Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట నలుబది ఒకటవ అధ్యాయము - వైకృతోపశమన వర్ణనము

గర్గః- బడబా హస్తినీ గౌర్వా యదియుగ్మీం ప్రసూయతే | విజాతం వికృతం వాపి షడ్భిర్మాసై ర్మ్రియేతవై ||

వియోనిషు చ గచ్ఛన్తో మైధునం దేశనాశనాః | అన్యత్ర వేసరోత్పత్తేః నృణాం చాజాతి మైధునమ్‌ ||

గర్గాచార్యు లిట్లనిరి. గుఱ్ఱము, ఏనుగు, ఆవుగాని జంటను (కవలలను) విరుద్ధ జాతిని వికృత సంతానమును నీనునేని యాఱు మాసములలో నాగుఱ్ఱము మొదలగునవి చనిపోవును. లేదా రాజు చనిపోవుననియుం గావచ్చును. వ్యతిరేక యోనులందు మైధునము సేసిన దేశనాశనమగును. కంచర గాడిదలకుతప్ప నితరజాతులతో (పశువులతో ) ఆజాతి మైధునము చేయుట దేశారిష్టము. ఇది కేవలం జంతు విషయమే కాదు మానవజాతి విషయమున గూడ.

సర్పమూషక మార్జార మత్స్య శ్వాన వివర్జితాః | జ్ఞేయా దుర్భిక్ష కర్తారః స్వజాతి పిశితాశినః ||

అకాలజం మదం ఘోరం చతుష్పా న్మృగ పక్షిణామ్‌ | అన్య జాతి వదేతచ్చ ధైన్వం శ్వాసం విశేషతః ||

అమానుషా మానుషవ జ్జల్పన్తిప్రాణినో యధా | వికృతా వా ప్రసూయన్తే పరచక్రాగమం వదేత్‌ ||

పాములు ఎలుకలు పిల్లులు చేపలు కుక్కలు తప్ప మిగిలిన జంతువులు తమ జాతి మాంసము దిన్నచో దుర్బిక్షము (కఱవు) వచ్చును. చతుష్పా జంతువులకు పక్షులకు అకాలమందు ఘోరమైన మదము (కామ ప్రవృత్తి) కలిగినచో, అన్యజాతి మైధునమట్టిది కూడ కఱవునకు గారణము. ఆవు కుక్కలకు ఇది కల్గినచో నది విశేష దుష్ట ఫలమిచ్చును.

త్యాగో వివాసనం దానం తేషాం కార్యం విజానతా | తర్పయే ద్బ్రాహ్మణాం శ్చాత్ర జపహోమాంశ్చ కారయేత్‌ ||

మృదంగ వాద్యైః పటహైః సంగీతైః | పూజా చకార్యాత్రిదివౌకసాం వై ||

ధాతు స్తధేజ్యా విధినా చ కార్యా | దేయం తధాన్నం బహుశో ద్విజేభ్యః ||

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే వైకృతోపశమనంనామ | ఏకచత్విరింశదుత్తర శతతోమోధ్యాయః ||

మనుష్యేతర ప్రాణులు మనుజలట్లు మాట్లాడు నేని వికృత ప్రసవములగునేని శత్రుభయము గల్లు ననవలెను. అట్టి వానిని విడిచిపెట్టుట వెళ్లగొట్టుట లేక యేరికేని ఇట్టివేయుటయు కర్తవ్యము. ఈ సందర్భములో బ్రాహ్మణ సంతర్పణము జపహోమాదులు నొనరింప వలెను. మృదంగ పటహాది వాద్యములు సంగీతములతో దేవతా పూజ సేయవలెను. బ్రహ్మనుద్దేశించి యాగము సేయవలెను. ఆవిధంగా ద్విజులకు మృష్టాన్న సంతర్పణము జేయవలెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున వైకృతోపశమన వర్ణనమను నూటనలుబదియొకటవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters