Sri Devi Bagavatham-2
Chapters
అథా ష్టమో೭ధ్యాయః శౌనక ఉవాచ ః ఆద్యో మన్వంతరః ప్రోక్తో భవతా చాయ ముత్తమః | అన్యేషా ముద్బవం బ్రూహి మనూనాం దివ్యతేజసామ్. 1 సూత ఉవాచ ః ఏవ మాద్యస్య చోత్పత్తిం శ్రుత్వా స్వాయంభువస్య హి | అన్యేషాం క్రమశ##స్తేషాం సంభూతిం పరిపృచ్ఛతి. 2 నారదః పరమో జ్ఞానీ దేవీతత్త్వార్థకోవిదః | నారద ఉవాచః మనూనాం మే సమాఖ్యాహి సూత్పత్తిం చ సనాతన 3 నారాయణ ఉవాచ ః ప్రథమో೭యం మనుః సావయం భువ ఉక్తో మహామునే | దేవ్యారాధనతో యేన ప్రాప్తం రాజ్య మకంటమ్. 4 ప్రియవ్రతోత్తాన పాదౌ మనుపూత్రౌ మహౌజసౌ | రాజ్య పాలన కర్తారౌ విఖ్యాతై వసుధాతలే. 5 ద్వితీయ శ్చ మనుః స్వారోచిష ఉక్తో మనిషిభిః | ప్రియ ప్రతసుతః శ్రీమా న ప్రమేయ పరాక్రమః 6 స స్వరోచిషనామాపి కాళింది కూలతో మనుః | నివాసం కల్పయా మాస సర్వనసత్వ ప్రియంకరః 7 జీర్ణ పత్రాశనో భూత్వా తపఃకర్తు మనువ్రతః | దేవ్యా మూర్తిం మృణ్యయీంచ పూజయా మాస భక్తితః 8 ఏవం ద్వాదశవర్షాణి వనస్థస్య తపస్యతః | దేవి ప్రాదుర భూత్తాత సహ స్రార్కస్ మద్యుతిః 9 తతః ప్రసన్నా దేవేశీ స్తవరాజేన సుప్రతా | దదౌ స్వరోచిషాయైవ సర్వమన్వంత రాశ్రయమ్. 10 ఆధిపత్యం జగద్ధాత్రీ చతారిణీతి ప్రథామగాత్ | ఏవం స్వారోచిష మను స్తారిణ్యారాధనాత్తతః 11 ఆధిపత్యం చ లేభే స సర్వారాతి వితవర్జితమ్ | ధర్మం సంస్థాప్య విధివద్రాజ్యం పుత్రైః సమంవిభుః 12 ఎనిమిదవ అధ్యాయము మన్వంతర వృత్తాంతము శౌనకు డిట్లనెను ః ఉత్తమమైన తొలి మన్వంతర కథ తెల్పితివి. దివ్యతేజముగల యితర మనువుల యుద్బవములను గూర్చియు తెలుపుము. సూతు డిట్లనెను ః ఇట్లు తొలి స్వాయంభువ మనువు సుత్పత్తి విని వరుసగ నితర మనువుల సంభవము గూర్చి ప్రశ్న వేయబడెను. నారదుడ-పరమజ్ఞాని-దేవీ తత్వార్థ కోవిదడు-నారదు డిట్లనెను: సనాతనా! ఇతర మనువుల సంభవము గూర్చియు తెల్పుము. నారాయణ డిట్లనెను : మహాముని! మొదటి మనువు స్వాయంభువ మనువు. అతడు శ్రీదేవి నారాధించి నిష్కంటకమైన రాజ్య మేలెను. అతనికిర్వురు కుమారులు గలరు. వారు తేజోవంతులు-రాజ్యపాలన సమర్థులు-భూతలమున ప్రసిద్ధులు- వారి పేర్లు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. రెండవ మనువు స్వాలోచిష మనువని పండితు లందురు. అతడు ప్రియవ్రతుని కుమారుడు- శ్రీమంతుడు- అమిత విక్రముడు. అతడు సకల భూతములకు ప్రియము గూర్చుచు కాళిందీనది తీరమున నాశ్రమము కల్పించుకొనును. అతడు పండు టాకులు తినిచు మట్టితో దేవి విగ్రహము చేసి కొల్చును తపము చేసెను. ఇట్లు పండ్రెండేండ్లు వనమందు తపము చేయుచుండగ వేయి సూర్యుల కాంతిగల దేవి యతనికి సాక్షాత్కరించెను. తర్వాత స్వారోచిషుడు చేసిన స్తోత్రమునకు దేవేశి ప్రసన్నురాలై యతనకి మన్వంతర రాజ్యము ప్రసాదించెను. ఇట్తనికి రాజ్యాధిపత్య మొసంగి జగజ్జనని భూమిపై తారిణియను నామముతో ప్రసిద్ధి గాంచెను. అతడు నిష్కంటకమైన రాజ్యాధిపత్య మలంకరించెను. యథావిధిగా ధర్మరాజ్యము నెలకొల్పెను. తుదకు తన రాజ్యమును తన కుమారుల కొప్పగించెను. భుక్త్వా జగామ స్వర్లోకం నిజ మన్వంత రాశ్రయాత్ | తృతీయ ఉత్తమోనామ ప్రియవ్రత సుతోమనుః 13 గంగాకూలే తపస్త ప్త్వా వాగ్బవం సంజపన్రహః | వర్షాణి త్రీణ్యుపవసన్దేవ్యను గ్రహ మావిశత్. 14 స్తుత్వా దేవీంస్తో త్ర వరై ర్బ క్తి భావితమానసః | రాజ్యం నిష్కంట కంలేభే సంతతిం చిరకాలికీమ్. 15 రాజ్యోత్థాన్యాని సౌఖ్యాని భుక్త్వా ధర్మాన్యు గస్య చ | సో೭ప్యా జగామ పదవీంరాజర్షి వరభావితామ్ 16 చతుర్థస్తామసోనామ ప్రియవ్రత సుతో మనుః | నర్మాదా దక్షిణ కూలే సమారాధ్య జగన్మయీమ్. 17 మహేశ్వరీం కామరాజ కూటజాప పరాయణః | వాసంతే శారదే కాలే నవరాత్ర సపర్యయా. 18 తోషయామాన దేవేశీం జలజాక్షీమనూ పమామ్ | తాస్యా ః ప్రసాదమాసాద్య నత్వాస్తోత్రైరనుత్తమైః. 19 అకంటకం మహద్రాజ్యం బుభుజే గత సాధ్వసః | పుత్త్రాన్బలోద్ధతాన్ శూరా న్దశవీర్య నికేతనాన్. 20 ఉత్పాద్య నిజభార్యాయాం జగామాంబరముత్తమమ్ | పంచమో మనురాఖ్యతో రైవతస్తామసానుజః 21 కాళిందీకూలమా శ్రిత్య జజాప కామసంజ్ఞికమ్ | బీజం పరమ వాగ్ధర్ప దాయకం సాధకాశ్రయమ్. 22 ఏతదారా ధనాదాప స్వారా జ్యర్ధిమనుత్తమామ్ | బలమప్రహతంలోకే సర్వసిద్ధి విధాయకమ్. 23 సంతతీం చిరకాలీనాం పుత్రపౌత్రమయీం శుభామ్ | ధర్మాన్వ్యస్య వ్యవస్థాప్య విషయానుపభూజ్యచ. 24 జగామా ప్రతిమః శూరో మహేంద్రాలయ ముత్తమమ్ | ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణదశమస్కధే೭ష్టమో೭ధ్యాయః తన మన్వంతరము పూర్తయైన తర్వాత నతడు స్వర్గసీమ నలకంరించెను. ప్రియప్రతుని కుమారు డుత్తముడను పేరప్రసిద్ధి గాంచెను. గంగాతీరమున వాగ్బవబీజము నొంటరిగ మూడేండ్లు జపించుచు నుపవసించి శ్రీదేవి దయకు పాత్రుడయ్యెను. నిండైన భక్తిభావముతో స్తోత్రములతో దేవిని సస్తుతించుచు నిష్కంటకమైన రాజ్యమును పూర్ణాయువుగల పూత్రులను బడసెను. తన యూగధర్మములు నడపి రాజ్యసుఖము లొంది రాజర్షులచే పొగడబడదగిన పదవి నలంకరించెను. నాల్గవ మనువు తామసుడన పేర్వడసెను. అతడును ప్రియవ్రతుని కుమారుడే. అతడు నర్మదానదికి దక్షిణ తీరమునందు విశ్వమాతను గొల్చెను. అతడట మాహేశ్వరిని సేవించుచు కామరాజకూటము జపించుచు వసంత| శారద-నవరాత్రములు జరిపెను. అత్తమమైన దేవి స్తోత్రములు చేయుచు పద్మాక్షి యగుదేవేశిని ప్రసన్నరాలిని చేసెను. చదేవి సంతోషించెను. అతడు భీతిలేక యెదురులేని రాజ్యమనుభవించెను. బలవీర్య శౌర్యములు గల పదిమంది పుత్రులను గనెను. ఇట్లతడు తన భార్యయందు పుత్రులను బడసి స్వర్గలోకమేగెను. తామస మనువు సోదరుడు రైవతుడు. ఇతడైదవ మనువయ్యెను. కాళిందీతీరమున సాధకులకు కామఫలములు పండించు కామరాజ మంత్రము జపించి ఉత్తమమైన రాజ్య సంపదలను సర్వసిద్ధులు లభించు శక్తిని సంపాదించగల్గెను. అతడు చిరాయువుగల పుత్రపౌత్రులను బడసెను. ఈ విధముగ రైవత మనువు ధర్మము నెలకొల్పి రాజ్యసుఖము లొందెను. ప్రియవ్రతుని మఱియొక కుమారుడు శూరుడైన రైవతుడు తుదకు స్వర్గసౌఖ్యము లనుభవించెను. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి దశమ స్కంధమున నెనిమిదవ యధ్యాయము.