Sri Devi Bagavatham-2    Chapters   

అథ చతుర్థోధ్యాయః

సూత ఉవాచః తతః సర్వే సురగణా మహేంద్రప్రముఖా స్తదా | పద్మయోనిం పురస్కృత్య రుద్రం శరణ మన్వయుః. 1

ఉపతస్థుః ప్రణతిభిః స్తోత్రైశ్చారు విభూతిభిః | దేవదేవం గిరిశయం శశిలోలిత శేఖరమ్‌. 2

దేవా ఊచుః ః జయ దేవ గణా ధ్యక్ష ఉమాలాలిత పత్కజ | అష్టసిద్ధి విభూతీనాందాత్రే భక్త జనాయతే. 3

మహామాయా విలసిత స్థానాయ పరమాత్మనే | వృషాంకాయామరేశాయ కైలాసస్థితిశాలినే. 4

అహిర్బుధ్న్యాయ మాన్యాయ మనవే మానదాయినే | అజాయ బహురూపాయ స్వాత్మారామాయ శంభ##వే. 5

గణనాథాయ దేవాయ గిరిశాయ నమోస్తుతే | మహావిభూతిదాత్రేతే మహావిష్ణు స్తుతాయ చ. 6

విష్ణుహృత్కంజవాసాయ మహాయోగరతాయ చ | యోగ గమ్యాయ యోగాయ యోగినాంపతయే నమః 7

యోగీశాయ నమస్తుభ్యం యోగానాం ఫలదాయినే | దీనదానపరాయాపి దయాసాగర మూర్తయే. 8

ఆర్తి ప్రశమనాయోగ్ర వీర్యాయ గుణమూర్తయే | వృషధ్వజాయ కాలాయ కాలకాలాయతే నమః 9

సూత ఉవాచ ః ఏవం స్తుతః స దేవేశో యజ్ఞ భుగ్బిర్వృషధ్వజః | ప్రాహగంభీరయా వాచా ప్రహసన్విబుధర్షభాన్‌. 10

శ్రీ భగవానువాచః ప్రసన్నోహం దివిషదః స్తోత్రేణోత్తమ పూరుషాః | మనోరథం పూరయామి సర్వేసాం దేవతర్షభాః 11

దేవా ఊచుః : సర్వ దేవేశ గిరిశ శశిమౌళివిరాజిత | ఆర్తానాం శంకరస్త్వంచ శం విధేహి మహాబల. 12

పర్వతో వింధ్యనామాస్తి మేరు ద్వేష్టామహోన్నతః | భానుమార్గనిరో ద్ధాహి సర్వేషాం దుఃఖదోనఘ. 13

నాలుగవ అధ్యాయము

శ్రీదేవీ చరితము

సూతు డిట్లనెను : ఆ తర్వాత నింద్రాది దేవత లెల్లరును బ్రహ్మను పురస్కరించుకొని శివుని శరణు వేడిరి. వారు సవినయముగ పెక్కు విధములైన సతులతో నుతులతో చంద్రసేఖరుడు- గిరీశుడు నగు దేవదేవుని ప్రార్థించిరి. దేవత లిట్లనిరి ః గణాధ్యక్షా ! పార్వతీ సేవిత పాదపద్మా ! భక్తులకు అష్టసిద్ధు లొసంగు మహాదేవా ! నీకు జయమంగళ మగుత. మహామాయను గూడి విలసిల్లు పరమాత్మా ! వృషభవాహనా ! అమరేశ్వరా ! కౌలాసవాసా ! అహిర్బుధ్న్యా! మాన్య! మను! మానదా ! అజ! బహురూపా !స్వాత్మారామా ! శంభూ ! గణనాథా ! దేవా ! గిరిశా ! నీకు నమస్కారములు. మహావిభూతి దాయకా ! మహావిష్ణు సన్నుతా ! విష్ణురూపా ! విష్ణు హృదయ కమలవాసా ! మహాయోగరతా ! యోగగమ్యా ! యోగరూపా ! యోగీశా! నీకు నమస్కారములు. దేవ! యోగివర్యా! యోగిఫలదాయకా! దయాసాగరమూర్తి! దీనదయాపరా! నీకు నమస్కారములు. దేవా! యోగివర్యా! యోగిఫలదాయకా! దయాసాగరమూర్తి ! దీనదయాపరా! నీకు నమస్కారములు. దేవ ! ఆర్తిని బాపుదేవా!ఉగ్రవీర్యా! గుణనిధానా !వృషభధ్వజా ! కాల! కాలకాలా!నీకు నస్కారములు దేవా! సూతుడిట్లననెను ః అని దేవతలు-దేవేశుడు -యజ్ఞభోక్త- వృషభధ్వజుడగు శివుని సన్నుతించిరి. అపుడు శివుడు నవ్వుచు గంభీరముగ దేవతలతో నిట్లు పలికెను.

తద్వృద్ధిం స్తంభ##యేశాన సర్వకల్యాణకృ ద్బవ | భాను సంచారరోధేన కాలజ్ఞానం కథం భ##వేత్‌. 14

నష్టస్వాహా స్వధాకారే లోకేశః శరణం భ##వేత్‌ | అస్మాకం చ భయార్తానాం భవానేవ హిదృశ్యతే. 15

దుఃఖనాశకరో దేవ ప్రసీద గిరిజాపతే | శ్రీభగవానువాచః నాస్మాకం శక్తిరస్తీహతద్వృద్ధి స్తంభ##నే సురాః. 16

ఇమమేవం వదిష్యామో భగవంతం రమాధవమ్‌ | సోస్మాకం ప్రభు రాత్మాచపూజ్యః కారణరూపధృక్‌. 17

గోవిందో భగవాన్విష్ణుః సర్వకారణః కారణః | తం గత్వా కథయిష్యామః స దుఃఖాంతో భవిష్యతి. 18

ఇత్యేవ మాకర్ణ్య గిరీశభాషితం దేవాశ్చసేంద్రాః నపయోజ సంభవాః |

రుద్రం పురస్కృత్య చ వేపమానా వైకుంఠలోకం ప్రతి జగ్మురంజసా. 19

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ దశమస్కంధే చతుర్థోధ్యాయః

భగవాను డిట్లనియెను. ః ఉత్తమ పురుషులగు దేవతలారా ! మీ స్తోత్రమునకు ప్రసన్నుడనైతిని. మీ యెల్లర కోరిక లీడేర్పగలను. దేవత లిట్లనిరి ః సర్వదేవేశా ః గిరిశా ః చంద్రశేఖరా ! మహాబలా! ఆర్తుల యార్తి బావు దేవ ! మాకు మేలు వెల్గుబాట చూపించుము. వింధ్య మను పర్వతము మేరువుతో పోటీపడి యెత్తుగ పెరిగి సూర్యగమనమున కడ్డు నిలిచెను. అది యెల్లరికి బాధ గల్గించుచున్నది. ఈశానా ! అనఘా ! దాని పెరుగుదల నాపుము. మేలు చేకూర్చుము. సూర్యూని గమన మాగినచో కాలము తెలియబడదు గదా. లోకమునందు స్వాహా స్వధాకారము లాగిపోయెను. ఇక మాకు దిక్కెవ్వరయా ! మా బోటి భయార్తులకిక నీవే దిక్కు. గిరిజాపతీ ! దేవా దయ జూడుము ! మా దుఃఖము బాపుము ! భగవాను డిట్లనెను ః దేవతలారా! దాని పెరుగుదల నాపుటకు నాకు శక్తి చాలదు. ఇదంతయును విష్ణు భగవానునితో తెలపుదము. మనకెల్లరికి ఆత్మ- ప్రభువు-పూజ్యుడు-కారణరూపుడతడే. గోవిందుడు - భగవానుడు - విష్ణువు - సర్వకారణ కారణుడు -అతనిని జేరి యంతయు నివేదించుదము. అతడీ యాటంకము తొలగింపగలడు. అను శివుని మాటలను దేవతలు ఇంద్రుడు బ్రహ్మ వినిరి. వారు త్వరితముగ రుద్రుని పురస్కరించుకొని భయముతో వైకుంఠధామ మరిగిరి.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి దశమ స్కంధమున నాల్గవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters