Sri Devi Bagavatham-2
Chapters
అథైకచత్వారింశో೭ధ్యాయః. నారాయణ ఉవాచ: హరిం ధ్యాత్వా మరి ర్ర్బహ్మన్ జగామ బ్రహ్మణః సభామ్ |
బృహస్పతిం పురస్కృత్య సర్వైః సురగణౖః సహ.
1 శీఘ్రంగత్వా బ్రహ్మలోకం దృష్ట్వా చ కమలోద్బవమ్ | ప్రణముర్దేవతాః సర్వాః సహేంద్రాగురుణాసహ.
2 వృత్తాంతం కధయామా స సురాచార్యో విధింప్రతి ప్రహాస్యోవాచ తచ్ర్ఛుత్వా మహేంద్రం కమాలాసనః.
3 బ్రహ్మోవాచ : పత్స మద్వంశజాతో೭సి ప్రపౌత్రో మేవిచక్షణః | బృహస్పతే శ్చ శిష్య స్త్వం సురాణా మధిపః స్వయమ్.
4 మాతామహ శ్చ దక్ష స్తే విష్ణు భక్తః ప్రతాపవాన్ | కులత్రయం యస్య శుద్ధం కథం సో೭హంకృతో భ##వేత్. 5 మాతా పతివ్రతా యస్యపితా శుద్ధో జితేంద్రియః | మాతామహో మాతుల శ్చ కథం సో೭హంకృతోభ##వేత్. 6 జనః పైతృక దోషేణ దోషా న్మాతామహ స్య చ | గురు దోషా త్త్రిభిర్దోష్హైరరి దోషిభ##వేద్ధ్రువమ్.
7 సర్వాంతరాత్మా భగవాన్ సర్వదేహేష్వ೭వస్దితః | యస్య దేహాత్స ప్రయాతి స శవస్త త్షణ భ##వేత్. 8 మనో೭హ మింద్రియేశం చ జ్ఞాన రూపోహి శంకరః | విష్ణుప్రాణా చ ప్రకృతి ర్బు ద్ధి ర్బ గవతీ సతీ. 9 నిద్రాదయః శక్తయ శ్చతాః సర్వాః ప్రకృతేః కళాః | ఆత్మనః ప్రతిబింబ శ్చ జీవో భోగ శరీరభృత్. 10 ఆత్మనీశే గతే దేహా త్సర్వేయాంతి ససంభ్రమాః | యథా వర్త్మని గచ్ఛంతం నరదేవమినానుగాః. 11 అహం శివ శ్చ శేష శ్చ విష్ణుర్ధర్మో మహావిరాట్ | యూయం యదం శాభక్తా శ్చ తత్పుష్పం న్యక్కృతం త్వయా. 12 నలువది ఒకటవ అధ్యాయము లక్ష్మీ చరితము నారాయుణు డిట్లనియెను : అంత దేవేంద్రుడు హరిని మనసులో ధ్యానించి బృహస్పతి ముందు నడువగ సురలు తేడురాగ బ్రహ్మసభ కేగెను. దేవత లెల్లరు నింద్ర గురువులతో గలిసి త్వరితగతి నటుల బ్రహ్మలోక మేగి బ్రహ్మకు నమస్కరించిరి. జరిగిన వృత్తాంతమంతయును బృహస్పతి బ్రహ్మకు నివేదించెను. అపుడు నలువ నవ్వి యింద్రున కిట్లనెను. వ్స! నీవు నా వంశమున బుట్టితివి - నా ముని మనుమడవు - గురుని శిష్యుడవు - సురపతివి. నీ మాతామహుడు విష్ణు భక్తుడు - ప్రతాపియైన దక్షుడు. ఇట్లు నీ మూడు కులములు పవిత్రములు గదా! మఱి నీ కహంకార మెట్లు గల్గెను? ఎవని తల్లి పతివ్రతయో ఎవని తండ్రి శుద్ధాత్ముడగు జితేంద్రియుడో ఎవని తాత - మేనమామలు పవిత్రులో యట్టి వాని కహంకార మెట్లు గల్గును. మానవుడు తండ్రి దోషమున మాతామహుని దోషమున గురుని దోషమున నీ మాట తప్పక తానును దోషియగును. సర్వాంతారాత్ముడగు భగవాను డెల్ల దేహములందు చైతన్యజ్యోతి గవెల్గుచుండును. అతడెవని శరీరమును వదలునో అతని శరీరము శవ మగును. ఇంద్రియములకు మనస్సధిపతి: శంకరుడు జ్ఞాన స్వరూపుడు; భగవతి - సతియగు బుద్ధియే ప్రకృతి. అది విష్ణునకు ప్రాణము. నిద్ర మున్నగు శక్తు లన్నియును ప్రకృతి కళలు. జీవుడాత్మ ప్రతిబింబము. ఈ భోగాయతన శరీరమును దాల్చువాడు. రాజు బయలుదేరగనే యతని యనుచరు లతని వెంటనడతురు. అటులే యాత్మ దేహమును విడువగనే శక్తు లన్నియు నతని ననుసరించును. శివుడు శేషుడు విష్ణువు ధర్ముడు మహావిరాట్టు మీరు నేను నెవని యంశజులమో యెవని భక్తులమో యతని పుష్పమును నీవు తిరస్కరించితివి. శివేన పూజితం పాదపద్మం పుష్బేణ యేన చ | తత్ర దుర్వాససా దత్తం దైవేన న్యక్కృతంత్వయా. 13 తత్పు ష్బం మస్తకే యస్య కృష్ణ పాదాబ్జ ప్రచ్యుతమ్ | సర్వేషాం చ సురాణాం చ తత్పూజా పురతోభ##వేత్. 14 దైవేన వంచిత స్త్వం హి దైవం చ బలవత్తరమ్ | భాగ్యహీనం జనం మూఢం కోవా రక్షితు మీశ్వరః. 15 సా శ్రీగాతా೭ధునా కోపాత్కృస్ణ నిర్మాల్య వర్జనాత్ | అధునా గచ్ఛ వైకుంఠం మయాచ గురుణా సహ. 16 నిషేవ్య చత్ర శ్రీనాథం శ్రియం ప్రాప్స్యసి మద్వురాత్ | ఏవ ముక్త్వాచ సబ్రహ్మా సర్వైః సురగణౖః సహ. 17 తత్ర గత్వా పరం బ్రహ్మ భగవంతం సనాతనమ్ | దృష్ట్వా తేజః స్వరూపంతం ప్రజ్వలంతం స్వతేజసా. 18 గ్రీష్మమధ్యాహ్న మార్తండ శత కోటి సమ ప్రభమ్ | శాంత మనాది మధ్యాంతం లక్ష్మీకాంత మాం తకమ్. 19 చతుర్బుజైః పార్శదైశ్చ సరస్వత్యా యుతం ప్రభుమ్ | భక్త్యా చతుర్బి ర్వేదైశ్చ గంగయా పరి వేష్టితమ్. 20 తం ప్రణముః సురాం సర్వే మూర్ద్నా బ్రహ్మపురోగమాః | భక్తి నమ్రాఃసాశ్రునేత్రా స్తుష్టువుః పరమేశ్వరమ్. వృత్తాంతం కధ యామాస స్వయం బ్రహ్మా కృతాంజలిః | 21 రురుదుర్దేవతాః సర్వాః స్వాధికారా చ్చ్యుతా శ్చ తాః. 22 స దదర్శ సురగణం విపద్గ్రస్తం భయా కులమ్ | రత్న భూషణ శూన్యం చ వాహనాది విపర్జితమ్. 23 శోభాశున్యం హతశ్రీకం నిష్రభం సభయం పరమ్ | ఉవాచ కాతరం దృష్ట్వ భయభీతి విభంజనః. 24 శివుడు విష్ణుని నే పుష్పముతో పూజించెనో దానిని హరి దుర్వాసున కిచ్చెను. ఆ ముని నీ కీయగ నీవు దానిని తిరస్కరించితివి. ఆ శ్రీకృష్ణుని పదకమలములం దుంచబడిన పుష్ప మెవని తలపై నుండునో యతడు సకల సురలలో నగ్రగణ్యుడగును. నీవు నష్ట భాగ్యుడవు: విధివంచితుడవు; దైవము బలవత్తరమైనది; ఆదృష్టహీనుడగు మూఢు నెవడును రక్షింపజాలడు. శ్రీకృష్ణుని నిర్మాల్యమును తిరస్కరించుట వలన నిపుడు రాజ్యశ్రీ నిన్ను వదలిపోయినది. కనుక గురుడు నేను వెంటరాగ నీవు వైకుంఠమున శ్రీపతిని సంసేవించి నా వరప్రభావమున తిరిగి లక్ష్మని బడయగలవు. అని బ్రహ్మ సురగణములతో తరలెను. అచటికి వెళ్ళి వారు భగవానుని దర్శించిరి. హరి స్వయంప్రకాశముతో వెల్గులు జిమ్ముచున్నాడు - సనాతనుడు - పరబ్రహ్మము - లక్ష్మిప్రియుడు - అనంతుడు - పరమశాంతుడు - ఆది మధ్యాంత రహితుడు - గ్రీష్మనున పట్ట పగలింటి నూఱు కోట్ల సూర్యుల కాంతులు విరజిమ్ముచున్నాడు. అతడు చతుర్బుజులగు పార్శ్వచరులతో గంగా సరస్వతులతో కొలువుండి నాల్గు వేదములతో నుతింపబడు పరమపురుషుడు. బ్రహ్మ మొదలగు దేవత లెల్లరును విష్ణునకు నమస్కరించిరి. వారు గద్గదకంఠముతో భక్తి నమ్రులై కన్నీ రొలుక పరమేశ్వరుని సంస్తుతించిరి. అపుడు బ్రహ్మ స్వయముగ దోసి లొగ్గి జరిగిన దంతయు విన్నవించెను. తమ తమ యధికారములు గోల్పోయిన దేవత లందఱును గోడుగోడున విలపించిరి. అంత శ్రీహరి రత్నభూషణములు - వాహనములు లేక భయముతో వణకుచు నాపదలందు జిక్కుకొనిన సురగణమును చూచెను. భయ నివారకుడు - అభయదాతయగు హరి శోభాప్రభలు - కోల్పోయి వెలవెబోవుచున్న దేవతలను చూచి యిట్లనెను. శ్రీభగవానువాచ : మాభైర్ర్బహ్మన్ హేసురాశ్చ భయం కిం వో మయి స్ధితే | దాస్యామి లక్ష్మీ మచలాం పరమైశ్వర్య వర్ధినీమ్. 25 కించ మద్వచనం కించి చ్ఛ్రూయతాం సమయోచితమ్ | హితం సత్యం సారభూతం పరిణామ సుఖావహమ్. 26 జనా శ్చా సంఖ్య విశ్వస్ధా మదధీనా శ్చ సంతతమ్ | యథతథా೭హం మద్బక్త పరా ధీనో೭స్వతంత్రకః. 27 యంయంరుష్టోహి మద్బక్తో మత్పరో హి నిరం కుశః | తద్గృహే೭హంస తిష్ఠామి పద్మయా సహనిశ్చితమ్. 28 దుర్వాసా శంకరాంశ శ్చ వైష్ణవో మత్పరాయణః | తచ్ఛాపాదాగ తో೭హం చ సలక్ష్మీకో హి వోగృహాత్. 29 యత్ర శంఖధ్వనిర్నాస్తి తులసీ న శివార్చనమ్ | నభోజనం చ విప్రాణాం న పద్మా తత్ర తిష్ఠతి. 30 మద్బక్తానాం చ మేనిందా యత్ర బ్రహ్మన్ భ##వేత్సురాః | మహారుష్టా మహాలక్ష్మీ స్తతోయాతి పరాభవమ్. 31 మద్బక్తిం హీనోయో మూఢో భుంక్తేయోహరి వాసరే | మమ జన్మ దీనే వాపియాతి శ్రీ స్తద్గృదపి. 32 మన్నామ విక్రయీ యశ్చ విక్రీణాతి స్వ కన్య కామ్ | యత్రాతిథి ర్న భుంక్తే చ మత్ర్పి యా యాంతి తద్గృహాత్. 33 యోవిప్రః పుంశ్చలీవుత్రో మహాపాపీ చ తత్పతిః | పాపినో యో గృహం యాతి శూద్ర శ్రాద్ధాన్న భోజకః. 34 మహారుష్టా తతో యాతి మందిరా త్కమలాలయా | శూద్రాణాం శపదాహి చ భాగ్యహీనోద్విజాధమః. 35 యాతి రుష్టా తద్గృహా చ్చ దేవాః కమల వాసినీ | శూద్రాణాం సూపకారీ యో బ్రాహ్మణో వృషవాహకః. 36 శ్రీభగవాను డిట్లనెను : బ్రహ్మా! దేవతలారా! భయపడకుడు నే నుండగ మీకు భయమేల? పరమైశ్వర్యము గల్గించు శాశ్వతలక్ష్మీని మీకు ప్రసాదించగలను. నామాట కొంచె మాలకింపుడు. సమయోచితము - హితము - సత్యము - సారభూతము సుఖకరమైన మాట మీకు చెప్పెదను. ఈ యనంత బ్రహ్మాండములందలి ప్రాణి కోటు లెల్లను నా యధీనమం దుండును. నేను భక్తరాధీనుడను. అస్వతంత్రుడను. నా ప్రియభక్తుడు నన్నే నమ్నుకొనయుండు నిరంకుశుడు. అత డెవరిని కోపించునో వారియింట నేను - లక్ష్మీ యిర్వురము నివసింపము. దూర్వాసుడు శంకరాంశజుడు వైష్ణవుడు - నన్ను గొల్చువాడు. అతడు మీ కిచ్చిన శాపమువలన నేను - లక్ష్మీయును మీ గృహమునుండి వెడలి వచ్చితిమి. శంఖ ధ్వని తులసి శివార్చనము బ్రాహ్మణ నిత్యభోజనము లేని యింట లక్ష్మి నివసింపదు. బ్రహ్మా! సురలారా! నా భక్తులకు నాకు నింద గల్గినచోట సిరి యుండనొల్లదు. కోపముతో లేచిపోవును. ఏ మూఢుడు నా భక్తిలేక ఏకదాశి-అష్టమి-నా పుట్టిననాడు భోజనము చేయునో యతని యింట సిరి యుండనోపదు. నానామమును - కన్యకను నమ్నుకొను వాని యింట అతిధులు భుజింపని యింట లక్ష్మి వెడలిపోవును. రంకు టాలికి పుట్టిన బాపని యింట రంకు టాలి పతి యింట శూద్రుల శ్రాద్ధాన్నము తినువాని యింట లక్ష్మి నివసింపక కొపముతో లేచిపోవును. శూద్రుల శవములు కాల్చువాడు భాగ్యహీనుడగు ద్విజాధముడు. అట్టి పాపుల యింటినుండి రోషములతో లక్ష్మి లేచిపోవును. శూద్రుల వంటలు చేయువాడగు బ్రాహ్మణునింట నెడ్లబండిలాగు విప్రు నింట లక్ష్మి యుండక వెళ్ళును. తత్తోయ పానభీతా చ కమలాయాతి తద్గృహాత్ | అశుద్దహృదయః క్రూరోహింసకో నిందకోద్విజః. 37 బ్రాహ్మణః శూద్రయాజీ చ యాతి దేవీ చ తద్గృహాత్‌ః | అవీరాన్నం చ యోసూఃంక్తే తస్మాధ్యాతి జగత్ర్పభు. 38 తృణం ఛినత్తినఖరైసై#్తర్వా యో విలిఖేన్నహీమ్ | నిరాశో బ్రాహ్మణో యత్రద్గృహా೭ద్యాతిమత్ర్పియా. 39 సూర్యోదయే ద్విజోభుంక్తే దివాశాయీ చ బ్రాహ్మణః | దివామైథున కారీ చ యస్తస్మా ద్యాతి మత్ర్పియా. 40 ఆచారహీనో విప్రోయో యశ్చ శూద్ర ప్రతిగ్రహీ | అదీక్షితో హి యోమూఢ స్తస్మాద్వైయాతి మత్ర్పియా. 41 స్నిగ్ద పాదశ్చ నగ్నోహి యఃశేతే జ్ఞాన దుర్బలః | శశ్వ ద్వదతి వాచాలో యాతి సాత ద్గృహాత్సతీ. 42 శిరః స్నాతస్తు తైలేనమ యో೭న్యాంగం సముపస్పృశేత్ | స్వాంగే చ వాదయే ద్వాద్యం రుష్టాసా యాతి తద్గృహాత్. 43 వ్రతోపవాస హీనోయః సంధ్యాహీనో೭శు చిర్ద్విజః | విష్ణు భక్తి విహీన స్తు తస్మా ద్యాతి చ మత్ర్పియా. 44 బ్రాహ్మణం నిందయే ద్యో೭హితం చ యోద్వేష్టి సంతతమ్ | జీవహింసో దయాహీనో యాతిసర్వ ప్రసూస్తతః. 45 యత్ర యత్ర హరేరర్చా హరేరుత్కీర్తనం తథా | తత్ర తిష్ఠతి సాదేవీ సర్వ మంగళ మంగళా. 46 యత్ర వ్రశంసా కృష్ణస్య తద్బక్త స్య పితామహ | సాచ కృష్ణప్రియా దేవీ తత్ర తిష్ఠతి సంతతమ్. 47 యత్ర శంఖధ్వనిః శంఖశిలా చ తులసీ దళమ్ | తత్సేవా వందనం ధ్యానం తత్ర సా పరితిష్ఠతి. 48 అతని చేతి నీరు త్రాగుటకు లక్ష్మీ యిష్టపడదు. చిత్తశుద్ధి లేనివాడు క్రూరుడు హింసకుడు నిందకుడునైన ద్విజునింట శూద్రయాజియగు బ్రాహ్మణునింటి సిరి యుండదు. పతిపుత్రులులేని స్త్రీ చేతి యన్నము తినువాని యింట లచ్చి నివసింపదు. గోళ్లతో గడ్డి త్రుంచువాని యింట గోళ్లతో నేల గీకువాని యింట బ్రహ్మాణుడు నిరాశతో వెళ్ళు వాని యింట లక్ష్మి యుండనోపదు. సూర్యోదయమున భుజించువాని యింట పగలు నిద్రించువాని యింట పగలు రతి సల్పు వాని యింట సిరి యుండజాలదు. దురాచారియుగు విప్రు నింట శూద్రులనుండి దానము పట్టువాని యింట దీక్ష గైకొనని మూఢు నింట లక్ష్మి యుండదు. తడి కాళ్లతో - దిగంబరముగ నిదురుంచువాని యింట అజ్ఞాని-వదరుబోతునైన వాని యింట లచ్చి యుండనోపదు. తలకు నూరె రాచుకొని యా చేత నితరులను తాకువాని యింట తన శరీరముపై వాద్యము వాయుంచువాని యింట నుండక కొపముతో లచ్చి లేచిపోవును. వ్రతోపవాసము-సంధ్యావందనము చేయనివాని యింట విష్ణుభక్తి లేనివా యింట లక్ష్మి వసించదు. బ్రాహ్మణుని సతతము నిందించి ద్వేషించువాని యింట జీవహింస చేయుచు దయమాలినవాని యింట లక్ష్మియుండదు. ఎచ్చటెచ్చట శ్రీహరి పూజలు - నామ సంకీర్తనలును సాగుచుండునో యచ్చటచ్చట సర్వమంగళ మంగళయగు సిరి పాయక సిరులు గురియుచుండును. పితామహా! ఎచ్చోట శ్రీకృష్ణుని ప్రశంస జరుగునో కృష్ణ భక్తుల మహిమలు కొనియాడబడుచుండునో యచ్చోట కృశ్ణప్రియయగు లచ్చి వాసమై యుండును. ఎచొట దక్షిణావర్త శంఖము - శంఖధ్వని - తులసీధళ ముండునో హరిసేవ - వందనము - ధ్యానము జరుగునో యచొట లచ్చి కొలు వుండును. శివలిం గార్చనం యత్ర తస్య చోత్కీర్తనం శుభమ్ | దుర్గార్చనం తద్గుణా శ్చ తత్ర పద్మనివాసినీ. 49 విప్రాణాం సేవనం యత్ర తేషాం చ భోజనంశుభమ్ | అర్చనం సర్వ దేవానాం తత్ర పద్మముఖీ సతీ. 50 ఇత్యుక్త్వా చ సురాన్సర్వారన్ మామాహరమాపతిః | క్షీరోదసాగరే జన్మ కలయా೭೭ కలయేతి చ. 51 ఇత్యుక్త్వా తాం జగన్నాథో బ్రహ్మాణం పునరాహ చ | మథిత్వా సాగరం లక్ష్మీం దేవేభ్యో దేహి పద్మజే. 52 ఇత్యుక్త్వా కమలా కాంతో జగామాంతః పురం మునే | దేవా శ్చి రేణ కాలేన యయుః క్షీరోద సాగరమ్. 53 మంథానం మందరం కృత్వా కూర్మం కృత్వ చ భాజనమ్. కృత్వా శేషం మంథ పాశం మమంథు రసురాః సురాః. 54 ధన్వంతరిం చ పీయూష ముచ్చైఃశ్రవసమీ ప్సితమ్ | నానారత్నం హస్తిరత్నం ప్రావుర్లక్ష్మీం సుదర్శనమ్. 55 వనమాలాం దదౌ సాచ క్షీరొదశాయినే మునే | సర్వేశ్వరాయ రమ్యాయ విష్ణవే వైష్ణవీ సతీ. 56 దేవైః స్తుతా పూజితా చ బ్రహ్మణా శంకరేణ చ | దదౌ దృష్టిం సురగృహే బ్రహ్మశాప విమోచనాత్. 57 ప్రారుర్ధేవాః స్వవిషయం దైత్య గ్రస్తంభయంకరమ్ | మహాలక్ష్మీ ప్రసాదేన వరదాదేన నారద. 58 ఇత్యేవంకథితం సర్వం లక్ష్మ్యు పాఖ్యాన ముత్తమమ్ | సుఖదం సారభూతం చ కిం భూయః శ్రోతుం మిచ్చసి. 59 ఇతి శ్రీదేవిభాగవతే మహాపురాణ నవమస్కంధే ఏకచత్వారింశోధ్యాయః. శివలింగార్చనము శివుని గుణనామ సంకీర్తనము శ్రీదుర్గాపుజ దూర్గా గుణ మహిమ గానము జరుగు తావులందు పద్మాలయ నివసించును. బ్రాహ్మణ పుజా-బ్రాహ్మణ భోజనము జరుగు చోట్ల సర్వ దేవార్చనము జరిగినట్లగును. కనుక నచ్చట లక్ష్మి నిక్కముగ కొలువై రాజిల్లును. అని దేవతలతో పలికి హరి మలర లక్ష్మీతో 'నీవు నీ యొక కళతో పాల సంద్రములో నవతరించు'మని పలికెను. ఇట్లు పలికిన పిదప కమలాపతి మరల బ్రహ్మతో నిట్లనియెను. ఓ బ్రహ్మా! దేవత లందఱును కలిసి సముద్రము మథించి లక్ష్మిని దేవతల కిండు. అని కమలాపతి పలికి తన యంతిపురమున కరిగెను. దేవతలును కొంత కాలమునకు పాలసంద్రము చేరిరి. మందరగిరిని కవ్వముగ శేషుని కవ్వపుత్రాడుగా తాబేటి నాధారముగ జేసి దేవాసురులు సాగరమును చిలికిరి. అపుడందుండి ధన్వంతరి ఉచ్చైఃశ్రవము ఐరావతము నానా రత్నములు సుదర్శనము లక్ష్మీ అమృతము నుద్బవించెను. నారదా! అంత క్షీరసాగర శయనుడు సర్వేశ్వరుడు రమ్యుడు నైన విష్ణు కంఠసీమలో లక్ష్మి వైజయంచి వనమాల నలంకిరంపజేసెను. అత్తఱి లక్ష్మిని సురలు బ్రహ్మ శివుడును పూజించిరి. బ్రాహ్మణ శాపము తొలగుట వలన కలుముల తల్లి మరల దేవతల యిండ్లలో నివసింపజొచ్చెను. నారదా! మహాలక్ష్మి వర ప్రసాదమున దైత్యులు భయంకరముగ దూరాక్రమణము చేసిన స్వర్గమును దేవతలు తిరిగి పొందిరి. ఇట్లు నీకు పవిత్రమైన లక్ష్మీదేవి మహోపాఖ్యానము వినిపించితిని. ఇది సుఖదము. సారభూతమునైనది. ఇంకేమి వినదలచితివో తెల్పుము. ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి తొమ్మిదివ స్కంధమున నలువదియొకటవ యధ్యాయము.