sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

త్రిషష్టితమోzధ్యాయ - దుర్గాదేవి వైశ్యునితో సంభాషించుట

నారద ఉవాచ- నారదుడిట్లనెను-

నారాయణ మహాభాగ వద వేదవిదాంవర | రాజాకేన ప్రకారేణ సిషేవే ప్రకృతిం పరాం || 1

సమాధిర్నామం వైశ్యోవా నిష్కామం నిర్గుణం విభుం | భేజే కేన ప్రకారేణ ప్రకృతేరుపదేశతః || 2

కిం వా పూజావిధానం చ ధ్యానం వా మనురేవచ| కిం స్తోత్రం కవచం కిం వా దదౌ రాజ్ఞే మహామునిః || 3

వైశ్యాయ ప్రకృతిస్తసై#్మ కిం వా జ్ఞానం దదౌ పరం | సాక్షాద్బభూవ సహసా కేన వా ప్రకృతిస్తయోః || 4

జ్ఞానం సంప్రాప్య వైశ్యశ్చ కిం పదం ప్రాప దుర్లభం | గతిర్బభూవ రాజ్ఞశ్చ కా వా తాం చ శ్రుణోమ్యహం || 5

వేదములన్నియు తెలిసిన నారాయణ మునీ! రాజు ఏవిధముగా ప్రకృతిరూపిణియైన దుర్గాదేవిని సేవించెనో, సమాధియను వైశ్యుడు కోరికలు లేక ప్రకృతియొక్క ఉపదేశమువలన ఏ విధముగా నిర్గుణుడైన పరమాత్మను సేవించెనో? ఆ దేవి పూజా విధానమెట్లున్నదో, ధ్యానము, మంత్రము, సోత్రము కవచము ఎట్లున్నవో? తెలుపుము.

అట్లే ప్రకృతి రూపిణియైన దుర్గాదేవి వైశ్యునకు జ్ఞానమునెట్లు ప్రాసదించెనో? ప్రకృతి వారికెట్లు ప్రత్యక్షమయ్యెనో? ఆ దేవి దయవలన జ్ఞానము పొందిన వైశ్యుడు ఎటువంటి స్థానమును పొందెనో? రాజు ఏమయ్యెనో? ఈ విషయములనన్నిటిని వివరింపుడు.

శ్రీ నారాయణ ఉవాచ- శ్రీనారాయణుడిట్లనెను-

రాజా వైశ్యశ్చ సంప్రాప్య మంత్రం వై మేధసో మునేః | స్తోత్రం చ కవచం దేవ్యాః ధ్యానం చైవ పురస్ర్కియాం ||

జజాప పరమం మంత్రం రాజావైశ్యశ్చ పుష్కరే ||

స్నాత్వా త్రికాలం వర్షం చ తతః శుద్ధో బభూవ హ | సాక్షాద్బభూవ తత్రైవ మూలప్రకృతిరీశ్వరీ || 7

రాజ్ఞే దదౌ రాజ్యవరం మనుత్వం వాంఛితం సుఖం | జ్ఞానం నిగూఢం వైశ్యాయ దదౌ చాతిసుదుర్లభం || 8

యద్ధత్తం శూలినే పూర్వం కృష్ణేన పరమాత్మనా | నిరాహారమతిక్లిష్టం దృష్ట్వా వైశ్యం కృపామయీ || 9

రురోద కృత్వా క్రోడే తమచేష్టం శ్వాసవర్జితం | చేతనాం కురు భో వత్సేత్యుచ్చార్య చ పునః పునః || 10

చేతనాం చ దదౌ తసై#్మ స్వయం చైతన్య రూపిణీ | సంప్రాప్య చేతనాం వైశ్యో రురోద ప్రకృతేః పురః || 11

తమువాచ ప్రసన్నాzసౌ కృపయాzతికృపామయీ || 12

మేధోమహర్షివలన సురథుడు, వైశ్యుడు దుర్గాదేవియొక్క కవచమును, స్తోత్రమును, ధ్యానమును మంత్రమును పొంది, పుష్కరక్షేత్రమున ఆ దేవిమంత్రమున జపించిరి. వారు ప్రతిసంధ్యలలో స్నానము చేయుచు ఆ దేవి మంత్రమును సంవత్సరకాలము జపించగా మూలప్రకృతియగు దుర్గాదేవి వారికి సాక్షాత్కరించి, రాజుకు రాజ్యమును, అతనికి గల ఇతర కోరికనలను, మనుత్వమునిచ్చెను. కోరికలులేని వైశ్యునకు అతిదుర్లభ##మైన జ్ఞానమునిచ్చినది. ఆ జ్ఞానమును పూర్వము శ్రీకృష్ణపరమాత్మ శంకరునకొసగియుండెను.

ఆ జ్ఞానమువలన నిరాహారియై భగవతిని ధ్యానించుచు కృశించిపోవుచున్న వైశ్యుడు శ్వాసలేక నిశ్చేష్టుడైయున్నప్పుడా తల్లి అతనిని దయతో తన ఒడిలోనికి తీసికొని కొంతసేపు బాధపడి వత్సా చైతన్యమును పొందుమని అనెను.

అప్పుడా వైశ్యుడు తెలివికి వచ్చి ఎదుటనున్న ఆ తల్లిని చూచి సంతోషమును పట్టలేక ఏడ్చెను. అప్పుడు కృపామయి యగు ఆ భగవతి అతనితో నిట్లనెను.

శ్రీప్రకృతిరువాచ-వైశ్యుడిట్లు పలికెను-

బ్రమ్మత్వమమర్తవం వా మాతర్మే న హి వాంఛితం | తతోzతి దుర్లభం కిం వాన జానే తదభీప్సితం || 15

త్వయ్యేవ శరణాపన్నో దేహి యద్వాంఛితం తవ | అనశ్వరం సర్వసారం వరం మే దాతుమర్హసి || 16

తల్లీ! నాకు అమరత్వము కాని బ్రహ్మత్వముకాని కావలనెనను కోరికలేదు. అంతకుమించినవి ఏముండునో నాకు తెలియదు. నేను నిన్నే శరణువేడితిని. నీకు ఏది ఇష్టమో దానినే నాకిమ్ము. అది శాశ్వతమై అన్నిటికి సారమగునట్లు మాత్రము కావలయును అని వైశ్యుడగు సమాధి ఆమెతో అనెను.

ప్రకృతివాచ- ప్రకృతి ఇట్లనినది -

అదేయం నాస్తిమే తుభ్యం దాస్యామి మమ వాంఛితం | యతో యాస్యసి గోలోకం పదమేవ సుదుర్లభం || 17

సర్వసారం చ యత్‌జ్ఞానం సురర్షీణాం సుదుర్లభం | తద్గృహ్యతాం మహాభాగ గచ్ఛ వత్సహరేః పదం || 18

స్మరణం వందనం ధ్యానమర్చనం గుణకీర్తనం | శ్రవణం భావనం సేవా కృష్ణే సర్వనివేదనం || 19

ఏతదేవం వైష్ణవానాం నవధా భక్తిలక్షణం | జన్మమృత్యు జరావ్యాధి యమతాడన ఖండనం || 20

ఆయుర్హరతి లోకానాం రవిరేవ హి సంతతం | నవధాభక్తి హీనానా మసతాం పాపినా మపి || 21

భక్తాస్తద్గత చిత్తాశ్చ వైష్ణవాశ్చిరజీవినః | జీవన్ముక్తావ్చ దుష్పాపా జన్మాది పరివర్జితాః || 22

శవః శేషశ్చ ధర్మశ్చ బ్రహ్మా విష్ణుర్మహాన్‌ విరాట్‌ | సనత్కుమారః కపిలః సనకశ్చ సనందనః || 23

వోఢుః పంచశిఖో దక్షో నారదశ్చ సనాతనః | భృగుర్మురీచి దుర్వాసాః కశ్యపః పులహోzంగిరాః || 24

మేధావీ లోమశః శుక్రో వసిష్ఠః క్రతురేవ చ | బృహస్పతిః కర్దమశ్చ శక్తిరత్రిః పరాశరః || 25

మార్కండేయో బలిశ్చైవ ప్రహ్లాదశ్చ గణశ్వరః | యమః సూర్యశ్చ వరుణో వాయుశ్చంద్రో హుతాశనః || 26

అకూపార ఉలూకశ్చ నాడీజంఘశ్చ వాయుజః | నరనారాయణౌ కూర్మ ఇంద్రదుమ్మో విభీషణః || 27

నవధా భక్తియుక్తాశ్చ కృష్ణస్య పరమాత్మనః | ఏతే మహాంతో ధర్మిష్ఠా భక్తానాం ప్రవరాస్తధా || 28

ఓ సమాధీ! నేను ఇవ్వలేనిదని ఏమి లేదు, ఐనను నీవు కోరుకొన్నట్లే నేను ఇష్టపడు వరమునే నీకిచ్చెదను, దానివలన నీవు అమరులకు కూడా సుదుర్లభ##మైన గోలోకమునకు పోయెదవు. నేను నీకు ఇచ్చు జ్ఞానము సర్వసారమైనది, దేవఋషులకు సహితము మిక్కిలి దుర్లభ##మైనది. ఈజ్ఞానము వలన నీవు శ్రీహరి నివసించు లోకమునకు పోగలవు.

శ్రీహరిని స్మరించుట, నమస్కరించుట, ధ్యానము చేయుట అతనిని అర్చించుట ఆ దేవదేవుని అనంతకల్యాణ గుణగణములను కీర్తించుట, ఆతని గుణగణములను వినుట, ఆ పరమాత్మను మనస్సులో భావనచేయుట, అతని సేవచేయుట, ఆ పరమాత్మపై తన భారమునంతయు వేడుట (శరణువేడుట) అనునవి ఆ పరమాత్మ భక్తి యొక్క తొమ్మిది భేదములు, ఈ భక్తివలన జన్మ, మృత్యు, జర, వ్యాధి, నరక బాధలు తప్పును, అసత్పురుషులు, పాపులైన శ్రీహరిభక్తి రహితులకు ఆయస్సు వ్యర్థముగా గడచిపోవును.

శ్రీహరిభక్తులెల్లప్పుడు ఆ శ్రీహరిని మనస్సులో ధ్యానించుచుందురు. వారందరు చిరంజీవులు, జీవన్ముక్తులు పాపరహితులు.

శివుడు, శేషుడు, ధర్ముడు, బ్రహ్మ, విష్ణువు మహావిరాట్‌ స్వరూపుడు, సనత్కుమారుడు, కపిలుడు, సనకుడు, సనందనుడు, వోఢు, పంచశిఖుడు, దక్షుడు, నారదుడు, సనాతనుడు, భృగువు, మరీచి, దుర్వాసుడు కశ్యపుడు పులహుడు అంగిరుడు మేధావీ, లోమశుడు, శుక్రుడు, వసిష్ఠుడు, క్రతువు, బృహస్పతి, కర్దముడు, శక్తి, అత్రి, పరాశరుడు, మార్కడేయుడు, బలి, ప్రహ్లాదుడు, గణపతి, యముడు, సూర్యడు, వరుణువు, వాయువు, చంద్రుడు, అగ్ని, అకూపారుడు, ఉలూకుడు, నాడీజంఘుడు, నరనారాయణులు, కూర్ముడు, ఇంద్రద్యుమ్నుడు, విభీషణుడు వీరందరు ధార్మికులు, శ్రీకృష్ణభక్తులలో శ్రేష్ఠులు, వీరందరూ శ్రీకృష్ణపరమాత్మను నవవిధభక్తులలో ఏదో విధభక్తితో సేవించుచున్నవారే.

యే తద్భాక్తాస్తే తదంశా జీవన్ముక్తాశ్చ సంతతం | పాపహరాస్తీర్థానాం పృథివ్యాశ్చ విశాం పతే || 29

శ్రీకృష్ణపరమాత్మ అంశకల అతని భక్తులందరు జీవన్ముక్తులు, పృథివీ, తీర్థక్షేత్రములందు పాపులవల్ల ఏర్పడు పాపమునపహరింతురు.

ఊర్ధ్వం చ సప్తస్వర్గాశ్చ సప్తద్వీపా వసుంధరా | అధః సప్త చ పాతాళా ఏతద్బ్రహ్మాండ మేవ చ|| 30

ఏవం విధానాం విశ్వానాం సంఖ్యా నాస్త్యేవ పుత్రక | ఏవం చ ప్రతివిశ్వేషు బ్రహ్మవిష్ణు శావాదయః || 31

దేవా దేవర్షయశ్చైవ మనవో మానవాదయః | సర్వాశ్రమాశ్చ సర్వత్ర సంతి బద్ధాశ్చ మాయయా || 32

మహావిష్ణోర్లోమకూపే సంతివిశ్వాని యస్య చ | స షోడశాంశః కృష్ణస్య చాత్మనశ్చ మహావిరాట్‌ || 33

భజ సత్యం పరం బ్రహ్మ నిత్యం నిర్గుణమచ్యుతం | ప్రకృతేః పరమీశానం

కృష్ణమాత్మానమీప్సితం || 34

నిరీహం చ నిరాకారం నిర్వికారం నిరంజనం | నిష్కామం నిర్విరోధం చ నిత్యానందం సనాతనం || 35

స్వేచ్ఛామయం సర్వరూపం భక్తానుగ్రహ విగ్రహం | తేజః స్వరూపం పరమం దాతారం సర్వసంపదాం || 36

ధ్యానసాధ్యం దురారాధ్యం శివాదీనాం చ యోగినాం | సర్వేశ్వరం సర్వపూజ్యం సర్వేషాం సర్వకామదం || 37

సర్వాధారం చ సర్వజ్ఞం సర్వానందకరం పరం | సర్వధర్మప్రదం సర్వం సర్వజ్ఞం ప్రాణరూపిణం || 38

సర్వధర్మస్వరూపం చ సర్వకారణకారణం | సుఖదం మోక్షదం సారం వరరూపం చ భక్తిదం || 39

దాస్యదం ధర్మదం చైవ సర్వసిద్ధిప్రదం సతాం | సర్వం తదతిరిక్తం చ నశ్వరం కృత్రిమం సదా || 40

పరాత్పరం శుద్ధం పరిపూర్ణతమం శివం | యథాసుఖం గచ్ఛవత్స భగవంతమధోక్షజం || 41

సప్తద్వీపములు గల భూఖండమునకు పైభాగమున ఏడు స్వర్గలోకములు, అధోభాగమున ఏడు పాతాళ లోకములు కలవు, ఈ చతుర్దశ లోకములను బ్రహ్మాండమని అందురు.

ఈ ప్రపంచమున ఇట్టి బ్రహ్మాండము లెన్నియో కలవు. ప్రతి బ్రహ్మాండమున బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగు దేవతలు దేవఋషులు, మనువులు, మానవులు వారిలోనున్న ఆశ్రమములన్ని ఉన్నవి. వీరందరు విష్ణుమాయకు బద్ధులైయుందురు.

ఈ బ్రహ్మాండములన్నియు శ్రీమహావిష్ణువుయొక్క రోమకూపములందున్నవి. ఆ మహావిష్ణువు శ్రీకృష్ణపరమాత్మయొక్క పదునారవ అంశ.

అందువలన ఓ వైశ్యుడా! నీవు సత్యస్వరూపుడు, పరబ్రహ్మరూపుడు, నిత్యుడు, నిర్గుణుడు, అచ్యుతుడు, ప్రకృతికంటె పరుడు, ఈశ్వరుడగు శ్రీకృష్ణుని సేవింపుము. ఆ పరమాత్మ నిరీహుడు, నిరాకారుడు, నిర్వికారుడు, నిరంజనుడు, నిష్కాముడు, నిర్విరోధుడు, నిత్యానందుడు, సనాతనుడు, స్వేచ్ఛామయుడు, సర్వరూపి, భక్తలననుగ్రహించుటకై శరీరమును స్వీకరించినవాడు. తేజః స్వరూపుడు, సమస్త సంపదలను కలిగించువాడు. ధ్యానముచేత మాత్రము సులభసాధ్యుడు, శివుడు మొదలగు మహాయోగులు సైతము ఆరాధించుటకు అసాధ్యుడు, సర్వేశ్వరుడు, సర్వపూజ్యుడు, అందరకు అన్ని కోరికలు తీర్చువాడు. సర్వాధారుడు, సర్వజ్ఞుడు, అందరకు ఆనందమును కలిగించువాడు. సర్వధర్మములనొసగువాడు, సర్వప్రాణరూపి, సర్వధర్మస్వరూపుడు, సమస్త కారణములకు కారణభూతుడు, సుఖమును, మోక్షమును ఒసగువాడు, పరరూపుడు, భక్తిదాత, దాస్యభక్తినిచ్చువాడు, సజ్జనులకు సమస్తసిద్ధులను కలిగించువాడు. ఆ పరమాత్మ భిన్నమైన దంతయు అశాశ్వతమైనది. అసహజమైనది. అట్టి శుద్ధస్వరూపుడైన పరమాత్మను సేవించుటకై సుఖముగా పొమ్ము.

కృష్ణేతి ద్వ్యక్షరం మంత్రం గృహీత్వా కృష్ణ దాస్యదం | పుష్కరం దుష్కరం గత్వా దశలక్షమిమం జప || 42

దశలక్షజపేనైవ మత్రసిద్ధిర్భవేత్తవ | ఇత్యుక్త్వా సా భగవతీ తత్రైవాంతరధీయత || 43

వైశ్యోనత్వా చ తాం భక్త్వా చాగమత్పుష్కరం మునే | పుష్కరే దుష్కరం తప్త్వా స లేభే కృష్ణమీశ్వరం ||

భగవత్యాః ప్రసాదేన కృష్ణదాసో బభూవ సః || 44

శ్రీకృష్ణ దాస్యమును కలిగించు కృష్ణ అను రెండక్షరముల మంత్రమును తీసుకొని పుష్కర క్షేత్రమునకు పోయి ఆ మంత్రమును పదిలక్షలమార్లు జపింపుము. నీవు ఆ మంత్రమును పది లక్షలసార్లు జపింపగానే సిద్ధిపొందుదువు అని చెప్పి భగవతియగు దుర్గామాత అంతర్ధానము చెందెను.

వైశ్యుడాదేవిని భక్తితో నమస్కరించి ఆమె చెప్పినట్లు పుష్కరక్షేత్రమునకు వెళ్ళి దుష్కరమైన తపస్సుచేసి శ్రీకృష్ణపరమాత్మను పొందెను ఈ విధముగా సమాధియను ఆ వైశ్యుడు దుర్గాదేవియొక్క అనుగ్రహమువలన శ్రీకృష్ణదాసుడయ్యెను. అని నారాయణుడు నారదమహర్షితో అనెను.

ఇతి శ్రీ బ్రమ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే దుర్గోపాఖ్యానే సురథ సమాధి మేధస్సంవాదే ప్రకృతి వైశ్య సంవాదకథనం నామ త్రిషష్టితమోzధ్యాయః.

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమందలి నారదనారాయణ సంవాదమున చెప్పబడిన దుర్గోపాఖ్యానములోని సురథసమాధి, మేధోమునుల మధ్య జరిగిన సంవాదమున ప్రకృతి వైశ్యుల సంవాదమును చెప్పు

అరవై మూడవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters