Sri Devi Bagavatham-2    Chapters   

అథషట్చత్వారింశోధ్యాయః

నారద ఉవాచః అనేకానాం చ దేవీనాం శ్రుతుమాఖ్యాన ముత్తమమ్‌ | అన్యాసాం చరితం బ్రహ్మ స్వద వేదవిదాం వర. 1

నారాయణ ఉవాచః సర్వాసాం చరితం విప్ర వేదేషు చ పృథక్‌ పృథక్‌ |

పూర్వోక్తానాం చ దేవీనాం కాసాం శ్రోతు మిహేచ్చసి. 2

నారద ఉవాచః షష్ఠీ మంగళచండీ చ మనసా ప్రకృతేః కళా |

ఉత్పత్తి మాసాం చరితం శ్రోతుమి చ్చామి తత్త్వతః 3

నారాయణ ఉవాచః షష్ఠాంశా ప్రకృతేర్యా చ సా చ షష్ఠీ ప్రకీర్తితా |

బాలకానా మధిష్ఠాత్రీ విష్ణుమాయా చ బాలదా. 4

మాతృకాసు చ విఖ్యాతా దేవసేనాభిధా చ యా | ప్రాణాధిక ప్రియా సాధ్వీ స్కందభార్యా చ సువ్రతా 5

ఆయుః ప్రదా చ బాలానాం ధాత్రీ రక్షణ కారిణీ | సతతం శిశువార్శ్వస్థా యోగేన సిద్ధయోగినీ. 6

తస్యాః పూజా విధిం బ్రహ్మాన్ని తిహాసమిదంశృణు | య చ్ర్చుతం ధర్మవక్త్రేణ సుఖదం పుత్రదం పరమ్‌. 7

రాజాప్రియ వ్రత శ్చా సీ త్స్వాయంభువమనోః సుతః |

యోగీంద్రో నోద్వహద్బార్యాం తపస్యాసు రతః సుదా. 8

బ్రహ్మజ్ఞయా చ యత్నేన కృతదారో బభూవహ | సుచిరం కృతదార శ్చ న లేభే తనయం మునే. 9

పుత్రేష్టి యజ్ఞం తం చాపి కారయామాస కశ్యపః | మాలిన్యై తస్య కాంతాయై ముని ర్యజ్ఞచరుం దదౌ. 10

భుక్త్యా చ తం చరుం తస్యాః సద్యో గర్బో బభూవ హ | దధార తం చ సా దేవీ దైవం ద్వాదశవత్సరమ్‌. 11

తతః సుషావ సా బ్రహ్మ న్కు మారం కనక ప్రభమ్‌ | సర్వావయవ సంపన్నం మృత ముత్తారలోచనమ్‌. 12

నలువదిఆరవ అధ్యాయము

షష్ఠీదేవీ చరితము

ƒyLRiµR…V²T…ÈýÁ®ƒsƒ«sV iM J úËØx¤¦¦¦øß᪫sLSù ! ®ªs[µR…„sµR…VÌÁÍÜ[úZaP[xtîsv²y ! |msNRPVä ®µ…[ª«s»R½ÌÁ xms„sú»R½ µj…ª«sù¿RÁLjiú»R½ÌÁV ¿ÁxmsögRi „sLiÉÓÁ¬s. BLiNTP»R½LRi ®µ…[ª«soÌÁ¿RÁLji»R½ÌÁVƒ«sV µR…¸R…V»][ ¾»½ÌÁVxmsoª«sVV. ƒyLS¸R…VßáV²T…ÈýÁ®ƒsƒ«sV iM „súxmsª«sLSù ! FsÌýÁ ®µ…[ª«s»R½ÌÁ ¿RÁLjiú»R½ÌÁV ®ªs[µR…ª«sVVÌÁLiµR…V ®ªs[lLi[*LRiVgRi ¿Áxmsö‡Á²T…ƒ«s„s. xmspLRi*ª«sVV ¿Áxmsö‡Á²T…ƒ«s ®µ…[„ds ¿RÁLji»R½ÌÁÍÜ[ ¬ds ®ªsª«sLji gRiWLjiè „sƒ«sµR…ÌÁ»R½Vª¯[ ¾»½ÌÁVxmsoª«sVV. ƒyLRiµR…V²T…ÈýÁ®ƒsƒ«sV iM xtsQ{tîsQc ª«sVLigRiÎÏÁ ¿RÁLi²T…NRPc ª«sVƒ«sxqs ¸R…Vƒ«sVªyLRiÌÁV úxmsNRPX¼½ NRPÎÏÁÌÁƒ«sVLi²T…xmsoÉíÓÁƒ«sªyLRiÌÁV. „dsLjixmsoÈíÁVNRPÌÁVc ¿RÁLji»R½ÌÁV ƒyNRPV „sƒ«sg][LjiNRP ¬sÇÁª«sVVgRi gRiÌÁVgRiV¿RÁVƒ«sõµj…. ƒyLS¸R…VßáV²T…ÈýÁ®ƒsƒ«sV. iM úxmsNRPX¼½ÍÜ[¬s ¸R…WLRiª«s ¸R…VLiaRPª«sVgRiV ®µ…[„s¬s xtsQ{tîsQ®µ…[„s ¸R…VLiµR…VLRiV. A®ªsV ËØÍص³j…uîyƒ«s®µ…[„sc „sxtñsvª«sW¸R…Vc xmsoú»R½µyLiVV¬s, A®ªsV ª«sW»R½XNRPÌÁLiµR…V ®µ…[ª«s}qsƒ«s¸R…Vƒ«s úxmszqsµôðj…gSLi¿Áƒ«sV. A®ªsV xqsäLiµ³R…V¬s ˳ØLRiùcxqsVúª«s»R½cryµ³j…*c xqsäLiµR…V¬s úFyßص³j…NRPúzms¸R…V. ËØÌÁVLRi NS¸R…VVª«so ¬s¿RÁVè »R½ÖýÁ. µyµj…ª«sÛÍÁ zmsÌýÁÌÁƒ«sV LRiOTPQLi¿RÁV »R½ÖýÁcFsxmsöV²R…V bPaRPVª«soÌÁ úxmsNRP䮃s[ ¸R…VVLi²R…V »R½ÖýÁ. ¸R…WgRizqsµôðR…c zqsµôðR…¹¸…Wgji¬s. ª«sV¥¦¦¦aRP¸R…W! @ÉíÓÁ xtsQ{tîsQ®µ…[„s xmspÇØ „sµ³yƒ«sª«sVVcÀÁLjiú»R½ „sƒ«sVª«sVV. xmsoú»R½cxqsVÅÁúxmsµR…ª«sVgRiV ƒy®ªsV ¿RÁLji»R½ª«sVV ®ƒs[ƒ«sV ª«sVVƒ«sVõ ª«sW»R½Liú²T…¸R…VgRiV µ³R…LRiVø¬s ƒ¯[ÈÁ „sLiÉÓÁ¬s. xmspLRi*ª«sVV ry*¸R…VLi˳ÏÁVª«s ª«sVƒ«sVª«so xmsoú»R½V²R…V úzms¸R…Vúª«s»R½V ²R…VLi®²…ƒ«sV. @»R½²R…V |msZNP[äLi²ýR…V |msLi²ýT… ¿Á[xqsVN]ƒ«sNRP ¹¸…WgkiLiúµR…V\®²… »R½xms ®ªsVVƒ«slLi胫sV. @»R½²R…V »R½LS*»R½ ú‡Áx¤¦¦¦ø xmsxqsVxmsoƒ«s |msLi²ýT… ¸R…V¹¸…Vùƒ«sV. NS¬s ¸R…V»R½¬sNTP |msZNP[äLi²ýR…V xqsLi»R½¼½ gRiÌæÁÛÍÁ[µR…V. NRPaRPùxmso²R…»R½¬s¿Á[»R½ xmsoú»R½NS®ªs[VztîsQ ÇÁLjizmsLi¿Áƒ«sV. @»R½¬s ˳ØLRiù ª«sWÖÁ¬sNTP ¸R…WgRi¿RÁLRiVª«so ¬s¿Á胫sV. ¿RÁLRiVª«so ¼½¬sƒ«s ®ªsLiÈÁ®ƒs[ ª«sWÖÁ¬sNTP gRiLRi÷骫sVV ¬sÖÁ¿Áƒ«sV. A®ªsV xmsLiú®²…Li®²…[²R…VÌÁ ª«sàáNRPV gRiLRi÷骫sVV ®ªsW|qsƒ«sV. A®ªsV ÀÁª«sLRiNRPV ‡ÁLigSLRiVNSLi¼½ gRiÖæÁƒ«s xqsLS*LigRixqsVLiµR…LRiV\®²…ƒ«s ¹¸…VVNRPxmsoú»R½V¬s gRi®ƒsƒ«sV. NS¬ds ¸R…V»R½²R…V ª«sVX»R½V\®²… úgRiV²ýR…V ¾»½[ÌÁ®ªs[zqs ¸R…VVLi®²…ƒ«sV.

తం దృష్ట్యా రురుదుః సర్వా నార్య శ్చ బాంధవ స్త్రీయః | మూర్చా మవాప తన్మాతా పుత్రశో కేన భూయసా.

శ్మశానం చ య¸° రాజా గృహీత్వా బాలకంమునే | రురోద తత్ర కాంతారే పుత్రం కృత్వా స్వవక్షసి. 14

నోత్సృజ ద్బాలకం రాజా ప్రాణాం స్త్యక్తుం సముద్యతః | జ్ఞానయోగం విసస్మార పుత్రశోకా త్సుదారుణాత్‌.

ఏతస్మి న్నంతరే తత్ర విమానం చ దదర్శ సః | శుద్ధస్పటిక సంకాశం మణిరాజ వినర్మితమ్‌. 16

తేజసా జ్వలితం శశ్వచ్చోభితం క్షౌమవాససా | నానాచిత్రవిచిత్రాఢ్యం పుష్పమాలా విరాజితమ్‌. 17

దదర్శ తత్ర దేవీం చ కమనీయాం మనోహరామ్‌ | శ్వేత చంపక వర్ణాభాం శశ్వత్సు స్థిర ¸°వనామ్‌. 18

ఈ షద్ధాస్య ప్రసన్నా స్యాం రత్న భూషణ భూషితామ్‌ | కృషా మయీం యోగసిద్ధాం భక్తాను గ్రహకాతరామ్‌. 19

దృష్ట్వా తాం పురతో రాజా తుష్టావ పరమాదరమ్‌ | చకార పూజనం తస్యా విహాయ బాలకం భువి. 20

పప్రచ్చ రాజా తాం తుష్టాం గ్రీష్మసూర్య సమ ప్రభామ్‌. |

తేజసా జ్వలితాం శాంతాం కాంతాం స్కందస్య నారద. 21

రాజోవాచ : కాత్వం సుశోభ##నే కాంతే కస్య కాంతాసి సువ్రతే |

కస్య కన్యా వరారోహే ధన్యా మాన్యా చ యోషితామ్‌. 22

నృపేంద్రస్యవచః శ్రుత్వా జగన్మంగళ చండికా | ఉవాచ దేవసేనా సా దేవానాం రణకారిణీ. 23

దేవానాం దైత్యగ్రస్తానాం పురా సేనా బభూవ సా | జయం దదౌ సా తేభ్య శ్చ దేవసేనా చ తేనసా. 24

ఆ శిశువు చచ్చెనని బందుగులు స్త్రీ లందఱు నేడ్వసాగిరి. తల్లియును పుత్రశోకమున మూర్చిల్లెను. రాజు చచ్చిన బాలుని గొని శ్మశానమునకు తీసికొని పోయి యతనిని ఱొమ్మునకు హత్తుకొని వలవల యేడ్వసాగెను. రాజు బాలుని వదల లేక దారుణ పుత్రశోకమున జ్ఞానము గోల్పోయి తానును చచ్చుటకు నిశ్చయించుకొనెను. అంతలో మేలుజాతి స్పటికములతోదివ్య మణులతో నిర్మింపబడిన యొక దివ్య విమాన మచట గనబడెను. అది చిత్రవిచిత్రమైన రంగులతో పూమాలలతో తెల్లని వస్త్రములతో శోభిల్లుచు వెలుగులు చిమ్ముచుండెను. రాజు దానియం దొక దేవిని దర్శించెను. ఆమె కుసుమ కోమల- సుమనోహర- శ్వేతచంపకవర్ణ- నిండు జవ్వని. చిర్నగవున విరిసిన మోము గలది- రత్నభూషణ భూషిత-కరుణా తరంగిణి- యోగసిద్ధ- భక్తానుగ్రహవిగ్రహ. రాజు తన యెదుట నున్న బాలుని వదలి యామెను దర్శించి పూజించి సంతోషపఱచెను. నారదా ! గ్రీష్మ ఋతువందలి సూర్యుని పగిది విలసిల్లునది-తుష్ట-శాంత యగు స్కందుని భార్యతో రాజిట్లు పలికెను. శోభనాంగీ! నీ వెవరవు ? ఓ సువ్రతా ! నీవెవరి కన్నియవు ! కాంతామణీ ! నీ కాంతుడెవడు ! నీవు స్త్రీ లోకమున మాన్యపు ధన్యపు సుమా. అను రాజు మాటలు విని జగములకు మంగళచండిక దేవరణకారిణియైన దేవసేన యిట్లు పలికెను. పూర్వము దానవులచేత నోటుపడిన దేవతలకు సేనాధిపత్యము వహించి వారికి జయము గూర్చుటకు దేవసేన యని యామెపేరుగాంచెను.

శ్రీదేవసేనోవాచః బ్రహ్మణో మానసీ కన్యా దేవసేనా హ మీశ్వరీ |

సృష్ట్వా మాం మనసా ధాతా దదౌ స్కందాయ భూమిప. 25

మాతృకాసు చ విఖ్యాతా స్కందభార్యా చ సువ్రతా | విశ్వే షష్ఠీతి విఖ్యాతా షష్టాంశా ప్రకృతేః పరా. 26

అపుత్రాయ పుత్రదాహం ప్రియాదాత్రీ ప్రియాయ చ | ధనదాహం దరిద్రేభ్యః కర్మిభ్యశ్చ స్వకర్మదా. 27

సుఖం దుఃఖం భయం శోకో హర్షో మంగళ##మేవచ | సంపత్తి శ్చ విపత్తి శ్చ సర్వం భవతి కర్మణా. 28

కర్మణా బహుపుత్ర శ్చ వంశహీనః స్వ కర్మణా | కర్మణా మృతపుత్ర శ్చ కర్మణా చిరజీవనః 29

కర్మణా గుణవాంశ్చైవ కర్ణా చాంగహీనకః | కర్మణా బహుభార్య శ్చ భార్యాహీన శ్చ కర్మణా. 30

కర్మణా రూపవా న్ధర్మీ రోగీ శశ్వత్స్వ కర్మణా | కర్మణా೭೭చ భ##వే ద్వ్యాధిః కర్మణా రోగ్యమేవచ. 31

తస్మాత్కర్మ పరం రాజ న్సర్వే భ్యశ్చ శ్రుతౌ శ్రుతమ్‌ | ఇత్యేవ ముక్త్వా సా దేవీ గృహీత్వా బాలకం మునే. 32

మహాజ్ఞానేన సా దేవీ జీవయామాస లీలయా | రాజా దదర్శ తం బాలం సస్మితం కనకప్రభమ్‌. 33

దేవసేనా చ పశ్యంతం నృపమాపృచ్చ్య సా తదా | గృహీత్వా బాలకం దేవీ గగనం గంతు ముద్యతా. 34

పునస్తుష్టావ తాం రాజా శుష్క కంఠోష్ఠ తాలుకః | నృపస్తోత్రేణ సా దేవీ పరితుష్టా బభూవ హ. 35

ఉవాచ తం నృపం బ్రహ్మాన్‌ వేదోక్తం కర్మ నిర్మితమ్‌ |

దేవ్యువాచః త్రిషులోకేషు త్వం రాజా స్వాయం భువమనోః సుతః 36

శ్రీదేవ సేన యిట్లు పలికెను ః నేను బ్రహ్మమానస కన్యను. ఈశ్వరిని-దేవసేనను-బ్రహ్మ నన్ను సృజించి స్కందుని చేతిలో పెట్టెను. నేను మాతృకలలో ప్రతిష్ఠ గాంచినదానను. సువ్రత శీలను. స్కందుని భార్యను. పరప్రకృతిలో నారవ యంశమ నగుట నన్ను షష్ఠీదేవి యందురు. నేను సంతులేని వారికి సంతును ప్రియునికి ప్రియను దరిద్రులకు ధనమును కర్మిష్ఠులకు కర్మనిష్ఠను గూర్పగలను. కర్మమూలముననే సుఖదఃఖములు హర్షశోకములు భయ భ్రాంతులు శుభాశుభములు సంపత్తి విపత్తులు అన్ని యును గల్గుచుండును. తన చేసికొన్న కర్మవలననే బహుపుత్రులు వంశక్షయము మృతపుత్రులు చిరంజీవులైన పుత్రులు గల్గుదురు. అట్టి తన కర్మమువలననే నరుడు గుణవంతుడు అంగహీనుడు బహుభార్యుడు భార్యాహీనుడు గాగలడు. తన చేసికొనిన కర్మమువలన నరుడు రూపవంతుడు రోగి వ్యాధిగ్రస్తుడు ఆరోగ్యవంతుడు కాగలడు. కావున ఓ రాజా! వేద శాస్త్రములందు కర్మమే గొప్పదని చెప్పబడెను. ఓ మునీ! అని యాదేవి బాలశవమును తీసికొనెను. షష్ఠీదేవి లీలగ జ్ఞానశక్తితో నా బాలుని మరల బ్రదికించెను. రా జపుడు బంగారు మెఱుగులచేత నవ్వులు చిందించునట్టి తన చిన్నారిని గాంచెను. అపుడు దేవసేన రాజు నడిగి యా బాలుని తీసికొని దివి కేగదలచెను. రాజు తన దౌడలు-పెదవులు-కంఠము నెండిపోవునట్లు పెద్ద కంఠముతో దేవిని సంస్తుతింపగ నామె సంతుష్టయయ్యెను. ఓ మహాత్మా ! షష్ఠీదేవి రాజుతో వేదోక్త కర్మము గూర్చి యిట్లుచెప్పెను. రాజా ! నీవు స్వాయంభువ మనువు కుమారుడవు. ముల్లోకము లేలినవాడవు.

మమ పూజాం చ సర్వత్ర కారయిత్వా స్వయం కురు | తదా దాస్యామి పుత్రం తే కులపద్మం మనోహరమ్‌. 37

సువ్రతం నామ విఖ్యాతం గుణవంతం సు పండితమ్‌ | జాతిస్మరం చ యోగీంద్రం నారాయణ కళాత్మకమ్‌. 38

శతక్రతుకరం శ్రేష్ఠం క్షత్రియాణాం చ వందితమ్‌ | మత్త మాతంగ లక్షాణాం ధృతవంతం బలం శుభమ్‌. 39

ధనినం గుణినం శుద్ధం విదుషాం ప్రియమేవచ | యోగినాం జ్ఞానినాం చైవ సిద్ధిరూపం తపస్వినామ్‌. 40

యశస్వినం చ లోకేషు దాతారం సర్వసంపదామ్‌ | ఇత్యేవ ముక్త్వాసా దేవీ తసై#్మ తద్బాలకం దదౌ. 41

రాజా చకార స్వీకారం పూజార్థం చ ప్రియవ్రతః | జగామ దేవీస్వర్గం చ దత్వా తసై#్మ శుభం వరమ్‌. 42

అజగామ సహామాత్యః స్వగృహం హృష్టమానసః | ఆగత్య కథయామాస వృత్తాంతం పుత్ర హేతుకమ్‌. 43

శ్రుత్వా బభూవః సంతుష్టా నరానార్య శ్చ నారద | మంగళం కారయామాస సర్వత్ర పుత్ర హేతుకమ్‌. 44

దేవీం చ పూజయామాస బ్రాహ్మణభ్యో ధనం దదౌ | రాజా చ ప్రతిమానేషు శుక్లపష్ఠ్యాం మహోత్సవమ్‌. 45

షష్ఠ్యా దేవ్యాశ్చ యత్నేన కారయామాస సర్వతః | బాలానాం సూతికాగారే షష్ఠాహే యత్న పూర్వకమ్‌. 46

తత్పూజాం కారయామాస చైకవింశతివాసరే | బాలానాం శుభకార్యే చ శుభాన్న ప్రాశ##నే తథా. 47

సర్వత్ర వర్ధయామాస స్వయమేవ చకారహ | ధ్యానం పూజావిధానం చ స్తోత్రం మత్తో నిశామయ. 48

నీవు నా పూజలు సొంతముగ చేసి యితరులచేత చేయింపుము. అపుడు నేను కులదీపకుడైన పుత్రుని ప్రసాదింపగలను. రాజా! నీకు సువ్రతుడను ప్రసిద్ధుడు-పుట్టగలడు అతడు గుణవంతుడు-పండితుడు- యోగీంద్రుడు-విష్ణు కళాత్మకుడు పూర్వజ్ఞానము గలవాడు నగును. అతడు నూఱు యజ్ఞములు చేయువాడు రాజపూజితుడు లక్ష యేనుగుల బలము గలవాడు శుభలక్షణుడు ధని గుణి శుద్ధాత్ముడు పండితప్రియుడు జ్ఞాని-యోగి- తాపసులకు సిద్ధిస్వరూపుడు లోకములందు పవిత్ర కీర్తనుడు సంపద లొసంగువాడు గాగలడు. అని షష్ఠీదేవి రాజున కా బాలు నొసంగెను ప్రియవ్రతుడు బాలుని స్వీకరించెను. ఇట్లు దీవి రాజునకు మేలు గల్గించి దివి కెగసెను. రాజు మంత్రులతో పుత్రోత్సాహముతో తన యింటి కరిగెను. తన పుత్రుడు మరల బ్రదికిన విధమంతయునతడు లోకులకు వెల్లడించెను. నారదా! అపుడు స్త్రీ పురుషు లెల్లరుసు పరమానంద మొందిరి. ఎల్లెడల రాజు పుత్రప్రాప్తి మహోత్సవములు జరిగెను. రాజషష్ఠీదేవిని పూజించి విప్రులకు ధనమునొసంగెను. ఆనాటినుండి రాజు ప్రతినెల శుద్ధ షష్ఠినాడు షష్ఠీదేవీ మహోత్సవము జరిపెను. ఆరవనాడు పురు టింటిలో తప్పక షష్ఠీదేవిపూజలు సాగును. ఇరువదొకటవనాడు అన్న ప్రాశనము దినముల బాలుర శుభకార్యము లందును షష్ఠీదేవి పూజలు సాగుచుండెను. ఇట్లు రాజు షష్ఠీదేవి పూజలు చేసి చేయింపసాగెను. షష్ఠీదేవి ధ్యానము-పూజా విధానమును-స్తోత్రమును నా వలన వినుము.

యచ్ర్చుతం ధర్మవక్త్రేణ కోథుమోక్తం చ సువ్రత | శాలగ్రామే ఘటేవా థ వటమూలేథమునే. 49

భిత్త్యాం పుతలికాం కృత్వా పూజయేద్వా విచక్షణః | షష్ఠాంశాం ప్రకృతే ః శుద్ధాం ప్రతిష్ఠాప్య చ సుప్రభామ్‌.

సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ర్పసూమ్‌ | శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణ భూషితామ్‌. 51

పవిత్రరూపాం పరమాం దేవసేనాం పరాంభ##జే | ఇతి ధ్యాత్వా స్వ శిరసి పుష్పం దత్వా విచక్షణః 52

పునర్ధ్యాత్వా చ మూలేన పూజయేత్సు వ్రతాంసతీమ్‌ | పాద్యార్ఘ్యా చమనీయై శ్చ గంధ పుష్ప ప్రదీపకైః 53

నైవేద్యై ర్వి విధై శ్చాపి ఫలేన శోభ##నేన చ | ఓం హ్రీం షష్ఠీ దేవ్యై స్వాహేతి విధిపూర్వకమ్‌. 54

అష్టాక్షరం మహామంత్రం యథాశక్తి జపేన్నరః | తతః స్తుత్వా చ ప్రణమే ధ్బక్తి యుక్తః సమాహితః 55

స్తోత్రం చ సామవేదోక్తం వరం పుత్ర ఫలప్రదమ్‌ | అష్టాక్షరం మహామంత్రం లక్షధాయోజపేత్తతః 56

సు పుత్రం చ లభేన్నూన మిత్యాహ కమలోద్బవః | స్తోత్రం శృణు మునిశ్రేష్ఠ సర్వకామ శుభావహమ్‌. 57

వాం ఛా ప్రదం చ సర్వేషాంగూఢం వేదేషు నారద | నమోదేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమోనమః 58

శుభాయై దేవసేనాయై షష్ఠ్యైదేవ్యై నమోనమః | వరదాయై పుత్రదాయై ధనదాయై నమోనమః 59

సుఖదాయై మోక్షదాయైష్ఠ్యై దేవ్యై నమోనమః | షష్ఠ్యై షష్ఠాంశరూపాయై సిద్ధాయై చ నమోనమః 60

ఓ సుప్రతా ! మొదట ధర్ముడు చెప్పగ విని కౌథుము డితరులకు చెప్పెను. సాలగ్రామమున గాని కలశమందుగాని మఱ్ఱిచెట్టు మొదటగాని షష్ఠీదేవి నావాహనముచేసి లేక చిత్రము గీసి తెల్వితో నిట్లు దేవి నారాధింపవలయును. షష్ఠాంశ-ప్రకృతి శుద్ధ - సుప్రభయగు షష్ఠిని ప్రతిష్ఠింపవలయును. సుపుత్రదాయిని-శుభదాయిని-దయరూప-జగముల తల్లి. తెల్లని చంపకకాంతి గలది రత్నభూషణ భూషిత- పవిత్రరూప-పరమయగు దేవసేనను గొల్చెదను. అని ధ్యానించి తెల్విగలాడు తన తలపై పూవు దాల్చవలయును. మరల ధ్యానించి మూలమంత్రముతో సువ్రత-సతియగు షష్ఠిని పూజించి పాద్యము- అర్ఘ్యము-ఆచమనీయము - గంధ-పుష్ప- దీపములు సమర్పించి పలు విధములైన మంచి పండ్లతో వివిధములైన పంటలతో నైవేద్యము షష్ఠికి నివేదింపవలయును. '' ఓం హ్రీం షష్ఠీ దేవ్యైస్వాహా '' అను మూలమంత్రము యథావిధిగ జపించవలయును. ఈ అష్టాక్షర మహామంత్రమును యథాశక్తిగ జపించవలయును. తర్వాత నిశ్చలభక్తితో షష్ఠిని సంస్తుతించ నమస్కరించవలయును. సామవేదమందలి షష్ఠీస్తోత్రము వరపుత్రఫలము లొసంగగలదు. ఈ షష్ఠి- అష్టాక్షర మహామంత్రము లక్ష జపించవలయును. అపుడు సుపుత్రకుడు తప్పక జన్మింపగలడని బ్రహ్మ పలికెను. ఓ మునివరా ! సర్వ శుభకామము లొసంగునట్టి షష్ఠీస్తోత్రము వినుము. నారదా ! షష్ఠీస్తోత్రము కోర్కెలు దీర్చునది. వేదములందు. రహస్యమైనది. మహాదేవి-సిద్ధి-శాంతి యగు దేవికి నమస్సులు. శుభాంగి- దేవసేన యగు షష్ఠీదేవికి నమస్సులు. వరదాయిని పుత్రదాయిని- ధన దాయినికి నమస్కారములు. సుఖదాయిని-మోక్షదాయిని యైన షష్ఠీదేవికి వందనములు. షష్ఠాంశరూప- సిద్ధయగు షష్ఠికి ప్రణామములు.

మాయాయై సిద్ధ యోగిన్యై షష్ఠీ దేవ్యై నమోనమః | సారాయై శారదాయై చ పరాదేవ్యై నమోనమః 61

బాలాధిష్ఠాతృ దేవ్యై చ షష్ఠీ దేవ్యై నమోనమః | కల్యాణదాయై కల్యాణ్యౖ ఫలదాయై చ కర్మణామ్‌. 62

ప్రత్యక్షాయై స్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమోనమః | పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు. 63

దేవరక్షణ కారిణ్యౖ షష్ఠీ దేవ్యై నమోనమః | ధనం దేహి ప్రియాందేహి పుత్రం దేహి సురేశ్వరి. 65

మానం దేహి జయందేహి ద్విషోజహి మహేశ్వరి | ధర్మం దేహి యశోదేహి షష్ఠీ దేవ్యై నమోనమః 66

భూమిం దేహి వ్రజాం దేహి విద్యాం దేహిసుపూజితే | కల్యాణం చ జయం దేహిషష్ఠీ దేవ్యై నమోనమః 67

ఇతి దేవీం చ సంస్తూయలేభే పుత్రం ప్రియవ్రతః | యశస్వినం చ రాజేంద్రః షష్ఠీ దేవ్యాః ప్రసాదతః 68

షష్ఠీస్తోత్ర విదం బ్రహ్మ న్యం శృణోతి తువత్సరమ్‌. | అపుత్రోలభ##తే పుత్రం వరం సుచిరజీవినమ్‌. 69

వర్షమేకం చ యో భక్త్యా సంపూజ్యేదం శృణోతి చ | సర్వాపాపా ద్వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే. 70

వీరంపుత్రం చ గుణినం విద్యావంతం యశస్వినమ్‌ | సుచిరాయుష్య వంతం చ సూతే దేవీ ప్రసాదతః 71

కాకవంధ్యా చ యానారీ మృతవత్సా చ యా భ##వేత్‌ | వర్షం శ్రుత్వాలభేత్సు త్రం షష్ఠీ దేవీ ప్రసాదతః 72

రోగయుక్తే చ బాలేచ పితామాతా శృణోతిచేత్‌ | మాసేన ముచ్యతేబాలః షష్ఠీ దేవీ ప్రసాదతః 73

ఇది శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే నారదనారాయణ సంవాదేషష్ఠ్యుపాఖ్యానే షట్చత్వారింశో೭೭ధ్యాయః

మాయ- సిద్ధయోగిని యగు షష్ఠికి కైమాడ్పులు సార-శారద యగు పరమదేవికి మ్రొక్కుదును. బాలాధిష్ఠానదేవి యగు షష్ఠికి దండపూలు. కల్యాణదాయిని-కర్మఫలదాయిని యగు కల్యాణి షష్ఠికి నమస్కృతులు. భక్తులకు ప్రత్యక్షయగు షష్ఠీదేవికి వందనములు. స్కంద భార్యకు నెల్లరి కెల్ల కర్మలందు పూజనీయమైన షష్ఠికి నమస్కారములు దేవరక్షణకారిణి యగు షష్ఠీదేవికి వందనములు. సిద్ధ సత్త్వ స్వరూపిణి- నరులకు వందనీయ యగు దేవికి వందనాలు. హింసాక్రోధములు లేని షష్ఠీదేవికి ప్రణతులు. ఓ సురేశ్వరీ ! ధనము-ప్రియను-సుపుత్రుని ప్రసాదింపుము తల్లీ ! ఓ మహేశ్వరీ ! మానము-జయము నిమ్మా ! శత్రులను పరిమార్చుము. ధర్మము కీర్తి నొసంగుము. షష్ఠీదేవి ! నీకు మా వందన శతములు. పూజితురాలా ! మాకు భూమిని ప్రజలను కల్యాణమును జయము నిమ్ము తల్లీ ! నీకు నమస్కారములు. అని షష్ఠిని సంస్తుతించి ప్రియపుత్రుడు పుత్రుని బడసెను. ఆ పుట్టినవాడు షష్ఠీదేవి దయవలన కీర్తిమంతుడు మహారాజునై వెలుగొందెను. బ్రాహ్మణోత్తమా ! ఈ షష్ఠీస్తోత్ర మొక సంవత్సరము విను మానవులు పుత్రహీనులైనను మంచి చిరంజీవి యగు సుపుత్రుని గాంచగలరు. ఒక సంవత్సరము పరమభక్తితో షష్ఠీదేవిని పూజించి స్తోత్రము విను పుణ్యాత్ముడు సర్వపాపముక్తు డగును. గొడ్రాలు వినినచో సంతానవతిగా గలదు. ఆమె దేవి దయవలన వీరుడు-గుణి- విద్యాంసుడు-కీర్తి-శాలి- ఆయుస్మంతుడు నైన పుత్రుని గనును. కాకవంధ్య- మృతవత్సయగు స్త్రీయును సంవత్సరమువఱ కీషష్ఠీస్తోత్రము విన్నచో షష్ఠిదేవ్యను గ్రహమున తప్పక సుపుత్రుని గనగలదు. తమ కుమారుడు రోగియైనచో తల్లిదండ్రులు షష్ఠీస్తోత్రము వినవలెను. దానిచే షష్ఠీదేవి దయవలన వారు బాలుడు డారోగ్యవంతుడు కాగలడు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధమున నారద నారాయణ సంవాదమున షష్ఠ్యుపాఖ్యానమున నలువదియారవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters