Sri Devi Bagavatham-2    Chapters   

అథైకాదశోధ్యాయః

రాజో వాచః కా సా దేవీ త్వయా ప్రోక్తా బ్రూహి కాలవిదాంవర | కా మోహయతి సత్త్వాని కారణం కిం భ##వే ద్ద్విజ. 1

క స్మా దుత్పద్యతే దేవీ కింరూపా సా కి మాత్మికా | సర్వ మాఖ్యాహి భేదేవ కృపయా మమ సర్వతః. 2

మునిరువాచః రాజ న్దేవ్యాః స్వరూపంతే వర్ణయామి నిశామయ | తథా చోత్పతితా దేవీ యేన వా సా జగన్మయీ. 3

యదా నారాయణో దేవో విశ్వం సంహీత్యమోగరాట్‌ | ఆస్తీర్య శేషం భగవా స్సముద్రే నిద్రితో7 భవత్‌. 4

తదా ప్రస్వాపవశగో దేవదేవో జనార్ధనః | తత్కర్ణమల సంఝాతౌ దానవౌ మధుకైటబౌ. 5

బ్రహ్మాణం హంతు ముద్యుక్తౌ దానవౌ ఫ°రరూపిణౌ | తదా కమలజో దేవో దృష్ట్వా తౌ మధుకైలభౌ. 6

నిద్రితం దేవదేవేశం చింతా మాప దురత్యయామ్‌ | నిద్రితో బగవా నీశో దానవౌ చ దురాసదౌ. 7

కిం కరోమి క్వగచ్చామి కథంశర్మ లభే హ్యహమ్‌ | ఏవం చింతయత స్తస్య సద్మయోనేర్మహత్మనః 8

బుద్ధిః ప్రాదురభూ త్తాత తదా కార్యప్రసాదినీ | యస్యా వశం గతో దేవో నిద్రితో భగవాన్హరిః 9

తాం దేవీం శరణం యామి నిద్రాం సర్వప్రసూతికామ్‌ | బ్రహ్మోవాచః దేవదేవి జగద్ధాత్రి భక్తాభీష్ట ఫలప్రదే. 10

జగన్మాయే మహామాయే సముద్రశయనే శివే | త్వదాజ్ఞాపశగా ః సర్వే స్వస్వకార్యవిధాయినః 11

పదునొకండవ అధ్యాయము

శ్రీదేవీ చరితము

రాజట్లనియెను : త్రికాలవేదీ !ద్విజవరా ! నీవు పేర్కోనిన యా దేవి యెవరు? ఆమె ప్రాణుల నెల్లర నేల మోహితులను చేయును? విప్రవర్యా! ఆ దేవి యెవరివలన నావిర్బివించెను. ఆమె రూపేది? ఆత్మ యేది? ఈ సంశయము లన్నియును దయతో తొలగింపుము. ముని యిట్లనియెనుః రాజా! ఆ దేవి దివ్స్వరూపము నామె జగన్మాతమగ నవతరించిన విధమును వెల్లడింతును వినుము. మున్ను యోగీశ్వరుడైన శ్రీమాన్నారాయణుడు జగము లన్నిటిని సంహరించి పాలమున్నీటిపై శేషతల్పముపై యోగనిద్రలో మునింగెను. అప్పుడు దేవదేవుడగు జనార్దనుని చెవుల గుబిలినుంచి మధుకైటభులను రాక్షసులు పుట్టిరి. ఆఘోర దానవులు బ్రహ్మను చంపుటకు పూనుకొనగ బ్రహ్మమధుకైటభుల క్రూరత్వము తెలిసికొనెను. దేవ దేవుడు నిద్రించుచున్నాడు. దానవులు మహాక్రూరులుగ నున్నారు. ఇపుడు నాకేమి గతియని బ్రహ్మచింతించెను. నే నిపుడేమి చేయవలయును? ఎక్కడి కేగవలయును? నాకాశాంతి యెట్లు చేకూరును? అని బ్రహ్మ విచారింపసాగెను. అంతలో నతిని బుద్ధి కొకటి తోచెను. ఈ భగవానుడగు హరి యెవరికి వశుడై నిదురుంచెను? అట్టి యెల్లరి నిద్రకు కారణమైన నిద్రా దేవిని శరణు వేడుచున్నాను. బ్రహ్మ యిట్లనెను : దేవదేవీ ! జగన్మాతా!భక్త కామఫలదాయినీ! జగన్మాయాదేవీ! మహామాయా! సాగరశయన! శివా! ఎల్లవారును నీ యానకు లోబడి తమ తమ పనులు చక్కబెట్టుకొందురు.

కాళరాత్రిర్మహారాత్రి ర్మోహరాత్రిర్మదోత్కటా | వ్యాపినీవశగామాన్యా మిహానందైక శేవధిః. 12

మహనీయా మహారాధ్యా మాయామధుమతీ మహీ | పరావరాణాం సర్వేషాం వరమాత్వం ప్రకీర్తితా. 13

లజ్జా పుష్టిః క్షమా కీర్తిః కాంతిః కారుణ్య విగ్రహా | కమనీయా జగద్వంద్యా జాగ్రదాదిస్వరూపిణీ. 14

పరమా పరమేశానీ పరానందరాయణా | ఏకా7ప్యేకస్వరూపా చ సద్వితీయా ద్వయాత్మికా. 15

త్రయీ త్రివర్గనిలయా తుర్యాతుర్యపదాత్మికా | పంచమీ పంచభూతేశి షష్ఠీ షష్టేశ్వరీతి చ. 16

సప్తమీసప్తవారేశీ సప్త సప్త వరప్రదా | అష్టమీ వసునాథాచ నవగ్రహమయీశ్వరీ. 17

నవరాగకళారమ్యా నవసంఖ్యా వనేశ్వరీ | ద్రశమీ దశది క్పూజ్యా దశాశావ్యాపినీరమా. 18

ఏకాదశాత్మికా చైకాదశరుద్రనిషే వితా | ఏకాదశీతిథిప్రీతా ఏకాధశగణాధిపా. 19

ద్వాదశీద్వాదశభుజా ద్వాదశాదిత్యజన్మభూః | త్రయోదశాత్మికాదేవీ త్రయోదశగణ ప్రియా 20

త్రయోదశాభిధాభిన్న విశ్వేదేవా ధిదేవతా | చతుర్దశేం ద్రవరదా చతుర్ధశమను ప్రసూః. 21

పంచాధికధశీవేద్యా పంచాధికదశీతిథిః | షోడశీ షోడశుభుజా పోడశేందు కళామయా. 22

షోడశాత్మకచంద్రాంశు వ్యాప్త దివ్య కళేబరా | ఏవం రూపా7సి దేవేశి నిర్గుణ తామసోదయే. 23

త్వయా గృహీతో భగవా న్దేవదేవోరమాపతిః | ఏతౌదురాసదౌదైత్యౌ విక్రాంతౌ మధుకైటభౌ. 24

ఏతయో శ్చ వధార్థయ దేవేశంప్రతిభోధయ | మునిరువాచ:ఏవంస్తుతా భగవతీ తామసీ భగవత్ప్రియా. 25

దేవదేవం తదా త్యక్త్వా మోహయామాస దానవౌ | తదైన భగవాన్విష్ణుః పరమాత్మా జగత్పతిః. 26

ప్రభోధమాప దేవేశో | దదృశే దానవోత్తమౌ | తదా తౌ దానవౌ ఘోరౌ దృష్ట్యాతం మధుసూదనమ్‌. 27

యుద్దాయకృతసంకల్పౌ జగ్మతుః సన్నిధిం హరేః | యుయుధే చ తతస్తాభ్యాం భగవాన్మధుసూదనః . 28

పంచవర్ష సహస్రాణి బాహుప్రహరణో విభుః | తౌ తదాతిబలోన్మత్తౌ జగన్నాయావిమోహితౌ. 29

వ్రియతాం వర ఇత్యేవ మూచతుః పరమేశ్వరమ్‌ | ఏవం తయో ర్వచః శ్రుత్వా భగవానాది పూరుషః. 30

వవ్రేవధ్యాపుభౌమే7ధ్య భ##వేతామినిశ్చితమ్‌ | తౌ తదా7తిబలౌ దేవం పునరేవో చతుర్హరిమ్‌. 31

ఆవాం జహి న యత్రోర్వీ పయసాచ పరిప్లుతా | తథే త్యుక్త్వా భగవతా గదాశంబభృతా నృప. 32

కృత్వా చక్రేణవై ఛిన్నే జఘనే శిరసీ తయోః | ఏవం దేవీ సముత్పన్నా బ్రహ్మణా సంస్తుతానృప. 33

మహాకాళీ మహారాజ సర్వయోగేశ్వరేశ్వరీ | మహాలక్ష్మాస్తథోత్పత్తిం నిశామయ మహాపతే. 34

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ధశమస్కంధే దేవీమాహాత్మ్యే ఏకాదశో7ధ్యాయః

కళారాత్రీ! మహారాత్రీ! మోహరాత్రీ! మదోత్కటా! విశ్వవ్యాప్తి వశగమినీ! మాన్య! పరమానంద రసనిథీ! మహానీయా! మహారాధ్యా! మూలప్రకృతీ! మధుమతీ! పరాపరుల కెల్ల పరాభరట్టారికవు వన్నె కెక్కిరన దానవు. లజ్జ-పుష్టి-కాంతి-కీర్తి-కారుణ్యమూర్తి-మనోహారిణి-జగన్నుత-జాగ్రదాది స్వరూపిణి. పరాదేవి! పరమేశాని-పరానంద పరాయణి. ఏకవచనమున నేకవై ద్వివచనమున ద్వితీయవై త్రివర్గ రూపమున త్రయీమయివై తుర్యవస్థను చెందుటచే తురీయవై పంచభూతేశ్వరి వగుటచే పంచమివై షష్ఠేశ్వరి వగుటచే షష్ఠివై సప్తవారముల కీశాని వగుట సప్తమివై సప్తసప్తవరదాయినివై వసుపుల కీశాని వగుట అష్టమివై నవగ్రహమయివై వా కిశ్వరివై నవశృంగార సుందరివైనవేశ్వరివై నవసంఖ్యవై యిరవొందుట నవమివై దశదిశల వ్యాపించిన రమాదేవివి-దశ దిశల పూజ్యవు నగుట దశమివై ఏకాదశ రుద్ర సంసేవితవు-ఏకాదశాత్మికవు- ఏకాదశ గణశ్వరివి నగుట ఏకాదశివై ద్వాదశాదిత్యులకు జననివి-ద్వాదశభుజవు నగుట ద్వాదశివై త్రయైదశ గణప్రియవు-త్రయైదశాత్మికవు నగుట త్రయోదశివై విశ్వేదేవతల కధీశ్వరివై-చతుర్ధశేంద్రులకు వరము లొసగుట-చతుర్ధశమనువుల సృజించినదాన వగుట చతుర్దశివై కామరాజ విద్యాస్వరూపిణి వగుట పంచదశివై షోడశబుజవై షోడశచంద్రకళలలో వున్నమ జాబిల్లి కిరణాలతో నిండినదాన వగుట షోడశివై నీవు విశ్వవిఖ్యాతి గాంచితివి. దేవేశ్వరీ! ఇట్టి రూపగుణముల నొప్పునిర్గుణవగు తల్లివినూవు.. తమముదయించునపుడు దేవదేవేశుడు భగవానుడు నగు రమాపతిని నీ వావేశించితివి. ఈ ముధుకైటభదానవు లలవికాని మేటి శూరులు. వీరిని చంపుటకై నీవు నారాయణుని మేలుకొల్పుము. మునియిట్లనెను: ఇట్లు భగవత్ప్రియ భగవతియగు తామసీదీవిని బ్రహ్మసన్నుతించెను. అపుడు తామసీదేవి నారాయణుని వదిలి దానవులను మోహితులు చేసెను. అంత పరమాత్మ-జగత్పతి-విష్టు భగవానుడు మేల్కోని దానవులను చూచెను. ఘోర దానవులను నారాయణుని దర్శించి. వారు కయ్యమునకు కాలు దువ్వుచు హరి నెదిరించిరి. భగవానుడగు హరియను వారితో పోరునకు గడింగెను. హరి వారితో నైదు వేలేండ్లు మల్లయుద్దమొనరించెను. బలోన్మత్తులగు దానవులు జగన్మాయకు మోహితులైరి. వారు పరమేశ్వరునే వరములు కోరుకొమ్మనిరి. అపుడాదిపురుషుడగు నారాయణ భగవానుడు వారి మాటలు వినెను. మీరు నా చేతిలో తప్పక చావవలయును. ఇదే నేను కోరు వరమని హరి యనెను. అపుడు దానములు మరల హరితో "ముమ్మునీరులేని నేలపై చంపు" ముని కోరుకొనిరి. అటులే యని హరి గదా శంఖములు దాల్చెను. చక్రము చేబూనెను. తన తొడలపై వారి నుంచుకొని వారి తలలు తెగనఱకెను. అపుడు బ్రహ్మ స్తుతికి శ్రీమహాకాళి యావిర్భవించెను. ఆమె సర్వయోగేశ్వరేశ్వరి మహాకాళి. దివ్యరూపమును నిట్లు ప్రత్యక్ష మయ్యెను. రాజా! ఇపుడు శ్రీమహాలక్ష్మి సంభవమును విను.

ఇది శ్రీదేవి భాగవత మహాపురమాణమందలి దశమ స్కంధమును పదునోకండవ యుధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters