Sri Devi Bagavatham-2
Chapters
అథ చతుర్దశో೭ధ్యాయః. శ్రీనారాయణ ఉవాచ : భస్మదిగ్ధశరీరాయ యో దదాతి ధనం ముదా |
తస్య సర్వాణి పాపాని వినిశ్యంతి న సంశయః.
1 శ్రుతయః స్మృతయః సర్వాః పురాణాన్యఖిలాన్యపి | వదంతి భూతిమాహాత్మ్యః తత్తస్మాద్ధారయేద్ద్విజః.
2 సితేన భస్మనా కుర్యా త్త్రిసంధ్యం య స్త్రీపుండ్రకమ్ | సర్వ పాపవినిర్ముక్తః శివలోకే మహీయతే.
3 యోగీ సర్వాంగకం స్నానమాపాదతల మస్తకమ్ | త్రిసంధ్య మాచరే న్నిత్య మాశుయోగ మవాప్ను యాత్.
4 భస్మన్నానేన పురుషః కులస్యోద్ధారకో భ##వేత్ | భస్మస్నానం జలస్నానా దసంఖ్యేయగుణాన్వితమ్.
5 సర్వతీర్థేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్పలమ్ | తత్పలం లభ##తే సర్వం భస్మస్నానాన్న సంశయః.
6 మహాపాతకయుక్తో వా యుక్తోవా ప్యుపపాతకైః | భస్మస్నానేన తత్సర్వం దహత్యగ్నిరివేం ధనమ్.
7 భస్మస్నానా త్పరం స్నానం పవిత్రంనైప విద్యతే | ఏవముక్తం శివేనాదౌ తదా స్నాతః స్వయం శివః.
8 తదా ప్రభృతి బ్రహ్మాద్యా మునయశ్చ శివార్థినః | సర్వకర్మసు యత్నేన భస్మస్నానం ప్రచక్రిరే.
9 తస్మాదేత చ్ఛిరస్నాన మాగ్నేయం యః సమాచరేత్ | అనేనైవ శరీరేణ స హి రుద్రో న సంశయః.
10 యే భస్మధారిణం దృష్ట్వా పరితృప్తా భవంతి తే | దేవాసురమునీంద్రైశ్చ పూజ్యా నిత్యం న సంశయః.
11 పదునాలుగవ అధ్యాయము భస్మధారణఫలము శ్రీనారాయణ డిట్లనెను : శరీరము నిండ భస్మము పూసికొన్నవానికి సంతోషముతో ధన మిచ్చిన దాతచేసిన పాపము లన్నియు తప్పక నశించును. శ్రుతి స్మృతి పురాణము లన్నియును విభూతి మహిమను గొప్పగ వర్ణించును. కనుక ద్విజుడు తప్పక భస్మధారణము చేయవలయును. మూడు సంధ్యలందును తెల్లని భస్మము త్రిపుండ్రములుగ ధరించువాడు సర్వపాప ముక్తుడై శివలోకమున మహిమాన్వితు డగును. యోగి నిత్యము మూడు సంధ్యలందును పాదమునుండి తల వఱకును భస్మస్నానము చేసినచో నతడు త్వరలో యోగసిద్ధు డగును. భస్మస్నానము చేసినవాడు తన కులమువారి నుద్ధ రించును. జలస్నానము కన్న భస్మస్నాన మెన్నో రెట్లు శ్రేష్ఠమైనది. భస్మస్నానమువలన సర్వతీర్థములందలి స్నానమున గలుగు పుణ్యఫలము లన్నియును లభించును. అగ్ని వలన కట్టెలు భస్మ మగును. అటులే ఉపపాతకములు-మహాపాతకములు చేసిన వాని పాపరాసు లన్నియును భస్మస్నాన మాత్రమున భస్మ మగును. భస్మస్నానమును మించిన పవిత్రమైన స్నానము లేదు. అని పూర్వము శివుడు పలికి తాను మొట్టమొదట భస్మస్నాన మాచరించెను. ఆనాటినుండి బ్రహ్మాదులు - మునులు - శివ భక్తులు - నెల్ల కర్మములందును తప్పక ప్రయత్నించి భస్మస్నాన మొనరింతురు. కనుక ఆగ్నేయస్నానమగు శిరస్నాన మాచరించువా డీ శరీరముతోడనే రుద్రు డగును. సందేహము లేదు. భస్మధారిని చూచి సంతోషించువాడు నిత్యమును దేవాసురమునులకు పూజనీయు డగుఉ. సందియము లేదు. భస్మసంఛన్న సర్వాంగం దృష్ట్వో త్తిష్ఠితియః పుమాన్ | తం దృష్ట్వా దేవరాజో೭పి దండత్ర్పణమిష్యతి.
12 అభక్ష్య భక్షణం తేషాం భస్మధారణ పూర్వకమ్ | తేషాం తద్బక్ష్యమేవ స్యాన్మునే నాత్ర విచారణా.
13 యః స్నాతి భస్మనా నిత్యం జలస్నానం తతః పరమ్ | బ్రహ్మచారీ గృహస్థోవావానప్రస్థో೭థ వాదరాత్.
14 సర్వపాప వినిర్ముక్తః స యాతి పరమాం గతిమ్ | ఆగ్నేయం భస్మనా స్నానం యతీనాం చ విశిష్యతే.
15 ఆర్ద్రస్నానా ద్వరం భస్మస్నానమార్ద్రవధో ధ్రువః | ఆర్ద్రంతు ప్రకృతిం విద్యాత్‌త్ర్పకృతిం బంధనం విదుః.
16 ప్రకృతే స్తు ప్రహాణాయ భస్మనా స్నాన మిష్యతే | భస్మనా సదృశం బ్రహ్మన్నాస్తిలోక త్రయేష్యపి. 17 రక్షార్థం మంగళార్థం చ పవిత్రార్థం పురా సురైః | భస్మ దృష్ట్వా మునే పూర్వం దత్తం దేవ్యై ప్రియేణతు. 18 తస్మా దేతచ్ఛిరః స్నాన మాగ్నేయం యః సమాచరేత్ | భవపాశైర్వినిర్ముక్తః శివలోకే మహీయతే. 19 జ్వరరక్షః పిశాచాశ్చ పూతనా కుష్ఠగుల్మకాః | భగందరాణి సర్వాణి చా೭శీతిర్వాతరోగకాః. 20 చతుః షష్టిః పిత్తరోగాం శ్లేష్మాః సప్త త్రిపంచకాః | వ్యాఘ్రచౌరభయం చైవాప్యన్యే దుష్టగ్రహా అపి. 21 భస్మస్నానేన నశ్యంతి సింమేనేవ యథా గజాః | శుద్ధశీతజలేనైవ భస్మనా చ త్రిపుండ్రకమ్. 22 యోథారయే త్పరం బ్రహ్మ స ప్రోప్నోతి న సంశయః | భస్మనాచ త్రిపుండ్రం చ యః కోపిధారయేత్పరమ్. శరీరమునిండ భస్మము పూసికొన్నవానిని చూచి యెవడు భక్తితో నిలుచుండునో అట్లు నిలుచున్న వాని కింద్రుడు దండప్రణామము లాచరించును. నారదా! భస్మము పూసికొన్నవారు తినరానివి తినినప్పటికిని వారి కవి భక్ష్యములే యగును. సందేహము లేదు. బ్రహ్మచారి గాని గృస్థుడుగాని వానప్రస్థుడుగాని మొదట భస్మస్నాన మొనరించి తర్వాత జలస్నానము చేసినచో అతడు పాపముక్తుడై బ్రహ్మభూయత్వ మొందును. భస్మముతో ఆగ్నేయ స్నానము యతులకు ముఖ్యముగ చేయదగినది. జలస్నానము కన్న భస్మస్నానము గొప్పది. ఏలన జలస్నానము ప్రకృతి సంబంధము గలది. భస్మస్నానము బంధనములు తెగద్రెంచునది. ప్రకృతి బంధనములు విడివడుటకే భస్మస్నానము విధింపబడినది. నారదా! అటువంటి భస్మమునకు సాటియైన దీముల్లోకములం దింకొకటి యేదియును లేదు. పూర్వము దీనిని రక్షకు - భద్ర తకు - పవిత్రతకు దేవతలు ధరించిరి. పూర్వము శివుడు దీనిని శివప్రియయగు తన పార్వతి కొసంగెను. కనుక ఆగ్నేయ భస్మముతో శిరఃస్నాన మాచరించువాడు మృత్యుభయదపాశములనుండి ముక్తుడై శివలోకమున మహిమలు గనును. అన్ని జ్వరములు - కుష్ఠు - గుల్మము - భగందరము - ఎనుబదివాత రోగములు - రాక్షస పిశాచములు - పూతన అరువదినాల్గు పిత్తరోగములు ముప్పదిరెండి శ్లేష్మరోగములు - పులి - దొంగలు - వీనివలని భయమును - దుష్టగ్రహములు - రోగములు ఈ భస్మస్నామున నశించును. ఎట్లన సింహమును చూచినంతనే గజము నశించును గదా ! స బ్రహ్మలో మాప్నోతి ముక్తపాపో న సంశయః | యథావిధి లలాటే వై వహ్నివీర్య ప్రధారణాత్. 23 నాశ##యేల్లిఖితాం యామీం లాలటస్థాం లిపిం ధ్రువమ్ | కంఠోవరి కృతం పాపం నాశ##యే త్తత్ర్ప ధారణాత్. 24 కంఠే చ ధారణాత్కంఠ భోగాది కృత పాతకమ్ | బాహ్వోర్బాహు కృతం పాపం వక్షసా మనసా కృతమ్. 25 నాభ్యాం శిశ్నకృతం పాపం గుదే గుదకృతం హరేత్ | పార్శ్వయోర్ధారణా ద్ర్బహ్మన్పరస్త్య్రా లింగనాదికమ్. 26 తద్బస్మ ధారణం శస్తం సర్వత్రైవ త్రిలింగకమ్ | బ్రహ్మ విష్ణు మహేశానాం త్రయగ్నీనాం చ ధారణమ్. 27 గుణలోక త్రయాణాం చధారణం తేన వైకృతమ్ | భస్మచ్చన్నో ద్విజో విద్యా న్మహాపాతకసంభ##వైః. 28 దోషైర్వియుజ్యతే సద్యో ముచ్యతే చ న సంశయః | భస్మనిష్ఠస్య దహ్యంతే దోషా భస్మాగ్ని సంగమాత్. 29 భస్మస్నాన విశుద్ధాత్మా ఆత్మనిష్ఠ ఇతి స్మృతః | భస్మనా దిగ్ధసర్వాంగో భస్మదీప్త త్రిపుండ్రకః. 30 భస్మశాయీ చ పురుషో భస్మనిష్ఠ ఇతి స్మృతః | భూతప్రేత పిశాచాద్యా రోగాశ్చాతీవ దుఃసహాః. 31 భస్మనిష్ఠస్య సాన్నిధ్యా ద్విద్రవంతి న సంశయః | భాసనా ద్బసితం ప్రోక్తం భస్మ కల్మషభక్షణాత్. 32 భూతి ర్బూతికరీ పుంసాం రక్షా రక్షా కరీ పురా | త్రిపుండ్రం ధారణం దృష్ట్వా భూతప్రేత పురః సరాః. 33 భీతాః ప్రకంపితాః శీఘ్రం నశ్యంత్యేవ న సంశయః | స్మరణా దేవ రుద్రస్య యథా పాపం ప్రణశ్యతి. 34 చల్లని నీటితో భస్మము త్రిపుండ్రములు ధరించినవాడు బ్రహ్మత్వ మొందును. సందియము లేదు. అతడు పాపముక్తుడై బ్రహ్మలోకము చేరగలడు. యథావిధిగ నొసట భస్మధారణము చేసినవాడు తన నొసట నున్న మృత్యురేఖలను తొలగించి వేయగలడు. కంఠముపైని భస్మము పూసినచో కంఠమున జరిగిన పాపాలు తొలగును. కంఠమందు దాల్చినచో కంఠభోగముల వలని పాపము నశించును. బాహువులందు దాల్చినచో బామువులు చేసిన పాపమును ఱొమ్మున దాల్చిన మనసులోని పాపాలు నశించును. బొడ్డున భస్మము పూసికొన్నచో సంభోగమున గల్గిన పాపమును గుదమున దాల్చిన గుదపాపములును ప్రక్కలకు పూసికొనిన పరస్త్రీలను కౌగిలించుకొన్న పాపాలును తొలగును. త్రిపుండ్ర విభూతి రేఖలు త్రిమూర్తులు - బ్రహ్మ విష్ణు మహేశులు - త్రేతాగ్నులు. కనుక భస్మధారణము ప్రశస్తమైనది. త్రిపుండ్ర ధారణమున త్రిగునములు - త్రిలోకములు ధరించినట్లగును. భస్మముతో వెలుగొందు ద్విజుడు విద్వాంసు డగును. అతడు మహాపాతకముల నుండి దోషములనుండి వెంటనే ముక్తు డగును. ఇది నిజము. ఏలన భస్మధారణము చేయువాని దోషము లగ్నితోడి సంబంధమున తొలగిపోగలవు. భస్మస్నానమున శుద్ధుడైనవా డాత్మనిష్ఠు డనబరగును. ఎవని శరీరము భస్మముతో నిండి శోభిల్లునో ఎవని త్రిపుండ్రములు భస్మకాంతితో వెల్గునో ఎవ్వడు భస్మముపైనే శయనించునో అతడు భస్మనిష్ణుడన ప్రసిద్ధి గాంచును. సహించరాని భూత - ప్రేత - పిశాచములును దీర్ఘరోగములును భస్మనిష్ఠుని చెంతనుండి దూరముగ పరుగెత్తును. సందియము లేదు. బ్రహ్మను భాసింపచేయునది కనుక భసితమనియును పాపములను భస్మము చేయుటవలన భస్మమనియు అణిమాది విభూతులు కల్గించున దగుట విలన విభూతియనియు రక్షించున దగుట వలన రక్షయనియు నందురు. త్రిపుండ్ర ములు ధరించినర వానిని చూచి భూతప్రేతములు మున్నగునవి గడగడలాడును. అవి వెంటనే తప్పక, నశించును. ఎట్లనగ రుద్రుని పేరు స్మరించినంతనే పాపరాసులు పటాపంచలగును గదా! అప్యకార్య సహస్రాణి కృత్వా యః స్నాతి భస్మనా | తత్సర్వం దహతే భస్మ యథా గ్ని స్తేజసా వనమ్. 35 కృత్వాపి చాతులం పాపం మృత్యుకాలే೭పి యో ద్విజః | భస్మస్నాయీ భ##వేత్కశ్చి త్షిప్రంపాపైః ప్రముచ్యతే. 36 భస్మస్నానాద్థి శుద్దాత్మా జితక్రోధో జితేంద్రియః | మత్సమీపం సమాగమ్య న సభూయో೭ భి వర్తతే. 37 వనస్పతి గతే సోమే భస్మోద్దూళిత విగ్రహః | అర్చితం శంకరం దృష్ట్వా సర్వపాపైః ప్రముచ్యతే. 38 ఆయుష్కామో೭ థవా విద్యా న్బూతి కామోథవా నరః | నిత్యంవై ధారయేద్బస్మ మోక్షకామీ చ వై ద్విజః. 39 త్రిపుండ్రం పరమం పుణ్యం బ్రహ్మవిష్ణు శివాత్మకమ్ | యే ఘోరా రాక్షసాః ప్రేతాయే చాన్యే క్షుద్రజంతవః. 40 త్రిపుండ్రధారిణం దృష్ట్వా పలియంతే న సంశయః | కృత్వా శౌచాదికం కర్మ స్నాత్వా తు విమలే జలే. 41 భస్మనోద్దూలనం కార్యమాపాదతలమస్తకమ్ | కేవలం వారుణం స్నానం దేహేబాహ్య మలాపహమ్. 42 విభూతిస్నాన మనఘం బాహ్యాంతర మలాపహమ్ | త్యక్త్వా ೭ పీ వారుణం స్నానం తత్పర ః స్యాన్న సంశయః. 43 కృతమ వ్యకృతం సత్యం భస్మస్నానం వినా మునే | భస్మస్నానం శ్రుతిప్రోక్త మాగ్నేయం స్నాన ముచ్యతే. 44 చేయరాని పననులు వేలకొలదిగ చేసినను భస్మస్నానమున నవన్నియును కాలిపోవును. ఎట్లన అగ్ని తన తేజముతో వనములనున గాల్చివేయును గదా ! విపరీతముగ పాపములేన్ని చేసినప్పటికిని చివరి కాలమున భస్మస్నానము చేసినచో నతని పాపము లన్నియునున వెంటనే నశించగలవు. అటువంటి భస్నస్నానము వలన మానవుడు శుద్దాత్మునడు-జితక్రోధుడు జితేంద్రియుడు గాగలడు. అతడు నా సన్నిధి కేతెంచెను. మరల పుట్టడు. చంద్రుని పదునైదు కళలు నమావాస్యనాడు సూర్యునిలో లీన మగును. అమావాస్యనాడు మేనినిండ భస్మము పూసికొని పూజితుడైన శంకరుని చూచినవాడు సర్వపాప ముక్తుడగును. చిరాయువు-సిరిసంపదలు-మోక్ష లక్ష్మి యనువానిని కోకు ద్విజుడు నిత్యమును భస్మధారణము చేయవలయును. త్రిపుండ్రములు-బ్రహ్మవిష్ణుశివాత్మకములు-పరమ పుణ్యములు నగును. ఘోర రాక్షసులు-ప్రేతములు-క్షుద్ర జంతువులును త్రిపుండ్రధారిని గాంచి పురుగెత్తిపోవును. సందేహము లేదు. మానవుడు దేహబాధ తీర్చుకొని పవిత్రజలములో గ్రుంకి పాదములనుండి తలవఱకు భస్మము ధరించవలయును. కేవలము జలస్నానము చేసినచో నొడలి మురికి మాత్రమే తొలగును. విభూతి స్నానము పాపహరము. బైటి-లోని దోషాలు పాపును. కనుక జలస్నానము చేసిన చేయకున్నను భస్మస్నానము తప్పక చేయవలయును. నారదా ! భస్మస్నానము చేయక చేసిన పనులు చేయనట్లే యగును. ఏలన భస్మస్నానము వేదప్రోక్తము-ఆగ్నేయస్నాన మనబరగును. అంతర్బహిశ్చ సంశుద్దం శివపూజా ఫలం లభేత్ | యద్బాహ్యామల మాత్రస్య నాశకం స్నాన మస్తి తత్. 45 తన్నాశయతి తీవ్రేణ ప్రాణిబాహ్యాంతరం మలమ్ | కృత్వా ೭ పి కోటిశో నిత్యం వారుణం స్నాన మాదరాత్. 46 న భవత్యేవ పూతాత్మా భస్మస్నానం వినా మునే | యద్బస్య స్నానమాహాత్మ్యాం తద్వేదో వేద తత్త్వతః. 47 యద్వా వేద మహాదేవః సర్వదేవశిఖామణిః | భస్మస్నాన మకృత్తైవ యః కుర్యా త్కర్మ వైదికమ్. 48 స తత్క ర్మకలార్దార్ద మపినాప్నోతి వస్తుతః | యః కరిష్యతి యత్నేన భస్మస్నానం యథావిధి. 49 స ఏకైకః సర్వకర్మ స్వధికారీ శ్రుతిశ్రుతః | సావనం పావనానాం చ భస్మస్నానం శ్రుతిశ్రుతమ్. 50 న కరిష్యతి యో మోహాత్స మహాపాతకీ భ##వేత్ | అనంతై ర్వారుణౖః స్నానైర్యత్పుణ్యం ప్రాప్యతే ద్విజైః. 51 తతో೭నంత గుణం పుణ్యం భస్మస్నానా దవాప్యతే | కాలత్రయే ೭ పి కర్తవ్యం భస్మస్నానం ప్రయత్నతః. 52 భస్మస్నానం స్మృతం శ్రౌతం తత్త్యాగీ పతితో భ##వేత | మూత్రాద్యుత్సర్జనాంతే తు భస్మస్నానం ప్రయత్నతః. 53 కర్తవ్య మన్యథాత పూతా న భవిష్యంతి మానవాః | విధివత్కృతశౌచో ೭ పి భస్మస్నానం వినా ద్విజః. 54 న భవిష్యతి పూతాత్మా నాధికార్యపి కర్మణి | అపానవాయు నిర్యాతే జృంభ##ణ స్కందనే క్షుతే. 55 శ్లేష్మోద్గారే ೭ పి కర్తవ్యం భస్మస్నానం ప్రయత్నతః | శ్రీభస్మస్నాన మహత్మ్యస్త్యెక దేశో ೭ త్ర వర్ణితః. 56 పున శ్చ సంప్రక్ష్యామి భస్మస్నానోత్థితం ఫలమ్ | సావధానేన మనసా శ్రోతవ్యం మునిపుంగవ. 57 ఇతి శ్రీదేవి భాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే చతుర్దశో ೭ ధ్యాయః. లోన-బైట పవిత్రుడైనవానికి శివపూజా ఫలితము లభించును. బైటి మురికిని బోగొట్టునది జలస్నానమే యగును. కాని భస్మస్నానము మానవునిలోని-బైటి పాపములను కడిగివేయును. ప్రతిదినము కోట్లసార్లు జలస్నానము చేసినను నరుడు భస్నస్నానము చేయనిచో పవిత్రుడు గాజాలడు. అట్టి భస్నస్నాన మహత్మ్యము కేవలము వెదమునకే తెలియును. లేక సర్వ దేవతలకు తల మానికమైన మహాదేవునకు తెలియును. అట్టి భస్మస్నానము చేయక ఎవడు వైదిక కర్మ చేయునో వాడు కర్మలోని సగము ఫలము గూడ బడయజాలడు. కనుక ఎవడు ప్రయత్నించి భస్మస్నాన మొనరించునో అతడొక్కడే సర్వకర్మల కధికారి. ఆ భస్మస్నానమే పావనములును పావనములుగ జేయజాలునని వేదశాస్త్రములందు వక్కాణింపబడినది. ఎవడు మోహముతో భస్మస్నాము చేయదగినది. యతడు మహాపాపి. అనంతమైన పవిత్ర జలస్నానములవలన ద్విజు డెంతటి పుణ్యము బొందునో ఇక్క భస్మస్నానము వలన నడ డంతటి పుణ్యమనంతముగ బడయుగలడు. కనుక మూడుకాలము లందును ప్రయత్నించి భస్మస్నానము చేయదగినది. భస్మసాన్నము-శ్రౌతకర్మ. దానిని వదిలినవాడు పతితు డగును. మూత్రము మన్నగునవి వదిలిన పిమ్మట తప్పక భస్మస్నాన మాచిరించవలయును. లేనిచో మానవులు పవిత్రులు గాజాలరు. యథావిధిగశౌచక్రియ జరిపినప్పటికిని ద్విజుడు భస్మస్నాన మాచరించవలయును. లేనిచో మానవులు ఎట్టి కర్మకు నధికారి కాజాలడు. అపానవాయుడు-అవులింత-తుమ్ము-దగ్గు-ఉమియుట-ఇవి గల్గినపుడు ప్రయత్నించి భస్మస్నాన మొనర్పవలయును. ఇంతవఱకు నీకు భస్మస్నాన మహాత్మ్యములోని యొక్కయంశము మాత్రమే తెల్పితిని. భస్మస్నానము వలని ఫలిత మింకను వివరింతును. మునివరా! సావధానముగ చెవికి రసాయనముగ నాలింపుము. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ఏకాదశ స్కంధమున పదునాల్గవ యధ్యాయము.