Sri Devi Bagavatham-2
Chapters
అథ ద్వాదశో೭ధ్యాయః. శ్రీనారాయణ ఉవాచ : దేవర్షే! శృణు తత్సర్వం భస్మోద్ధూలనజం
ఫలమ్ | సరహస్య విధానం చ సర్వకామఫలప్రదమ్.
1 కపిలాయాః శకృత్స్వ చ్ఛం గృహీత్వా గగనే పతత్ | నక్లిన్నంనాపి కఠినం నదుర్గంధం న చోషితమ్.
2 ఉపర్యధః పరిత్యజ్య గృహ్ణీయా త్పతియం యది | పిండీకృత్య శివాగ్న్యాదౌ తత్షిపేన్మూలమంత్రితమ్.
3 ఆదాయ వాససాచ్చాద్య భస్మాధానే వినిక్షిపేత్ | సుకృతే సుదృఢే శుద్ధే క్షాళితే ప్రోక్షితే శుభే. 4 విన్యస్య మంత్రీ మంత్రేణ పాత్రం భస్మ వినిక్షిపేత్ | తైజసం దారవం చాథ మృణ్మయం చై లమేవచ. 5 అన్యద్వా శోభనం శుద్ధం భస్మాధానం ప్రకల్పయేత్ | క్షౌమే చైవాతిశుద్ధేవా ఘనవద్బస్మ నిక్షిపేత్.
6 ప్రస్థితో భస్మగృహ్ణీయా త్స్వయం చానుచరో పివా | న చాయుక్త కరేదద్యాన్నచాశుచి తలేక్షిపేత్.
7 న సంస్పృశేత్తునీచాంగై ర్నక్షిపేన్న చ లంఘయేత్ | తస్మా ద్బ సిత మాదాయ వినియుంజీత మంత్రితమ్.
8 విభూతి ధారణవిధిః స్మృతిప్రోక్తో మయేరితః | యదీయాచరణనైవ శివతుల్యో నసంశయః.
9 శైవైః సంపాదితం భస్మవైదికైః శివసన్నిధౌ | భక్త్యా పరమయా గ్రాహ్యం ప్రార్థయిత్వాతు పూజయేత్.
10 తంత్రోక్తం వర్త్మనా సిద్ధం భస్మ తాంత్రి కపూర్వకైః | యత్ర కుత్రాపి దత్తం చేత్తద్గ్రాహ్యం నైవవైదికైః.
11 శూద్రైః కాపాలికైర్వాథ పాఖండై రపరైస్తుతత్ | త్రిపుండ్రంధారయే ద్బక్త్యా మనసా పిన లంఘయేత్. 12 శ్రుత్వా విధీయతే యస్మాత్తత్త్యాగీ పతితో భ##వేత్ | త్రిపుండ్రధారణం భక్త్యా తథా దేహావ గుంఠనమ్. 13 ద్విజః కుర్యాద్ధి మంత్రేణ తత్త్యాగీ పతితో భ##వేత్ | ఉద్ధూలనం త్రిపుండ్రం చ భక్త్యానైవాచరంతి యే. 14 పండ్రెండవ అధ్యాయము భస్మధారణ విధానము శ్రీనారాయణు డిట్లనియెను : నారదా! భస్మధారణ ఫల మంతయును తెల్పుదును వినుము. అది సకల కామఫల ప్రదుమ - రహస్యము నైనది. కపిలగోవు పేడను క్రిందపడక ముందే పట్టుకొనవలయును. అది పలుచనిదిగాని - గట్టిదిగాని - దుర్వాసన కలదిగాని - నిన్నటిదిగాని కారాదు. క్రిందపడిన పేడయైనచో దానిపై - క్రింది - భాగముల పేడ తీసివేసి నడిమిది గ్రహించవలయును. దానిని ముద్దగా జేసి యెండెంచి శివాగ్నిలో మూలమంత్రముతో భస్మము చేయవలయును. దాని నొక బట్టలో కప్పి తీసికొని పాత్రలో నుంచవలయును. దానిని మంచి గట్టి - పవిత్రమైన పాత్రమున నుంచవలయును. అది కట్టెతో - మట్టితో - చేసినదికాని బంగారము మున్నగు ధాతువులతో వస్త్రములతో కాని మఱదైన శుద్ధమైన పాత్ర కావలయును. భస్మపు టుండను తెల్లని వస్త్రములో నుంచవలయును. త్రోవలో వెళ్లునపుడు వెంట భస్మ ముంచుకోవలయును. తోడివారికి నీయవల యును. దానిని తగనివాని కీయరాదు. తగనిచోట నుంచరాదు. నీచాంగములతో భస్మము తాకరాదు. ఎక్కడనైన పారవేయరాదు. తిరస్కరించరాదు. దానిని గ్రహించి సమంత్రకముగ ధరించవలయును. స్మృతులందు చెప్పబడిన భస్మధారణ విధానము తెల్పితిని. దాని నాచరించిన మనుజుడు నిజముగ శివసమాను డగును. శివోపాసకులు వేదములననుసరించి భస్మము నేర్పఱచిరి. శివసన్నిధియందు పరమభక్తితో వారి నడిగి భస్మమును తీసికొనవలెను. తాంత్రికులు సిద్ధపరచిన భస్మమును తంత్రమార్గ ముననే గ్రహించవలయును. వైదికు లెక్కడ ననిన అక్కడ శూద్రులు - పాఖండులు - కాపాలికులు - ఇతరులును ఇచ్చిన భస్మము గ్రహించరాదు. దానిని మనసునందును వదలరాదు. భస్మము వేద విధానమున చెప్పబడినది. కనుక దానిని పరిత్యజించువాడు పతితు డగును. ద్విజుడు భక్తితో త్రిపుండ్రములు ధరించవలయును. సమంత్రకముగ భక్తితో త్రిపుండ్ర ములు ధరించక యొడలికి పూయకున్నచో - తేషాం నాస్తి వినర్మోక్షః సంసారాజ్జన్మ కోటిభిః | యేన భస్మోక్తమార్గేణ ధృతంసముని పుంగవ. 15 తస్య విద్ధి మునే జన్మ నిష్పలం సౌకరం యథా | యేషాం వపుర్మనుష్యాణాం త్రిపుండ్రేణ వినా స్థితమ్. 16 శ్మశానసదృశం తత్స్యాన్న ప్రేక్ష్యం పుణ్యకృజ్జనైః | ధిగ్బస్మరహితం భాలం ధిగ్గామ మశివాలయమ్. 17 ధిగనీశార్చనం జన్మ ధిగ్విద్యా మశివాశ్రమయామ్ | త్రిపుండ్రం యే వినిందంతి నిందంతి శివమేవ తే. 18 ధారయంతి చయే భక్త్యా ధారయంతి తమేవతే | యథా కృశానురహితో భూధరో న విరాజితే. 19 అశేషసాధనే೭ప్యేవం భస్మహృనం శివార్చనమ్ | ఉద్ధూలనం త్రిపుండ్రం శ్రద్ధయా నాచరంతి యే. 20 తైః పూర్వాచరితం సర్వం విపరీతం భ##వేదపి | భస్మనా వేదమంత్రేణ త్రిపుండ్రస్య చధారణమ్. 21 వినా వేదోచితాచారం స్మార్తస్యానర్థం కారణమ్ | కృతం స్యా దకృతం తేన శ్రుత మప్యశ్రుతం భ##వేత్. 22 అధీత మనధీతం చ త్రిపుండ్రం యోనధారయేత్ | వృథా వేదా వృథా యజ్ఞా వృథా దానం వృథా తపః. 23 వృథా వ్రతోపవాసేన త్రిపుండ్రం యోన ధారయేత్ | భస్మధారణకం త్యక్త్వా ముక్తి మిచ్ఛతీయః పుమాన్. 24 విషపానేన నిత్యత్యం కురుతే హ్యాత్మనో హి సః | స్రష్టా సృష్టిచ్ఛలేనాహ త్రిపుండ్రస్య చ ధారణమ్. 25 ససర్జ స లలాటం హి తిర్యగూర్ధ్వం న వర్తులమ్ | తిర్యగ్రేఖాః ప్రదృశ్యంతే లలాటే సర్వదేహినామ్. 26 తథాపి మానవా మూర్ఖా న కుర్వంతి త్రిపుండ్రకమ్ | నతద్ధ్యానం న తన్మోక్షం న తదొజ్ఞానం న తత్తపః. 27 వినా తిర్యక్త్రిపుండ్రం చ విప్రేణ యదనుష్ఠితమ్ | వేదస్యాధ్యయనే శూద్రో నాధికారీ యథా భ##వేత్. 28 అట్టివారికి కోటి జన్మలకైన ఈ మృత్యు సంసారమునుండి ముక్తిరాదు. మునివరా! ఈ చెప్పిన చొప్పున నెవడు భస్మము ధరించడో వాని జన్మ పంది జన్మవలె వ్యర్థము. ఎవని శరీరమున త్రిపుండ్రము లుండవో వాడు శ్మశానమువంటి వాడు. పుణ్యాత్ములు వానిని దర్శించరాదు. భస్మము లేని తల - శివాలయములేని గ్రామమువలై పనికిమాలినది. ఈశ్వరార్చన లేని జన్మము - ఈశ్వరాశ్రయములేని విద్యయు పనికిమాలినవి త్రిపుండ్రములు నిందించువాడు - శివుని నిందించువాడే. ఎవరు భస్మము ధరించి - యితరులచేత ధరింపచేయుదురో వారు పేరుగ గాంతురు. లేనిచో నగ్నిలేనిపర్వతమువలె వారు శోభిల్లరు. ఎన్ని సాధనములున్నను భస్మము ధరింపక యెవరు శివార్చన చేతురో ఎవరు భక్తితో భస్మము పూసికొని త్రిపుండ్రములు ధరింపరో వారు పూర్వము సంపాదించిన పుణ్యమంతయును విపరీత మగును. భస్మమును వేదమంత్రముతో త్రిపుండ్రములుగ ధరింపవలయును. వేదమార్గమున గాకస్మార్తుడన్య పద్ధతిలో ధరించిన చేటు మూడును. వాడు భస్మము దాల్చినను దాల్చనట్లేవాడు శాస్త్రములు చదివినను చదువనట్లే. ఎవడు త్రిపుండ్రములు ధరింపడో వాని వేద - యాగ - తపో - దానము లన్ని యును వ్యర్థములే. ఎవడు త్రిపుండ్రములు ధరించడో యెవడు భస్మధారణ చేయక ముక్తిని గోరుకొనునో వాడు విషముత్రాగి తానమరుడుకావలెనని తలచునట్టివా డగును. బ్రహ్మ - సృష్టి నెపమున త్రిపుండ్ర ధారణము తెల్పెను. ఎట్లన బ్రహ్మ మన నొసటిని నిలువుగ గుండ్రగ చేయలేదు. ప్రతివాని నొసట మూడు గీత లడ్డముగ సాజముగ కనంబడును. ఐనను మూర్ఖులు త్రిపుండ్రములు ధరింపరు. త్రిపుండ్రము లేక చేసిన ధ్యానము ధ్యానముకాదు; తపము తపముకాదు; వానికి ముక్తి గాని జ్ఞానము గానిలభ్యముగాదు. వేదాధ్యయనమునకు శూద్రు డధికార గానటులే భస్మదారణ చేయని బ్రాహ్మణుడు దేని ననుష్ఠించుటకు నధికారి గాడు. త్రిపుండ్రేణ వినావిప్రో నాధికారీ శివార్ఛనే | ప్రాజ్ముఖ శ్చరణౌ హస్తౌ ప్రక్షాళ్యాచమ్య పూర్వవత్. 29 ప్రాణానాయమ్యసంకల్ప్య భస్మస్నానం సమాచరేత్ | ఆదాయ భసితం శుద్ధమగ్నిహోత్ర సముద్బవమ్. 30 ఈశానేనతు మంత్రేణ స్వమూర్ధని వినిక్షిపేత్ | తత ఆదాయ తద్బస్మ ముఖే చ పురుషేణ తు. 31 అఘోరాఖ్యేణ హృదయే గుహ్యే వామాహ్యయేన చ | సద్యోజాతాభిధానేన భస్మపాదద్వయే క్షిపేత్. 32 సర్వాంగం ప్రణవేనైవ మంత్రేణో ద్ధూలనం తతః | ఏత దాగ్నేయకం స్నానముదితం పరమర్షిభిః. 33 సర్వ కర్మ సమృద్ధ్యర్థం కుర్యాదాదావిదం బుధః | తతః ప్రక్షాళ్య హస్తాదీనుపస్పృశ్య యథావిధి. 34 తిర్యక్త్రిపుండ్రం విధినా లలాటే హృదయే గళే | పంచభిర్ర్బహ్మాభి ర్వాపి కృతేన భసితేన చ. 35 ధృతమేత త్త్రిపుండ్రం స్యా త్సర్వకర్మసు పావనమ్ | శూద్రాంత్య జనం హస్తస్థ న ధార్యం భస్మచ క్వచిత్. 36 భస్మనా సాగ్నిహోత్రేణ లిప్తః కర్మసమాచరేత్ | అన్యథా సర్వకర్మాణి న ఫలంతి కదాచన. 37 సత్యం శౌచం జపోహోమస్తీర్థందే వాది పూజనమ్ | తస్ట వ్యర్థ మిదం సర్వం యస్త్రీపుండ్రం న ధారయేత్. 38 త్రిపుండ్రధృగ్విప్రవరో యోరుద్రాక్షధరః శుచిః | స హంతి రోగదురితవ్యాధి దుర్బిక్షస్కరాన్. 39 సమాప్నోతి పరంబ్రహ్మ యతో నా వర్తతే పునః | స పంక్తి పావనః శ్రాద్ధే పూజ్యో విపై#్రః సురైరపి. 40 శ్రాద్ధే యజ్ఞే జపే హోమే వైశ్వదేవే సురార్చనే | ధృతత్రిపుండ్రః పూతాత్మా మృత్యుంజయతి మానవః. 41 భస్మధారణ మాహాత్మ్యం భూయో೭పి కథ యామితే. ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే ద్వాదశో೭ధ్యాయః. త్రిపుండ్రధారణ చేయని బ్రాహ్మణుడు శివార్చనకు పనికిరాడు. కనుక తూర్పుముఖముగనుండి కాలుసేతులు కడుగుకొని యాచమించవలయును. తర్వాత ప్రాణాయామ పూర్వకముగ సంకల్పముచేసి భస్మస్నానముచేయవలయును. పిదప నగ్ని శుద్ధమైన భస్మము తీసికొనవలయును. ఈశానమంత్రముతో శిరమున భస్మము ధరించవలయును. తత్పురుష మంత్రముతో ముఖమునందు అఘోర మంత్రముతో హృదయమునందు వామదేవమంత్రముతో గుహ్యమందును సద్యోజాత మంత్రముతో రెండుపాదములమీదను భస్మము పూసికొనవలయును. ఓంకార పూర్వకముగ నొడలి నిండ భస్మము పూయుట అగ్నిస్నానమని పరమర్షులందురు. బుధు లన్ని కర్మల సమృద్ధి కిటుల నాచరింపవలయును. తర్వాత కాలుసేతులు కడుగు కొని యథావిధిగ జలము తాకవలయును. పిదప యథావిధిగ నొసట కంఠమున హృదయమున పంచబ్రహ్మ మంత్రములతో నెవడు త్రిపుండ్రము లడ్డముగ ధరించునో అతడు త్రిపుండ్రములు దాల్చినవాడగును. వాని పను లన్నియును పవిత్రము లగును. శూద్రుల - అంత్యజుల చేతి భస్మమును ద్విజు డెన్నడును దాల్చరాదు. అగ్నిహోత్రములోని భస్మమును దాల్చి చేసిన పనులు తప్పక సిద్ధి బొందును. అటుల గానిచోపను లేవియును సిద్ధించవు - ఫలించవు. త్రిపుండ్రములు ధరించనివాడు చేసిన సత్యము - శౌచము - జపము - హోమము - తీర్థము - దేవతార్చనము నన్నియును వ్యర్థములే యగును త్రిపుండ్రములు - రుద్రాక్షలును ధరించు బ్రాహ్మణుడు పావనుడై యెల్ల పాపములను వ్యాధులను కరవు - కాటకములను దొంగలను శమింపచేయగలడు. అట్టి బ్రాహ్మణుడు పరబ్రహ్మమును జెందును. తిరిగివాడు. అతడు పంక్తిపావను డగును. శ్రాద్ధమునం దతడు విప్రులచేత సురలచేత పూజ్యు డగును. శ్రాద్ధము - యజ్ఞము - జపము - హోమము - వైశ్వదేపము - దేవచార్యనము - వీని యన్నిటియందు త్రిపుండ్రములు ధరించి పవిత్రుడైన మానవుడు మృత్యువును జయించగలడు. అట్టి భస్మధారణ మహాత్మ్యము నీ కింకను విరవితంతును. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ఏకాదశ స్కంధమున పండ్రెండవ యధ్యాయము.