Sri Vishnudharmottara Mahapuranamu-2
Chapters
ఐదవ యధ్యాయము - పురోహితలక్షణము భార్గావరామః- రాజ్ఞా పురోహితః కార్య స్తథా మంత్రీ చ కీదృశః | మహిషీచ తథా జ్యేష్ఠా తన్మమాచక్ష్వ పృచ్ఛతః || 1 పుష్కరః- అవ్యంగ లక్షణోపేత మనుకూలం ప్రియంవదమ్ | అధర్వవేద విద్వాంసం యుజుర్వేద విశారదమ్ || 2 ద్వివేదం బ్రాహ్మణం రాజా పురోహిత మధర్వణమ్ | పంచకల్ప విధానజ్ఞం వరయేత సుదర్శనమ్ || 3 నక్షత్ర కల్పో వైతాన స్తృతీయ స్సంహితావిధిః | చతుర్ధో7ంగిరసాం కల్పః శాంతికల్పస్తు పంచమః || 4 పంచకల్ప విధానజ్ఞం ఆచార్యం | పాప్య భూపతిః | సర్వోత్పాత ప్రశాంతాత్మా భునక్తి వసుధాం చిరమ్ || 5 రాజుయొక్క పురోహితుడు మంత్రియునెట్టి వాడైయుండవలెను? పట్టమహిషి ( జ్యేష్ఠభార్య) యేరీతిది కావలె? దెలుపుమని పరుశురాముడడుగ పుష్కరుండిట్లనియె. ఏ అంగలోపములేని సలక్షణుడైన యనుకూలుడైన ప్రియభాషిణి అధర్వవేద పండితుని యజుర్వేద విశారదని (ద్వివేదినన్న మాట) అధర్వవేద శాఖీయుని పంచకల్ప విధానము లెరింగిన వానిని సుదర్శనుని మంచిచూపు గల వానిని ( అనగా భవిష్యద్దర్శనసమర్థునన్న మాట) పురోహితునిగా వరింపవలయును. అకల్పములై దు: 1 నక్షత్రకల్పము 2వైతానకల్పము 3 సంహితాకల్పము 4 అంగిరః కల్పము 5 శాంతికల్పము. ఈ యైదుకల్పముల విధాన మెరింగిన వానిని ఆచార్యునిగా గ్రహించి రాజు సర్వోత్పాత ములనుదాటి ( ఆధిభౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మిక రూపమలయిన యాపదలనుగడచి) రాజు ప్రశాంత మనస్కుడై చిరకాలము వసుంధర ననుభవించును. స చ రాజ్ఞ న్తధా కుర్యాన్ని త్యం కర్మ సదైవతు | నైమిత్తికం తథా కామ్యం దైవజ్ఞ వచనే రతః || 6 న త్యాజ్య స్తుభ##వే ద్రాజ్ఞా దైవజ్ఞేన పురోధసా | పతితస్తు భ##వే త్త్యాజ్యో నాత్ర కార్యా విచారణా || 7 తథైవ పతితౌ రామ ః న త్యాజ్యౌ తౌ మహీభుజా | తయోస్త్యాగేన రాజేంద్ర ః రాజ్యభ్రంశో వినిర్ధిశేత్ || 8 దుర్గతిః పరలోకేచ బహుకాల మసంశయమ్ | సాంవత్సర విరుద్ధస్తు త్యాజ్యో రాజ్ఞా పురోహితః || 9 పురోహితో7న్యథా రాజ్ఞో యథా మాతా యథా పితా | అనిష్ట మస్య వ్యసనం హన్యా ద్దెవోపఘాతజమ్ || 10 బ్రహ్మణో నిష్కృతి స్తస్య కుత్ర శక్యా మహీభుజా || యావన్న రాజ్ఞా విద్వాంసౌ సాంవత్సర పురోహితౌ || 11 వృత్తిచ్ఛేదే తయో రాజ్ఞః కులం త్రిపురుషం వ్రజేత్ | నరకం, వర్జయే త్తస్మాత్ వృత్తిచ్ఛేదం తయో స్సదా || 12 స్థావరేణ విభాగ శ్చ తయోః కార్యో విశేషతః | అనురూపేణ ధర్మజ్ఞః సాంవత్సర పురోహితౌ || 13 భావ్యం సదా భార్గప వంశచంద్ర ః పురోహిత స్యాత్మ సమస్య రాజ్ఞా | రాజ్ఞో యథా పి స్వజనేన భావ్యో విద్వాన్ ప్రభుస్స్యా న్నృపతేః పురోధాః || ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే పురోహిత లక్షణ కధనం నామ పంచమో7 థ్యాయః. ఆ పురోహితుడగూడ యేవేళ రాజుసేయవలసిన నిత్యనైమిత్తిక కామ్య కర్మములను గావింపవలెను. రాజు దైవజ్ఞుని మాటపై నాస్థగొని యుండవలెను. దైవజ్ఞుడు పురోహితుడు నను నీయిద్దరిచే రాజెన్నడు పరిత్యక్తుడు గాకూడదు. ఒకవేళ నయ్యెనో యారాజు తప్పక పతితుడు ( రాజ్య భ్రష్టుడు) నగును. ఇక్కడ మరి విచారణలేదు. రాజుగూడ వారిని స్థాన భ్రష్టులంజేయరాదు. విడిచి పెట్టరాదు. వారిని పద భ్రంశముచేయుటచే రాజ్యభ్రంశము తప్పదు. పరమందు దుర్గతియుం దప్పదు సాంవత్సర (జ్యౌతిషిక) విరుద్ధుడయిన పురోహితుని రాజు విడువవచ్చును. పురోహితుడు తండ్రి తల్లవంటివాడు, ఈ రాజునకు తటస్థించిన యనిష్టమును వ్యసనమును దైవోపఘాతమువలన వచ్చినదాని దేనినైన వారింపగలవాడు తన్నిష్కృతికి బ్రాహ్మణునడే కావలయును. అతడు గాక నక్కడ పరిష్కారము సేయుటకు రాజునకు మరి దారి లేదు. కావున రాజాస్థానమందు జ్యౌతిషిక పురోహితు లిద్దరు మహా విద్వాంసులుండి తీరవలెను. వారివృత్తికి చ్ఛేదము సేసిన యేడల రాజు మూడు తరములవారు నరకమునంబడుదురు. కావున వారికి వృత్తి భంగమేవేళనుం జేయరాదు విశేషించివారికి స్థావరముచే (భూమి-అగ్రహారాదులను) సమరూపవృత్తి కల్పన మా యిద్దరకు తప్పకరాజు గావించవలెను. ఓ భార్గవ వంశచంద్ర! రామా! రాజున కాత్మసమానుడు పురోహితుడు. స్వజనములోని వాడుగా నుండవలెను. ప్రభువునకుగూడ ప్రభువు పురోహితుడు. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున పురోహిత లక్షణమను నైదవయధ్యాయము.