Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఇరువదిఏడవ యద్యాయము -అగదనిరూపణము

రామః-రక్షోఘ్నాని విషఘ్నాని యాని కార్యాణి భూభుజా | అగదాని సమాచక్ష్వ తాని ధర్మభృతాం వర! || 1

పుష్కరః- బిల్వాఢకీ యవక్షార పాటలీ బాహ్లి కోషణాః | శ్రీపర్ణీ సల్లకీ యుక్తా నిష్క్వాథః ప్రోక్షణం పరమ్‌ || 2

స విషం ప్రోక్షితం తేన సద్యో భవతి నిర్విషః | యవ సైంధవ పానీయ వసు శయ్యా7సనౌదనమ్‌|| 3

కవచా7భరణ చ్ఛత్ర వాలవ్యజన మేవ చ | శైలూ పాటల్యతివిషా శిగ్రు గోపీ పునర్నవాః || 4

ససంగా వృక్షమూల త్వక్కపిత్థం వృక్షశోణితమ్‌ | సహ దంత శఠం తద్వ త్రోక్షణం విషనాశనమ్‌ || 5

లాక్షా ప్రియంగు మంజిష్టా సమంగాః సహరేణుకా | సయష్ట్యాహ్వ మధూపేతా బభ్రు పిత్తేన కల్కితాః|| 6

నిఖినేత్‌ గోవిషాణాస్థా సప్తరాత్రం మహీతలే | తతః కృత్వా మణిం హేమ్నా బద్ధం హస్తేన ధారయేత్‌ |7 7

సంస్పృష్ట స్సవిష స్తేన సద్యోభవతి నిర్విషః| మనోహ్వల శమీపుష్ప త్వజ్నిశా సర్షపాః|| 8

కపిత్థ కుష్ఠ మంజిష్టా పిత్తేనః శ్లక్ష కల్కితాః | ధనో గవః కపిల్లాయాః సౌమ్యాఖ్యో7యం పురో గదః || 9

విషజి త్పరమః ప్రోక్తో మణి రత్రచ పూర్వపత్‌ | మూషక జిరకా చాపి హస్తే బద్ధా విషాపహా|| 10

పరుశురాముడు రక్షోఘ్నములు విషహరములునైన కృత్యములకు మందులను తెలపుమన పుష్కరుడిట్లనియె. మారేడు అఢకి యవక్షారము పాటలి బాహ్లికము ఊషణము శ్రీపర్ణి సల్లకి వీని నిష్కాథము (కషాయము) తో ప్రోక్షించిన విషము విరుగును. యవ- సైంధవలవణ పానీయ వసు శయ్యాసన-ఓదనములు కవచము అభరణములు ఛత్రము వాలవ్యజనము శైలు పాటలి అతి విష గోపి గలిజేరు సంగా వృక్షమూలము పట్ట వెలగ వృక్షశోణితము దంతశరముతో గలిపి ప్రోక్షణము సేసిన విషము నశించును. లక్క ప్రియుంగుపు మంజిష్ట మంగము రేణుక యష్టియును మధువుతో గలిపి బభ్రుపిత్తముతో గూర్చి దానిని ఆవు కొమ్ములో పెట్టి ఏడు రాత్రులు భూమిలో పాతిపెట్టి అవ్వల దానిని బంగారముతో పొదిగి చేతం ధరింపవలెను. దానిచే విషస్పర్శనందినవాడు నిర్విఘుడగును. మనోహ్వల శమీ పుష్టి త్వక్కులతో పసుపు తెల్ల ఆవాలు కపిత్థ--వెలగ కుష్ట-మంజిష్ట కలిపి పిత్తముతో గూర్చి నునుపుగా దయారుచేసిన మణి యీ మున్ను చెప్పినట్లు చేసి ధరించిన విషహరమగును. ముందటి దాని వలెనే యా మణియు విషహారము. మూషక జిరక అనుదానిని చేతికి కట్టుకొన్న విషము హరించును.

హరేణు మాంసీ మంజిష్టా రజనీ మధుకం మధు | అక్షత్వక్సురసం.............శ్వపిత్తం పూర్వవర్మణి|| 11

వాదిత్రాణ పతాకాశ్చ విష్టై రేతైః ప్రలేపితాః | శ్రుత్వా దృష్ట్వా సమాఘ్రాయ సద్యో భవతి నిర్విషః|| 12

తత్పూషణం పంచలవణం మంజిష్టా రజనీ ద్వయమ్‌ | సూక్ష్మైలా త్రివృతా7పత్రం విడ జ్గానీంద్ర వారుణీ || 13

మధుకం చేతి సక్షౌద్రం గోవిషాణౖ ర్నిధాపయేత్‌ | తస్మా దుష్ణాంబునా మాత్రాం ప్రాగుక్తాం యోజయే త్తథా|| 14

విషం భుక్తం జరాం యాతి నిర్విషో7పి న దోషకృత్‌ | సంతు సర్జరసోశిర సర్షపా7పత్ర వాలుకైః || 15

సవేల్లా రుష్కర పురైః కుసుమై రర్జునస్య చ | ధూపో వాసో గృహే హన్తి విషం స్థావర జంగమమ్‌ || 16

న తత్ర కీటాః న విషాః దర్దురా న సరీసృపాః | న కృత్యాః కర్మ నా7న్యచ్చ ధూపో7యం యత్ర దహ్యతే || 17

కల్కితైః శ్చందన క్షీర పలాశ ద్రుమ వల్కలైః | పూర్వైల వాలు సురసా నాకులీ తండులీయకైః || 18

క్వాథః సర్వోద కార్యేషు కాకామాచీ జలై ర్వృతః | రోచనాపత్ర నైపాలీ కుంకుమై స్తిలకం వహన్‌|| 19

విషం న బాధతే స్యాచ్చ నర నారీ నృప ప్రియః | చూర్ణైర్హరిద్రా మంజిష్టాకిణిహీకణ నింబకైః|7 20

జిఘ్ర న్నిర్విషతా మేతి గాత్రం సర్వవిషార్ధితమ్‌ | శిరీషస్య ఫలం పత్రం పుష్పం త్మఙ్మల మేవ చ|| 21

గోమూత్రపిష్టో హ్యగదః సర్వ కర్మకరః స్మృతః | ఏతా వీరమహౌషధ్యః శృణు చా7తః పరం ద్విజః|| 22

వంధ్యా కర్కోటకీ రామ ! విష్ణు క్రాన్తా తధోత్కటా | శతమూలా శతానందా బలా స్ఫోటా పటోలికా || 23

సోమా పిండా నిశా చైవ తథా దగ్ధరుహా జయా | స్థలే కమలినీ యా చ పింగళీ శృంగమూలికా |7 24

చండాలీ హస్తిచండాలీ గోచండాలీ కబంధికా | రక్తా చైవ మహారక్తా తథా బర్హిశిఖా చ యా || 25

కోశాతకీ నక్రమాలం పియాలంచ స్వలక్షణా | చారణా చ సుగంధా చ తథా వైగన్ధనాకులీ || 26

ఈశ్వరీ చ సలింగీ చ సోమలీ వంశనాలికా | జతుకారీ తథా శ్వేతా శ్వేతా చ మధుయష్టికా || 27

పజ్జటః పారిభద్రశ్చ తథావై సింధువారికా| జీవానందీ వసుమతీ న తం నాగకటం కటమ్‌ || 28

తాలనా జాలపాతాలం తథా చ వటపత్రికా| కరక్షీరా మహానీలీ కహ్లారం హంసపాదికా || 29

మధూకపర్ణీ వారాహీ ద్వే తథా తండులీయకే | సర్పాక్షీ లవణా బ్రాహ్మీ విశ్వరూపా సుఖంకరీ || 30

రుజావహా శుద్ధికరీ తథా శల్యాపహా చ యా | పత్రికా రోహిణీ చైవ రక్తలా చ మహోషధీ || 31

తథా77 మలక వందారు యావచిత్ర పటోలికా| కాకోలీ క్షీరకాకోలీ పీలుపర్ణీ మనోపతీ|| 32

కేశనీ వృశ్చికా కాళీ మహానాగా శతావరీ | తథా గరుడవేగా చ స్థలే కుముదినీ చ యా || 33

స్థలే చోత్పలినీ యాచ మహాభూమి లతా చయా| ఉన్మాదినీ సోమరాజీ సర్వరత్నాని భార్గవ! || 34

విశేషా న్మరకతం తత్ర కీటపక్షం విశేషతః| జీవజాతా శ్చ మణయ స్సర్వే ధార్యా విశేషతః || 35

రక్షోఘ్నాశ్చ యశస్యాశ్చ కృత్యా బేతాల నాశినః | విశేషాంతర నాగాశ్చ గోఖరోష్ట్ర సముద్భవాః || 36

సర్పతిత్తిర గోమాయు బభ్రు మండుకజాశ్చ యే| సింహ వ్యాఘ్రర్ష ముర్జార ద్విప వానర సంభవాః || 37

కపింజలా7జ గో7ధావి మహిషైణ భవాశ్చయే|

ఇత్యేవ మేతై స్సకలై రుపేతం | ద్రవ్యైః పురం రక్షితసంచయం చ |

రాజా7వసే త్తత్ర గృహం చ శుభ్రం| గుణాన్వితం లక్షణసంప్రయుక్తమ్‌|| 39

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే - ద్వితీయఖండే -అగందకరాధ్యాయో నామ సప్తవింశో7ధ్యాయః

హరేణు మాంసి మంజిష్ట రజనీ మధుకము మధువు అక్షము (బెరడు) మొక్క రసము కుక్కపిత్తము నీ మున్ను చెప్పిన పద్ధతిలో నుపయోగించిన విషము విరుగును వాద్యములకు పతాకలకు వీనింబూసిన యెడల నాధ్వని విని యా జెండాలను దాకినను జూచినను వెంటనే విషము హరించును తత్పూషణము పంచలవణము మంజిష్ఠ రజనీద్వయము సన్నయేలకులు తివృతాపత్రము విడంగములు ఇంద్రవారుణి మధుకము నను వానిని తేనెలో కలిపి ఆవుకొమ్ములో నుంచవలెను. దానిని వేడి నీళ్ళతో గలిపి మాత్రను జేసి ఈ ముందుచెప్పినట్లు వాడినచో తిన్న విషము విరిగిపోవును. కడుపులో నొకవేళ విషమున్న నీ మందు వికటింపదు.సంతు సర్జరము వట్టివేరు ఆవకూర వాలుకలు వేల్ల రుష్కరములతో అర్జునపు చెట్టు పువ్వులతో నివాస గృహ మందు ధూపము వేసిన స్థావర జంగమ విషములు హరించును. ఆ యింట విషక్రిములు కప్పలు పాములు కృత్యలు మఱి యే చేతబడి మొదలయిన ప్రయోగములు మొదలయినవాని నీ ధూపము హరింపగలదు. మంచిగంధము పాలు మోదుగ పట్ట పూర్వైల వాలు సురస నాకులీ తండులీయకములచే తయారైన క్వాధము కాకమాచీ జలములతో గలిపినది సర్వజల విషములను హరించును. రోచనాపత్ర నైపాలీ కుంకమలతో దిలకము బెట్టుకొన్న విషము వధింపదు. మరియు నరనారీ నృపప్రియు డగును. పసుపు మంజిష్ట కిణహీకణములు వేపచూర్ణము భావించిన శరీరము నిర్విషమగును. దిరిసెన పండు ఆకు పూవ్వు పట్ట జంకయును గోమూత్రముతో నూరిన ముద్ద సర్వ విషహరమైనది. ఇంకనీమీద పేర్కొను మహౌషధులను గూడ వినుము. వంధ్య కర్కోటి విష్ణుక్రాంత ఉత్కట శతమూల శతానంద బల స్ఫోట పటోలిక సోమ పిండ పసపు దగ్ధరుహా జయ మెట్టదామర పింగళి శృంగమూలిక చండాలి హస్తి చండాలి గోచండాలి కబంధిక రక్త మహారక్త బర్హిశిఖ బీర నక్రమాలము ప్రియాలము స్వలక్షణ చారణ సుగంధ వైగంధ సర్పాక్షి ఈశ్వరి లింగి సోమలి వంశనాలికా శ్వేతజతుకారీ శ్వేతమధుయష్టిక వజ్జట పారిభద్రము శింధువారిక జీవానందీ వసుమతి కటము నాగకటము నతము తాలనా జాలపాతాళము కటపత్రిక ఖరక్షీరము మహీనీలి కల్హారము హంససాదిక మండూకపర్ణీ వారాహీ ద్వివిధములగు తండులీయకములు సర్పాక్షీ లవణా బ్రహ్మీ విశ్వరూపా సుఖంకరీ రుజాపహ శుద్ధికరీ శల్యాపహ పత్రికా రోహిణీ రక్తలా మహౌషధీ అమలక వందారు యావచిత్రాపటోలికా కాకోలీ క్షీరకాకోలీ పీలుపర్ణీ మనోవతీ కేశినీ వృశ్చికా కాలీ మహానాగ శతావరీ గరుడవేగ మెట్టతామర మెట్టకలువ మహాభూమిలతా ఉన్మాదినీ సోమరాజీ సర్వరత్నములు వీటిలో కీటపక్ష మగు మరకతము శ్రేష్టము. జీవజాతులైన మణులెల్లను విశేషించి ధరింపదగినవి రక్షోఘ్నములు కృత్యాబేతాళనాశనకరములు యశస్యములు విశిష్టములగు నాగ గోఖర ఉష్ట్ర సముద్భవములు సర్ప తిత్తిర గోమాయ బభ్రు మండూకజములు, సింహ వ్యాఘ్రృఋక్షమార్జార ద్విప వానర సంభవములు కపింజల అజ గోదావిమహిషోద్భవములు ఈవిధమయిన సమస్త ద్రవ్యముల రక్షణతో గూడిన పట్టణములో రాజు స్వచ్ఛమైన గృహ మందు నివశించవలెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున అగందకరాధ్యాయమను ఇరువదియేడవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters