Sri Devi Bagavatham-2
Chapters
అథపంచయోధ్యాయః సూత ఉవాచః తే గత్వా దేవ దేవేశం రమానాథం జగద్గురుమ్ |విష్ణుం కమల పత్రాక్షం దదృశుః ప్రభయాన్వితమ్. 1 స్తోత్రేణ తుష్టువుర్బక్త్యా గద్గదస్వరసత్కృతాః | దేవా ఊచుః జయ విష్ణో రమేశా೭ద్య మహాపురుష పూర్వప. 2 దైత్యారే కామజనక సర్వకామ ఫలప్రద | మహావరాహ గోవింద మహాయజ్ఞ స్వరూపక. 3 మహావిష్ణో ధ్రువేశా೭೭ద్య జగదుత్పత్తి కారణ | మత్స్యావతాదే వేదానా ముద్ధారాధార రూపక. 4 సత్యవ్రతధరా ధీశ మత్స్య రూపాయ యతే నమః | జయా7కూపార దైత్యారే సుకాయ సమర్పక. 5 అమృతాప్తి కరేశాన కూర్మరూపాయ తే నమః | జయా೭೭దిదైత్యనాశార్థ మాదిసూకరరూపధృక్. 6 మహ్యుద్ధార కృతోద్యోగ కోలరూపాయ తే నమః | నారసింహంవపుః కృత్వా మహాదేత్యం దదార యః 7 కరజై రవ దృప్తాంగం తసై#్మ నృహరయే నమః | వామనం రూప మాస్థాయ త్రైలోక్యై శ్వర్యమోహితమ్. 8 బలింసంఛలయామాస తసై#్మ వామనరూపిణ | దుష్టక్షత్త్రవినాశాయ సహస్రకరశత్రవే. 9 రేణుకాగర్బజాతాయ జామదగ్న్యాయ తే నమః | దుష్టరాక్షస పౌలస్త్య శిరచ్చేద పటీయసే. 10 శ్రీమద్ధాశరథే తుభ్యం నమో నంత క్రమాయ చ | కంసదుర్యోధనాద్యై శ్చ దైత్యైః పృథ్వీశలాంచనైః 11 భారాక్రాంతాం మహీం యో సావుజ్జాహార మహావిభుః | ధర్మం సంస్థా పయామాస పాం కృత్వా సుదూరతః. 12 తసై#్మ కృష్ణాయ దేవాయ నమో೭స్తు బషుధా విభో | దుష్ట యజ్ఞ విఘాతాయ పశుహింసానివృత్తయే. 13 ఐదవ అధ్యాయము శ్రీదేవీ చరితము సూతుడిట్లనెను ః వారు వెడలి దేవ దేవేశుడు-రమాపతి -జగద్గురుడు కమలపత్రాక్షుడు-ప్రభాయతుడగు విష్ణువును దర్శించిరి. దేవతలు భక్తిమీర గద్గదస్వరముతో విష్ణు నిట్లు సంస్తుతించిరి. మహాపురుషా ! పూర్వజ ! రమాకాంతా! నీకు జయము. కామజనకా !కామఫలదాయక ! విష్ణు ! నీకు జయమగుత ! మహావరాహా ! గోవింద! మహాయజ్ఞ స్వరూపా ! మహావిష్ణు! జగదుత్పత్తికారణ! మత్స్యావతారా ! వేదోద్ధారకా ! ఈశా !నీకు జయమగుత! మత్స్యరూపా ! సత్యవ్రత పరాయణా! దానవాంతకా ! సురకార్య నిర్వాహక ! దయాసాగరా! నీకు నమస్కారములు. అమృతము సంపాదించిన దేవా ! ఈశానా ! కూర్మరూపా ! నీకు నమస్కారములు. దానవ నాశకా ! ఆది వరాహరూప ! నీకు నమస్కారములు. భూమి నుద్ధరించుటకు వరాహరూపము దాల్చిన దేవా ! మహాదైత్యుని సంహరించిన నరసింహరూపా ! నీకు నమస్కారములు. వాడి గోళ్లతో దానువుని చీల్చిన నరసింహా !నీకు నమస్కారములు. వామనరూపమున ముల్లోకముల సంపదలకు గర్వించిన బలి నణచితివి. బలిగర్వ మడచిన వామనునకు నమస్కారములు. కార్తవీర్యార్జునుడు నోడించినవాడు దుష్టక్షత్రియుల దునుమాడినవాడును రేణుకకు జన్మించినవాడునైన పరశురామ రూపము దాల్చిన దేవా ! నమస్కారములు. దుష్ట రాక్షసుడైన రావణాసురుని శిరము దును మాడిన వాడును అనంతవిక్రముడు ధర్మవిగ్రహుడు మోహనరూపుడునైన దశరథరాముడవు నీవు ! నీకు నమస్కారములు. కంసుడు దుర్యోధనుడు మొదలగు దైత్యభూమిపతులను భూమి భరింప లేకుండెను. అపుడు ధర్మసంస్థాపనకు పాపులను చంపి భూమి భారము తగ్గించితివి. అట్టికృష్ణ పరమాత్ముడవు- విభువవు నగు నీకు పలుమార్లు నమస్కరించుచున్నాము. యజ్ఞములు వలదని- పశుహింస తగదని ప్రబోధము చేసినవాడవు. బుద్ధరూపము దాల్చిన దేవుడవు నీకు నమస్కారములు. బౌద్ధరూపం దధౌ యో೭సౌ తసై#్మ దేవాయతేనమః | వ్లుెచ్చ ప్రాయే೭ఖిలే లోకే దుష్టరాజన్యపీడితే. 14 కల్కిరూపం సమాదధ్యౌ దేవదేవాయ తేనమః | దశావతారాస్తే దేవ భక్తానాం రక్షణాయ వై. 15 దుష్టదైత్య విఘాతాయ తస్మాత్త్వం సర్వదుఃఖహృత్ | జయభక్తార్తినాశాయ ధృతం నారీజలాత్మసు. 16 రూపం యేన త్వయా దేవ కో೭న్య స్త్వత్తో దయానిధిః | ఇత్యేవం దేవదేవేశం స్తుత్వా శ్రీపీతవానసమ్. 17 ప్రణము ర్బక్తి సహితాః సాష్టాంగం విబుధర్షభాః | తేషాంస్తవంసమాకర్ణ్య దేవః శ్రీపురుషోత్తమః 18 ఉవాచ విఖుదాన్సర్వాన్ హర్షయం ఛ్రీ గదాధరః | శ్రీ భగవానువాచః ప్రసన్నో೭స్మి స్తవేనా೭హం దేవాస్తాపం విముంచథ 19 భవతాం నాశయిష్యామి దుఃఖం పరమ దుఃసహమ్ | వృణుధ్వం చ వరం మత్తో దేవాః పరమదుర్లభమ్. 20 దదామి పరమ ప్రీతః స్తవస్యా೭స్య ప్రసాదతః | య ఏతత్పఠతే స్తోత్రం కల్య ఉత్థాయ మానవః 21 మయి భక్తిం పరాం కృత్వా నతంశోకః సృశేత్కదా | అలక్ష్మీ కాలకర్ణీ చ నాక్రామే త్తద్గృహం సురాః 22 నోపసర్గా నబేతాళా నగ్రహ బ్రహ్మ రాక్షసాః | నరోగా వాతికాః పైత్తాః శ్లేష్మసంభవినస్తథా. 23 నా కాలమరణం తస్య కదాపి చ భవిష్యతి | సంతతిశ్చిరకాలస్థా భోగాః సర్వే సుఖాదయః 24 సంభవిష్యంతి తన్మర్త్య గృహే యఃస్తోత్ర పాఠకః | కిం పునర్బ హునోక్తేన స్తోత్రం సర్వార్థ సాధకమ్. 25 ఏతస్య పఠనాన్నౄణం భుక్తిముక్తీన దూరతః | దేవా భవత్సు యద్దుఃఖం కథ్యతాం తదసంశయమ్. 26 నాశయామి న సందేహ శ్చా೭త్ర కార్యో೭ణురేవ చ | ఏవం శ్రీభగవద్వాక్యం శ్రుత్వా సర్వే దివౌకసః 27 ప్రసన్నమనసః సర్వేపునరూచు ర్వృషాకపిమ్ | ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ దశమస్కంధే పంచమో೭ధ్యాయః లోకమంతయును చెడు రాజులచేత పీడింపబడి వ్లుెచ్చులతో నిండియుండు నపుడు కల్కి రూపము దాల్చి దుష్టుల నంతమొందించిన దేవ దేవా ! నీకు నమస్కారములు. దేవా ! నీవు భక్తులను బ్రోచుటకు యీ పది యవతారములు దాల్చితివి. నీవు దుష్టదైత్యులను చంపి విఘ్నములు దుఃఖములు తొలగించితివి. అట్టి భక్తులు యార్తి బాపుటకు నారీ జలరూపములు దాల్చిన దేవుడవు నీకు నమస్కారములు. దయాననిధీ ! దేవా ! నీవు దాల్చిన రూపములు నీవు దక్క యితరు డెవడు దాల్చగలడు? అని దేవతలు పీతవసనుడు - దేవదేవేశుడు నగు విష్ణునిస్తుతించిరి. ఆ దేవతలు భక్తిప్రపత్తులతో విష్ణుని సాష్టాంగముగ నమస్కరించిరిః వారి స్తోత్రమును పురుషోత్తముడగు దేవుడాలకించెను. అపుడు శ్రీభగవానుడు గదాధురుడు నవ్వుచు సురలతో నిట్లనెను. దేవతలార! మీస్తోత్రమునకు సంతసించితిని-దిగు లొందకుడు. మీ దుస్సహమైన దుఃఖము బాపగలను. మీరు నానుండి దుర్లభ##మైన వరము కోరుకొనుడు. మీరు చేసిన స్తోత్రమునకు ప్రసన్నుడనై మీకు వరమిత్తును. మీరుచేసిన స్తోత్రమును దయమున లేచి చదువువాడు నా యందు భక్తిగలవాడగును. అతని నెన్నెడను శోకమంటదు.సురలారా ! అతని యింటిని పెద్దమ్మగాని అకాలమృత్యువుగాని యెన్నడు నాశింపదు. అతని యింట బ్రహ్మ రాక్షస-బేతాళ గ్రహముమలు చేరవు. అతనికి వాత -పిత్త-శ్లేష్మరోగములు దాపురించవు. అతని కెన్నడు నకాలమరణము గలుగదు. అతని సంతతి చిరకాలము జీవించును. సుఖభోగములు కలుగును. ఈ స్తోత్రము చదువువాని యింట సుఖము లెల్ల గలుగును. వేయేల ! ఈ స్తోత్రము సకలార్థసాధకము. దీనిని చదివిన వారికి భుక్తి ముక్తులు కరతలామలకములు. వేల్పులారా ! మీకు గల్గిన దుఃఖము తప్పక తెలుపుడు. దానిని తప్పక తొలగింపగలను. ఇం దావంతయును సందియము లేదు. అనుభగవానుని వచనము దేవత లెల్లరు విసిరి. వారెల్లరును సంతోషముతో విష్ణుమూర్తితో నిట్లనిరి. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణ మండళమందలి దఖమ స్కంధమున పంచమాధ్యాయము.