Sri Devi Bagavatham-2
Chapters
అథ చతుర్థో೭ధ్యాయః నారద ఉవాచ ః ఏవంభూతానుభావో7యం రుద్రాక్షో భవతా೭నఘ |వర్ణితో
మహతాం పూజ్యః కారణం తత్ర కిం వద.1 నారాయణ ఉవాచ: ఏవమేవ పురా పృష్టో భగవాన్ గిరిశః ప్రభుః | షణ్ముఖేన చ రుద్రస్తం యదువాచ శృణుష్వతత్.
2 ఈశ్వర ఉవాచః శృణుషణ్ముఖ తత్వేన కథయామి సమాసతః | త్రిపురో నామ దైత్యస్తు పురా7సీత్సర్వ దుర్జయః 3 హతాస్తేన సురాః సర్వే బ్రహ్మవిష్ణ్వా దిదేవతాః | సర్వైస్తు కథితే తస్మిం స్తదా7హం త్రిపురం ప్రతి. 4 అచింతయం మహాశస్త్ర మఘోరాఖ్యం మనోహరమ్ | సర్వ దేవమయం దివ్యం జ్వలంతంఘోర రూపియత్. 5 త్రిపురస్య వధార్థాయ దేవానాం తారణాయ చ | సర్వ విఘ్నోపశమన మఘోరాస్త్రమ చింతయమ్. 6 దివ్యవర్ష సహస్రంతు చ క్షురున్మీలితం మయా | పశ్చాన్మమాకులాక్షిభ్యః పతితా జలబిందవః || 7 తత్రాశ్రు బిందుతో జాతా మహారుద్రాక్షవృక్షకాః | మమా೭జ్ఞయా మహాసేన సర్వేషాం హితకామ్యయా. 8 బభూవుస్తే చ రుద్రాక్షా అష్టత్రింశ త్ర్పభేదతః | సూర్యనేత్ర సముద్భూతాః కపిలా ద్వాదశ స్మతాః. 9 సోమనే త్రోత్థితాః శ్వేతాస్తేషోడశ విధాః క్రమాత్ | వహ్నినేత్రోద్బవాః కృష్ణా దశ##భేదా భవంతి హి. 10 శ్వేతవర్ణ శ్చ రుద్రాక్షో జాతితో బ్రహ్మఉచ్యతే | క్షాత్రో రక్తస్తథా మిశ్రోవైశ్యః కృష్ణస్తు శూద్రకః 11 ఏకవక్తృః శివః సాక్షా ద్ర్బహ్మహత్యాం ప్యపోహతి | ద్వివక్త్రో దేవదేవ్యౌ స్యాద్వివిధం నాశ##యేదఘమ్. 12 త్రివక్తృ స్త్వనలః సాక్షాత్త్స్రీ హత్యాం దహతిక్షణాత్ | చతుర్యక్తృః స్వయం బ్రహ్మ నరహత్యాం వ్యపోహతి. నాలుగవ అధ్యాయము రుద్రాక్ష ప్రాశస్త్యము నారదు డిట్లనెను: అనఘా ! రుద్రాక్షల కింత ప్రభావ ముండుటకును దానిని మహాత్ముల పూజించుటకును గల కారణమేమో తెలుపుము. నారాయణు డిట్లనియెనుః ఇదే ప్రశ్న మున్ను కుమారస్వామి శివపు నడిగెను. అపుడు శివుడు పల్కినపల్కులు వినిపింతును వినుము. ఈశ్వరు డిట్లనియెను: కుమారా! రుద్రాక్షమహిమ గూర్చి నీకు సంక్షేపముగ తెలుపుచున్నాను. చక్కగవినుము. తొల్లి త్రిపురాసురుడు దుర్జయుడై యుండెను. అతడు బ్రహ్మ- విష్ణువు మొదలుగాగల దేవతలను లెక్కచేయక వ్యవహరించెను. ఆ విషయము వారందఱు వచ్చినాతో తెలిపిరి. అపుడు నేను అఘోర మహాస్త్రమును లోక కల్యాణము కొఱకు తలంచితిని. అది సకల దేవమయము - మనోహరము- మహోజ్జ్వలము - ఘోరరూపము నైనది. అఘో రాస్త్రమును నేను త్రిపురవధకు దేవతల రక్షణకును సర్వ విఘ్నోపశాంతికిని స్మరించితిని. అపుడు నేను వేయి దివ్య వర్షములు కన్నులు మూసికొని యుంటిని. అంత నా కన్నులనుండి నీటి బిందువులు రాలెను. సేనాపతీ ! నా కన్నీటినుండి నా యానతి ప్రకారము మహారుద్రాక్ష వృక్షము లుద్బవించెను. అవి ముప్పది యెనిమిది భేదములుగనయ్యెను. నాకుడి నేత్రము నుండి ఎఱుపు పసుపు వర్ణముగల పండ్రెండు విధముల రుద్రాక్ష వృక్షము లుద్బవించెను. ఎడమ కంటినుండి తెల్లనివి పదారు విధములైనవి పుట్టెను. అగ్ని నేత్రమునుండి నల్లనివి పది విధములుగ నుద్బవించెను. తెల్ల రుద్రాక్షలు బ్రాహ్మణజాతివి. మిశ్రమము వైశ్యజాతివి. నల్లనివి శూద్రజాతివని తెలియవలయును. ఏకముఖము గల రుద్రాక్షసాక్షాత్తుగ శివుడే. అది బ్రహ్మహత్యా పాతకమును పాపును. రెండు ముఖములుగలది శివాశివుల స్వరూపము - అది సకల పాతకముల నడచివేయును. మూడు ముఖములు గలది అగ్నిరూపము. అది క్షణములో స్త్రీహత్యా దోషము దహించివేయగలదు. నాల్గు ముఖములు గలది బ్రహ్మరూపము. అది నరకహత్యాదోషము బాపగలదు. పంచవక్తృః స్వయం రుద్రఃకాలాగ్నిర్నామ నామతః | అభక్ష్య భక్షణో ద్బూత్తె రగమ్యా గమనోద్బవైః 14 ముచ్యతే సర్వపాపై స్తు వంచ వక్తృ స్యధారణాత్ | షడ్వక్త్రః కార్తికేయస్తు సుధార్యో దక్షిణ కరే. 15 బ్రహ్మహత్యాదిభిః పాపైర్ము చ్యతే నాత్ర సంశయః | సప్త వక్త్రో మహాభాగో నామ హ్యనంగో నామనామతః తద్దారణాన్ము చ్యతేహి స్వర్ణస్తేయాది పాతకైః | అష్టవక్త్రోమహాసేనః సాక్షాద్దేవో వినాయకః 17 అన్నకూటం తూలకూటం స్వర్ణకూటం తథై చ| దుష్టా೭న్వయ స్త్రీయం వా೭థ సంస్పృశం శ్చ గురుస్త్రీయమ్. 18 ఏవమాదీని పాపాని హంతి సర్వాణి ధారణాత్ | విఘ్నా స్త స్య ప్రణశ్యంతి యాతిచాంతే పరంపదమ్. 19 భవంత్యేతే గుణాః సర్వే హ్యష్ట వక్తృ స్యధారణాత్ | నవవక్త్రో భైరవ స్తు ధారయేద్వామబాహుకే. 20 భుక్తి ముక్తి ప్రదః ప్రోక్తో మమతుల్యబలోభ##వేత్ | భ్రూణహత్యా సహస్రాణి బ్రహ్మహత్యాశతాని చ. 21 సద్యః ప్రళయ మాయాంతి నవవక్త్ర స్యధారణాత్ | దశవక్త్ర స్తు దేవేశః సాక్షాద్దేవో జనార్దనః 22 గ్రహా శ్చైతే పిశాచా శ్చ బేతాళా బ్రహ్మరాక్షసాః | పన్నగా శ్చోపశామ్యంతి దశవక్తృ స్య ధారణాత్. 23 వక్త్రెకా దశరుద్రాక్షో రుద్రై కాదశకం స్మృతమ్ | శిఖాయాం ధారయే ద్యోవై తస్యపుణ్య ఫలంశృణు. 24 అశ్వమేధ సహస్రస్య వాజపేయశతస్య చ గవాం శతసహ స్రస్య సమ్యగ్దత్తస్య యత్పలమ్. 25 తత్పలం లభ##తే శీఘ్రం వక్రై కాదశధారణాత్ | ద్వాదశాస్యస్య రుద్రాక్షస్త్యెవ కర్ణేతుధారణాత్. 26 ఆదిత్యాస్తోషితా నిత్యం ద్వాదశాస్యేవ్య వస్థితాః | గోమేధే చా೭శ్వమేధే చ యత్పలంతదవాప్నుయాత్. 27 పంచముఖములు గలది కాలాగ్ని. తినరానివి తినుటవలన-పోరాని చోట్లకు పోవుటవలన గలుగు పాపములు నది తుడుచిపెట్టగలదు. ఈ పంచముఖ రుద్రాక్షదాల్చుట వలన సర్వపాపములును సమసిపోవును. ఆరు ముఖములు గలది షణ్ముఖుడు. దానిని కుడిచేతియందు ధరించవలయును. అటుల దాల్చిన నది బ్రహ్మహత్యాది పాతకములను పోకార్చును. సందేహింపరాదు. ఏడు ముఖములు గలది అనంగరూపమైనది. ఇది సౌభాగ్యవంతమైనది. దీనిని దాల్చుటవలన బంగారము దొంగలించిన పాపము తొలగును. పుత్రకా! అష్టముఖములుగలది సాక్షాత్తుగ వినాయకుడేసుమా! దీనిని దాల్చుటవలన అన్న-వస్త్ర-సువర్ణములకులోపము గలుగదు. కులముగాని స్త్రీని గురుపత్నిని తాకిన పాపముల ఇతర పాపముల మొత్తమును దీనిని దాల్చుటవలన నశించగలవు. అతనికి విఘ్నములు గలుగవు. అతడుతుదకు పరమపదమేగును. అష్టముఖరుద్రాక్ష దాల్చుట వలన నివన్నియును గల్గును. నవముఖములు గలది భైరవము. దీనినెడమ భుజమున దాల్చవలయును. అది భక్తి-ముక్తి గలిగించును. అది నాయంతబలము గలది. వేలు భ్రూణహత్యలు-నూఱు బ్రహ్మహత్యలును-నవముఖరుద్రాక్ష దాల్చుటవలన వెంటనే నశించగలవు. పదిముఖములు గలది సాక్షాత్తుగ దేవేశుడైన జనార్దనుడే. దీనిని దాల్చుటవలన గ్రహ-పిశాచ-బేతాళ-బ్రహ్మరాక్షస-పన్న గములవలని బాధలన్నియును తొలగిపోవను.పదునొకండు ముఖములుగల రుద్రాక్ష రుద్రుడే. దానిని తలపైదాల్చిన వాని పుణ్యఫలము వినుము. వేయి అశ్వమేధములు నూఱవాజపేయములు-పదివేల గోదానములు చేసినంద పుణ్యఫలితము. శీఘ్రముగ నేకాదశముఖ రుద్రాక్ష దాల్చుటవలన గల్గితీరును. పండ్రెండు ముఖముల రుద్రాక్షను చెవియందు దాల్చవలయును. దానివలన నిత్యము ద్వాదశాదిత్యులు ప్రసన్నులగుదురు. వానికశ్వమేధ-గోమేధములు చేసిన ఫలమబ్బును. శృంగిణాం శస్త్రీణాంచైవ వ్యాఘ్రాదీనాం భయం నహి | న చవ్యాధి భయం తస్యనైవ చాధిః ప్రకీర్తితః 28 న చ కించిద్బయం తస్య న చ వ్యాధిః ప్రవర్తతే | న కుతశ్చి ద్బయం తస్య సుఖీచైవేశ్వరోభ##వేత్. 29 హస్త్యశ్వ మృగ మార్జార సర్పముషక దర్దురాన్ | ఖరాం శ్చ శ్వశృగాలాం శ్చ గాత్వాబహూవిధానపి. 30 ముచ్యతే నాత్రసందేహో పక్త్రద్వాదశధారణాత్ | వక్త్ర త్రయోదశో వత్సచ రుద్రాక్షో యదిలభ్యతే. 31 కార్తికేయ సమోజ్ఞేయః సర్వకామార్థ సిద్దిదః | రసో రసాయనం చైవ తస్య సర్వం ప్రసిధ్యతి. 32 తసై#్యవ సర్వభోగ్యాని నాత్ర కార్యవిచారణా | మాతరం పితరం చైవ భ్రాతరం వా నిహంతియః 33 ముచ్యతే సర్వ పాపేభ్యో ధారణాత్తస్యషణ్ముఖ | చతుర్దశాస్యో రుద్రాక్షో యదిలభ్యేత పుత్రక. 34 ధారయేత్సతతం మూర్ద్ని తస్య పిండః శివస్యతు | కిం మునే బహు నోక్తేన వర్ణనేన పునః పునః 35 పూజ్యతే సంతతం దేవైః ప్రాప్యతే చ పరాగతిః | రుద్రాక్ష ఏకః శిరసా ధార్యో భక్త్యా ద్వి జోత్తమైః. 36 షడ్వింశద్బిః శిరోమాలా పంచాశద్దృదయేన తు | కలాక్షే ర్బాహువలయే అర్కాక్షైర్మణి బంధనమ్. 37 అష్టోత్తర శ##తేనాపి పంచాశద్బిఃషడానన | అథవాస ప్త వింశత్యా కృత్వా రుద్రాక్ష మాలికామ్. 38 ధారణాద్వా జపాద్వాపి హ్వనంతం ఫలమశ్నుతే | అష్టోత్తర శ##త్తెర్మాలా రుద్రాక్షేర్దార్యతే యది. 39 క్షణక్షణ శ్వమేధస్య ఫలం ప్రాప్నొతిషణ్ముఖ | త్రిః సప్తకుల ముద్ధృత్య శివలోకే మహీయతే. 40 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ఏకాదశ స్కంధే చతుర్థోధ్యాయః వానికిపశువుల-శస్త్రముల-పులులవలన నెట్టి భయమును గలుగదు. అధివ్యాధులు గలుగవు. వాని కెట్టి భయమును వ్యాధియు గలుగదు. అతనికి ముమ్మాటికి భయములేదు. అతడు సఖి-ఈశ్వరుడేయగును. ఏనుగు-గుఱ్ఱము-జింక-కుక్క, -నక్క-పిల్యి-యెలుక-గాడిద-దుర్దురము మున్నగు జీవులను చంపినపానిము ద్వాదశముఖ రుద్రాక్ష దాల్చుటవలన తొలగును. అతడు పాపముక్తుడగును. సందేహములేదు. వత్సా! పదుడు ముఖముల రుద్రాక్ష లభించినచో అదికార్తికేయునితో సమము సకలార్దసాధనము. అతనికెల్లరసములు- రసాయనములును సిద్దించును. అతడెల్ల భోగ్యవస్తువులనుభవింపగలడు. సందేహము లేదు. ఎవ్వడు తలిదండ్రులను సోదరుని చంపునో వాడు దానిని దాల్చుటవలన పాపముక్తుడుగాగలడు. పుత్రా! షణ్ముఖా! పదునాల్గు ముఖముల రుద్రాక్ష లభించుట కష్టము. గొరకినచో దానినితలపై ధరించవలయును., అతడు శివస్వరూపు డగును. మునీ! మాటిమాటికి చెప్పనేల! అతడు దేవపూజ్యుడగును. పరమగతినందగలడు. ద్విజులొకే రుద్రాక్షను పరమభక్తితో తలపైదాల్చవలయును. ఇరువదారు రుద్రాక్షలుగల మాలికతలపై ఏబదిరుద్రాక్షలదిహృదయముపైపదారు రుద్రాక్షలది బాహువులందును పండ్రైండు రుద్రాక్షలది మణిబంధమందును దాల్చవలయును. షడాననా! నూటయెనిమిది రుద్రాక్షలమాలగాని-ఏబది రుద్రాక్షలమాలగాని-ఇరువదేడు రుద్రాక్షలమాలగాని ధరించిన లేక దానితో జపించినవాని కలంత ఫలములబ్బును. షణ్ముఖ! నూటయెనిమిది రుద్రాక్ష మాలదాల్చినవాడు క్షణక్షణ మశ్వమేధఫలితములందు గలడు. అతడిరువదొక్కతరముల వారినుద్దరించి శివలోకమందు ప్రతిష్ట గాంచగలడు. ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి ఏకాదశస్కంధమున నాలవయధ్యాయము.