Sri Devi Bagavatham-2
Chapters
అథ నవమో7ధ్యాయః. శ్రీనారాయణ ఉవాచ : ఇదం శిరోవ్రతం చీర్ణం విధివద్యైర్ధ్విజాతిభిః |
తేషామేవ పరాం విద్యాం వదే దజ్ఞానబాధికామ్. 1 విధివచ్చృద్ధయాసార్థం న చీర్ణంయైః శిరోవ్రతమ్ | శ్రౌతస్మార్తసమాచారస్తేషా మనుపకారకః. 2 శిరోవ్రత సమాచారా దేవ బ్రహ్మాది దేవతాః | దేవతా అభవన్విద్వన్ ఖలు నాన్యేన హేతేనా. 3 శరోవ్రతస్య మాహాత్మ్యం పూర్వైః పూఏర్వతంరం కృతమ్ | బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ కదేవతాః సకలా అపి. 4 సర్వపాతక యుక్తో7పి ముచ్యతే సర్వపాతకైః | శరోవ్రత మిదం యేన చరితం విధివద్బుధ. 5 శరోవ్రత మిదం నామ శిరస్యాధర్వణ శ్రతేః | యదుక్తం తద్వినైనాన్య త్తత్తు పుణ్యన లభ్యతే. 6 శాఖాభేదేషు నామాని వ్రతస్యాస్య విభేదతః | పఠ్యంతే మునిశార్దూల శాఖాస్వేకవ్రతం హి తత్. 7 సర్వశాఖాసు వస్త్వేకం శివాఖ్యం సత్యచిద్ఘనమ్ | తథా తద్విషయం జ్ఞానం తథైవ చ శిరోవ్రతమ్. 8 శిరోవ్రత విహీనస్తు సర్వధర్మ వివర్జితః | అపి సర్వాసు విద్యాసు సో 7 ధికారీ న సంశయః. 9 శివోవ్రత మిదం కార్యం పాపకాంతార దాహకమ్ | సాధనం సర్వ విద్‌ఆయనాం యత స్తత్సమ్యగా చరేత్. 10 శ్రుతిరాథర్వణీ సూక్ష్మ సూక్ష్మర్థస్య ప్రకాశినీ | యదువాచ వ్రతం ప్రీత్యా తన్నిత్యం సమ్యగా చరేత్. 11 అగ్నిరిత్యాదిభిర్మంత్రైః షడ్బిః శుద్ధేన భస్మనా | సర్వాంగో ద్డూలనం కుర్యాచ్ఛిరోవ్రత సమాహ్వయమ్. 12 ఏతచ్ఛిరో వ్రతం కుర్యాత్సంధ్యాకలేషు సాదరమ్ | యావద్విద్యోదయస్తావత్తస్య విద్యాఖలూత్తమా. 13 తొమ్మిదవ అధ్యాయము భస్మధారణ విధానము శ్రీనారాయణు డిట్లనెను; శరోవ్రత విధనము తెలిసిన ద్విజులకు అజ్ఞానము బోగోట్లునట్టి పరవిద్యను గూర్చి బోధించవలయును. ఈ శిరోవ్రతమును విధి పూర్వకముగ నాచరింవపనివారు శ్రుతిస్మృతుల విధాన మాచరించినను ప్రయోజనము లేదు. ఈ శిరోవ్రత మాచరించుట వలననే బ్రహ్మదులు బ్రహ్మత్వ మొంది దేవత లైరి. మఱి దేనివలనను గాదు. ఈ శిరోవ్రత మాహాత్మ్యమును మన పూర్వులకు పూర్వులు నెఱింగి యాచరించిరి. బ్రహ్మ- విష్ణు -శివులును దీని నాచరించిరి. ఎల్ల పాపులలో మహాపాపి కూడ ఈ శిరోవ్రత మాచరించినచో నతచు పాపములనుండి ముక్తుడగును. మేలు గాంచును. అధర్వ శీర్షోపనిషణత్తునం దీ శరోవ్రతము గూర్చి విపులముగ గలదు. ఇదెంతో పూర్వ పుణ్య విశీషమున లభించును. మునివరా! ఇది శాఖాభేదములనుబట్లి పాశుపతమనియు-శివవ్రతమనియు పెక్కు రీతులుగ పిలువబడును. ఈ శాఖ లన్నియందును సత్యము-చిర్ఘనము-శివము నగు నొకే వస్తువు గలదు. శివ సంబంధమైన జ్ఞానము దీన గ ల్గుట వలన దీనిని శిరోవ్రతమనియు నందురు. ఎల్ల విద్యలం దధికారము గలవాడు సైతము శిరోవ్రతమాచరించనిచో నతడు నిస్సంశయ ముగ ధర్మహీను డగును. పాపము లడవి-శిరోవ్రత మడవి గాల్చు దావాగ్ని. సర్వ విద్యలకు సాదన భూతము. కనుక దీని నెల్లరును తప్పక సమాచరింపవలయును. అధర్వణ వేదము సూక్ష్మ రహస్యములను చక్కగ వివరించును. అది ప్రియముగ బలికిన వ్రతమును తప్పక సమాచరింపవలయును. ''అగ్నిరితి భస్మ- జలమితి భస్మ- స్థలమితి భస్మ-వాయుదితి భస్మ- వ్యోమేతి భస్మ- సర్వంహవా భస్మ- '' అను నారు మంత్రములు పలుకుచు శరీర మంతట భస్మము పూసికొని శరోవ్రత మాచరింపవలయును. సంధ్యావందన కసమయమం దీ శిరోవ్రతము తప్ప కాచరింపవలయును. బ్రహ్మజ్ఞానము గల్గునంతవఱకు దీనిని తప్ప కాచరింపవలయును. ద్వాదశాబ్ధమథాబ్దంవా తదర్ధం తదర్థకమ్| ప్రకుర్యా ద్ద్వాదశాహం వా సంకల్పేన శిరోవ్రతమ్. 14 శిరోవ్రతేన యః స్నాతస్తంతు నోపదిశేత్తు యః | తస్య విద్యావినస్టా స్యాన్నిర్ఘృణః స గురుః ఖలు.15 బ్రహ్మవిద్యాగురుః సాక్షాన్మునిః కారుణికఃఖలు | యథా సర్వశ్వరః శ్రీమాన్మృదుః కారుణికః ఖలు. 16 జన్మాంతర సహస్రేషు నరా యే ధర్మచారిణః | తేషామేవఖలు శ్రద్దజాయతే నకదాచన.17 ప్రత్యుతాజ్ఞాన బాహుల్యా ద్ద్వేష ఏవ విజాయతే | అతః ప్రద్వేషయుక్తస్య న భ##వేదాత్మవేదనమ్. 18 బ్రహ్మవిద్యోపదేశస్య సాక్షా దేవాధికారిణః | త ఏవ నేతరే విద్వన్యే తుప్నాతా శరోవ్రతైః. 19. వ్రతం పాశుపతం చీర్ణం యైర్ద్విజై రాదరేణు తు | తేషామేబేవో పదేస్టవ్య మితి వేదానుశాసనమ్. 20 యః పశస్త త్పశుత్వం చ ప్రతేనానేన సంత్యజేత్ | తాన్హత్వా నస పాపీయా న్బవే ద్వేదాంత నిశ్చయః.21 త్రిపుండ్రధారణం ప్రోక్తం జాబాలైరాదరేణతు | త్రియంబకేన మంత్రేణ సతారేణ శివేన చ. 22 త్రిపుండ్రం ధారయేన్నిత్యం గృహస్థాశ్రమమాశ్రతిః | ఓంకారేణ త్రిరుక్తేన సహంపేన త్రిపుండ్రకమ్. 23 ధారయేద్బక్షకో నిత్యమితిజాబాలికీ శ్రతిః | త్రియం బకేన మంత్రేణ ప్రణవేన చ శివేన చ. 24 గృహసప్థ శ్చ వాన ప్రస్థో ధారయే చ్ఛ త్రిపుండ్రకమ్ | మేధా విత్యాదినావా 7 పి మ్రహ్మచారీ దినే దినే. 25 భస్మనా సజలేనా7పి ధారయే చ్ఛ త్రిపుండ్రకమ్ | బ్రహ్మణో విధినోత్పన్న స్త్రీ పుండ్ర భస్మనైవతు. 26 లలాటే ధారయే న్నిత్యం తిర్యగ్బస్మావ గుంవఠనమ్ | '' మహాదేవస్య కసంబంధాత్త ద్దేర్మే7 స్వస్తి సంగతిః .'' సమ్య క్త్రి పుండ్రధర్మం చ బ్రాహ్మణో నిత్యమాచరేత్. 27 '' నేను పండ్రెండేండ్లు లేక పండ్రెండు మాసములు లేక పండ్రెండు పక్షములు లేక పండ్రెండు వారములు లేక పండ్రెండు దినము లీ వ్రత మాచరింతు '' నని సంకల్పించి దేనిని పాటించవలయును. ఈ శిరోవ్రతమున సుస్నాతుడైన శిష్యున కుపదేశించని గురువు- గురువుగాడు. అతడు కఠినాత్ముడు. అతని విద్య వినష్టమగును. నిజముగ బ్రహ్మ విద్యను బోధించు వాడే గురుడు - ముని- దయాళుడు-సర్వేశ్వరుడు-నారాయణునివలె నుపదేశించుటకు తగినవాడు. బహుజన్మలలో మానవతా ధర్మమాచిరంచిన మానవులకే దీనియందు శ్రద్ధగల్గును. ఇతరుల కేనాటికి గల్గదు. ఇతరునిలో నజ్ఞానమే ప్రబలముగ నుండుటవలన వానికి దీనిపట్ల ఏవగింపు గల్గును. అట్టి ద్వేషి కాత్మవిచార మిం కెట్లు గల్గును? ఈ శిరోవ్రతమున స్నాతులైనవారే బ్రహ్మవిద్య నుపదేశింప సాక్షాత్తుగ నధికారులు. ఇతరులుగారు. ఏ ద్విజుల లీ పాశుపతవ్రత మాచిరంచి యాచిరంతులో వారికి మాత్రమే బ్రహ్మవిద్య నుపదేశింపవలయునని వేదమే శాసించుచున్నది. పశువైనవాడు దీని నాచరించినచో నతని పశుత్వము తొలగును. పశువును జ్ఞాని చంపిన్పటికి నతడు పాపిగాడని వేదము నిశ్చయము. జా బాలి శ్రుతియందును త్ర్యయబంక మంత్రముతో గాని పంచాక్షరితోగాని త్రిపుండ్రములు ధరింపవలయునని కలదు. గృహస్థు ప్రణవము ముమ్మారు జపించికాని- హంస మంత్ర మునగాని త్రిపుండ్రములు ధరించవలయును. సన్యాసి నిత్యము త్ర్యయంబక మంత్రముతో గాని పంచాక్షరి మంత్రముతో గాని భస్మము ధరించవలయునని జాబాల శ్రుతి వినిపించుచున్నది. ఇట్లు గృహస్థు- వానప్రస్థుడును త్రపుండ్రములు ధరింపవలయును. ఇక బ్రహ్మచారి '' మేధావి భూయాస'' మను మంత్రముతో దినిదినము భస్మము ధిరించవలయును. నీరు గలిపిన భస్మమునే త్రిపుండ్రములుగ ధరింపచవలయును. బ్రాహ్మణుడు చక్కగా నిత్యము తన నెన్నోసట నడ్డముగ మూడు రేఖటు భస్మముతో దాల్చవలయును. అతనికి మహాదేవుని సంబంధముననే భస్మధారమున నిష్ట కుదురును. అదిబ్రాహ్మనభూతేన త్రిపుండ్రం భస్మనాధృతమ్ | యతో7 త ఏవ విప్రస్తు త్రిపుండ్రం ధారయేత్సదా.28 భస్మనా వేదసిద్ధేన త్రిపుండ్రదేహ గుంఠనమ్ | రుద్రలింగార్చనం వా7 పి మోహతో7 పి చ న త్యజేత్. 29 త్రియంబకేన మంత్రేణ సతారేణ తథైవచ | పంచాక్షరేణ మంత్రేణ ప్రణవేన తథైవచ. 30 లలాటే హృదయేచైవ దోర్ద్వంద్వేచ మహామునే | త్రిపుండ్రం ధారయేన్నిత్యం సంన్యాసాశ్ర మమాశ్రితః. 31 త్రియాయుషేణ మంత్రేణ సనేధావీత్యాదినా7 థవా | గౌణన భస్మనా ధార్యం త్రిపుండ్రం బ్రహ్మచారిణా. 32 అన్వేషామపి సర్వేషాం వినామంత్రేణా సువ్రత| ఉద్దూలనం త్రింపుడ్రం చ కర్తవ్యం భక్తితో మునే. 34 భూత్యైవోద్ధూలనం తిర్యక్త్రిపుండస్య చ ధారణమ్ | వరేణ్యం సర్వధర్మేభ్య స్తత్త్వాన్నిత్యం సమాచరేత్.35 భస్మాగ్ని హోత్రజం వా7 థ విరజాగ్నిసనముద్భవమ్ | ఆదరేణ సమాదాయ శుద్ధే పాత్రే నిధాయ తత్. 36 ప్రక్షాళ్య పాదే హస్తౌ చ రద్‌ఇరాచమ్య సమాహితః | గృహీత్వా భస్మ తత్పం చ బ్రహ్మమంత్రైః శ##నైః శ##నైః. 37 ప్రాణామాయామత్రయం కృత్వా అగ్నిదిత్యాది మంత్రితమమ్| తైరేవ సప్తభిర్మం త్రై స్త్రీవార మభి మంత్రయేత్. 38 ఓమాపోజ్యోతి రిత్యుక్త్వా ర్యాత్వా మంత్రానుదీరయేత్ | సితేన భకస్మనా పూర్వ సముద్ధూల్య శరీరకమ్. 39 విపాపో విరజో పర్త్యోజ.ఆయతే నాత్ర సంశయః తతో దా%్‌యతా%్‌యవ మలహావిష్ణుం జగన్నాధం జలాధిపమ్. 40 సంయోజ్య భస్మనా తోయ మగ్నిరిత్యాదిభిః పునః | విమృజ్య సాంబం ధ్యాత్వా చ మసముద్ధూల్యోర్ధ్వమస్తకమ్. 41 తే చ భావనయా బ్రహ్మభూతేన సితబస్మనా | లలాట వక్షః స్కంధేషు స్వాశ్రయోచినత మంత్రతః.42 మధ్యమానామి కాంగుష్ఠై రనులో మవిలో మతః | త్రిపుండ్రం ధారయే న్నిత్యం త్రికాలేష్వఫి భక్తితః.43 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ఏకాదశస్కందే నవయో7 ధ్యాయః. ఆదిబ్రాహ్మణుడైన బ్రహ్మ మొట్టమొదట భస్మముతో త్రపుండ్రములు ధరించెను. కావున ప్రతి విప్రుడును భస్మ త్రిపుండ్రములు వేదసిద్ధమూఐన భస్మముచే దేహమున దాల్చవలయును. ఎంతటి మోహవశుడైన వాడును శివలింగార్ఛనము మాత్ర మెన్నడును వదలరాదు. త్ర్యంబక మంత్రముతో గాని -పంచాక్షరితో గాని - ప్రణవముతో గాని మానవుడు నెన్నోసట- హృదయమున -భుజములందును త్రిపుండ్రములు ధరించవలయును. సన్యాసియువీనీ దాల్చవలయును. బ్రహ్మచారి''త్ర్యాయుష'' మంత్రమునగాని '' మేధావీ'' మంత్రమునగాని గౌణభస్మమును(అగ్నిహోత్రమును సిద్ధముగానిది) త్రిపుండ్రమబులుగ ధరించవలయును. సేవానిరతుడగు శూద్రడును శివాయనమః యను మంత్రముతో భక్తితో నిత్యము త్రిపుండ్రములు దాల్చవచ్చును. సువ్రతా! ఇంకితరులు గూడ మంత్రము లేకున్నను భక్తితో త్రిపుండ్రములు దాల్చవచ్చును. విభూతియన ఐశ్యర్యము. దానికొఱకు విభూతిని త్రిపుండ్రములుగ నడ్డముగ ధరించుట సర్వధర్మములలో నుత్తమము. కనుక దీనిని తప్ప కాచరించవలయును. అగ్నిహోత్రమందలి భస్మాగాని- విరజాహోమమందలి భకస్మమును గాని భక్తితో తీసికొని యోక శుద్దపాత్రలో నుంచవలయును. కాలుసేతులు కడుగుకొన్న పిమ్మట రెండు మారు లాచమించి మెల్లమెల్లగ సత్యోజాతాది పంచ బ్రహ్మ మంత్రములతో భస్మమును తీసికొనవలయును. ముమ్మారు ప్రాణాయామ మొనర్చి అగ్ని రిత్యాది మంత్రయమాలతో ముమ్మారు దాని నభిమంత్రించవలయరును. తర్వాత '' ఓమాపోజ్యోతీ రసో మృతం బ్రహ్మ'' అను మంత్ర ముచ్ఛరించుచు మేనినవండ తెల్లని భస్మము పూయవలయును. ఇట్లు చేయుట వలన నరుడు పాపముక్తుడగును. తర్వాత జలాధిపతి జగన్నాధుడగు విష్ణుని ధ్యానించవలయును. అగ్నిరిత్యాది మంత్రములతో భస్మమందు జల ముంచి సదాశివుని ధ్యానించుచు తలపై భస్మము దాల్చ వలయును. ఈ భావనతో నరుడు భ్రహ్మభూతుడై తెల్లని భస్మమును నెన్నొసట- ఱొమ్మున - భుజములందును తన యాశ్రమ మునకు దగినట్లుగ ధరింపవలయును. నడిమి వ్రేలు-ఉంగరపు వ్రేలు ఈ రెంటితో నొసట నెడమనుండి కుడికి దాల్చి పిడగప బొటనవ్రేలితో కుడినుండి యెడమకు దాన్చవలయును. ఇది త్రిపుండ్రధారణ విధానము. భక్తితో మూడు కాలములందును త్రిపుండ్రములు తప్పక ధరించవలయును. ఇది శ్రీదేవీ భాగవత మహాపనురాణమందలి ఏకాదశ స్కంధమున నవమాధ్యాయము.