Sri Devi Bagavatham-2
Chapters
అథ దశమో೭ధ్యాయః శ్రీ నారాయణ ఉవాచః సప్తమో మనురాఖ్యాతో మనుర్వైవస్వతః ప్రభుః | శ్రాద్ధదేవః పరానందభోక్తా నామ్యస్తు భూభుజామ్. 1 సచ వై వస్వతమనుః పరదేవ్యాః ప్రసాదతః | తథా తత్తపసాచైవ జాతో మన్వంతరాధిపః 2 అష్టమో మనురాఖ్యాతః సావర్ణిః ప్రథితః క్షితౌ| స జన్మాంతర ఆరాధ్య దేవీం తద్వరలాభతః 3 జాతో మన్వంతరపతిః సర్వజారన్యపూజితః | మహాపరాక్రమీ ధీరో దేవీభక్తి పరాయణః. 4 నారద ఉవాచః కథం జన్మాంతరే తేన మనునా೭೭రాధనం కృతమ్ | దేవ్యాః పృథివ్యుద్బవాయా స్తన్మమాఖ్యాతు మర్హసి. 5 శ్రీ నారాయణ ఉవాచః చైత్రవంశసము ద్బూతో రాజా స్వారోచిషేం೭తరే | సురథోనామ విఖ్యాతో మహాబలపరాక్రమః. 6 గుణగ్రాహీ ధనుర్ధారీ మాన్యః శ్రేష్ఠః కవిః కృతీ | ధనసంగ్రహకర్తా చ దాతా యాచకమండలే. 7 అరీణాం మర్దనో మాన్యః సర్వాస్త్రకుశలో బలీ | తసై#్యకదా బభూవుస్తే కోలావిధ్వంసినో నృపాః 8 శత్రవః సైన్యసహితాః వరివార్యైన మూర్జితాః | రురుధు ర్నగరీం తస్య రాజ్ఞో మానధనస్య చ. 9 తదా స సురథో నామ రాజా సైన్యసమావృతః | నిర్య¸° నగారాత్స్వీయాత్ సర్వశత్రునిబర్హణః. 10 తదా స సమరే రాజా సురధః శత్రుభిర్జితః | అమాత్యై ర్మం త్రిభిశ్యైవ తసయ కోశగతం ధనమ్. 11 హృతం సర్వమశేషేణ తదా೭తప్యత భూమిపః | నిష్కా సితశ్చ నగరా త్స రాజా పరమద్యుతిః 12 పదవ అధ్యాయము వస్వంతప కథనము-శ్రీదేవీ చరితము శ్రీనారాయణు డిట్లనెను ః ఏడవ మనువు వైవస్వత మను వనగ ఖ్యాతి గడించెను. ఇతడు శ్రాద్ధదేవుడు-పరానంద భోక్త-మాన్యుడైన రాజవర్యుడు. ఇతడును పరాదేవి దయవలన తీవ్రతపము ఫలితముగ మన్వంతరమున కధిపతి కాగల్గెను. ఇంకేనిమిదవ మనువు సావర్ణి మను వనగ ప్రతీతి బడసెను. అతడు వెనుకటి జన్మములలో దేవిని గొలిచి వరము లొందెను. అతడు సర్వరాజన్యమాన్యుడు- మహావిక్రముడు- ధీరుడు. దేవీ భక్తిపరాయణుడు నగు మన్వతంతరపతి యయ్యెను. నారదు డిట్లనియెను: అతడితర జన్మములోభూమిపై జన్మించి దేవి నే రీతిగ నారాధించెను. అంతయునాకు తెల్పుటకు నీవేసమర్థుడవు. శ్రీనారాయణుడిట్లు పలికెనుః స్వారోచిష మన్వంతరమున చైత్రవంశమునందు మహాబల పరాక్రమములుగ ల సురథుడను రాజుండెను. అతడు గుణగ్రాహి- దనుర్ధారి- మాన్యుడు- శ్రేష్ఠుడు- కవి- ధనసంగ్రహకర్త- యాచకుల పాలిటి కల్పతరువు. సకలాస్త్రకుశలుడు- బలశీలి - శత్రుదమనుడు- అభిమాని. ఒకప్పుడు పగతురు వ్లుెచ్చులు సేనావాహినితో వచ్చి సురథు నెదిరించి యా మానధనుని నగరు ముట్టడించిరి. సురథుడును తన సేనలు గూర్చుకొని శత్రువులను పరిమార్చుటకు నగరు వెడలెను. ఆ యుద్ధమున సురథుడు నతని మంత్రులను పగతుర చేతిలో నోడిపోయిరి. అతని ధనాగారమును శత్రువులు కొల్లగొట్టిరి. విక్రమశాలి యగు సురథుడు నగరము నుంచి వెడలగొట్టబడెను. జగామా೭శ్వ మథా೭೭రుహ్య మృగయామిషతో వనమ్ | ఏకాకీ విజనే రణ్య బభ్రామోద్బ్రాంత మానసః. 13 మునేః కస్యచిదాగత్య స్వాశ్రమం శౄంతమానసః | ప్రశాంతజంతు సంయుక్తం మునిశిష్యగణౖర్యుతమ్. 14 ఉవాస కంచిత్కాలం స రాజా పరమశోభ##నే | ఆశ్రమే మునివర్యస్య దీర్ఘదృష్టేః సుమేధసః 15 ఏకదా స మహిపాలో మునిపూజావసానకే | కాలే గత్వా ప్రణమ్యా೭೭శు పవ్రచ్చ వినయాన్వితః 16 మునే మమ మనోదుఃఖం బాధతే చాధిసంభవమ్ | జ్ఞాతతత్త్వస్య భూదేవ నిశ్ర్పజ్ఞస్య చ సంతతమ్. 17 శత్రుభి ర్విర్జితస్యాపి హృతరాజ్యస్య పర్వశః | తథాపి తేషు మనసి మమత్వం జాయతే స్ఫుటమ్. 18 కిం కరోమి క్వ గచ్చామి కధం శర్మ లభే మునే | త్వదనుగ్రహ మాశాసే వద వేదవిదాం వర. 19 మునిరువాచః ఆకర్ణయ మహీపాల మహాశ్టర్యకరం వరమ్ | దేవీమాహత్మ్య మతులం సర్వకామప్రదం పరమ్. జగన్మయీ మహామాయా విష్ణు బ్రహ్మహరోద్బవా | సా బలాదపహృత్యైవ జంతూనాం మానసాని హి. 21 మోహాయ ప్రతిసంయుచ్చే దితి జానీహి భూమిప | సా సృజత్యఖిలం విశం సా పాలయతి సర్వదా. 22 సంహారే హరరూపేణ సంహరత్యేవ భూమిప | కామదాత్రీ మహామాయా కాళరాత్రిర్ దురత్యయా. 23 విశ్వసంహారిణీ కాలీ కమాలా కమలాలయా | తస్యాం సర్వం జగజ్జాతం తస్యాం విశ్వం ప్రతిష్ఠితమ్. 24 లయమేష్యతి తస్యాం చ తస్మా త్సైవ పరాత్పరా | తస్యా దేవ్యాః ప్రసాద శ్చ యస్యోపరి భ##వేన్నృప | స ఏవ మోహ మత్యేతి నాన్యథా ధరణీతలే. 25 ఇది శ్రీదేవీ భాగవతే మహాపురాణ దశమస్కంధే దశమో೭ధ్యాయః అతడు వేట నెపమున గుఱ్ఱమెక్కి విభ్రాంతచిత్తుడై యొంటరిగ నిర్డనవనములంజు గ్రుమ్మరుచుండెను. అచట జంతువులతో ముని శిష్య గణములతో నలరారునొక మున్యాశ్రమము గని సురథు డచటి కేగెను. అది సమేధసుడను దీర్ఘ దృష్టిగల మున్యాశ్రమము. అందు ప్రశాంత వాతావరణములో రాజు కొంతకాణు వసించెను. ఒకనాడు. ముని తన పూజలు నిర్వర్తించుకొనిన మాదట రాజు సవినయముగ మునని సమీపించి నమస్కరించి యిట్లనియెను. బ్రాహ్మణోత్తమా! నన్ను మనోవ్యాధి యెంతయో పీడించుచున్నది. తత్త్వ మెఱిగియునేను ప్రజ్ఞ గోల్పోతిని. శత్రుల కోడి రాజ్యభ్రష్టుడ నైతిని. నా కింకను రాజ్యకాంక్ష తీరక మిక్కుట మగుచున్నది. వేదవేత్తవగు! మునీశా! నే నిపుడేమి చేయవలయును? ఎక్కడికేగవలయును? శాంతి నాకెట్లు గల్గును? నీయనుగ్రహము గోరుచున్నాను. దయచేసి తెలుపుము. ముని యిట్లనెనుః సర్వసంవత్కరము ఆశ్చర్యకరము -పరమ పవిత్రమునై సాటిలేక వెలుగొందు దేవి మహిమలు వినుము. మూల ప్రకృతి-జగజ్జనని- హరిహరబ్రహ్మలను పుట్టింపజాలివ తల్లి జంతువుల మనస్సులు బల్మితో నాకర్షించగల శక్తి దేవి. రాజా! ఆమె విశ్వమోహిని! ఎల్ల లోకముల నెల్లకాలము తన మాయామోహములో మంచివేయగల దేవి. ఆ తల్లి యెల్ల జగములు పుట్టించి పెంచుచుండును. ఆమె చివరికాలమున రుద్రరూపమున నంతయు నంతమొందించగలదు. రాజా ! అట్టి దేవియే మహామాయ- శివకామిని- కాళరాత్రి-దురత్యయ. విశ్వసంహారిణి - కాళికాశక్తి- కమల- కమలాలయ ఈ యెల్ల జగములా తల్లియందే పుట్టి యామె యందేపెరిగి పెద్ద వగును. కడ కన్నియు నా మాత యందే లయించును. రాజా! ఆ దేవి ప్రసాదము దయ యెవనిపై ప్రసరించునో యత డీ నేలపై మోహమునుండి ముక్తు డగును. ఇతరుడు గాడు. ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి దశమ స్కంధమున దశమాధ్యాయము.