Sri Vishnudharmottara Mahapuranamu-2 Chapters
నూట ఎనుబదిరెండవ అధ్యాయము - ధనుర్వేద విద్యావర్ణనము
పుష్కర ఉవాచ :-
ఖడ్గ ప్రయోగములు 32
భ్రాంతముద్భ్రాంత మావిద్ధ మాప్లుతం నిఃసృతంసృతమ్ | సంపాతం సముదీర్ణం చ సేనాపాత మనాకులమ్.
ఉద్ఘాత మవధూతం చ సవ్యదక్షిణ మేవ చ | అనాలక్షితవిస్ఫోటౌ కరాలేంద్రమహాముఖౌ.
వికరాల విపాతౌ చ విభీషణభయంకరౌ | సమగ్రాం వా తృతీయాం వా పాదపాదావజారిజాః.
ప్రత్యాలీఢ మనాలీఢం వరాహ లులితం తథా | ఇతి ద్వాత్రింశధా జ్ఞేయా ఖడ్గా శ్చర్మ విధారణాః.
ఖడ్గ ప్రయోగములు
పుష్కరుడనియె. భ్రాంతము ఉద్భ్రాంతము మొదలుగ ఖడ్గ విధారణములు=కత్తిగొనిచేయు ప్రక్రియలు - ముప్పదిరెండు
ప్రాసప్రయోగములు 5
ఋజ్వా యత విశాలం చ తిర్యఙ్నమితమేవ చ | పంచ కర్మ వినిర్దిష్టం వ్యస్త్రే ప్రాసం మహాత్మభిః.
శూల ప్రయోగములు 6
ఛేదనం తర్జనం పాతో భ్రమణం భ్రామణం తథా | వికర్తనం కర్తనం చ చక్రభ్రమణ మే చ.
(ఈటె) -: ప్రాసప్రయోగములు :-
ఋజువు ఆయతము విశాలము తిర్యక్కు నమితమునను పేరి అస్త్రప్రయోగమెరుగని వానికి ప్రాసప్రయోగమైదురకములుగా మహాత్ములచే జెప్పబడినది. ప్రాసమనగా (?)
ఆస్ఫోట క్ష్వేడనం భేద స్త్రాసోల్లాసితకౌ తథా | శూలకర్మణి జానీహి షష్ఠమాఘ్రాతసంజ్ఞితమ్.
తోమర ప్రయోగములు 4
దృష్టిఘాతం భుజాఘాతం పార్శ్వఘాతం చ భార్గవ | ఋజ్వావక్షేపమాఘాతం తోమరస్య ప్రకీర్తితమ్.
గదా ప్రయోతములు 12
సంహతావితతం వామం గోమూత్రం కమలావిలమ్ | తతో7ర్ధభాగనమితం వామ దక్షిణ మేవ చ.
వ్యావృత్తం చ పరావృత్తం పాదోద్ధూత మవిప్లుతమ్ | హంసమార్గ విమార్గే చ గదాకర్మ ప్రకీర్తితమ్.
పరశుప్రయోగాః 6
కరాలమకపాతం చ ద శోప ప్లమేవ చ | క్షిప్తం హస్త స్థితం శూన్యం పరశోస్తు వినిర్దిశేత్.
ముద్గరలగుడ ప్రయోగాః 3
తాడనం ఛేదనం రామ! తథా చూర్ణన మేవ చ | ముద్గరస్య తు కర్మాణి లగుడస్యచ తాన్యపి.
-: శూల ప్రయోగములు :-
భేదనము తర్జనము పాదము భ్రమణము భ్రామణము వికర్తనము కర్తనము ననునవి చక్రభ్రమణ ప్రక్రియలు ఏడు. ఆస్ఫోటము క్ష్వేడనము భేదము త్రాసము ఉల్లాసితకము ఆఘ్రాతము నననవి శూలప్రయోగములారురకముయి.
తోమర (చిల్లకోల) -: ప్రయోగములు :-
దృష్టిపాతము భూజాఘాతము పార్శ్వఘాతము ఋజ్వానక్షేపము ఆఘాతము ననునవి తోమర ..... ......
ప్రయోగ ప్రక్రియలారు. గదాప్రయోగ ప్రక్రియలు 12. సంహతావితతము వామములు గోమూత్రము కమలావిలము అర్ధభాగనమితము వామదక్షిణము వ్యావృత్తము పరావృత్తము పాదోద్ధూతము అవిప్లుతము హంసమార్గము ననునవి పండ్రెండు.
-: పరశు (గండ్రగొడ్డలి) ప్రయోగములు :-
కరాలము పాతము దశోపప్లవము క్షిప్తము హస్తస్థితము శూన్యము ననునవి పరశు (గండ్రగొడ్డలి) యొక్క ప్రయోగ భేదములారు.
ముద్గరము - లగుడము - యొక్క ప్రయోగము
తాడనము ఛేదనము చూర్ణనము ననునవి ముద్గరము - లగుడము = దుడ్డుకఱ్ఱ యొక్క ప్రయోగములు మూడు.
-: పట్టిస ప్రయోగః :-
అన్త్యమధ్యం పరావృత్తం నిదేశార్థం తథైవ చ | వజ్రసై#్య తాని కర్మాణి పట్టిసస్య తథైవహి.
-: కృపాణీ ప్రయోగః :-
హరణం ఛేదనం ఘాతో భేదనం రక్షణం తథా | కృపాణీకర్మ నిర్దిష్టం పాతనం స్ఫోటనం తథా.
-: క్షేపణీ ప్రయోగః :-
త్రాసనం రక్షణం ఘాతం తలోద్ధరణ మాయతమ్ | క్షేపణీకర్మ నిర్దిష్టం యంత్రకర్మైతదేవతు.
-: గదా ప్రయోగములు :-
సంత్యాగ మంగమర్దం చ వరాహోద్ధూతకం తథా | హస్తార్ధం హస్తపాలీన మేక హస్తార్ధ హస్తకమ్.
ద్విహస్త బాహు పాశే చ కోటిరేచితకోద్దతే | ఉరోలలాట ఘాతే చ భుజాది వసనం తథా.
కరో ద్ధూత విమార్గం చ పాదాహతి విపాదకమ్ | గాత్ర సంశ్లేషణం కాంతం తథా గోవిధి పర్యయమ్.
ఊర్ధ్వ ప్రహారం ఘాతం చ గోమూత్రం సవ్యదక్షిణమ్ | పాదసంచారకం గండం కబరీబంధ మాకులమ్.
తిర్యగ్గత మపా మార్గం భీమవేగం సుదర్శనమ్ | సింహక్రాంతం గజక్రాంతం వృషభా7క్రాంతమేవ చ.
గదాకర్మ విజానీయా ద్ధనుర్వేద విశారదః |
-: నియుద్ధ ప్రయోగాః :-
ఆకర్షణం వికర్షంచ బాహునామనమేవ చ.
గ్రీవావిపరి వర్తం చ పృష్ఠభంగం సుదారుణమ్ | పర్ణాసనం విపర్యాసః పశుపార మజావికమ్.
పాదప్రహార మాస్ఫోటం కవిరేచితకం తథా | గాత్రశ్లేషం కంఠగతం మహీత్యాజన మేవ చ.
ఉరోలలాట ఘాతం చ విస్పష్టకరణం తథా | ఉద్ధూత మవధూతం చ తిర్యఙ్మార్గ గతిం తథా.
గజస్కంధ మవక్షేప మవాఙ్ముఖకమేవ చ | దేవమార్గ మధోమార్గ మమార్గ గమనా కులమ్.
ముష్టిఘాత మవక్షేపో వసుధా ధారణం తథా | జాను బంధం భుజాబంధం ఊరుబంధం సుదారుణమ్.
సంసృష్టం సోదరం శుభ్రం భుజావేల్లితమేవ చ | నియుద్ధకర్మ జానీయా న్ని యుద్ధకుశలో జనః.
ప్రధాన కర్మాణి తవేరితాని | న్యస్తప్రధానే పురుషప్రవీర;
నామాని రూపాణి భవంతి తాని | జ్ఞేయాని సర్వాణి యథానురూపమ్.
ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే ధనుర్వేద విద్యావర్ణనో నామ ద్వ్యశీత్యుత్తర శతతమో7ధ్యాయః.
-: వజ్ర - పట్టిస - ప్రయోగములు :-
అంత్యమధ్యము వరావృత్తము నిదేశార్థము అనునవి వజ్రము - పట్టిసము - ఖడ్గభేదము - అడ్డుకత్తి - యనువాని ప్రయోగములు.
-: కృపాణీ ప్రయోగములు :-
హరణము ఛేదనము ఘాతము భేదనము అనునవి.
-: క్షేపణీ ప్రయోగములు :-
క్షేపణి=భిండివాలము - విడిసివాటు గలదియు త్రాసనము రక్షణము ఘాతము తలోద్ధరణము అయతము యంత్ర కర్మ యంత్రముచేత జేయవలసినవియునివే.
-: గదా ప్రయోగములు :-
సంత్యాగము అనునది మొదలు వృషభాక్రాంతముదాక.
-: గదా ప్రయోగ ప్రక్రియలు :-
ఆకర్షణము మొదలుగ భుజావేల్లితమనుదానిదాక నియుద్ధ ప్రక్రియలు (జెట్టీపట్లు కుస్తీపట్లు నవివీనినందురు.) ఓ వీర పురుష! ప్రధాన కర్మలివి లీ ప్రక్రియముల నీకు జెప్పితిని. పేర్లువానిరూపములు యథానురూపముగ దెలియనగును.
ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమున ద్వితీయఖండమున ధనుర్వేదవిద్యావర్ణనమను నూటయెనుబదిరెండవ అధ్యాయము.