Sri Devi Bagavatham-2
Chapters
అథ ద్వితీయోధ్యాయః. శ్రీదేవ్యువాచ: భూమిపాల మహాబాహో సర్వమేత ద్బవిష్యతి |యత్త్వయా ప్రార్థితం తత్తే దదామి మనుజాధిప.
1 అహం ప్రసన్నా దైత్యేంద్రనాశనా మోఘ విక్రమా | వాగ్బవస్య జపేనైవ తపసా తే సునిశ్చితమ్.2 రాజ్యం నిష్కంటకం తే7స్తు పుత్రా వంశకరా అపి| మయి భక్తి ర్దృడా వత్స మోక్షోంతే సత్య పదేభ##వేత్. 3 ఏవంవరాన్మహ దేవీ తసై#్మ దత్వా మహాత్మనే | పశ్యత స్తు మనోరేవ జగామ వింధ్య పర్వతమ్.4 యో7సౌ వింధ్యాచలో రుద్ధః కుంభోద్బవమహర్షిణా | భాను మార్గావరోధార్థం ప్రవృత్తో గగనం స్పృశన్. 5 సా వింధ్యవాసినీ విష్ణో రనుజా పరదేశ్వరీ | బభూవ పూజ్యా లోకనాం సర్వేషాం మునిసత్తమ. 6 ఋషయ ఉవాచః కో7సౌ వింధ్యాచలః సూత కిమర్థం గగనం స్పృశన్ | భాను మార్గావరోధం చ కిమర్థం కృతవానసౌ. 7 కథం చ మైత్రావరుణిః పర్వతంతం మహోన్నతమ్ | ప్రకృతి స్థం చకారేతి సర్వం విస్తరతో పద. 8 నహి తృప్యామహే సాథో త్వ దాస్యగళి తామృతమ్ | దేవ్యా శ్చరిత్రరూ పాఖ్యం పీత్వా తృష్ణా ప్రవర్దతే. 9 సూత ఉవాచః అసీ ద్వింధ్యాచలో నామ మాన్యః సర్వధరాభృతామ్ | మహావనసమూహోఢ్యో మహాపాదవసంవృతః. 10 సుపుష్పితై రవేకై శ్చ లతా గుల్మైస్తు సంవృతః | మృగా వరాహా మహిషా వ్యాఘ్రాః శార్ధూలకా అపి. 11 వానరాః శశకా ఋక్షాః శృగాలా శ్చ సమంతతః | విచరంతి సదా హృష్టాః పుష్టాః ఏవ మహోద్యమాః. 12 నదీనదజలాక్రాంతో దేవగంధర్వ కిన్నరైః అప్సరోభిః కింపురుషైః సర్వకామఫలద్రుమైః. 13 ఏతా దృశే వింద్యనగే కదాచిత్పర్యట న్మహీమ్ | దేవర్షిః పరమ ప్రీతో జగామస్వే చ్ఛాయా మునిః 14 రెండవ అధ్యాయము శ్రీదేవీ చరితము శ్రీదేవి యిట్లనెను : రాజా! నీ వన్నదంతయును జరుగగలదు. నీవు కోరిన వన్నియు నిచ్చుచున్నాను. దుష్ట దైత్యులను సంహరించు దివ్యశక్తిగల వాగ్బవ బీజమును జపించి తప మొనర్చితివి. నీయెడల ప్రసన్ను రాలనైతిని. నీ రాజ్య పాలనమును కెదురుండదు. నీకు వంశవృద్ధికరులైన సుపుత్రులుద్భవింపగలరు. వత్సా! నాయెడల నీకు నిశ్చలభక్తి యుండును. చివరకు నీవు నా సత్యపదము చేరుదువు. ఇట్లు మహాదేవి మను మహాశయునకు వరము లొసంగి యతడు చూచుచుండగనే వింధ్యపర్వతము మీది కరిగెకు. వింధ్యగిరి సూర్యమార్గము నడ్డగించుట కెత్తగు చుండగ ఆగస్త్య మహర్షి దాని పెరుగుదల నాపు జేసెను. ఋషు లిట్లనిరి; సూత మహర్షీ! ఆ వింద్యాచల మెవరు? అది నింగిని తాకుచు సూర్యమార్గము నేల యడ్డగించదలచెను. అంత పెద్ద పర్వతము నగస్త్యముని యెట్లు పెరుగనీయ కాపుదల చేయగలిగెను. అంతయు నాకు వివరముగ తెలుపుము. సాధుపుంగవా! నీ ముఖమునుండివ వెడలు దేవీ చిరిత్రామృత దివ్య రస మెంత క్రోలినను తనివితీరుట లేదు. ఇంకను దేవి కథలు విను వేడుక పెల్లుబుకుచున్నది. సూతు డిట్లనెను : వింధ్యాచలమెల్ల పర్వతములతో శ్రేష్ఠమైనది. అది మహావృక్షములు గల వనములతో నలరారుచున్నది. అందు మిక్కిలి విరబూచిన తీగ పొదరిండ్లు గలవు. అందడవి జంతువులైన పందులు దున్నలు పెద్దపులులు చిఱుతపులులు కోతులు కుందేళ్లు ఎలుగుబంట్లు నక్కలు నెప్పుడు బాగగ తిని బలిసి తిరుగాడుచుండును. అందు నదీనదములు ప్రవహించుచుండును. దేవ గంధర్వులు కిన్నెర కింపురుషులు అచ్చరలు వహరింతురు. అందు కోరిన కోర్కు లిచ్చు ఫలవృక్షములను గలవు. ఒకప్పుడు నారదుడీ నేల యంతయును తిరిగి తిరిగి పరమప్రీతితో స్వేచ్ఛగ వింధ్యగిరి కేతించెను. తం దృష్ట్వా సన గో మంక్షు తూర్ణముత్థాయ సంభ్రమాత్ | పాద్య మర్ఘ్యం తథా దత్వా వరానన మథార్పయత్. సుఖోపవిష్టం దేవర్షిం ప్రసన్నం నగ ఊచివాన్ | వింధ్యా ఉవాచః దేవర్షే కథ్యతాం జాత ఆగమః కుత ఉత్తమః. 16 తవా77గమనతో జాత మనర్ఘ్యం మను మందిరమ్ | తవ చంక్రమణం దేవా7భయార్థం హి యథా రవేః. 17 అపూర్వ జన్మనో వృత్తం తద్ర్భూనహిమమ నారద| నారద ఉవాచ: మమా77గమన మింద్రారే జాతం స్వర్ణగిరే రథ. 18 తథ్ర దృష్టా మయా లోకాః శక్రాగ్ని యమపాశినమ్ | సర్వేషాం లోకపాలానాం భవనాని సమంతతః. 19 మయా దృష్టాని వింధ్యాగ నానాభోగ ప్రదాని చ | ఇతి చోక్త్వాబ్రహ్మయోనిః పునరు చ్చ్వాసమావిశత్. 20 ఉచ్చ్వ సంతం మునిం దృష్ట్యా పునః పప్రచ్ఛ శైలరాట్ | ఉచ్చ్వాసకారణం కింత ద్ర్బూహి దేవఋషే మమ. 21 ఇత్యాకర్ణ్య నగస్యోక్తం దేవర్షి రమితద్యుతిః | అబ్రవీచ్చ్రూతాం వత్స మమోచ్చ్వాసస్య కారణమ్ 22 గౌరీగురుస్తు హిమవాన్ శివస్య శ్వశురః కిల | సంబంధిత్వా త్పశుపతేః పూజ్య ఆసీ త్షమాభృతమ్.23 ఏవమేవ చకైలాసః శిస్యావసథ్ః ప్రభుః | పూజ్యః పృథ్వీభృతాం జాతో లోకే పాపౌఘదారణః.24 నిషదః పర్వతో నీలో గంధమాదన ఏవ చ | పూజ్యాః స్వస్థాన మాసాద్య సర్వ ఏవ క్షమాభృతః. 25 యం పర్వేతి చ విశ్వాత్మా సహస్రకిరణః స్వరాట్ | స గ్రహర్షగణోపితః సో7యం కనక పర్వతః 26 ఆత్మానం మనుతే శ్రేష్ఠం వరిష్ఠం చ ధరాభృతామ్ | సర్వేషా మహ మే వాగ్ర్యో నాస్తి లోకేషు మత్సమః. 27 ఏవం మానాభిమానంతం స్మృత్వో చ్చ్వా సో మయోజ్ఘితః | అస్తునైతావతా కృత్యం తపో బలవతాం నగ | ప్రసం గతో మయోక్తంతే గమిష్యామి నిజం గృహమ్. 28 ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ దశమస్కంధే ద్వితీయో7ధ్యాయః. వింధ్యగిరి కధిష్ఠానదేవత వెంటనే లేచి వచ్చి ముని కర్ఘ్యపాద్యము లొసంగి యాసన మొసంగెను. నారద ముని యును ప్రసన్నుడై కూర్చొనియుండగ వింధ్యగిరి యతనితో నిట్లనెను. మహాత్మా! మీ రాక యెచ్చటినుండియో తెలుపుము. మీ రాకవవలన నా మందిరము పావన మయ్యెను. సూర్యుని గమనము మేలుకొఱకే జరుగును. అటులే మీ యాగమనమున అభయము మేలు జరుగును. మీ మనస్సులోని సంగతి యేమో తెలుపుము. నారదు డిట్లనెను : గిరివరా! నేను సుమేరుగిరినుండి యేతెంచుచున్నాను. నేనచట ఇంద్ర-యమ- వరుణల లోకములు గాంచితిని. లోకపాలుర భవనాలు మేరువునకు నలువైపుల నుండుట చూచితిని. అవి పెక్కు సుఖభోగములు గల్గించుచుండగ చూచితిని. అని నారదుడు నిట్టూర్చెను. అటుల నిట్టూర్పు మునివరుని గాంచి వింధ్యగిరి మరలనిట్లనెను. నారదా ! నీ నిట్టూర్పు నకు కారణ మేమో తెలుపుము. అను గిరి మాటలు విని తపోజ్యోతియగు నారదుడు తన నిట్టూర్పునకు కారణ మిట్లు చెప్పసాగెను. హిమాచలము గౌరికి తండ్రి- శివునకు మామ. ఆ హిమాచలుడు పశుపతి సంబంధము వలన పర్వతములలో పూజ్యుడయ్యెను, కైలాసగిరి శివుని నివాసస్థానము. అది పాపహారమగుట వలన పర్వతములలో మిక్కలి పూజనీయమైనది. ఇక నిషథ- నీల- గంథమాదన పర్వతములును తమ తమ స్థానముందుండి పూజింపబడుచున్నవి. ఇంకవేవెలుగు-విశ్వాత్ముడైన రవి గ్రహననక్షత్ర గణములతో గలిసి మేరుగిరికి ప్రదక్షిణము చేయును. ఈ నేలపై గల పర్వతము లన్నిటిలోను తన్ను మించిన గిరి లేదని మేరుపు తలంచును. దాని యీ స్వాభిమానము-దర్పము చూచి నాకు నిట్టూర్పు గల్గుచున్నది. ఇంత తపస్సంపన్నులమైన మా కెట్టి యభిమానమును లేదు. ఏదో సందర్భము వచ్చెనని చెప్పితిని. ఇక నా చోటికి నే నేగగలను. ఇతి శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి దశమ స్కంధమున రెండవ యధ్యాయము