Sri Vishnudharmottara Mahapuranamu-2
Chapters
పదునెనిమిదవ యధ్యాయము - రాజభిషేకకాలనిర్ణయము పుష్కరః ఇతి సంభృత సంభారో రాజ్ఞ స్సాంవత్సర స్తధా | కాలే7భిషేచనం కుర్యాత్తం కాలం కథయామి తే ||
1 మృతేరాజ్ఞి న కాలస్య నియమో7త్ర విధీయతే | తత్రా7స్య స్నపనం కార్యం విధివ త్తిలసర్షపైః ||
2 ఘోషయిత్వా జయం చాస్య సాంవత్సర పురోహితౌ | అన్యాసనో పవిష్టస్య దర్శయేతాం జనం శ##నైః || 3 స సాంత్వయిత్వా స్వజనం ముక్త్వా బంధనగాన్ తథా | అభయం ఘోషయిత్వా చ కాలకాంక్షీ తథా భ##వేత్ || 4 పుష్కరుడనియె: ఈ రీతిని సంభారములు సమకూర్చుకొని జ్యోతిషికుడు సుముహూర్తమందు రాజున కభిషేచనము జరుపవలెను నీకాసమయము నెఱిగించెద. రాజు దివంగతుడైనపుడు కాలనియమము లేదు. అప్పుడభిషిక్తుడు గావలసిన రాజునకు నువ్వులతో నావాలతో స్నానము సేయింపవలెను. సాంవత్సరపురోహితులిద్దరు నీతనికి జయముసాటింపజేసి వేరొకయాసనమందు గూర్చుండ జేసి ప్రజలను దర్శింప జేయవలెను. ఆ రాజు స్వజనమును ఓదార్చి బంధమునున్న వారిని విడిపించి అందరకు అభయమును జాటింపజేసి యభిషేకలగ్నమును గనిపెట్టుకొని యుండలెను. నా7భిషేచ్యో నృపశ్చైత్రే నా7ధిమాసే చ భార్గవ! | న ప్రసుప్తే తధా విష్ణౌ విశేషా త్ప్రావృష ద్విజ! || 5 నచ భౌమదినే రామ! చతుర్ధ్యాం న తధైవ చ | నవమ్యాం నా7భిషేక్తవ్య శ్చతుర్దశ్యాం చ భార్గవ! || 6 ధ్రువాణి వైష్ణవం శాక్రం హస్తపుష్యే తథైవ చ | నక్షత్రాణి ప్రశస్యన్తే భూమిపాలా7 భిషేచనే || 7 నాగ శ్చతుష్పదం విష్టిః కింస్తుఘ్న శ్శకుని స్తధా | కరణాని న శస్యన్తే వ్యతీపాతదినం తథా|| 8 నక్షత్ర ముల్కాభిహత ముత్పాతాభిహతం తథా | సౌరసూర్య కుజా క్రాంతం పరివిష్టిం చ భార్గవ! || 9 ముహూర్తా శ్చోక్తనక్షత్రాః సతం మానహితప్రదాః | కుజహోరా తధా నేష్టా సర్వత్ర కులిక స్తథా || 10 వృషో7ధ కీటసింహౌ చ కుంబో లగ్నేచ శస్యతే | ఏతేషాం జన్మలగ్నాభ్యాం యస్స్యా దుపచయస్థితః || 11 తారా ద్వితీయా షష్ఠీ చ చతుర్ధీ చాష్టమీ చ యా | నవమీ చ తధా శస్తా అనుకూలశ్చ చంద్రమాః || 12 సౌమాః కేంద్రగతాః లగ్నాః శుభాశ్చైవ త్రికోణయోః | పాపా శ్చోపచయస్థానే శస్తో లగ్నే దివాకరః || 13 లగ్నేనవాంశః క్షితిజస్య వర్జ్యో వర్గ స్తథా తస్య మహానుభావ! | సూర్యస్య వర్గ స్సకలః ప్రశస్తో రాజ్ఞో7భిషేకే సగ్రహో నృపాణామ్ || 14 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే అభిషేకకాలనిర్ణయోనామ అష్టాదశాధ్యాయః. చైత్రమందు అధికమాసమందు విష్ణువు శయనించిన చాతుర్మాస్యలయందు విశేషించి వర్షర్తులోను, మంగళ వారమందు చవితి నవమి చతుర్దశి తిధులందు పట్టాభిషేకము గూడదు. ధ్రువనక్షత్రములు వైష్ణవము (శ్రవణము) ఇంద్ర దేవతాకము (జ్యేష్ఠ) హస్తవుష్యమియు ప్రశస్తములు, నాగము చతుష్పదము విష్టి కింస్తుఘ్నము శకుని యనుకరణములు నిషిద్ధములు. వ్యతీపాత దినము దుష్టము. కొఱవులు వడిన నక్షత్రము ఉత్పాతదూషిత నక్షత్రము శని సూర్యకుజులాక్రమించినది పరివిష్టియు నింద్యములు. పట్టాభిషేకమునకు చెప్పబడిన ముహూర్తములను నక్షత్రములు సత్పురుషులగు రాజులకు గౌరవప్రదములగును. కుజహోరలో నభిషేచనము కూడదు. కుళికము ఎప్పుడు కూడదు. వృషభము కర్కటకము సింహము కుంభము నను లగ్నము లుత్తమములు వీనికి జన్మలగ్న చంద్రలగ్నములలో దేనితోనుపచయమున్న నాలగ్నము మంచిది. తారాబలములతో రెండవది సంపత్తార ఆరవది సాధనతార నాల్గవది క్షేమతార ఎనిమిదవది మిత్రతార తోమ్మిదవది పరమ మైత్రతారయు అనుకూల చంద్రుడు శ్రేష్ఠములు. కేంద్రములందు సౌమ్యగ్రహములు త్రికోణములందు శుభగ్రహములు పచయ స్థానములందు పాపగ్రహము రవి లగ్నమందుడెనేని యా లగ్నము ప్రశస్తము. లగ్నమందున కుజనవాంశము కుజవర్గమయినను నిషిద్ధము. సూర్యవర్గమంతయు ప్రశస్తమే. ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున రాజాభిషేకకాలనిర్ణయమను పదునెనిమిదవ అధ్యాయము. * వి.ధ.పు-75