Sri Vishnudharmottara Mahapuranamu-2
Chapters
పదవ యధ్యాయము - గజలక్షణము పుష్కరః- నాగాః ప్రశస్తా ధర్మజ్ఞ ! ప్రమాణనా7ధికాస్తుయే, | దీర్ఘహస్తా మహోఛ్ఛ్వాసా స్వాసనా శ్చ విశేషతః || 1 నిగూఢవంశా మధ్వక్షా గూఢా గూఢోష్ట మస్తకాః | వింశత్యష్టాధికనఖాః శీతకాల మదాశ్చ యే || 2 యేషాం చైవ వరాః పాదాః దీర్ఘ లాంగూల మేవచ | దక్షిణం చోన్నతం దీప్తం బృంహితం జల దోపమమ్ || 3 అత్యర్థ వేదనా యేచ శూరాః శబ్ద సహిష్ణవః | కర్ణౌ చ విపులౌ యేషాం సూక్ష్మబిందుయుతత్వచః || 4 తే ప్రశస్తా మహాభాగ ! యే తథా సప్త సుస్థితాః | దన్తచ్ఛదేషు దృశ్యన్తే యేషాం స్వస్తిక లక్షణాః || 5 శృంగార వాలవ్యజనం వర్ధమానాంకుశా స్తథా | తే ధార్యా న తథా ధార్యా వామనా మత్కుణాదయః || 6 హస్తిన్యో యాశ్చ గర్భిణ్యో యే చ మూఢా మతంగజాః | అపాకలా శ్చ కుబ్జా శ్చ నద్దంతా యేచ భార్గవ ! 7 కుదన్తా శ్చ తథా వర్జ్యాః వామకూటాశ్చ యత్నత ః | అస్రుస్వృశశ్చ కూటాశ్చ శఠాశ్చ వికటాశ్చయే || 8 పుష్కరుడనియె : ధర్మజ్ఞా! పరుశురామా! పెద్దవి పెద్దతొండములు కలవి దీర్ఘోచ్ఛ్వాసములు గలవి (ముక్కులు) చక్కగ చక్కగ కూర్చుండుట కనువైనవి వెన్నెముక నిగూఢమయియున్నవి తేనెకళ్ళుగలవి గూఢములు గూఢములయిన పెదవులు తలలుగలవి యిరువది యెనిమిది గోళ్ళు కలవి శీతకాలమందెక్కువ మదము గొనునవి పెద్దపాదములు పెద్దతోకగలవి. కాంతిమంతము లైనవియు దక్షిణము మేఘమఱుముంబోలు ఘీంకారము గలిగిన యేనుగులు శ్రేష్ఠములు. శూరములు పెద్దసడి నోర్వగలవి అత్యర్ధవేదనములు (గంబీరవేదులన్నమాట) శ్రేష్ఠములు (గంభీరవేది యేనుగులక్షణములోగడ నీయబడినది) చెవులు చేటలట్లు విపులములై చర్మముపై చిన్న చిన్న బిందువుల (చుక్కలు) గలవి సప్తసుస్థిరములు (సప్తసుస్థిరమనునిదియొక జాతి ) దంతచ్ఛదములందు (పెదవులందు) స్వస్తికము గుర్తు చక్కని వాల వ్యజనము (చామరముగుర్తు) వర్ధమానముగుర్తు అంకుశము గుర్తుగల యేనుగులు త్తమములు, వామనములు మత్కుణాది జాతుల గజములతో నున్న యాగర్భిణులు మూఢములు అపాకలములు = కుబ్జముల (మఱుగుజ్జువి) మక్కిలి పెద్దవి పుప్పిదందములు గలవి వామకూటములు అసృస్పృక్కులు కూటములు శఠములు వికటములు నను నీయేనుగులు నింద్యములు. రామః- వామనాద్యాశ్చ యే నాగాః ప్రోక్తా నిందితలక్షణాః | తేషాం తు శ్రోతు మిచ్ఛామి లక్షణం వరుణాత్మజ || 9 పుష్కరః- ఆయామేన న సంపూర్ణో యో7తి హ్రస్వో భ##వే ద్గజః | వామనస్తు సమాఖ్యాతో మత్కుణో దంత వర్జితః 10 దశాం చతుర్థీం సంప్రాప్య వర్థేతే యస్య న ద్విజౌ | స్థూల వనాయతౌ స్యాతాం స మూడాఖ్యో గజాధమః || 11 అపాకలో విశాలేన దంతే నైకేన వారణః | సంక్షిప్త వక్షోజఘనః పృష్ఠమధ్యసమున్నతః || 12 ప్రమాణహీనతన్నాభిః సకుబ్జో వారణాధమః | అత్యున్నతాంసః సద్దన్తః కుదన్తః స్యాన్నతో బహిః || 13 వామదన్తో న్నతో నాగో వామ కూటశ్చ కధ్యతే | దన్తౌ వక్త్ర స్పృశౌ యస్య సో 7 శ్రస్పృక్ కధితో గజః || 14 ఏక దన్త స్తథా నాగః కూట ఇత్యభి ధీయతే | పాదయోః సన్ని కర్షస్స్యా ద్యస్య నాగస్య గచ్ఛతః || 15 స శఠో7ధ్వని యుద్ధే చ లక్షణజ్ఞైర్న పూజితః | అరత్న్యభ్యధికం యస్య విస్తరేణ స్తనాంతరమ్ || 16 వికట స్స వినిర్దిష్టో దుర్గతి ర్నిందితో గజః | రామః- శ్రోతు మిఛ్ఛామి ధర్మజ్ఞ ! కుంజరం సప్తసుస్థితమ్ || 17 యంప్రాప్య కిల రాజానో జయన్తి వసుధాం నృపాః | పుష్కరః- వర్ణం సత్వం బలం రూవం కాన్తి స్సంహననం జవమ్ | సపై#్తతాని సదా యస్య స గజః సప్తసుస్థితః || 18 యేషాం భ##వే ధ్దక్షిణ పార్శ్యభాగే రోవ్ణూంచ పుంజః పిటకో7ధవాపి | తే నాగ ముఖ్యా విజయాయ యుద్ధే భవన్తి రాజ్ఞాం నహి సంశయో7త్ర || ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే హస్తిలక్షణం నామ దశమో 7 ధ్యాయః. వామనాదులు నిందితములని యిప్పుడు మీరు పేర్కొన్నయాయా జాతిత యేనుగుల లక్షణము వినవలయునన పుష్కరుండిట్లనియె. పూర్తిపొడవులేనిది వామనము. దంతములు లేనిది మత్కుణము. నాల్గవ పదివయస్సు వచ్చిన తరువాత (40 యేట నుంచి దేని దంతములు పెఱుగవో, యవి మిక్కిలి లావుగామాత్రమేయుండి పొడవుగలవి గాకుండనో యాయేనుగును మూఢజాతి యేనుగనబడును. అపాకల మనుబూ తిగజము దీనికి ఒక్కటే పొడవైన దంతముండును. రొమ్ము పిఱుదు సంక్షిప్తముగా నుండును. నొక్కవడియందు) పృష్ఠమధ్య మెత్తుగా నుండును కుబ్జమను నధమ జాతి యేనుగు బొడ్డుకొలతకు మించియుండును. సద్దంతము మిక్కిలి ఎత్తైన మూపురముగలది. కుదంతము (బహిః) నతము వంగి యుండును. వామ కూటము మిక్కిలి ఎత్తగనుండును వామదంతమనికూడ దానినందురు. అశ్రుస్పృక్కు జాతియేనుగు దంతములు ముఖముందాకు చుండును కూటము = ఒకేదంతముగలది. దారి నడచునపుడు యుద్ధమునందు నడుగులు రెండు (సన్నికర్షములగునేని) కలియుచుండునేని యా యేనుగు శఠము. ఆశఠజాతి యేనుగును లక్షణజ్ఞులు పూజింపరు. వికటజాతి యేనుగుకు స్తనముల నడిమి యెడము అరత్నికంటె మించియుండును. దానిగతి (నడక) బాగుండదు. (దుర్గతి) అది నిందితము. అనవిని పరశురాముడు సప్తసుస్థితమంటివి అట్టికుంజరమేదియన పుష్కరుండు వేని యొక్క కుడిప్రక్క భాగమున రోమపుంజముగాని పిటకము = కాయ యుండునో యాయేనుగులు రాజులకు యుద్ధములందు జయము గూర్చును. ఇందు సందియములేదు. ఇతి శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున గజలక్షణమను పదియవ అధ్యాయము.