Sri Devi Bagavatham-2
Chapters
అథ సప్తమోధ్యాయః. శ్రీనారాయణ ఉవాచ : ఏవం నారద షడ్వక్త్రో గిరిశేన విబోధితః |
రుద్రాక్ష మహిమానం చ
జ్ఞాత్వా7సీత్స కృతార్థకః. 1 ఇత్థం భూతాను భావో7యం రుద్రాక్షో వర్దితో మయా | సదాచార ప్రసంగేన శృణు చాన్యత్స మాహితః.
2 యథా రుద్రాక్షమహి మా7వర్ణితో నం తపుణ్యదః | లక్షణం మంత్ర విన్యాసం తథ7హం వర్ణయామితే.
3 లక్షం తు దర్శనా త్పుణ్యం కోటి స్తత్స్ప ర్శనాద్బవేత్ | తస్యకోటి గుణం పుణ్యం లభ##తే ధారణాన్నరః.
4 లక్షకోటి సహస్రాణి లక్షకోటిశతాని చ | తజ్జపాల్లభ##తే పుణ్యం నరో రుద్రాక్షధారణాత్.
5 రుద్రాక్షణాంతు భద్రాక్షదారణా త్స్యాన్మహాఫలమ్ | ధాత్రీఫలప్రమాణం యచ్చ్రేష్ఠమేత దుదాహృతమ్.
6 బదరీఫల మాత్రంతు ప్రోచ్యతే మధ్యమంబుధైః | అధమం చణ మాత్రం స్యా త్పృతిజ్ఞైషా మయోదితా. 7 బ్రాహ్మాణా ః క్షత్రియావైశ్యాః శూద్రాశ్చేతి శివాజ్ఞయా | వృక్షాజాతాః పృథివ్యాంతు తజ్జాతీయాః శుభాక్షకా. 8 శ్వేతాస్తు బ్రాహ్మణా జ్ఞేయాఃక్షత్రియారక్తవర్ణకాః | పీతావైశ్యాస్తు విజ్ఞేయాః కృష్ణాః శూద్రాః ప్రకీర్తితాః 9 బ్రాహ్మణో బిభృయాచ్చ్వేతా న్రక్తాన్రాజా తధారయేత్ | పీతా న్వైశ్యస్తు బిభృయాత్కృష్ణాన్ శూద్రాస్తుధారయేత్. 10 సమాఃస్నిగ్దా దృఢాస్తద్వత్కంటకైః సంయుతాః శుభాః | కృమి దష్టాన్ చిన్నభిన్నాన్కంటకై రహితం స్తథా. 11 వ్రణ యుక్తానావృతాశ్చ షడ్రుద్రాక్షాంస్తు వర్జయేత్ | స్వయమేవ కృతద్వారో రుద్రాక్షః స్వాదిహోత్తమః. 12 యత్తుపౌరుషయత్నేన కృతం తన్మధ్య మంభ##వేత్ | సమాన్స్నిగ్దా న్దృఢా న్వృత్తాన్షౌమ సూత్రేణ ధారయేత్. 13 ఏడవ అధ్యాయము సదాచారవిశేష నిరూపణము శ్రీనారాయణు డిట్లనెను. : నారదా! ఈ ప్రకారముగ శివుడు కుమారునకు రుద్రాక్ష మహాత్మ్యము గూర్చి తెలపెను. అది విని యతడు ధన్యభాగ్యుడయ్యెను. ఇటుల నీకుసదాచారమును దెల్పుచు రుద్రాక్ష మహిమము దెల్పితిని. సదాచారము గూర్చియింకను వినుము. రుద్రాక్ష మహిమము మిక్కిలి పుణ్యప్రదమని వర్ణింపబడినధి. అటులే దాని లక్షణము-మంత్రము-న్యాసము లనుగూడ వివరింతును వినుము. రుద్రాక్షను చూచిన లక్షరెట్లును తాకిన కోటిరెట్లును ధరించిన దానిక %ికోటిరెట్లును పుణ్యము గల్గును. మానవుడు రుద్రాక్షను ధరించుట వలన-జపించుట వలన- లక్ష కోటివేల-లక్షకోటి నూర్లరెట్లు పుణ్యము సంపాదించును. రుద్రాక్షలలో భద్రాక్షలు నుండును. వానిని దాల్చుట వలన గూడ పుణ్యము గల్గును. రుద్రాక్షలలో నుసిరికాయంత రుద్రాక్షయుత్తమోత్తమమైన దందురు. రేగుపండంత రుద్రాక్ష మధ్యమము. శనగగింజంత రుద్రాక్ష యథమమైనదని బుధు లందురు. నా ప్రతిజ్ఞయు నిదే. శివాజ్ఞవలన బ్రహ్మ-క్షత్రియ-వైశ్య-శూద్రములను నాల్గు విధములైన రుద్రాక్ష వృక్షము లీ నేలపై వర్దిల్లెను. ఆయా జాతులకు సంబంధించిన రుద్రాక్షలుండను. తెల్లనివి బ్రాహ్మణ జాతివి; ఎఱ్ఱనివిక్షత్రియ జాతివి పచ్చనివి-వైశ్యజాతివి నల్లనివిశూద్రజాతివని తెలియవలయును. కనుక బ్రాహ్మణుడు తెల్లని రుద్రాక్షలును క్షత్రియు డెఱ్ఱనివి వైశ్యుడు పచ్చనివి శూద్రుడు నల్లనివి ధరించవలయును. సమముగ-గట్టి-నునుపుగ-ముండ్లతో చెన్ను మీరు రుద్రాక్షలు-శుభకరములు; పురుగులు తొలిచినవి-ఛిన్న భిన్నములు-ముండ్లు లేనివి. దెబ్బలు తిన్నవి-అనావృతమైనవి అను నారు విధముల రుద్రాక్షలు ధరించరాదు. రుద్రాక్షలో రంధ్రము సహజముగ పడిన నదిఉత్తమోత్తమ మైనది. ప్రయత్నముతో రంధ్రముచేయబడినది మధ్యమము. సమముగ-నున్నగ-గట్టిగ-గుండ్రముగ నున్న రుద్రాక్షలు పట్టుదారముతో గట్టుకొనవలయును. సర్వగాత్రేషు సామ్యేన సమానా7తి విలక్షణా | నిషుర్షేహేమలేఖాభా యత్రలేఖా ప్రదృశ్యతే. 14 తదక్షముత్తమం విద్యాత్స ధార్యఃశివపూజకైః | శిఖాయామేక రుద్రాక్షం త్రింశ##ద్వై శిరసా వహేత్. 15 షట్త్రింశచ్చగలే ధార్యా బాహ్వోః షోడశషోడశ | మణిబంధే ద్వాదశాక్షాన్స్కంధే పంచాశతం భ##వేత్. 16 అష్టోత్తర శ##త్తెర్మాలో పవీతం చ ప్రకల్పయేత్ | ద్విసరం త్రిసరం వాపి బిభృయాత్కంఠ దేశతః 17 కుండలే ముకుటే చైవ కర్ణికాహారకేషు చ | కేయూరే కటకే చైవ కుక్షివంశే తథైవ చ. 18 సుప్తే పీతే సర్వకాలం రుద్రాక్ష ధారయేన్నరః | త్రిశతం త్వధమం పంచశతం మధ్యమ ముచ్యతే. 19 సహస్ర ముత్తమంప్రోక్తం చైవం భేదేన ధారయేత్ | శిరసీశాన మంత్రేణ కర్ణే తత్పురుషేణచ. 20 అఘోరేణ లలాటేతు తేనైవ హృదయే7పి చ| అఘోర బీజమంత్రేణ కరే యో ధారయేత్పునః. 21 పంచాశదక్ష గ్రథితాం వామదేవేన చోదరే | పంచబ్రహ్మభిరంగై శ్చా ప్యేవం రుద్రాక్షధారణమ్. 22 గ్రథితాన్మూల మంత్రేణ సర్వానక్షాం స్తుధారయేత్ | ఏకవక్త్ర స్తు రుద్రాక్షః పరతత్త్వ ప్రకాశకః. 23 పరతత్త్వ ధారణా చ్చ జాయతే తత్పృకాశమ్ | ద్వి వక్త్ర స్తుమునిశ్రేష్ఠ అర్దనారూశ్వరో భ##వేత్. 24 ధారణా దర్ద నరీశః ప్రీయతే తస్య నిత్యశః | త్రివక్త్ర స్త్వనలః సాక్షాత్త్సీహత్యాం దహతి క్షణాత్. 25 త్రిముఖశ్త్చెవ రుద్రాక్షో7ప్యగ్ని త్రయస్వరూపకః | తద్దారణా చ్చ హుతభుక్తస్య తుష్యతి నిత్యశః. 26 చతుర్ముఖ స్తు రుద్రాక్షః పితామహస్వరూపకః | తద్దారణాన్మహా శ్రీమాన్మహదారోగ్యముత్తమమ్. 27 రుద్రాక్ష లన్ని యవయవములకు సమానముగ ధరింపవలయును. గీటురాతిపై బంగారము గీచిన గీటు పడును. అట్లు రుద్రాక్షను గీచిన గీటు పడవలయును. అదిఉత్తమోత్తమమైనది. శివారాధకు లట్టి రుద్రాక్షలు తప్పక ధరించవలయును. శిఖయం దొకటి శిరమున ముప్పదియును మెడలో ముప్పదియారును ప్రతి భుజమున పదారు చొప్పున మణిబంధమున పండ్రెండు మూపున ఏబది జందెములో నూట యెనిమిదియను ధరించవలయును. మెడలో రెండు లేకమూడు వరసలుగ ధరించవలయును. కుండలములలో కిరీటముల చెవిపోగులలో హారములందును దండకడియములందును కంకణము లందును మొలత్రాటను రుద్రాక్షలు ధరించవలయును. నిదురించుచు త్రాగుచు నెల్ల వేళలయందు రుద్రాక్షలు ధరించియుండ వచ్చును. మూడు వందల దాల్చుటధమము. అయిదు వందలు మధ్యమము. వేయి ధరించు టుత్తమమని చెప్పబడెను. ఈ భేదము లెఱిగి ధరించుట శ్రేష్ఠము. శిరమున ధరించు నపు డీశానమంత్రమును చెవులందు తత్పురుష మంత్రమును నొసట హృదయమున దాల్చునపుడు అఘోరమంత్రమును చేతులందు దాల్చునపు డఘోర బీజమంత్రమును చదివి ధరించవలయును. ఏబది రుద్రాక్షల మాలికను పొట్టపై వామదేవ మంత్రముతోను అంగములందు పంచబ్రహ్మమంత్రములతోను షడంగ మంత్రముతోను దాల్చవలయును. రుద్రాక్షలు గూర్చునపుడు మూలమంత్రము చదువవలయును. ఏకముఖి రుద్రాక్ష పరతత్వమునకు గుర్తు. దానిని దాల్చుట వలన పరమతత్త్వము ప్రదీపించును. నారదా! రెండు ముఖములుగల దర్దనారీశ్వరము. దానిని నిత్యము దాల్చుట వలన నర్ధనారీశ్వరుడు ప్రసన్నుడగును. త్రిముఖిసాక్షాత్తుగ అగ్నిరూపమే. దానిని దాల్చుట వలన స్త్రీ హత్యాపాతకము తొలగును. త్రిముఖిమూడగ్నుల స్వరూపము. దానిని నిత్యము దాల్చుట వన అగ్ని సంతృప్తి జెందును. చతుర్ముఖి-బ్రహ్మకు ప్రతిరూపము. దానిని దాల్చుట వలన మంచి యారోగ్యభాగ్యములు గల్గును. మహతీజ్ఞాన సంపత్తిః శుద్ధయే ధారమేన్నరః | పంచముఖ స్తు రుద్రాక్షః పంచబ్రహ్మస్వరూపకః 28 తస్య ధారణ మాత్రేణ సంతుష్యతి మహేశ్వరః | షడ్వక్త్రశ్చెవ రుద్రాక్షః కార్తికేయాధిదైవతః 29 వినాయకం చాపిదేవం ప్రవదంతి మనీషిణః | సప్త వక్త్ర స్తు రుద్రాక్షః సప్తమాత్రధిదైవతః 30 సప్తాశ్వదైవ తశ్త్చెవ మునిసప్త కదైవతః | తద్దారణాన్మహా శ్రీఃస్యాన్మహదారోగ్యముత్తమమ్. 31 మహతీజ్ఞాన సంపత్తిఃశుచిర్త్వె ధారయేన్నరః | అష్టవక్త్ర స్తు రుద్రాక్షో7ప్యష్టమాత్రధి దైవతః. 32 వస్వష్టక ప్రీతికరో గంగాప్రీతికరఃశుభః | తద్దారణా దిమే ప్రీతా భ##వేయుః సత్యవాదినః. 33 నవ వక్త్ర స్తు రుద్రాక్షో యమదేవ ఉదాహృతః | తద్దారణా ద్యమభయం న భవత్యేవ సర్వథా. 34 దశవ క్త్ర స్తు రుద్రాక్షో దశాశాదైవతః స్మృతః | దశాశాప్రీతజనకో ధారణనాత్రసంశయ. 35 ఏకాదశముఖ స్త్వక్షో రుదైకాదశ దైవతః | తమింద్రదైవతం చాహుః సదాసౌఖ్య వివర్దనమ్. 36 రుద్రాక్షో ద్వాదశముఖో మహావిష్ణు స్వరూపకః | ద్వాదశాదిత్య దైవ శ్చ బిభ##ర్త్యేవ హితత్పరః. 37 త్రయోదశముఖశ్చాక్షః కామదఃసిద్దిదఃశుభః | తస్య ధారణ మాత్రేణ కామదేవః ప్రసీదతి. 38 చతుర్దశముఖశ్చాక్షో రుద్రనేత్ర సముద్బవః | సర్వవ్యాధిహారశ్చైవ సర్వారోగ్య ప్రదాయకః 39 మద్యం మాంసం చ లశునం పలాండుం శిగ్రు మేవచ | శ్లేష్మాతకం విడ్వరాహం భక్షణ విర్జయేత్తతః. 40 గ్రహణ విషువేచైవ సంక్రమే అయనే తథా | దర్శే చ పౌర్మమాసే చ పుణ్యషు దివసేష్వపి. 41 రుద్రాక్షధారణా త్సద్యః సర్వపాపైః ప్రముచ్యతే | ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే సప్తమో7ధ్యాయః. దీనివలన మహాజ్ఞాన సంపత్తి గల్గును. నరుడు దీనిని పరిశుద్దికొఱకు దల్చవలయును. పంచముఖి-పంచబ్రహ్మస్వరూపమైనది. దానిని దాల్చుట వలన మహేశుడు ప్రసన్ను డగును. షణ్ముఖకి షణ్ముఖు డధిదైవతము. మనీషులు దీనికి వినాయకుడు గూడ నదిదైవతమందురు. సప్తముఖిని సప్తమాతృక లధిదేవతలు. దీనికి సూర్యూడు సప్తఋషులుగూడ నధిదేవతలే. దీనిని దాల్చుట వలన మంచి యారోగ్యము సిరిసంపదలు గల్గును. దానిని శుచిగ ధరించువానికి జ్ఞానధనము గల్గును. అష్టముఖికి అష్టమాత లధిదేవతలు. అష్ట వసువులకు-గంగకు నిది ప్రీతిపాత్రమైనది. దీనిని దాల్చుట వలన సత్యవాదులగు దేవతలు తృప్తిజైందుదురు. నవముఖి రుద్రాక్షకుయము డధిదేవత. దానిని దాల్చుట వలన యమభీతి యుండదు. దశముఖికి దశదిశ లధిదైవతములు. దానిని దాల్చుట వలన దశదిశలును సంతోషించును. ఏకాదశముఖి కేకాదశ రుద్రులధిదైవములు. దాని నింద్రదైవతమనియు నందురు. అది సుఖశాంతులను పెంపొందించును. పండ్రెండు ముఖముల రుద్రాక్ష శ్రీమహావిష్ణువునకు ప్రతిరీపుము. దానికి ద్వాదశాదిత్యు లధిదేవతలు. దానిని దాల్చుట వలన వార ప్రసన్నులగుదురు. పదుమూడ ముఖముల రుద్రాక్ష కామసిద్ధి గల్గించును. దానిని దాల్చుట వలన కామదేవుడు తుష్టి జెందును. పదునాల్గుమోముల రుద్రాక్ష కేవలము రుద్రనేత్రము నుండియే యుద్బవించెను. అది సర్వవ్యాధులు పాపి యారోగ్యభాగ్యము లొడగూర్చును. రుద్రాక్షలు దాల్చువాడు మద్య మాంసములు వెల్లుల్లి నీరుల్లి మునగ విరిగి ఊరపంది తిన గూడదు. గ్రహణ తులామేష సంక్రాంతులందును అమావాస్య పౌర్ణములందును రుద్రాక్షను ధరించినవాడు సకల పాపములనుండి వెంటనే విముక్తుడు గాగలడు. ఇది శ్రీ దేవీ భాగవతము మహాపురాణమందలి ఏకాదశ స్కంధమున నేడవ యధ్యాయము.