Sri Vishnudharmottara Mahapuranamu-2
Chapters
ఆరవ యధ్యాయము - మంత్రిలక్షణము పుష్కరః- సర్వలక్షణ లక్షణో మంత్రీ రాజ్ఞ స్తథై వచ | బ్రాహ్మణో వేదతత్త్వజ్ఞో వినీతః ప్రియదర్శనః || 1 స్థూలలక్షో మహోత్సాహః స్వామిభక్తః ప్రియంవదః | బృహస్పత్యుశనః ప్రోక్తాః నీతీ జానాతి సర్వతః || 2 రాగద్వేషేణ యత్కార్యం న వద న్తి మహీక్షితః | లోకాపవాదా ద్రాజార్థే భయం యస్య నజాయతే || 3 క్లేశక్షమ స్తథా యశ్చ విజితాత్మా జితేంద్రియః | గూఢ మంత్రశ్చ దక్షశ్చ ప్రాజ్ఞో భక్తజన ప్రియః || 4 ఇంగితాకార తత్త్వజ్ఞ ఊహాపోహ విశారదః | శూరశ్చ కృతవిద్యశ్చ నచ మానీ విమత్సరః ||5 చార ప్రచార కుశలః ప్రణిథి ప్రణయాత్మవాన్ | షాడ్గుణ్యవిధి తత్త్వజ్ఞ ఉపాయ కుశల స్తథా || 6 వక్తాపి ధాతా కార్యాణాం నైవ కార్యాతిపాతితా | | సమశ్చ రాజభృత్యానాం తథైవచ గుణప్రియః || 7 కాలజ్ఞ స్సమయజ్ఞశ్చ కృతజ్ఞశ్చ జనప్రియః | కృతానామకృతానాంచ కర్మణాం చాన్వవేక్షితా || 8 యథా7ను రూప మర్హాణాం పురుషాణాం నియోజితా | రాజ్ఞః పరోక్షే కార్యాణి సంపరాయే భృగూ త్తమః || 9 కృత్వా నివేదితా రాజన్ ! కర్మణాం గురులాఘవమ్ | శత్రు మిత్రు విభాగజ్ఞో విగ్రహాస్పద తత్త్వ విత్ || 10 స రాజ్ఞ స్సర్వకార్యాణి కుర్యాద్ భృగుకులోద్వహ | విదితాని యథా కుర్యా న్నాజ్ఞాతాని మహీక్షితా || 11 అజ్ఞతాని నరేంద్రస్య కృత్వా కార్యాణి భార్గవ | అచిరేణా7పి విద్వేషం స మంత్రం త్వధిగచ్ఛతి || 12 కరోతి యస్తు కార్యాణి వివిధాని మహీపతేః | భేదో నో తస్య భవతి కదాచిదపి భూభుజా || 13 ఏవం గుణో యస్య భ##వేచ్చ మంత్రీ వాక్యే చ తస్యా 7 భిరతస్య రాజ్ఞః | రాజ్యం స్థిరం స్యా ద్విపులా చ లక్ష్మీః వంశశ్ప దీప్తో భువన త్రయే7పి || 14 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే మంత్రిలక్షణ కథనం నామ షష్ఠోధ్యాయఃః పరశురామునకు పుష్కరుండిట్లనియె. సర్వలక్షణ లక్షణ్యుడు మంత్రి రాజునకు గావలయును. బ్రాహ్మణుడు వేదతత్త్వజ్ఞుడు వినీతుడు (వినయశీలి) ప్రియదర్శనుడు స్థూలలక్షుడు ముహోత్సాహి రాజభక్తుడు ప్రియంవదుడు బృహస్పతి-శుక్రాచార్యుడు చెప్పిన నీతిశాస్త్రముల జక్కనెరింగినవాడు. (బార్హస్పత్యనీతి-శుక్రనీతి) రాజునకు రాగద్వేషములుగాని చేడు సలహాలీయనివాడు రాజకార్య నిర్వహణముపట్ల లోకాపవాద గల్గునని బెదరనివాడు. క్లేశములనోర్చుకోగలవాడు జితేంద్రియుడు జితాత్ముడు (దననుదా నెఱింగినవాడు) గూఢవంతుడు ( కార్యాలోచన చాలా గుప్తము సేయువాడు) దక్షుడు ప్రాజ్ఞుడు భక్తజనుల కిష్టుడు ఇంగితాకారముల గ్రహణము గలవాడు ఊహాపోహ విశారదుడు శూరుడు కృతవిద్యుడు (విద్యాసంపన్నుడు) అయినను గర్వరహితుడు దురభిమానిగాని వాడు మాత్సర్యములేనివాడు చార ప్రచారనిపుణుడు ప్రణిధులయెడ ప్రణయము గలవాడు (ప్రతినిధి= రాయబారి) సంధివిగ్రహాదిషాడ్గుణ్య ప్రయోగము రహస్యముల నెరింగినవాడు సామదాన భేదదండోపాయ కుశలుడు వక్త కార్యవిధాత ( పనిచక్కబెట్టగలవాడు) కార్యముల నెప్పటికప్పుడు ముందుకునెట్టనివాడు (వాయిదాలు వేయనివాడు) రాజభృత్యులందరికి సముడు మరియు వారివారి గుణమందు ప్రియుడు చేసిన చేయని పనులను దానుగగూడ పర్యవేక్షించువాడు తగినవారిని దగిన పనులందు నియోగించువాడు రాజు పరోక్షమందు సంపరాయమందు యుద్ధసమయమందు కార్యములను దాను జక్కబెట్టి యాయా పనుల గురులాఘవ మెరింగి నివేదింపగలవాడు శత్రువెవరో మిత్రుడెవరో విభజింపనేర్చినవాడు విగ్రహాస్పదములయొక్క యుద్ధసాధనములయొక్క రహస్యమెరింగినవాడు నైన మంత్రి యాతడు రాజుయొక్క సర్వకార్య నిర్వహణము సేయవలయును రాజునకు దెలిసినవే చేయవలెను. రాజెరుంగని పని చేసినచో నామంత్రి యచిరకాలమున రాజద్వేషమునకు గురియగును. వివిధ కార్యములు రాజానుమతముగ చేసిన మంత్రికి రాజుతో భేదమెన్నడునురాదు. ఈ యీగుణములు గలవాడెవ్వనికి మంత్రియగునున ఆరేని వాక్యమందభిరతు డెప్పుడగును వాని రాజ్యము సుస్థిరమగును. సువిస్తారమగును. వాని వంశము ముల్లోకములందును మిగుల రాణించును. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున మంత్రిలక్షణమను నాఱవ యధ్యాయము.