింపబడుచున్నది.

శ్రీ మచ్చంద్ర కిశోరశేఖరయతీం ద్రాజ్ఞాప్రసాదశ్రియా

సాక్షాత్‌ శ్రీశుకతాతపాదమధురోక్తి స్ఫూర్తి సౌందర్యయా

వాణ్యా మాతు రనూదితం మమ పున ర్ముద్రాపితం కేనచి

ద్ధన్యేనాపి పురాణ సత్రయజనే దృష్టం సదసై#్య రపిll

శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ జగద్గురుదేవుల ఆజ్ఞాప్రసాద సంపదగొని శ్రీ శుకాచార్యులంగన్న తండ్రి వ్యాసభగవానుల మధుర భాషణ స్ఫూర్తిచే సొంపుగులుకు మా తల్లిబాష తెలుగులోని కనువదింపబడినది. ఒకానొక ధన్యమూర్తిచే ముద్రింపబడినది ఆష్టాదశ మహా పురాణాంధ్రీ కరణ ప్రచురణరూపమైన యీ సత్రయాగమందలి సదస్యులచే దిలకింపబడినది యీ మహాగ్రంధము.

శ్రీ చంద్రశేఖరేంద్రైః పరమాచార్యై స్తథా నిజాచార్యైః

శ్రీమద్భిశ్చ జయేంద్రై రిద మాలక్షిత మహో! శ్రియా జయతి

మీ పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ జగద్గురు దేవుల చేతను మీ యాచార్యులు శ్రీ జయేంద్ర సరస్వతీ శ్రీ చరణులచేతను ఈ కృతి చక్కగా నాలోకింపబడి పరమ శోభతో సర్వోన్నతమై యలరు చున్నది.

కైశోరే వయసి స్ఫురత్‌ శ్రుతిమహామాత్రా ముహుశ్చుంబనాత్‌

విస్మేరద్యుతిసుందర స్మితమధుస్యందాత్‌ శుకస్యేవ యత్‌

ఆచార్యైః పరమైః కరే సరసిజే సంలాలితం వోముఖం

దృష్ట్వా వత్సలితం తరంగిత మభూత్‌ శ్రీవ్యాసవాణ్యా మనః||

లేతవయస్సున శ్రుతిమాత మఱి మఱి ముద్దు వెట్టుకొనుట వలన విరజిమ్మ తళుకులచే సొంపు గులుకు చిఱునవ్వులను తేనెలంజిందించుచు శ్రీ శుకముఖ మట్లలరుచున్నదియు పరమాచార్యులకరకమలములందు పలాలితమగుచున్న దియునగు మీముఖముంగని వ్యాసభారతిమనసు వాత్సల్య రసోత్త రంగితమైనది.

తాదృక్‌ తే ముఖ మాదిశంకరగురుశ్రీమన్ముఖం జ్ఞాపయ

త్యానీతం, తవ సమ్ముఖే తత ఇదం భాష్యే ప్రమాణీకృతమ్‌

ప్రాధాన్యేన; కృతం త్వదంకిత మహో! విష్ణోః పురాణం ప్రభో!

హస్తే స్వీకురు నః కృతాం ప్రణతిమ ప్యంబాపదే7లంకురు!

అటువంటి మీ ముఖము ఆది శంకర భగవ త్పూజ్య పాదుల కేవల బ్రహ్మ తేజస్సును జిందు నెమ్మోమును మాకు జ్ఞాపకము సేయుచున్నది. కావున వారిచే భాష్యమందు ప్రధానముగా ప్రమాణముగా గైకొనబడిన యీ విష్ణు పురాణము గొనివచ్చి మీకంకిత మొనర్చుచున్నాము. ఈకృతి తామందుకొని దీనిని, మాయొనర్చు ప్రణతినింగూడ జగజ్జనని శ్రీ చంద్రమౌళీశ్వరులదేవి శ్రీమత్త్రిపురసుందరీదేవి పదమునం దలంకరింపుడు! శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

క్రోధన-శ్రావణపూర్ణిమా శుక్రవారే 23-8-1985 ఇతి గురుశిశుః కల్లూరి వేంకటసుబ్రహ్మణ్య దీక్షితః

శ్రీః

ధర్మము - వేదము - పురాణము

ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠాహేతురుచ్యతే | ధర్మ ఏవ. హతో హన్తి ధర్మోరక్షతి రక్షితః ||

సమస్త జగత్తునకు స్థితిహేతువు ధర్మము. ధర్మమును పాటించిన వాని నది కవచము వలె రక్షించును. ఉల్లంఘించిన వానిని నశింపజేయును. కావున ధర్మరక్షణ ద్వారా జగద్రక్షణము కావించుకొనుట మానవధర్మము. ధరింప బడినదై మనలను ధరించు (కాపాడు) దానికేధర్మమని పేరు సార్థకము. అట్టి ధర్మము వేదైకసమధిగమ్యము. వేదము శబ్దరూపము. సమస్త వాఙ్మయ ప్రపంచమునకు మూల మదయే.

ఇద మంధం జగత్‌ సర్వం జాయేత భువనత్రయం | యది శబ్దాహ్వయం జ్యోతిః ఆసంసారం నవర్తతే ll

శబ్ద రూపమగు ఆ జ్యోతి సృష్టికి పూర్వము నుండియు లేనిచో ఈ ప్రపంచమంతయు ఆంధ్రప్రాయమై యుండెడిదని దండి మహాకవి చెప్పనాడు.

యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, యోవై వేదాంశ్చ ప్రహిణోతి తసై#్మll

అను శ్వేతాశ్వతరోపనిషద్వాక్యము వలన- నిత్యసిద్దములైన వేదములను పరమేశ్వరుడు బ్రహ్మకు నుపదేశించినట్లు తెలియుచున్నది.

''అనాది నిధనా నిత్యా వాగుత్సృష్టా స్వయంభువా l అదౌ వేదమయీ దివ్యా యతస్సర్వాః ప్రవృత్తయః ll ''

అను స్మృతి వాక్యము వలన, సమస్త వాఙ్మయోత్పత్తికి కారణమైనదియు ఆద్యంత శూన్యమును నిత్యమును వేదరూపమునునగు దివ్యవాక్కును సృష్టికి ఆదియందు స్వయంభువ బ్రహ్మఆవిష్కరించెను. ఆతడు వేదములకు కర్త మాత్రము కాడు అని తెలియుచున్నది.

''ఋగ్యజు స్సామాధర్వాభ్యాన్‌ వేదాదీన్‌ ముఖతో7 సృజత్‌ l

శాస్త్ర మిజ్యాం స్తుతిస్తోమం ప్రాయశ్చిత్తం వ్యధాత్‌ క్రమాత్‌ ll

ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వం వేద మాత్మనః | స్థాపత్యం చా7 సృజద్వేదం క్రమాత్‌ పూర్వాదిభి ర్ముఖైః ll

ఇతిహాస పురాణాని పంచమం వేద మీశ్వరః l సర్వేభ్య ఏవ వక్త్రేభ్యః ససృజే సర్వదర్శనః ll

అను శ్రీమద్భాగవత తృతీయస్కంధ గత వచనము వలన గూడ వేదా విర్భావము ఆబ్రహ్మనుండియే జరిగినట్లు తెల్లమగుచున్నది.

''అస్య మహతో భూతస్య నిశ్వసిత మేతత్‌ యత్‌ ఋగ్వేదో యజుర్వేదస్సామవేదః'' అను శ్రుతియుపై విషయమునే బలపరచుచున్నది.

వేదము

విశ్వనిశ్శ్రేయస కారణమును ఇతర ప్రమాణవేద్యముకానిదియునగు ధర్మమును బోధించు అపౌరుషేయ వాక్యమునకు వేదమని పేరు. ఆ వేదము మంత్రబ్రాహ్మణభేదమును రెండు భాగములుగానున్నది. అందు మంత్ర భాగము, అనుష్ఠాన సాధనములగు ద్రవ్యములను, దేవతలను బోధించును.

వేదము, ఋగ్వేదము యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని నాలుగు విధములు. ఆ వేదముల పరిమితి పతంజలి భగవానునిచే వ్యాకరణ మహా భాష్యము నందు ఇట్లు చెప్పబడినది.

''ఏకశత మధ్వర్యు (యజుః) శాఖాః, సహస్రవర్త్మా సామ వేదః, ఏక వింశతిధా బాహ్వృచ్యమ్‌(ఋగ్వేదః) నవధా ఆధర్వణో వేదఃl'' 'అని, కాని యిపుడీ శాఖలలోకొన్నిలుప్తప్రాయములు.

బ్రాహ్మ ణము అష్టవిధములు - ''ఇతిహాసః, పురాణం, విద్యా, ఉపనిషదః, శ్లోకాః, సూత్రాణి, వ్యాఖ్యానాని, అను వ్యాఖ్యానాని అసై#్యవనిశ్వసితాని'' అని బృహదారణ్యక శ్రుతి తెలుపు చున్నది.

పురాణము

బ్రాహ్మణాంతర్గతముగ వక్కాణింపబడిన పురాణము, ప్రపంచము యొక్క పూర్వా7 వస్థా ప్రతి పాదకము, వేదార్థ నిరూపకమును నై కరుణాపయోనిధియు సాక్షాన్నారాయణ రూపుడును నగు వేదవ్యాస భగవానునిచే ప్రణీతమునునై పంచ లక్షణ శాస్త్రముగను దశలక్షణ శాస్త్రముగను పేరొందినది.

''యస్మాత్‌ పురాహ్యనక్తీదం పురాణం తేన తత్‌ స్మృతమ్‌''

అని బ్రహ్మాండ పురాణము నందు ప్రక్రియా పాదమునందు పురాణ శబ్ద నిర్వచనము గలదు.

సహోవాచ ఋగ్వేదం భగవో7 ధ్యేమి యజుర్వేదంl సామ వేద మాధర్వణం చతుర్థ, మితిహాస పురాణం పంచమం దేవానాం వేదమితి'' అను ఛాందోగ్యశ్రుతిననుసరించి పురాణములు వేదాత్మకములనుటకు సంశయము లేదు.

''ప్రవృత్తి స్సర్వశాస్త్రాణాం పురాణా దభవత్తతఃl కాలేనా7 గ్రహణం దృష్ట్వా పురాణస్య మహామతిః l

హరి ర్వ్యాస స్వరూపేణ జాయతేచ యుగే యుగే l చతుర్లక్ష ప్రమాణన ద్వాపరే ద్వాపరే సదాl

త దష్టాదశధా కృత్వా భూతులే నిర్దిశత్యపిll

అను బృహన్నారదీయోక్తి వలన ఏకరూపముననున్న పురాణముచే సాక్షాన్నారాయణుడు వేద వ్యాసరూపమున ఆవిర్భవించి పదునెనిమిది పదునెనిమిది గా విభజించెననియు అందువలన మహా పురాణములు 18, ఉప పురాణములు 18 యేర్పడెననియు తెలియుచున్నది. ఇందు కొన్ని మాత్రమే ఉప లద్ధము లగుచున్నవి.

విష్ణు పురాణము

అష్టాదశ మహా పురాణములలో విష్ణుపురాణము మహోత్కృష్టమైనది. ఇది షడంశాత్మకముగనలరారుచున్నది. ఇందు 6412శ్లోకములు గలవు. విష్ణుపారమ్య మిందు వర్ణితము ఇది ఆంధ్రభాషలోనికి అనూదితమై మూలతాత్పర్యములతో ముద్రితమై శ్రీ కాంచీకామకోటి జగద్గురు శంకరాచార్య స్వామి చరణుల కరకమలములందంచితమై భాగ్యనగరస్థ శ్రీవేంకటేశ్వర ఆర్షభారతీ సంస్థచే ఆంధ్ర జనలోకమునకు నిదివరలోనే నందజేయ బడినది.

విష్ణు ధర్మోత్తర మహా పురాణము

విష్ణు పురాణమే విష్ణుధర్మోత్తర మహా పురాణమను పేరునమరిఖండత్రయ రూపమున నున్నది. అందీఖండము ప్రథమము. ఈ ఖండము నందు 269 అధ్యాయములు ద్వితీయఖండమున 183 అధ్యాయములు తృతీయ ఖండమున 355 అధ్యాయములు కలవు.

ప్రథమ ఖండమునందు సృష్టకి ప్రారంభ మందలిబ్రహ్మ యొక్క జననము మొదలుకొని అనేక వంశములు, వ్రతాదులు గాయత్రి మహా మంత్ర ప్రభామము, ఉపాఖ్యానములు, శంకర గీత, నారాయణ కవచము మునులచే నిత్యాను సంధేయ విషయములు మిక్కుటముగ గలవు.

ఈ పురాణమును గురించి నారదీయ మహా పురాణము నందు

అతః పరస్తు సూతేన శౌనకాదిభి రాదరాత్‌ l పృష్టేన చోదితాః శశ్వ ద్విష్ణు ధర్మోత్తరాహ్వయాఃl

నానాధర్మ కథాః పుణ్యాః వ్రతాని నియమా యమాఃl ధర్మశాస్త్రం చార్థశాస్త్రం వేదాంతం జ్యోతిషం తధా l

వంశాఖ్యానం ప్రకరణాః స్తోత్రాణి మనవస్తధాl నానా విద్యాశ్రయాః ప్రోక్తాః సర్వలోకోపకారకాః l

ఏత ద్విష్ణు పురాణంవై సర్వ శాస్త్రార్థ సంగ్రహమ్‌ll

అనిప్రశంస గలదు. అనగా శౌనకాది మునులు ఆదరముతో నడుగగా సూత మహర్షి విష్ణు ధర్మోత్తరములను పేరుగల అనేక ధర్మబోధకములగు కథలు పవిత్రములైన కధలు, వ్రతములు, నియమములు, యమములు, ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, వేదాంతము, జ్యోతిషము, వంశముల కీర్తించుట, ప్రకరణములు, స్తోత్రములు, మనువుల చరిత్ర అనేక విద్యలకు సంబంధించినవి, సర్వలోకములకు ఉపకరించునట్టి విషయములననేకములను చెప్పెను. ఈవిష్ణుపురాణము సర్వ శాస్తార్థ్ర సంగ్రహరూపమైనది.

ధర్మ ప్రధానమగు నిట్టి శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమును శ్రీకాంచీపట్టణ విరాజమాన శ్రీ కామకోటి పీఠాధిప శ్రీ శ్రీ శ్రీ మశ్చంద్ర శేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి కరకమల సంజాత శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి హస్త పద్మసంజాత శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ నవ్య శ్రీ చరణ కరకమలములందు సప్రశ్రయముగను సాంజలి బంధముగను సమర్పించు మహాభాగ్యము శ్రీ సద్గురుదేవుల గురు కృపవలన చేకూరి నందులకు నెంతయు సంతసించు చున్నాము.

శ్రీ కాంచీ కామకోటి పీఠ జగద్గురువుల యొక్కయు శ్రీ శృంగేరి శారదా పీఠ జగద్గురువుల యొక్కయు అమోఘాశీస్సులతో భాగ్యనగరమున శ్రీ పల్లెంపాటి వేంకటేశ్వర్లు గారిచే వ్యవస్థాపితమైన శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతీ ట్రస్టు వారు ఇట్టి మహోత్కృష్ట గ్రంథములను ఆంధ్ర సోదరుల కరకమలములకు అందింప గల్గినందులకు లోకకళ్యాణ మిక్కిలిఆనందించుచున్నారు. ప్రతి ఆంధ్రుడును వీనిని చదివి దానివలన కలిగిన విజ్ఞానమును ఆచరణలో నుంచుకొని సంధాయకులగుచు మా కృషిని సార్థకము చేయుదురుగాక !

ఇతిశమ్‌

బుధ విధేయః

విద్వాన్‌ జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రీ

వ్యాకరణ విద్యా ప్రవీణః సాహిత్య విద్యాప్రవీణః, వేదాంత విశారదః

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters