Sri Devi Bagavatham-2    Chapters   

అథ పంచత్రింశోధ్యాయః.

ధర్మరాజ ఉవాచ: దేవసేవాం వినాసాధ్వి నభ##వేత్కర్మకృంతనమ్‌| శుద్ధకర్మ శుద్ధబీజం నరకశ్చ కుకర్మణా. 1

పుంశ్చల్యన్న్‌ చ యో భుంక్తే యోస్యాం గచ్ఛేత్పతి వ్రతే|

స ద్విజః కాలసూత్రం చ మృతోయాతి సుదుర్గమమ్‌. 2

శతవర్షం కాలసూత్రే స్థిరీభూతోభ##వేద్ధ్రువమ్‌| తత్ర జన్మనిరోగీచతతతః శుద్ధో భ##వేద్ద్విజః. 3

పతి వ్రతా చైకపతౌ ద్వితీయే కులటా స్మృతా| తృతీయే ధర్షిణీ జ్ఞేయా చతుర్థే పుంశ్చలీత్యపి. 4

వేశ్యా చ పంచమే షష్ఠే పుంగీ చ సప్తమేష్టమే| తత ఊర్ధ్వం మహావేశ్యా సాస్పృశ్యా సర్వ జాతిషు. 5

యోద్విజః కులటాంగచ్ఛే ద్ధర్షిణీం పుంశ్చలీ మపి| పుంగీం వేశ్యాం మహావేశ్యాం మత్ప్యోదే యాతి నిశ్చితమ్‌. 6

శతాబ్దం కులటాగామీ ధృష్టాగామీ చతుర్గుణమ్‌ | షడ్గుణం పుంశ్చలీగామీ వేశ్యాగామీ గుణాష్టకమ్‌. 7

పుంగీగామీ దశగుణం వసేత్తత్ర న సంశయః|మహావేశ్యా కాముకశ్చ తతో దశగుణం వసేత్‌. 8

తత్రైవ యాతనాం భుంక్తే యమదూతేన తాడితః| తిత్తిరిః కులటాగామీ ధృష్టగామీ చ వాయసః. 9

కోకిలః పుంశ్చలీగామీ వేశ్యాగామీ వృకఃస్మృతః|పుంగీగామీ సూకర శ్చ సస్త జన్మని భారతే. 10

మహావేశ్యా ప్రగామీ చ జాయతే శాల్మలీతరుః| యోభుం క్తే జ్ఞాన హీనశ్చ గ్రహణ చంద్ర సూర్యయోః. 11

అరుంతుదం సయాత్యేవా ప్యన్నమానాబ్ధ మేవచ| తతో భ##వేన్మానవశ్చ ప్యుదరే రోగపీడితః. 12

ముప్పది ఐదవ అధ్యాయము

సావిత్య్రుపాఖ్యానము

ధర్మరాజిట్లనెను. ఓ సతీమతల్లీ! శ్రీ పరా దేవిని సేవించినంత కాలము కర్మము నశింపదు. మంచి పనుల వలన సుకృతము చెడు పనుల వలన నరకము గల్గును. ఓ పతివ్రతా! వ్యభిచారిణి చేతి యన్నము దిని దాని వలపు పొంగులో తగుల్కొన్నవాడు కాలసూత్ర నరక యాతన లొందును. అతడందు నూఱడులు యాతనలుపొంది పిదప రోగిగ బుట్టి తర్వాత శుద్ధాత్ముడగు ద్విజుడగును. ఒకపతిగలది పతివ్రత; ఇద్దఱిని గూడునది కులట; ముగ్గురివెంట బోవునది ధర్షిణి; నల్గురినైన లెక్కచేయక వలచునది పుంశ్చలి. ఐదుగురిని ఆరుగురిని పొందునది వేశ్య; ఏడుగురు లేకెన మండుగురు మిండ గాండ్రతో సయ్యాటలాడునది పుంగి. అంతకు మిక్కిలిగ లెక్కలేనంత మందితో తమిదీరక వదలనిది మహావేశ్య. ఆమె యే జాతి దైనను తాకరానిదే యగును. కులట ధర్షిణి పుంశ్చలి పుంగి వేశ్య మహావేశ్యయను వారిలో నెవరిని గూడినను విప్రుడు మత్స్యోదమున తప్పక బాధలు పడును. అందు కులటను మరగినవాడు నూఱండ్లును ధర్షిణిని తన మగసిరితో గెల్చువాడు దానికి నాల్గు రెట్లును పుంశ్చలి వెచ్చని వలపు కౌగిళ్ళలో సొక్కినవాడు దాని కారు రెట్లును వేశ్యకాంత వలపు టూయలల నూగినవాడు దాని కెనిమిది రెట్లును పుంగి కవ్వింపులకు కాలు దువ్వువాడు పది రెట్లు నైన యేండ్లును దానిలో వసించును. వలపు రేగిన మహావేశ్యతో శృంగారరాజ్య మేలు మొనగాడు దానికి పది యింతలుగ నందు యాతన లందును. అత డచట యమదూతలు పెట్టు బాధలు పడుచుండును. కులటగామి-తత్తిరిపక్షగ ధర్షిణిని గూడినవాడు కాకిగ వేశ్యగామి తోడేలుగను పుంశ్చలీగామీ కోయిలగను పుంగీగామి పందిగ నేడు జన్మలవఱకు భారతమున బుట్టు చుండును. ఇక మహావేశ్యను మరగిన సుందరాంగుడు తుదకు బూరుగు చెట్టుగ పుట్టును. సూర్యచంద్రగ్రహణములందజ్ఞానముతో నన్నము తినువాడు అన్నము మెదుకు లెన్ని గలవో యన్ని యేండ్లు నరుంతుద నరకమున గూలును. ఆ తర్వాత నతడుదర వ్యాధిచే పీడితుడుగ జన్మించును.

గుల్మయుక్త కాణశ్చ దంతహీన స్తతః శుచిః| వాక్ర్ప దత్తాం స్వకన్యాం చ యో న్యసై#్మ ప్రదదాతి చ. 13

స వసేత్పాంసు కుండే చ తద్బోజీ శత వత్సరమ్‌| తద్ద్రవ్యహారీయః సాధ్వి పాంసువేష్టే శతాబ్దకమ్‌. 14

నివసే చ్చరశయ్యాయాం మమ దూతేన తాడితః|భక్త్యా న పూజ యే ద్విప్రః శివలింగం చ పార్థివమ్‌. 15

స యాతి శూలినః పాపా చ్చూలప్రోతం సుదారుణమ్‌| స్థిత్వా శతాబ్దం తత్రైవ శ్వాపదః సప్తజన్మసు. 16

తతోభ##వే ద్దవేలశ్చ సప్తజన్మ తతః శుచిః| కరోతి కుంఠితం విప్రం యద్బియా కంపతే ద్విజః. 17

ప్రకంపేన వసేత్సోపి విప్రలోకాబ్ధ మేవ చ| ప్రకోప వదనా కోపాత్స్వామినం యాచపశ్యతి. 18

కటూ క్తింతం ప్రవదతి సోల్ముకం సంప్రయాతిహి| ఉల్కాం దదాతి తద్వక్త్రే సతతం మమ కింకరః. 19

దండేన తాడ యేన్మూర్ధ్నితల్లోమాబ్ద ప్రమాణమ్‌| తతో భ##వేన్మానవీ చ విధవా సప్చజన్మసు. 20

సా భు క్త్వా చవవైధవ్యం వ్యాధియుక్తా తతఃశుచిః| యా బ్రాహ్మణీ శూద్రభోగ్యా చాంధకూపే ప్రయాతి సా. 21

తప్తశౌ చోదకే ధ్వాంతే తదాహారీ దివానిశమ్‌|నివసేదతి సంతప్తా మమ దూతేన తాడితా. 22

శౌచోదకే నిమగ్నా సాయావ దింద్రాశ్చతుర్దశ| కాకీజన్మ సహస్రాణి శతజన్మాని సూకరీ. 23

సృగాలీ శతజన్మాని శతజన్మాని కుక్కుటీ| పారావతీ సప్తజన్మ వానరీ సప్తజన్మసు. 24

ఆ పిమ్మట నతడు గుల్మరోగిగ కుంటిగ పండ్లు లేనివాడు పుట్టి తర్వాత శుచి గాగలడు. ఒకని కిచ్చెదనన్న కన్య నింకొకని కిచ్చి పండ్లి చేసినవాడు పాంసుకుండమునందుండి దానినే తినుచు నూఱండ్లు దానిలో నుండును. కన్యా ద్రవ్య మపహరించువాడు నూఱండ్ల వఱకును దుమ్ము కొట్టుకొనగ బాణశయ్యపై నుండి యమదూతలచేత బాధలు పడుచుండును. విప్రుడైనను పార్థివ శివలింగమును భక్తితో పూజించినచో అతడు శివునకు చేసిన పాపమువలన దారుణమైన శూలప్రోత నరకమున నూఱడు లుండి తర్వాత నేడు జన్మలు శ్వాపదముగ బుట్టును. పిమ్మట నేడు జన్మలు పూజారిగ పుట్టి తర్వాత పవిత్రు డగును. ఎవడు విప్రుని నీచముగ చూచునో-కంపింపజేయునో ఆ విప్రుని రోమము లెన్నో యన్ని సంవత్సరము లతడు ప్రకంపన నరకమున యాతన లనుభవించును. తన స్వామినిని గ్రుడ్లెఱ్ఱజేసి తీవ్రముగ చూచునది వికటముగ లెక్కచేయక తన పతితో మాటాడునది ఉల్ముక నరకమున యమకింకరులచేత బాధ పడును. భటులామె నోట మండెడు కొరవు లుంతురు. ఆమె కెన్ని వెండ్రుకలు గలవో యన్ని వత్సరము లామెను యమదూతలు కొట్టి బాధలు పెట్టుదురు. ఆమె పిదప నేడు జన్మలు విధవగ నగుచుండును. ఆమె వ్యాధిపీడతో వైధవ్యమొంది పిదప పవిత్రురా లగును. శూద్రుని వలచి వలపించుకొన్న బ్రాహ్మణి అంధకూప నరకమందు దుఃఖము లొందును. ఆమె అందు రేబవళ్ళును క్రాగిన మలము తినుచు పెనుచీకటిలో సంతాప మొందుచు నా దూతలచేత దండింపబడుచుండును. ఆమె పదునల్గు రింద్రులంతకాలము శౌచోదకమందుండి పిదప వేయి జన్మలు కాకిగను నూఱు జన్మలు పందిగను నూఱు జన్మలు నక్కగను నూఱు జన్మలు కోడిగను నేడు జన్మలు పావురముగను నేడు జన్మలు కోతిగను బుట్టును.

తతో భ##వేత్సా చాండాలీ సర్వభాగ్యా చ భారతే| తతో భ##వేచ్చ రజకీ యక్ష్మ గ్రస్తా చ పుంశ్చలీ. 25

తతః కుష్ఠయుతా తైలకారీ శుద్ధా బవేత్తతః| నివసేద్వేధనే వేశ్యా పుంగీ చ దండతాడనే. 26

జలరంధ్రే వసేద్వేశ్యా కులటా దేహచూర్ణకే| సై#్వరిణీ దళ##నే చైవ ధృష్టా చ శోషణ తథా. 27

నివసే ద్యాతనా యుక్తా మమ దూతేన తాడితా| విణ్మూత్ర భక్షా సతతం యావన్మన్వంతరం సతి. 28

తతో భ##వేద్విట్కృమిశ్చ లక్షవర్షంతతః శుచిః| బ్రాహ్మణో బ్రాహ్మణీం గచ్చే త్షత్రియాం వాపి క్షత్రియః. 29

వైశ్యో వైశ్యాం చ శూద్రాం వా శూద్రశ్చా పి ప్రజేద్యది|సవర్ణరదారైశ్చ కాషాయం యాంతి తే జనాః. 30

భుక్త్వా కషాయ తప్తోదం నివసే ద్వా శతాబ్దకమ్‌| తతో విప్రోభ##వేచ్చుద్ధ స్తతోవై క్షత్రియాదయః. 31

యోషితశ్చాపి శుద్ధ్వంతీత్యేవమాహ పితామహః| క్షత్రియో బ్రాహ్మణీం గచ్ఛే ద్వైశ్యోవావ పతివ్రతే. 32

మాతృగామీ భ##వేత్సోపి శూర్పే చ నరకే వసేత్‌| శూర్పాకారైశ్చ కృమిభి ర్బ్రాహ్మణ్యా సహభక్షితః. 33

ప్రతప్త మూత్రభోజీ చ మమ దూతేనా తాడితః| తత్త్రైవ యాతనాం భుంక్తే యావదింద్రాశ్చ తుర్దశ. 34

సప్త జన్మ వరాహ శ్చ ఛాగలశ్చ తతః శుచిః| కరే ధృత్వా తు తులసీం ప్రతిజ్ఞాం యోన పాలయేత్‌. 35

మిథ్యా వాశపథం కుర్యా త్స చ జ్వాలాముఖం ప్రజేత్‌| గంగాతోయం కరేకృత్వా ప్రతిజ్ఞాం యోన పాలయేత్‌. 36

ఆ పిదప కర్మభూమి యగు భారతభూమిపై నామె చాండాలిగ బుట్టి పెక్కుమంది విటులచేత ననుభవింప బడును. ఆ తరువాత నామె చాకలిదిగ యక్ష్మరోగముగల పుంశ్చలిగ బుట్టును. అటు పిమ్మట కుష్టరోగము గలదై నూనె యముకొనుచు తర్వాత పరిశుద్ధురా లగును. వేశ్య-వేధన నరకమందును పుంగి-దండతాడన నరకమునందును బాధలు పడుచుండును. వేశ్య జలరంధ్రస్థానమున కులట-దేహచూర్ణమున నుండును. సై#్వరిణి-దళనము-ధర్షిణి-శోషణము అను నరకములందు బాధలు పడును. ఆపాపాత్మురాండ్రు దూతలచేత బాధలు పడుచుందురు. మలమూత్రము లెప్పుడును తిందురు. ఇట్లొకమన్వంతరము బాధలు పడుదురు. పిదప మలములోని పురుగులై పుట్టి లక్షయేండ్లుకు పరిశుద్ధురాండ్రగుదురు. బ్రాహ్మణు డితర బ్రాహ్మణిని క్షత్రియుడు-పరుల క్షత్రియకాంతను వైశ్యుడు పరుల వైశ్య స్త్రీని శూద్రు డితరుల శూద్ర యువతిని గూడినచో నతడు కషాయ నరకమందు బాధలు పడును. ఆ నరకకుండమందు క్రాగిన కషాయము త్రాగుచు నూఱండ్లున్న పిదప విప్రుడు-క్షత్రియుడు మొదలగు వారు శుద్ధి జెందుదురు. ఇటులే స్త్రీలు శుద్ధరాండ్రగుదురు. ఇట్లు పూర్వము బ్రహ్మ తెలిపెను. ఓ సతీ తిలకమా! క్షత్రియుడుగాని వైశ్యుడుగాని బ్రాహ్మణ స్త్రీని గూడినచో అతడు మాతృగామితో సమానుడు. అతడు శూర్ప నరకమునబడి యా బ్రాహ్మనితో గలిసి శూర్పాకారమైన పురుగులను దినును. అత డచట యమబాధలు పడుచు క్రాగిన మూత్రము త్రాగుచు పదునల్గు రింద్రు లంతకాల ముండును. అతడేడేండ్లు పందిగ పిదప మేకగ బుట్టి తర్వాత పరిశుద్ధు డగును. తులసీదళము పట్టుకొని చేసిన ప్రతిన నిలువబెట్టలేనివాడు ఊరక మాటిమాటికి శపథముల చేయువాడు జ్వాలాముఖ నరకమున గూలును. గంగాజలము చేతనుంచుకొని చేసిన ప్రతిన నిలువబెట్టలేనివాడు-

శిలాంవాదేవ ప్రతిమాం స చ జ్వాలాముఖం వ్రజేత్‌| దత్వా దక్షిణ హస్తం చ ప్రతిజ్ఞాం యోన పాలయేత్‌. 37

స్థిత్వా దేవగృహేవాపి స చ జ్వాలాముఖం వ్రజేత్‌| ఆస్పృశ్య బ్రాహ్మణంగాం చ జ్వాలా వహ్నిం వ్రజేద్ద్విజః. 38

న పాలయే త్ర్పతిజ్ఞాం చ స చ జ్వాలాముఖం వ్రజేత్‌| మిత్రదోహీ కృతఘ్నశ్చ యశ్చ విశ్వాసఘాతుకః. 39

మిథ్యాసాక్ష్య ప్రదశ్చైవ స చ జ్వాలాముఖం వ్రజేత్‌| ఏతే తత్ర వసంత్యేవ యావదింద్రాశ్చ తుర్దశ. 40

తథాంగార ప్రదగ్ధా వ్చ యమదూతేన తాడితాః| చాండాల స్తులసీం స్పృష్ట్వా సప్త జన్మతతః శుచిః. 41

వ్లుెచ్ఛో గంగాజల స్పర్శీ పంచజన్మ తతః శుచిః| శిలాస్పర్శీ విట్కృమిశ్చ సప్తజన్మసు సుందరి. 42

అర్చా స్పర్శీ బ్రహ్మ కృమిః సప్తజన్మ తతః శుచిః| పక్షహస్త ఫ్రదాతా చ సర్పశ్చ సప్త జన్మసు. 43

తతో భ##వేద్బ్రహ్మహీనో మానవశ్చ తతః శుచి | మిథ్యావాది దేవగృహే దేవలః సప్తజన్మసు 44

విప్రాది స్పర్శ కారీ చ వ్యాఘృజాతిర్బవే ద్ధ్రువమ్‌| తతో భ##వే చ్చ మూకః సబధిరశ్చ త్రి జన్మని. 45

భార్యాహీనో బంధుహీనో వంశహీన స్తతః శుచిః| మిత్రద్రోహీ చ నకులః కృతఘ్నశ్చా పి గండకః. 46

విశ్వాసఘాతీ వ్యాఘ్రశ్చ సప్త జన్మసు భారతే| మిథ్యాసాక్షీ చ వక్తవ్యే మండూకః సప్తజన్మసు. 47

పూర్వాన్సప్తా పరాన్సప్తపురు ష్హానంతి చాత్మనః| నిత్యక్రియా విహీనశ్చ జడత్వేనయుతో ద్విజః. 48

సాలగ్రామమునుగాని దేవతామూర్తినిగాని చేతబట్టుకొని ప్రతినచేసి నిలువబెట్టలేని వాడును జ్వాలాముఖ నరకము నందు యాతనలు పొందును. ఒకని చేతిలో కుడిచేయివేసి మాట యిచ్చి నిలువబెట్టుకొనలేని వాడును దేవాలయమున చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చనివాడును జ్వాలాముఖ నరకమందు గూలును. విప్రునిగాని ఆవునుగాని తాకి ప్రతిజ్ఞచేసి నిలువబెట్టుకొనలేని వాడును జ్వాలా ముఖమున పడును. ఏ ప్రతిజ్ఞనైన నెఱవేర్చనివాడు జ్వాలాముఖమున పడును. మిత్రద్రోహి-కృతఘ్నడు-విశ్వాస ఘాతకుడును తప్పుడు సాక్షిమిచ్చువాడు న్ను పావులు జ్వాలాముఖమున బాధలు పడుదురు. అచట వీరందఱును పదునల్గురింద్రులంత కాలము వసించి కష్టముల పాలగుదురు. యమ భటులు వారిని నిప్పులతోగాల్చి కొట్టుదురు. తులసీ దళమును పట్టుకొని చేసిన శపథము నెఱవేర్చలేనివాడు చండాలుడుగ నేడు జన్మలెత్తి తుదకు పవిత్రుడగును. గంగాజలమును తాకి చేసిన ప్రతిజ్ఞ నెఱవేర్చని వాడైదు జన్మలు యవనుడుగ బుట్టి పిమ్మట పరిశుద్ధుడు గాగలడు. ఓ సుందరీ! సాలగ్రామ శిలను దాకి యిచ్చిన మాటలను తప్పినవాడు మలములోని పురుగుగ నేడు జన్మలెత్తి తర్వాత శుచియగును. దేవతా విగ్రహ మును దాకి పల్కినమాట చెల్లింపనివాడు గృహస్థు నింట నేడు జన్మలు పురుగై పుట్టి తర్వాత శుచి యగును. తనకుడి చేతి నితరులచేతనుంచి మాటయిచ్చి తప్పినవాడు పాముగ నేడు జన్మలు దాల్చును. అతడు పిదప బ్రాహ్మణ జన్మమెత్తిన తర్వాత శుచి యగును. దేవుని గుడిలో మిధ్యావాదము చేసిన వాడేడు జన్మలు పూజారిగ బుట్టును విప్రుని దాకి మాటయిచ్చి నిలువబెట్టు కోలేనివాడు వ్యాఘ్రమై పుట్టి తర్వాత మూగగ మూడు జన్మలు చెవిటిగ బుట్టును. అతడు భార్య-బంధువులు-వంశములేని వాడుగబుట్టి పిదప శుచి యగును. మితృద్రోహి ముంగిసగను కృతఘ్నుడు గండకముగను బుట్టును. విశ్వాసఘాతకు డేడు జన్మలు భారత దేశమునందు వ్యాఘ్రముగను తప్పుడు సాక్ష్యము చెప్పువా డేడు జన్మలు కప్పగను బుట్టును. అతడు తనకు ముందు వెనుక నున్న యేడు తరాల వారిని చంపును. నిత్యక్రియలు జరపుకొనని విప్రుడు జడత్వ మొందును.

యస్యానాస్థా వేదవాక్యే మందం హసతి సంతతమ్‌| వ్రతోపవాసహీనశ్చ సద్వాక్య వరనిందకః. 49

ధూమ్రాంధే చ వసేత్సోపి శతాబ్ధం ధూమ్రభక్షకః| జలజంతుర్బవేత్సోపి శతజన్మ క్రమేణ చ. 50

తతో నానాప్రకారాశ్చ మత్స్యజాతి స్తతః శుచిః| యః కరోత్యుపహాసం చ దేవబ్రాహణయోర్దనే. 51

పాతయిత్వా స పురషా న్ధశాపూర్వాన్దశాపరాన్‌| సోయం యాతి చ ధూమ్రాంధం ధూమధ్వాంత సమన్వితమ్‌. 52

ధూమ్ర క్లిష్టో దూమ్రభోజీ వసేత్తత్ర చతుర్గుణమ్‌| తతో మూషకజాతిశ్చ సప్త జన్మసు భారతే. 53

తతోనానావిధాః పక్షిజాతయః కృమిజాతిభిః| తతోనానావిధా వృక్షాఃపశవశ్చ తతో నరః. 54

విప్రో దైవజ్ఞ జీవీచ వైద్యజీవీ చికిత్సకః| లాక్షాలోహాది వ్యాపారీ రసాది విక్రయీచ యః. 55

సయాతి నాగవేష్టం చ నాగైర్వేష్టిత మేవ చ| వసేత్సలోమమానాబ్దం తత్రైవ నాగపాశితః. 56

తతో నానా విధాః పక్షిజాతయశ్చ తతో నరః| తతో భ##వేత్స గుణకో వైద్యశ్చ సప్త జన్మసు. 57

గోపశ్చ కర్మకారశ్చ రంగాకార స్తతఃశుచిః| ప్రసిద్ధాని చ కుండాని కథితాని పతివ్రతే. 58

అన్యాని చాప్రతిసిద్ధాని క్షుద్రాణి సంతి తత్రవై | సంతి పాతకిన స్తేషు స్వకర్మ ఫలభోగినః. 59

భ్రమంతి నానా యోనించ కిం భూయః శ్రోతుమిచ్చసి|

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కందే పంచ త్రింశోధ్యాయః.

వేద వాక్యమందు నమ్మికలేని వాడును మెల్లమెల్లగ నవ్వువాడును వ్రతోప వాసములు చేయనివాడును మంచి మాటలు పెడచెవిని బెట్టువాడును నూఱండ్లు పొగపీల్చుకొను ధూమ్రాంధ నరకమందు గూలుదురు. వారు నూఱు జన్మలు వరుసగ నీటి జంతువులై పుట్టదురు. పిదపవారు పెక్కు విధముల చేపలుగబుట్టి తర్వాత శుద్ధి చెందుదురు. దేవ బ్రాహ్మణుల ధర్మమును పరిహసించువాడు తనకుముందు-వెనుకలనున్న పదితరాల వారిని నరకమున పడవేయును. వాడు చీకటిపొగతో నిండిన ధూమ్రాంధ నరకమున పలుయాతన లనుభవించును. అచట నతడు పొగగాలి పీల్చుకొనుచు పొగతో నాలుగింతలు బాధలుపడుచు నుండును. తర్వాత నతడు భారత భూమిపై నెలుకగ నేడు జన్మలు పుట్టును. ఆ తర్వాత నతడు పెక్కు విధముల పక్షులుగను పురుగులుగలను పుట్టి పుట్టి తరువాత చెట్లుగ-పశువులుగ పుట్టి పుట్టి మానవుడై శుద్ధిజెందును. జ్యోతిషము వృత్తిగను వైద్యము వృత్తిగను లక్క-యినుము-రస వస్తువుల వ్యాపారము చేయుచును బ్రదుకు విప్రుడు పాములచేత చుట్టబడి నాగవేష్టనరక యాతన లొందును. అచట తనకెన్ని రోమములుగలవో యన్ని యేండ్లచట వసించును. అతడు పిమ్మట పెక్కుపక్షుల జన్మలుదాల్చి తర్వాత మానవజన్మమెత్తును. ఆ పిదప లెక్కలు వ్రాయువాడుగను నేడు జన్మలు వైద్యుడుగను బుట్టును. అతడు గోవులుగాయువాడు కర్మకారుడు రంగులద్దువాడుగపుట్టి తర్వాత శుద్ధుడగును. ఓపతివ్రతా! ఈ ప్రకారముగ నీవు ప్రసిద్ధములైన నరక కుండముల గూర్చి తెల్పితిని. అచట నితర నరక కుండములు ముఖ్యములుగానివి నీచమైనవి ఎన్నియోకలవు. పాపాత్ముల వానిలోపడి తమ పాపఫలము లనుభవింతురు. వారుపెక్కు జన్మలు దాల్తురు. నీవిం కను నేమి వినదలతునో తెలుపుము.

ఇది శ్రీదేవీభాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధమందు ముప్పది యైదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters