Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట ముప్పదిఏడవ అధ్యాయము - వృక్ష వైకృత్య శాంతి

గర్గః -పురేషు యేషు దృశ్యన్తే పాదపా దైవచోదితాః | రుదన్తోవా హసన్తోవా స్రువన్తోవా బహూన్‌ రసాన్‌ ||

పురోగవా వినా వాసం శాఖాం ముంచంత్య సంశ్రమాత్‌ | ఫలపుష్పం తధా బాలాదర్శయన్తి త్రిహాయనాః ||

సర్వావస్థాం దర్శయాన్తి ఫలపుష్ప మధాభవమ్‌ | క్షీరం స్నేహం సురాం రక్తం మధుతోయం స్రవన్తిచ ||

గర్గాచార్యులనిరి. పురములందు చెట్లు దైవ ప్రేరణచే నేడ్చును, నవ్వును, పెక్కు రసములు స్రవించును, గాలివేయకుండనే కదలిపోవును, కొమ్మలు విరిగి పడును, మూడేండ్లు, లేతమొక్క పూలు పండ్లును బ్రదర్శించును. పుష్ప ఫలాదులతోడి సర్వవిధావస్థలం బ్రదర్శించును. పాలు, నూనె, కల్లు, రక్తము, తేనె, నీళ్ళును, గార్చును.

శుష్య న్త్యరోగాః సహసా శుష్కారోహన్తి వా పునః | ఉత్తిష్ఠన్తీహ పతితాః పతన్తిచ తధోత్థితాః ||

తత్ర వక్ష్యామి తే బ్రహ్మన్‌ ః విపాకే ఫలమేవ చ | రోదనే వ్యాధి మాఖ్యాతి హసనే దేశవిప్లవమ్‌ ||

శాఖా ప్రపతనే కుర్యా త్సంగ్రామే యోధపాతనమ్‌ | బాలానాం మరణ కుర్యాద్భాలానాం ఫలపుష్పతా ||

రోగము లేకుండ హఠాత్తుగ నెండి పోవును. ఎండినవి తిరిగి మొలచును. పడిపోయినవి లేచును. లేచినవి పడిపోవును. బ్రహ్మణ్య! అట్టి అద్భుత విపాకమునందేర్పడు ఫలము తెల్పెద. చెట్లేడ్చిన వ్యాధి-నవ్వినచో దేశోవిప్లవము. కొమ్మలు విరిగి పడినచో యుద్ధమునందు యోధులు పడిపోవుదురు. లేత మొక్కలు పూచిన పండినను బాల మరణాలు కల్గును.

స్వరాష్ట్ర భేదం కురేత ఫలపుష్ప సనాతనమ్‌ | క్షయం సర్వత్రగేక్షీరే స్నేహే దుర్భిక్ష లక్షణమ్‌ ||

వాహనాప చయం మద్యేర క్తే సంగ్రామమా దిశేత్‌ | మధుస్రావే భ##వేద్వ్యాధి ర్జలస్రావేణ వర్షతి ||

అరోగ శోషణా జ్ఞేయం బ్రహ్మన్‌ః దుర్భిక్ష లక్షణమ్‌ | శుష్కేషు సంప్రరోహత్సు వీర్య మన్నంచ హీయతే ||

పూలు పండ్లూరక రాలినచో రాష్ట్రభంగము గల్గును. పాలుగారిన జనక్షయము, నూనె గార్చిన దుర్భిక్షము, మద్యము కారిన వాహన క్షయము, రక్తముగారిన యుద్ధభయము, తేనె కారిన వ్యాధి, నీరు కారిన వర్షభయమును జెప్పవలెను. రోగములేకుండ నెండినచో దుర్భిక్షము (కఱవు) ఎండినవి చిగిరించిన వీర్యము అన్నము క్షీణమగును.

ఉత్థానే పతితానాం చ భయం భేదకరం భ##వేత్‌ | స్థానాత్థానా త్తురంగాణాం దేశభంగం తధా దిశేత్‌ ||

జల్పత్స్వపిచ వృక్షేషు రుదత్స్వపి ధనక్షయం | ఏతత్‌ పూజ వృక్షేషు సర్వం రాజ్ఞో విపచ్యతే ||

పుష్పే ఫలే వా వికృతే రాజ్ఞో మృత్యుం తదా దిశేత్‌ | అన్వేషు చైవం యుక్తేషు వృక్షోత్పాతే ష్వతంద్రితః ||

ఆచ్ఛాదయిత్వాం తం వృక్షం గంధమాల్యై ర్విభూషయేత్‌ | వృక్షోపరి తధా ఛత్రం కుత్తాప ప్రశార్షాన్తయే ||

పడిపోయినవి లేచినచో భేదమును కల్గించు భయమును, గుఱ్ఱములు తమతమ స్థానముల నుండి లేచినచో దేశభంగమును చెప్పవలెను. చెట్లు వాగినను ఏడ్చినను రాజునకు ధనక్షయము. ఇదంతయు పూజార్హములయిన చెట్లయందు కనిపించినచో నీ ఫలము రాజు నెడల విపాకము సెందును. పువ్వునందు పండునందేదేని వైకృత్యము గనిపించినచో రాజునకు మృత్యువని చెప్పవలెను. ఇట్లు తీర వృక్షములందు గూడ యిట్టి ఉత్పాతములు గోచరించినపుడు తొట్రు పడకుండ నియమవంతుడై ఆ చెట్లును కప్పివేసి గంధ మాల్యాదులతో నలంకరించి తాపప్రశాంతి నిమిత్తముగ నా చెట్టు పైగొడుగు పట్టవలెను.

శివ మభ్యర్చయే ర్దేవం పశుం చైసై#్మ నివేదయేత్‌ | మూలేభ్య ఇతి షణ్మాసాన్‌ హుత్వా రుద్రీం జపేత్తధా ||

మధ్వాజ్య యుక్తేన తు పాయసేన సంపూజ్య విప్రాంశ్చ భువం చ దద్యాత్‌ |

గీతేన నృత్యేన తధార్చయేత దేవం భవం పాపవినాశ హేతోః ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే వృక్షవైకృత్య శాంతి వర్ణనం నామ సప్తత్రింశదుత్తర శతతమోధ్యాయః

శివార్చనసేసి స్వామికి పశువును నివేదింపవలెను. "మూలేభ్యః" అనురౌద్రిని రుద్రదేవతాకమయిన మంత్రమును జపించి యాఱునెలలు హోమము సేయవలెను. తేనె నెయ్యితోడి పాయసముతో విప్రులను బూజించి వారికి భూదానము సేయవలెను. గీత నృత్యాదులతో దేవదేవుని భవుని పరమశివుని పాపము పోవుటకు నర్చింప వలెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున వృక్షవైకృత్యశాంతివర్ణనము అను నూట ముప్పదియేడవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters