Sri Devi Bagavatham-2    Chapters   

అథపంచాశో7ధ్యాయః.

నారద ఉవాచ : శ్రుతం సర్వముపాఖ్యానం ప్రకృతీనాం యథాతథమ్‌ | యచ్చ్రుత్వా ముచ్యతే జంతు ర్జన్మ సంసార బంధనాత్‌. 1

అధునా శ్రోతు మిచ్చామి రహస్యం వేదగోపితమ్‌ | రాధాయాశ్చైవ దుర్గాయా విధానం శ్రుతి చోదితమ్‌. 2

మహిమా వర్ణితో7తీవ భవతా పరయోర్ద్వయోః | శుత్వ్రాతం తద్గతం చేతోన సక్య స్యా న్మునీశ్వర. 3

యయో రంశో జగత్సర్వం యన్నియమ్యం చరాచరమ్‌ | యయోద్బక్త్యా భ##వేన్ముక్తిస్తద్విధానం వదా7ధునా. 4

నారాయణ ఉవాచ : శృణు నారద వక్ష్యామి రహస్యం శ్రుతిచోదితమ్‌|

యన్న కస్యాపి చా77ఖ్యాతం సారాత్సారం పరాత్పరమ్‌. 5

శ్రుత్వా పరసై#్మ నో వాచ్యం యతో7తీవ రహస్యకమ్‌ | మూల ప్రకృతి రూపిణ్యాః సంవిదో జగదుద్బవే. 6

ప్రాదుర్బూతం శక్తి యుగ్మం ప్రాణబుద్ధ్యధిదైవతమ్‌ | జీవానాంచైవ సర్వేషాం నియంతృ ప్రేరకం సదా. 7

తదధీనం జగత్సర్వం విరాడాది చరాచరమ్‌ | యోవత్తయోఃప్రసాదో న తావన్మోక్షోహి దుర్లభః 8

తతస్తయోః ప్రసాదార్థం నిత్యం సేవేత తద్ద్వయమ్‌ | తత్రాదౌ రాధికా మంత్రం శృణు నారద భక్తితః. 9

బ్రహ్మా విష్ణ్యాదిభిర్నిత్యం సేవితో యః పరాత్పరః | శ్రీరాధేతి చతుర్థ్యంతం వహ్నేర్జాయా తతః పరమ్‌. 10

షడక్షరో మహామంత్రో ధర్మాద్యర్థ ప్రకాశకః | మాయా బీజాదికశ్చా యం వాంఛా చింతామణిః స్మృతః. 11

వక్త్రకోటి సహసై#్త్రస్తు జిహ్వకోటిశ##తైరపి | ఏతన్మంత్రస్య మహాత్మ్యం వర్ణితుం నైవ శక్యలే. 12

జగ్రాహ ప్రథమం మంత్రం శ్రీకృష్ణో భక్తి తత్పరః | ఉపదేశా న్మూలదేవ్యా గోలోకేరాస మండలే. 13

విష్ణుస్తేనోపదిష్టస్తు తేన బ్రహ్మవిరాట్తథా | తేన ధర్మస్తేన చా2హ మిత్యేషా హి పరంపరా. 14

అహం జపామితం మంత్రం తేనా2హదృషిరీడితః | బ్రహ్మాద్యా సకలా దేవా నిత్యం ధ్యాయంతి తాంముదా. 15

కృష్ణార్చాయాం నాదికారో యతో రాధార్చనం వినా | వైష్ణవైః సకలై స్తస్మాత్కర్తవ్యం రాధికార్చనమ్‌. 16

ఏబదవ అధ్యాయము

శక్తి రహస్య నిరూపణము

నారదు డిట్లనెను : వేనిని వినుటవలన జీవు డీ జన్మసంసార బంధములనుండి విముస్తు డగునో యట్టి ప్రకృతులచరితలు చక్కగ వింటిని. ఇపుడు శ్రీరాధా దుర్గల గుఱించి మఱల వేదములందు చెప్పబడిన పరమ రహస్య విధానము వినదలచుచున్నాను. నారాయణ! వారిర్వురిని గూర్చి వివరముగ తెల్పితివి. అట్టి వారి చరిత్రలు వినిన వారి మనస్సులు వారి భక్తిలో మునిగిపోవును. ఎవరి యంశ##చే నీ చరాచర జగముత్పన్నమయ్యెనో నియమింపబడుచున్నదో యెవరి భక్తి వలన ముక్తి గల్గునో యట్టివారిని వారి పూజా విధానమును మరల కొంచెము విపులముగ తెలుపుము. నారాయణు డిట్లు పలికెను : నారదా! వేద రహస్యము తెల్పుచున్నాను వినుము. సారములలో సారము-పరాత్పరము పూర్వమెవరును చెప్పని రహస్యము. అది రహస్యము మగుటవలన నితరులకు తెలపురాదు. ఈ జగము లుద్బవించిన పిమ్మట ప్రకృతిరూప జగదీశ్వరునుండి ఇర్వురు శక్తు లుద్బవించిరి. ఒకరు కృష్ణుని ప్రాణాధిష్ఠానదేవి ఇంకొకరు కృష్ణుని బుధ్ధ్యధిష్ఠానదేవి. వీరిర్వురు సకల జీవులను నియమించగలరు ప్రేరేపించగలరు. ఈ విరాడ్విశ్వమంతయును వారి స్వాధీనమందుండు. వారి యనుగ్రహమునకు పాత్రులు గానివారికి ముక్తి దుర్లభము. కనుక వారి ప్రీతికి నా రిర్వురిని నిత్యము సంసేవింపవలయును. వారిలో మొదట రాధామంత్రము భక్తిమీర నాలకింపుము. బ్రహ్మ విష్ణ్వాదులచేత పరాత్పరుడు నిత్యము సేవింపబడును. అతడు శ్రీరాధా శబ్దమునకు చతుర్థీ విభక్తి తర్వాత స్వాహాశబ్దము. ఇది షడక్షర మహామంత్రము ధర్మార్థము లొసంగునది. దీనికి మాయాబీజము చేర్చినచో నది కోర్కులు తీర్చుచింతామని యగు " ఓం హ్రీం శ్రీరాధాయైస్వాహా" అను మూలమంత్రము. కోటి నోళ్ళతో కోట్ల నాలుకలతోను రాధామంత్ర మహిమ వర్ణింపనలవిగాదు. ఈ మంత్రము మొట్టమొదట శ్రీకృష్ణుడు భక్తితత్పరుడై గోలోక రాసమండలమున రాధాదేవి యాదేశము ప్రకారము జపించెను. కృష్ణుడు విష్ణునకు బ్రహ్మకు బ్రహ్మ ధర్మునకు ధర్ముడు నాకు నీ మంత్ర ముపదేశించెను. నే నీ మంత్రము జపించుట వలన నేను దీనికి ఋషినైతిని. బ్రహ్మాది దేవతలును నిత్యము రాధనే ధ్యానింతురు.

కృష్ణ ప్రాణాధి దేవీసా తదధీనో విభుర్యత ః | రాసేశ్వరీ తస్య నిత్యం తయా హీనో న తిష్ఠతి. 17

రాధ్నోతి సకలాన్కా మాంస్తస్మాద్రాధేతికీర్తితా | అత్రోక్తానాం మనూనాం చ ఋషిర స్మ్యహమేవచ. 18

చందశ్చ దేవీ గాయంత్రీ దేవతా7త్ర చ రాధికా | తారో బీజం శక్తి బీజం శక్తిస్తు పరికీర్తితా. 19

మూలావృత్త్యా షడంగాని కర్తవ్యానీ తరత్ర చ | అథ ధ్యాయేన్మహా దేవీం రాధికాం రసనాయికామ్‌. 20

పూర్వోక్తరీత్యాతు మునే సామవేదే విగీతయా | శ్వేతచంపక వర్ణాభాం శరదించు సమాననామ్‌. 21

కోటిచంద్ర ప్రతీకాశాం శరదంభోజలోచనామ్‌ | బింబాధరాం పృథుశ్రోణీం కాంచీయుత నితంబినీమ్‌. 22

కుందపంక్తి సమానాభ దంతపంక్తి విరాజితామ్‌ | క్షౌమాంబర పరీధానాం వహ్నిశుద్దాంశుకాన్వితమ్‌. 23

ఈషద్దాస్యప్రసన్నాస్యాం కురికుంభయుగస్తనీమ్‌ | సదా ద్వాదశవర్షీయాం రత్నభూషణభూషితామ్‌. 24

శృంగార సింధులహరీం భక్తానుగ్రహకాతరామ్‌ | మల్లికా మాలతీమాలా కేశపాశ విరాజితామ్‌. 25

సుకుమారాంగలతికాం రాసమండల మధ్యగామ్‌ | వరాభయకరాం శాంతాం శస్వత్సుస్థిర¸°వనామ్‌. 26

రత్నసింహాసనాసీనాం గోపీమండల నాయకమ్‌ | కృష్ణ ప్రాణాధికాం వేదబోధితాం పరమేశ్వరీమ్‌. 27

ఏవం ధ్యాత్వా తతోబాహ్యే శాలగ్రా మే ఘటే7థవా | యంత్రే వా7ష్టదళే దేవీం పూజయే త్సు విధానతః. 28

ఆవాహ్య దే వీం తత్ప శ్చా దాసనాది ప్రదీయతామ్‌ | మూల మంత్రం సముచ్చార్య చాసనాదీని కల్పయేత్‌. 29

పాద్యంతు పాదయోర్దద్యా న్మస్తకే7ర్ఘ్యం సమీరితమ్‌|

ముకే త్వాచమనీయం స్వా ద్ద్వివారం మూలవిద్యయా. 30

రాధ నర్చింపకున్నచో శ్రీకృష్ణు నర్చించుట కధికారము లేదు. ఇది వైష్ణవు లందఱికి నియమము కనుక తొలుత రాధార్చనము చేయవలయును. శ్రీకృష్ణుని ప్రాణాధిష్ఠానదేవి రాధ. కృష్ణు డామెకు వశుడు. ఆమె రాసేశ్వరి. కృష్ణుడు లేక రాధ యుండజాలదు. సకల కామములు సిద్దింపచేయునది గాన ఆమెను రాధ యుందురు. ఈ స్కంధమున చెప్పబడిన మంత్రము లన్నిటికిని నారాయణుడను నేనే ఋషిని. ఈ రాధా మంత్రమునకు గాయత్రీ-ఛందము; రాధ-దేవత; ప్రణవము బీజము భువనేశ్వరి శక్తి. మూలమంత్రము నారుసార్లు చెప్పి షడంగన్యాసము చేయవలయును. పిదప శృంగార రసాధిదేవి-రాసేశ్వరి-మహాదేవియగు శ్రీరాధాదేవిని మదిలో ధ్యానించవలయును. సామవేదమున చెప్పబడిన విధముగ రాధ నిల్టు ధ్యానింపవలయును. తెల్లని చంపక వర్ణము గలది శారద చంద్రునివంటి ముఖము గలది కోటిచంద్రులుగల మేను గలది శారద కమలముల బోలు కన్నులు గలది పండిన దొండపండువంటిమోవి గలది సొంపైన పిఱుదులు గలది మొలనూలు గలది మొల్ల మొగ్గల వరుసలవలె వెల్గు జిమ్ము పలువరుసగలది దేవి. ఆమె తెల్లని దువ్వలువలు దాల్చి అగ్ని శుద్ధమైన మేలిముసుగు దాల్చియున్నది. లేత మొలకనవ్వులు విప్పారిన ముఖము గలది. ఏనుగు కుంభములవంటి స్తనముల గలది. రత్నభూషణభూషితయై నిత్యము పండ్రెం డేడుల వయసుతో నలరారు సౌందర్యలహరి ; భక్తనుగ్రహ పరాయణ; మల్లికా మాలతీ మాలల పరిమళములు గుబాళించు కేశపాశములు గలది. కుసుమకోమలి-లతాంగి-రాస మండల మధ్య వర్తిని. వరాభయ ముద్రలుకల కలములుగల శాంతమూర్తి. నిండారు పరువముతో విలసిల్లు తల్లి. రత్న సింహాసనాసీన- గోపీమండలనాయిక-వేదప్రబోధిత-పరమేశ్వరి. కృష్ణ ప్రాణాధిక ప్రియ. ఈ విధముగ రాధను ధ్యానించి సాలగ్రామమునగాని కలశమునగాని అష్టదళపద్మయంత్రమునగాని విధి విధానమున రాధ నావాహమనము చేయవలయును. ఇట్లా వాహనము చేసిన పిమ్మట మూలమంత్రముతో దేవి కాసనాదులు కల్పించవలయును. మూల మంత్రముతో రాధపాదములకు పాద్యమును కరముల కర్ఘ్యమును ఆచమనీయము నగసంగవలయును.

మధుపర్కం తతో దద్యా దేకాంగాం చ పయస్వినీమ్‌ | తతో నయే త్స్నానశాలాం తాం చ తత్త్రెవ భావయేత్‌. 31

అభ్యంగాదిస్నానవిధిం కల్పయిత్వా7థ వాససీ| తతశ్చ చందనం దద్యాన్నానాలంకార పూర్వకమ్‌. 32

పుష్పమాలా బహువిధా స్తులసీ మంజరీయుతాః | పారిజాత ప్రసూనాని శతపత్రాదికాని చ. 33

తతఃకుర్యాత్పవిత్రం తత్పరివారార్చనం విభోః | అగ్నీ శాసురతవాయవ్యమధ్యే దిక్ష్యంగపూజనమ్‌. 34

కృత్వా పశ్చా దష్టదళే దక్షిణా వర్తతో7గ్రతః | మాలావతీ మగ్రదళే వహ్నికోణ చ మాధవీమ్‌. 35

రత్నమాలం దక్షిణ చ నైరృత్యేతు సుశీలకామ్‌ | పశ్చాద్దళే శశికళాం పూజయ్యేన్మతిమాన్నరః 36

మారుతే పారిజాతం చావ్యుత్తరే చ పరావతీమ్‌ | ఈశానకోణ సంపూజ్యా సుందరీ ప్రియకారిణీ. 37

బ్రహ్మాదయ స్తు తద్బా హ్యే7ప్యాశాపాలాంస్తు భూపురే | వజ్రాదికాన్యాయుధాని దేవీమిత్థం ప్రపూజయేత్‌. 38

తతో దేవీం సావరణాం గంధాద్యై రుపచారకైః | రోజోపచార సహితైః పూజయే న్మతిమాన్నరః 39

తతః స్తువీత దేవేశీం స్తోత్త్రెర్నామసహస్రకైః | సహస్ర సంఖ్య చ జపం నిత్యం కుర్యాత్ప్రయత్నతః. 40

య ఏవం పూజయేద్దేవీం రాధాంరాసేశ్వరీం పరామ్‌ | సభ##వే ద్విష్టుతుల్యస్తు గోలోకంయాతి సంతతమ్‌. 41

యః కార్తిక్యాం పౌర్ణమాస్యాం రాధాజన్మోత్సవం బుధః | కురుతే తస్య సాన్నిధ్యం దద్యాద్రాసేశ్వరీ పరా. 42

కేన చిత్కారణనైవ రాధా బృందావనే వనే | వృషభాను సుతా జాతా గోలోకస్థాయినీ సదా. 43

అత్రోక్తానాం తు మంత్రాణాం వర్ణసంఖ్యా విధానతః | పురశ్చరణకర్మోక్తం దశాంశం

హోమమాచరేత్‌. 44

తర్వాత రాధాదేవికి మధుపర్కమును పాలిచ్చు గోవును సమర్పించవలయును. పిదప స్నానశాలకు భక్తిభావముతో గొని పోవలయును. దేవి కభ్యంగ స్నాన మొనరించి పట్టు పుట్టములు కట్టబెట్టవలయును. పెక్కు సొమ్ములు దరింపజేసి మేనికి మంచి గందములందవలయును. రాధాదేవికితులసి గుత్తుల పూలమాలలు-పారిజాత-కమలములు మాలలు నర్పించవలయును. తర్వాత పవిత్రముగ దేవి పరివారమును పూజింపువలుయును. అగ్నేయమునైరృతివాయువ్యము ఈశాన్యములందు దిక్పూజ సలుపవలయును. తర్వాత అష్టదళయంత్రమునందు దక్షణము మొదలుకొని దిక్కులందు క్రమమున అష్ట శక్తుల నర్చింపవలయును. తూర్ప దళమున మాలావతిని అగ్నికోణమున మాధవిని దక్షిణమందు రత్నమాలను నైఋ%ుతిని సుశీలను పడమటి దళమున శశికళను తెలివిగలవాడు పూజింపవలయును. వాయువ్యము పారిజాతను ఉత్తరమున పరా వతిని; ఈశాన్యమున ప్రియకారిణియగు సుందరి నర్చింపవలయును. ఆమెకు బైట బ్రహ్మాదులను భూమిపై ఆశాపాలురను పూజింపవలయును. ఇట్లు వజ్రాయుధము మున్నగునాయుధములను దేవిని పూజింపవలయును. తర్వాత బుద్ధిమంతు డావరణ దేవతలను రాధను గంధము మున్నగు పూజ ద్రవ్యములతో రాజోపచారములతో పూజింపవలయును. ఆ తర్వాత రాధా సహస్రనామములతో దేవి నర్చింపవలయును. తప్పనిసరిగ మూలమంత్రము వేయి సార్లు జపించవలయును. ఈ విధముగ రాసేశ్వరి- పరమయగు రాధాదేవిని పూజించువాడు విష్ణు సమాను డగును. అతడు గోలోక మేగగలడు. కార్తిక పూర్ణిమ నాడు రాదా జన్మోత్సవము జరుపు భక్తుని చెంత రాసేశ్వరి- పరాదేవి కటాక్షముతో విలసిల్లును. ఏదో యొక కారణమున గోలోకవాసినియగు రాధ బృందావనమును వృషభాను నందినిగ నవతరించెను. ఇందు చెప్పబడిన మంత్రములకు చెప్పిన సంఖ్యప్రకారముగ పురశ్చరణ జరుపవలయును. దానికి దశాంశము హోమము చేయవలయును.

తిలైస్త్రి స్వాదు సంయుక్తైర్జుహుయా ద్బక్తి భావతః |

నారద ఉవాచః స్తోత్రం పదమునే సమ్యగేన దేవీ ప్రసీదతి. 45

నారాయణ ఉవాచ ః నమస్తే పరమేశాని రాసమండల వాసిని | రాసేశ్వరి నమస్తేస్తు కృష్ణ ప్రాణాధిక ప్రియే.

నమః సరస్వతీరూపే నమః సావిత్రి శంకరి | గంగా పద్మావతీరూపే షష్టిమంగళచలడికే. 48

నమస్తే తులసీరూపే నమోలక్ష్మీ స్వరూపిణీ | నమో దుర్గే భగవతి నమస్తే సర్వరూపిణీ. 49

మూల ప్రకృతి రూపాం త్వాం భజామః కరుణార్ణవామ్‌| సంసారహగరా దస్మాదుద్ధరాంబ దయాంకురు. 50

ఇదంస్తోత్రం త్రిసంధ్యంయః పఠేద్రాధాంస్మరన్నరః | తస్యవై దుర్లభం కించిత్కదా చిన్నభవిష్యతి. 51

దేహాంతే చ వసేన్నిత్యం గోలోకే రాసమండలే | ఇదం రహస్యం పరమం నచా 77ఖ్యేయంతు కస్యచిత్‌. 52

అధునాశృణు వప్రేం ద్ర దుర్గాదేవ్యా విధానకమ్‌ | యస్యాః స్మరణ మాత్రేణ పలాయంతే మహాపదః. 53

ఏనాం న భజతే యో హి తాదృ జ్నాస్త్యేవ కుత్రచిత్‌ | సర్వోపాస్యా సర్వమాతా శైవీశక్తి ర్మహా ద్బుతా. 54

సర్వబుద్ద్యధిదేవీయ మంతర్యామిస్వరూపిణీ | దుర్గసంకటహంత్రీతి దుర్గేతి ప్రథితా భువి. 55

వైష్ణవానాం చ శైవానా ముపాస్యేయం చ నిత్యశః | మూలప్రకృతి రూపా సా సృష్టిస్థిత్యంతకారిణీ. 56

తస్యా నవాక్షరం మంత్రం వక్ష్యే మంత్రోత్తమోత్తమమ్‌ | వాగ్బవం శంభువనితా కామబీజం తతః పరమ్‌. 57

చాముండా యై పదం పశ్చాద్వి చ్చే ఇత్య క్షరద్వయమ్‌ | నవాక్షరో మనుః ప్రోక్తో భజతాం కల్పపాదపః. 58

నూగులు- తేనె- నెయ్యి- పాలు మున్నగు వస్తువులతో భక్తితో హోమము జరుపవలయును. నారదు డిట్లనెను: మహాత్మా| ఏ స్తోత్రమున రాధ ప్రసన్న మగునో తెల్పుము. నారాయణు డిట్లనెను : పరమేశాని ! రాసమండలవాసిని ! రాసేశ్వరి! కృష్ణ ప్రాణాధికప్రియా! నీకు నమస్కారములు. త్రైలోక్యజననీ ! కరుణాలయా! బ్రహ్మ విష్ణ్వాది దేవతలచే మనస్కరింబడు పదపద్మములుగల దేవి ! నమస్కారములు. సరస్వతి రూపిణీ ! సావిత్రి! శంకరీ!గంగ! పద్మావతి రూపా! షష్ఠీ మంగళచండికా ! నమస్కారములు. తులసీ ! లక్ష్మీ ! దుర్గాదేవీ ! సర్వస్వరూపిణీ ! నీకు నమస్కారములు తల్లీ! మూలప్రకృతి స్వరూపిణీ దేవీ! కరుణాలవాలా! మేము నిరంతరము నిన్నే కొలిచెదము ఘోర సంసార సాగరమునుండి సముద్ధరింపదగినదవే! దయ చూడుము ! ఈ విధముగ సంస్మరించుచు మూడువేళల స్తోత్రము చదువు వాని కెచ్చటను దుర్లభ##మైనది లేనేలేదు. అతడు తనువు చాలించిన మీదట గోలోకమందలి రాసమండలమున నివసింపగలడు. ఈ పరమ రహస్య మితరులకు చెప్పరాదు. ఇపుడు శ్రీదుర్గాదేవి పూజా విధాన మాలకింపుము. దుర్గామాతను స్మరించినంతనే మహాపద లన్నియు తొలిగిపోవును. ఎవడు దుర్గాదేవిని కొలువడో వాని కెచ్చటనేమియు నుండదు. ఆమె విశ్వమాత- శైవి- సర్వోపాస్య-సర్వశక్తి-మహాద్బుత చరిత్ర-సర్వ బుద్ధ్యధిష్ఠానదేవి- అంతర్యామి స్వరూపిణి- ఘోరా సంకటములు పాపున దగుటచే భువిపై దుర్గ యని ప్రసిద్ధి గాంచినది. ఈమె నిత్యమును శైవ-వైష్ణువుల చేత నుపాసింపబడుదగినది. మూలప్రకృతి స్వరూపుణి-సృష్టి స్థిత్యంతకారిణి. దుర్గ నవార్ణమంత్రము త్తమోత్తమమైనది. అది వాగ్బీజము శాంభవీ బీజము కామబీజములు గల్గియుండునది. చాముండాయై పదము చివర '' విచ్ఛే '' యను రెండవక్షరములుండును. '' ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే '' యను నవాక్షర మంత్రము కొల్చువారికి కల్పతరువు. దీనిని మనువు తెల్పెను.

బ్రహ్మ విష్ణు మహేశానా ఋషయో7స్య ప్రకీర్తితాః | ఛందాం స్యుక్తానిసతతంగా యత్ర్యుష్ణి గనుష్టుభః. 59

మహాకాళీ మహాలక్ష్మీః సరస్వత్యపి దేవతాః | స్యా ద్రక్త దంతికాబీజం దుర్గాచ భ్రామరీ తథా. 60

నందాశాకంభరీ దేవ్యౌ భీమా చ శక్తయఃస్మృతాః | ధర్మార్థ కామమోక్షేషు వినియోగ ఉదాహృతః. 61

ఋషిచ్ఛందో దైవతాని మౌళౌ వక్త్రే హృది న్యసేత్‌ | స్తనయోః శక్తిబీజాని న్య సేత్సర్వార్థ సిద్ధయే. 62

బీజత్రయై శ్చతుర్బి శ్చద్వాభ్యాం సర్వేణ చైవహి | షడంగాని మనో కుర్యా జ్ఞాతి యుక్తాని దేశికః. 63

శిఖాయాం లోచనద్వంద్వే శ్రుతినాసాననేషు చ | గుదే న్యసే న్మం త్ర వర్ణా న్సర్వేణ వ్యాపకం చరేత్‌. 64

ఖడ్గ చక్ర గదాబాణ చాపాని పరిఘం తథా | శూలం భుశుండీం చశిరః శంఖం సందధతీం కరైః. 65

మహాకాళీం త్రినయనాం నానాభూషణ భూషితామ్‌ | నాలాంజనసమప్రఖ్యాం దశపాదాననాం భ##జే. 66

మధుకైటభనాశార్థం యాం తుష్టావాంబుజాసనః | ఏవం ధ్యాన్మహాకాళీం కామ బీజస్వరూపిణీమ్‌. 67

అక్షమాలాం చ పరశుం గదేషుకులిశాని చ | పద్మం ధనుష్కుండికాం చ దండం శక్తి మసింతథా. 68

చర్మాం బుజం తథా ఘంటాం సురా పాత్రం చ శూలకమ్‌ | పాశం సుదర్శనం చైవ దధతీ మరుణ ప్రభామ్‌. 69

రక్తాంబుజాసనగతాం మయా బీజస్వరూపిణిమ్‌ | మహాలక్ష్మీ భ##జే దేవం మహిషాసురమర్దినీమ్‌. 70

ఘంటా శూలే హలం శంఖం ముసలం చ సుదర్శనమ్‌ | ధనుర్బాణా న్హ స్తపద్మై ర్దధానాం కుంద సన్నిభామ్‌. 71

శుభాంది దైత్య సంహర్తీం వాణీబీజ స్వరూపిణీమ్‌ | మహాసరస్వతీం ధ్యాయే త్సచ్చి దానంద విగ్రహమ్‌. 72

ఈ మంత్రమునకు బ్రహ్మ- విష్ణువు-మహేశులు ఋషులు; గాయథ్రి-ఉష్ణిక్‌-అనుష్టుప్పులు చందములు మహాకాళీ-మహాలక్ష్మీ-మహా సరస్వతులు దేవతలు; రక్తదంతికా దుర్గాభ్రామరీ బీజములు; నందా-శాకంభరీ భీభూదేవతలు శక్తులు; ధర్మార్థ కామమోక్షములందు దీని వినియోగము. (ఋషి- ఛందము-దేవతలను క్రమముగా శిరమున-ముఖమున- హృదయమున బీజత్రయమును దక్షిణస్తనమున శక్తి త్రయమును వామస్తనమున వ్యాపము చేయవలెను. పిమ్మట వాగ్బీజమును హృదయ మున మాయా బీజమును శిరమున కామ రాజబీజమును శిఖయందు చాముండాయై అను నాల్గక్షరములను కవచమున విచ్చేఅను రెండక్షరములను నేత్ర త్రయమున మోత్తమునవార్ణమంత్రమును అస్త్రమున న్యాసమొనర్పవలయును. ఈ అంగన్యాసమున చతుర్థ్యంతములయిన శిరసే మొదలగు పదముల చివర వరుసగా నమః స్వాహా - వషట్‌ - హుం - వౌషట్‌ - ఫట్‌- అను జాతి పదముల చేర్చవలెను. ఇక వర్ణ వ్యాసము; కామ రాజ బీజము మొదలు మూల మంత్రపు తొమ్మిది వర్ణములను వరుసగా శిఖా- దక్షిణ నేత్ర- వామనేత్ర - దక్షిణ వర్ణ - వామ కర్ణ- దక్షిణ నాసా - వామనాసా- ముఖ గుదములందు న్యాసము చేయవలెను. పరిష్కర్త.) ఖడ్గము-శంఖము-చక్రము గద విల్లమ్ములు పరిషు శూలము భుశుండి శిరము శంఖము దాల్చినది త్రిణయన నానా భూషణభూషిత నల్లని కాటుక కొండవంటి రూపు పది పాదములు ముఖములుగలది మధుకైటభనాశమునకు మున్ను బ్రహ్మయే దేవిని సంస్తుతించెనో యా కామబీజ స్వరూపిణి యగుమహాకాళిని ధ్యానించుచున్నాను. అక్షమాల- పరశు- గద-కులిశము-పద్మము- ధనువు- కుండి- కరండము-శక్తి- కత్తి-చర్మము- అంబుజము-ఘంటిక-పానపాత్ర-శూలము-పాశము-సుదర్శనమునను నాయుధములు దాల్చు అరుణప్రభ రక్తకమలాసన మాయాబీజ స్వరూపిణి మహిషాసురమర్దిని యగు మహాలక్ష్మిని ఘంట- శూలము- హలము - ముసలము- సుదర్శనము- ధనుర్భాణములను కరములందు దాల్చి మొల్ల పూలకాంతు లీను శుంభాది దైత్య సంహారిణి నవార్ణమంత్రమందలి వాగ్బీజమున కధిదేవత- సచ్చిదానంద స్వరూపిణియైన మహాసరస్వతిని ధ్యానించుచున్నాను.

యంత్ర మస్యాః శృణు ప్రాజ్ఞ త్ర్యస్రం షట్కోణ సంయుతమ్‌ |

తతో7ష్టదళ పద్మం చ చతుర్విం శతి పత్రకమ్‌. 73

భూగృహేణ సమాయుక్తం యంత్రం మేవంవిచింతయేత్‌ | శాలగ్రామే ఘటేవా7పి యంత్రేవా ప్రతిమాసువా. 74

బాణలింగే7థవా సూర్యే యజేద్దేవీ మనన్యధీః | జయాది శక్తి సంయుక్తే పీఠే దేవీం ప్రపూజయేత్‌. 75

పూర్వకోణ సరస్వత్యా సహితం పద్మజం యజేత్‌ | శ్రియాసహ హరిం దేవీం నైరృతే కోణకే యజేత్‌. 76

పార్వత్యా సహితం శంభుం వాయుకోణ సమర్చయేత్‌ | దేవ్యా ఉత్తరతః పూజ్యః సింహో వామే మహాసురమ్‌. 77

మహిషం పూజయే దంతే షట్కోణషు యజేత్క్రమాత్‌ | నందజాం రక్తదంతాం చ తథాశాకం భరీం శివామ్‌. 78

దుర్గాం భీమాం భ్రామరీం చ తతో వసుదళేషు చ | బ్రాహ్మీం మహేశ్వరీం చైవ కౌమారీం వైష్ణవీంతథా. 79

వారాహీం నారసింహీం చ ఐంద్రీం చాముండకాంతథా | పూజయేచ్చ తతః పశ్చాత్తత్వ పత్రేషు పూర్వతః. 80

విష్ణుమాయాం చేతనాం చ బుద్దిం నిద్రాం క్షుధాంతథా | ఛాయాశక్తిం పరాంతృష్టాం శాంతింజాంతిచ లజ్జయా. 81

క్షాంతిం శ్రద్ధాం కీర్తి లక్ష్మ్య ధృతింవృత్తిం శ్రుతిం స్మృతమ్‌ |

దయాంతుష్టిం తతః పుష్టిం మాతృ భ్రాంతీ ఇతి క్రమాత్‌. 82

తతో భూపురకోణషు గణశం క్షేత్ర పాలకమ్‌ | వటుకం యోగినీ శ్చా పి పూజయేన్మతి మాన్నరః. 83

ఇంద్రాద్యానపి తద్బాహ్యే వజ్రాద్యాయుధ సంయుతాన్‌ | పూజయే దనయారీత్యా దేవీం సావరణాంతథా. 84

రాజోపచారా న్వివిధా న్దద్యాదంబా ప్రతుష్టయే | తతోజపేన్న వార్ణం చ మంత్రం మంత్రార్థ పూర్వకమ్‌. 85

తతః సప్తశతీ స్తోత్రం దేవ్యా అగ్రేతు సంపఠేత్‌ | నానేన సదృశం స్తోత్రం విద్యతే భువనత్రయే. 86

ఇక దేవీయంత్రము గూర్చి వినుము. త్రికోణము-తర్వాత షట్కోణము-తర్వాత అష్టదశములు తర్వాత ఇరువదినాల్గు దళములు. భూగృహ నిర్మాణము గలదానిగ చింతింపవలయును. సాలగ్రామము కలశము యంత్రము ప్రతిమ బాణలింగము వీనిలో దేని యందైనను సూర్యనందైనను నిశ్చలబుద్ధితో దేవి నారాధింపవలయును. యంత్రమునకు తూర్పున సరస్వతితోడి బ్రహ్మను నైరృతకోణమున లక్ష్మితో విష్ణువును ధ్యానించవలయును. వాయుకోణమున పార్వతితోడి శంభుని ఉత్తరమున సింహమును దక్షిణమున మహాసురుడైన (సాయుజ్యమొందుట వలన) మహిషుని పూజింపవలయును. తర్వాత ఆరు కోణములందు నందజ- రక్తదంత- శాకంభరి-శివ-దుర్గ-భీమ-భ్రామరిలను పూజింపవలయును. తర్వాత అష్టదళములందుబ్రాహ్మి - మహేశ్వరి-కౌమరి- వైష్ణవి- వారాహి- నారసింహ- ఐంద్రి- చాముండలను బూజింపవలయును. తరువాత నిరువది నాల్గు దళములందు క్రమముగ విష్ణుమాయ-చేతన-బుద్ది-నిత్ర-క్షుధ-ఛాయ- పరాశక్తి-తృష్ణ-శాంతి-జాతి-లజ్జ-క్షాంతి-శ్రద్ధ-కీర్తి-లక్ష్మి-ధృతి-వృత్తి-శ్రుతి-స్మ్రతి-దయ-తుష్టి-పుష్టి-మాత-భ్రాంతి- యను నిరువది నల్గురు దేవతలను బూజింపవలయును. ఆ తర్వాత మతిమంతుడై భక్తుడు భూగృహ కోణములలో గణపతిని-క్షేత్రపాలకుని-వటుకుని-యోగినిని బూజింపవలయును. దానికి బైట వజ్రము మున్నిగు నాయుధములు దాల్చిన యింద్రుడు మొదలగు దేవతల నర్చించవలయును. ఈ విధమున నావరణ దేవతలను దుర్గాదేవి నారాధింపవలయును. తర్వాత వివిధ రాజోపచారములతో నర్చించి దేవిని సంతుష్టి పఱచవలయును. అటు తరువాతనవార్ణ మంత్రమును- మంత్రార్థమును భావింపవలయును. ఆ తరువాత దేవి సన్నిధిలో సప్త శతి స్తోత్రము పారాయణ చేయవలయును. ఈ ముల్లోకములందును సప్తశతీ స్తోత్రమునకు సాటియైన స్తోత్రము లేనేలేదు.

తతశ్చానేన దేవేశీం తోషయోత్ప్రత్యహం నరః | ధర్మార్థ కామమోక్షాణా మాలయో జాయతే నరః. 87

ఇతి తే కధితం విప్ర శ్రీదుర్గాయా విధానకమ్‌ | కృతార్థతా యేన భ##వేత్త దేవత్కథితం తవ. 88

సర్వే దేవా హరి బ్రహ్మ ప్రముఖా మనవస్తథా | మునయో జ్ఞానవిష్ఠా శ్చ యోగిన శ్చా77శ్ర మాస్తథా. 89

లక్ష్మ్యాదయ స్తథా దేవ్యః సర్వే ధ్యాయంతి తాంశివామ్‌ | తదైవ జన్మసాఫల్యం దుర్గాస్మరణ మస్తిచేత్‌. 90

చతుర్థశా7పి మనవో ధ్యాత్వా చరణ పంకజమ్‌ | మనుత్వం ప్రాప్తవంతం శ్చ దేవాః స్వం స్వం పదం తథా. 91

తదేత త్సర్వ మాఖ్యాతం రహస్యాతిరహస్యకమ్‌ | ప్రకృతీనాం పంచకస్య తదంశానాంచ వర్ణనమ్‌. 92

శ్రుత్యైత న్మనుజో నిత్యం పురుషార్థచతుష్టయమ్‌ | లభ##తే నా7త్ర సందేహః సత్యం సత్యం మయెదితమ్‌. 93

అపుత్రో లభ##తే పుత్రం విద్యార్థీ ప్రాప్ను యాచ్చ తామ్‌ | యం యం కామం స్మరే ద్వాపి తంత శ్రుత్వా సమాప్నుయాత్‌. 94

నవరాత్రే పఠే దేత ద్దేవ్యగ్రేతు సమాహితః | పరితుష్టా జగద్ధాత్రీ భవత్యేవ హి నిశ్చితమ్‌. 95

నిత్య మేకైక మధ్యాయం పఠేద్యః ప్రత్యహం నరః | తస్య వశ్యా భ##వే ద్దేవీ దేవీ ప్రియకరో హి సః. 96

శకునాం శ్చ పరీక్షేత నిత్య మస్మిన్యథా విధి| కుమారీదివ్యహస్తేన యద్వా నటుకరాంబుజాత్‌. 97

మనోరథంతు సంకల్ప్య పుస్తకం పూజయేత్తతః | దేవీం చ జగదీశానీం ప్రణమే చ్చ పునః పునః. 98

సుస్నాతాం కన్యకాం తత్రా77నీయా7భ్యర్చ్య యథావిధి | శలాకాం రోపయే న్మధ్యే తయా స్వర్ణేన నిర్మితామ్‌. 99

శుభం వా7ప్య శుభం తత్ర యదాయాతి చ తద్బవేత్‌ | ఉదాసీనే7ప్యుదాసీనం కార్యం భవతి నిశ్చితమ్‌. 100

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే పంచాశత్తమో7ధ్యాయః

బాణాక్షిరసరామైస్తు సార్దైః (3625 1/2ల ) శ్లోకైః సునిస్తరః |

దేవీ భాగవత స్యాస్య నవమస్కంధ ఈరితః

ఇతి శ్రీమద్ధేవీభాగవతే నవమస్కంధః

సమాప్తః.

ఈ విధముగ మానవుడు నిత్యమును దేవేశిని సంతోషపఱచవయును. ఇట్లు చేసిన వానికి ధర్మార్థకామమోక్షములు కరతలామలకములు. ఇది శ్రీదుర్గా పూజా విధానము. దీనివలన జన్మసార్థక మగును. ధన్య మగును. ఇదంతయును నీకు తెల్పితిని. బ్రహ్మ-విష్ణువు మొదలగు నెల్ల దేవతలు మునులు యోగులు యోగనిష్ఠలు ఆశ్రమవాసులు. లక్ష్మి మున్నగు దేవతందఱును శివకామేశ్వరిని దుర్గను మనసార ధ్యానింతురు. దుర్గాదేవిని స్మరించినచో జన్మతరించును. పదునలుగురు మనువులును దుర్గాదేవి చరణ కమలములు ధ్యానించుట వలన మనువు లైరి. దేవతలును తమ గొప్ప గొప్ప పదవు లలంకరించగల్గిరి. ఈవిధముగ రహస్యాతి రహస్యమైన దుర్గాదేవీ చరిత్ర మంతయును వినిపించితిని. పంచ ప్రకృతులను వారి యంశజులను గూర్చి విపులముగ దెలిపినతిని. నాచేత చెప్పబడిన దీనిని వినిన మానవుడు ముమ్మాటికి నిక్కముగ మహావిద్యావంతుడు గాగలడు. ఎవ డే కోర్కితో వినునో వాని కా కోరిక తేరును. దీని శరన్న వరాత్రములందు శ్రీదేవి సన్నిధానమునందు నిశ్చల మనస్సుతో చదివినచో వానికి దేవి వశ్యురా లగును. వాడు దేవికి ప్రియభక్తుడు గాగలడు. ఇందు గూర్చి యథా విధిగ శకునములు చూచుకొనవలయును. దాని క్రమ మెట్లనగా నొక కుమారిక చేతగాని వటువు చేతగాని ఏదేని మనస్సులో తంచుకొని దేవి పుస్తకమును మొదట పూజింపవలయును. ఆ జగదీశానిని మాటిమాటికి నమస్కరించవలయును. చక్కగా స్నానముచేసిన ఒక కన్యను తెచ్చి యామెను పూజించవలయును. ఆమె చేతి కొక బంగారు కడ్డీ నీయవలయును. ఆమె దానిని శుభాశుభ స్థానములం దెచ్చట నుంచునో తెలిసికొని దానిని బట్టి తన కోరిక ఫలమెఱుంగవలయును. ఆ బాలిక ప్రసన్నయైన దేవి తలంచవలయును. ఉపేక్షించియున్న దేవి యుదాసీనగ నుండునని యెఱుగవలయును. దానిని బట్టి ఫలితములును తెలియవలయును.

ఇది శ్రీదీవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధమందు యేబదవ యధ్యాయము

మూడువేల ఆరు వందల యిరువదైదున్నర శ్లోకములుగల నవమ స్కంధము సమాప్తము.

Sri Devi Bagavatham-2    Chapters