Sri Vishnudharmottara Mahapuranamu-2
Chapters
తొమ్మిదవ యధ్యాయము - స్త్రీలక్షణములు పుష్కరః- శస్తా స్త్రీ చారు సర్వాంగీ మత్త మాతంగ గామినీ | గురూరు జఘనా యాచ మత్త పారావతేక్షణా || 1 సునీలకేశీ తన్వంగీ పరపుష్టనినాదినీ | తను మధ్యా విలోమాంగీ స్నిగ్ధ వర్ణా మనోహరా || 2 సమగ్ర భూస్పృశౌ యస్యా శ్చరణౌ కమలోపమౌ | నాభిః ప్రదక్షిణావర్తా సంహతౌ చ తథా స్తనౌ || 3 విభక్త మధరోష్ఠంచ దర్శనం మధురం తథా | గుహ్యం ప్రదక్షిణావర్త మశ్వత్థదళ సన్నిభమ్ || 4 గుల్ఫౌ నిగూఢౌ గూఢే చ తథా యస్యాః కకుందరే | మధ్యనాభే శ్చ యస్సాస్స్యా ద్ధంస్తాంగుష్ట ప్రమాణతః || 5 పిండికే చ న సన్నద్ధే నలంబా చ తథా కటిః | జఠరంచ ప్రలంబంచ నయనే చ న కేకరే || 6 కచా శ్చ కపిశాః కేశాః కేశా రూక్షా స్తథైవ చ | న చ వృక్షనదీ నామ్నీ నదేవగిరినామికా|| 7 న చైవోరగ గంధర్వ భూతప్రేత సనామికా | న వాచాల నలుబ్ధా చ నశఠా కలహ ప్రియా || 8 న లోలుపా న దుర్భావా నవాకుంఠకపాలికా | దేవ ద్విజాతి సిద్ధానాం పూజనే రతా || 9 శీలోపేతా గుణోపేతా న శిరాలా న లోమశా | 10 గండై ర్మధూక పుష్పాభైః స్నిగ్ధై శ్చ దశనచ్ఛదైః | న సంహతభ్రూ స్సంశ్లిష్ట చరణాం గుళికుట్మలా || 11 పతిప్రియా పతిప్రాణా యా నారీ పతిదేవతా | అలక్షణా7పి సంజ్జేయా సర్వలక్షణ సంయుతా || 12 భ్రువం కనీనికాయస్యా న స్పృశేత కథంచన | న తాం కుర్వీత భార్యార్థం మృత్యుస్సా కధితా బుధై ః ||13 సరోమ ముత్తరోష్టంచ గండౌ యస్యా స్స కూపకౌ | అతిదీర్ఘా కషాయా చ చల న్మాంసాచ యా తథా || 14 సా వివర్జ్యా విశేషేణ నరేణ హిత మిచ్ఛతా | 15 సంక్షేపత స్తే కథితం మయైతత్ స్యాల్లక్షణం చారు నితంబినీనామ్ | రహస్య మేత త్కథితం తు తత్ర యత్రా7కృతి స్తత్ర గుణా వసన్తి || 16 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే స్త్రీ లక్షణం నామ దశమో7ధ్యాయః. పుష్కరుడనియె : బరువైన తొడలు పిరుదులు గలది సర్వావయవ సుందరి మదించిన యేనుగట్లు నడుచునది మదించిన పావురము కన్నులు గలది మిక్కిలి నల్లనిజుట్టుగలది. మృదుసుకుమార శరీరము కోకిలపలుకులు సన్ననినడుము రోమకళ##లేని శరీరము మెఱుగారురంగుకలది మనోహారిణి. తామరపూపులట్టి పాదతలముల నిండుగ భూమిని తాకు చుండును. బొడ్డు కుడి వైపుసుడితిరిగియుండును. కుచములొండొంటి నొత్తుకొని యుండును. క్రింది పెదవి సువిభక్తమై చూడనింపయి మధురమైయండును. గుహ్యము కుడివైపు సుడితిరిగి రావియాకట్లుండును. చీలమండలు బొద్దుగ మెటిమలు పైకి కానరాకుండ నుండును. కకుందరములు నట్లేయుండును. బొడ్డు బొటనవ్రేలంత లోతుగ నుండును. పిండిక లొండొంటి నొత్తకొనవు. నడుము తూగక బిగువుగ నుండును. పొత్తికడుపు నేత్రములు కేకరములు జుట్టు తేనె రంగులో గరుకుదేరియుండదు. చెట్టు నదులు దేవతలు కొండలు పాములు గంధర్వులు భూత ప్రేతముల పేరులుగలదిగా నుండదు. వదరుబోతు లుబ్ధురాలు శఠురాలు మూర్ఖించునది (మొండి) ప్రియలోలుప (మోహశీల) చెడుస్వభావముకలది (పెడగట్టియ) కాగూడదు. కుంఠకపాలికా నడితలగుంటపడి యండరాదు. దేవబ్రాహ్మణ సిద్ద సాధువులను బూజింప మనసుపడునది శీలవతి గుణవతి, మేనిపైకి తేలిననరములు గలదియు మేనెల్ల రోమకళ కలదియుగానిది. ఇప్పపూవు రంగుగల గండభాగములు (చెక్కిళ్లు) స్నిగ్ధములైన (మెఱయుచండు) పెదవులు గలిగియున్నది కనుబొమలు ముడిపడనిది. పాదముల వ్రేళ్ళు మొగ్గలవలె ఒండొంటి నొత్తికొని యుండునది. పతి యందనురాగము కలది పతియే ప్రాణమును పతియే దేవతగా నున్నదియగుస్త్రీ సాముద్రిక లక్షణములు కొరవడియున్నను సర్వలక్షణ సంపన్నురాలుగా భావించదగినది. ఱప్పలు కనుబొమలను తాకియుండనిస్త్రీని యెన్నడు భార్యగా గైకొనదాదు. పండితులిది మృత్యువేయని యందురు. మేలుకోరువాడు పై పెదవిపై రోమకళ గలదానిని (మీసకళయన్నమాట) చెక్కిళ్ళు గుంటలుపడుదానిని మిక్కిలి దీర్ఘకాయను (పొడవు ఎత్తు ఎక్కువ దానిని) దీర్ఘకోపకషాయను మేనిమాంసమదరుదాని నెన్నడును గ్రహింపరాదు. స్త్రీలక్షణములివి సంక్షేపముగ నీకు దెల్పితిని. అందులో గూడ రహస్యమిది వచింపబడినది. ఎక్కడ యందముండునో యక్కడ గుణములుండును. ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున స్త్రీలక్షణమను తొమ్మిదవ యధ్యాయము.