Sri Devi Bagavatham-2
Chapters
అథ వింశో7ధ్యాయః. శ్రీనారాయణ ఉవాచ: ద్విరాచమ్య ద్విజః పూర్వం ద్విర్మార్జన
మథాచరేత్ | ఉపస్పృశే
త్సవ్యపాణిం పాదౌ చ ప్రోక్షయే త్తతః. 1 శిరసి చక్షుషి తథా నాసాయాం శ్రోత్రదేశ##కే | హృదయే చ తథా మౌళౌ ప్రోక్షణం సమ్యగాచరేత్.
2 దేశకాలౌ సముచ్చార్య బ్రహ్మయజ్ఞ మథాచరేత్ | ద్వౌ దర్బౌ దక్షిణ హస్తే వామే త్రీ నాసనే సకృత్.
3 ఉపవీతే శిఖాయాంచ పాదమూలే సకృత్సకృత్ | విముక్తయే సర్వపాపక్షయార్థం చైవమేవ హి.
4 సూత్రోక్త దేవతాప్రీత్యై బ్రహ్మయజ్ఞం కరోమ్యహమ్ | గాయత్రీం త్రిర్జపే త్పూర్వం చాగ్నిమీళే తతః పరమ్.
5 యదంగేతి తతః ప్రోచ్య అగ్నిర్వై ఇతి కీర్తయేత్ | అథ మహావ్రతం చైవ పంథా ఏతచ్చ కీర్తయేత్.
6 ఆథాతః సంహితాయాశ్చ విదా మఘవదిత్యపి | మహావ్రతస్యేతి తథా ఇషే త్వోర్జే ఇతీవ హి.
7 అగ్న ఆయాహి చేత్యేవం శన్నో దేవీరితీతి చ | అథై తస్య సమామ్నాయో వృద్దిదాదై జితీవ హి. 8 అథ శిక్షాం ప్రవక్ష్యామి పంచసంపత్సరేతి చ | మయరస తజ భ##నేత్యేవ గ్లౌర్గ్మా ఇత్యేవకీర్తయేత్.
9 అథా తో థర్మజిజ్ఞాసా అథా తో బ్రహ్మ ఇత్యపి | తచ్ఛంయో రితి చ ప్రోచ్య బ్రహ్మేణ నమ ఇత్యపి.
10 తర్పణం చైవ దేవానాం తతః కుర్యాత్ర్ప దక్షిణామ్ | ప్రజాపతి శ్చ బ్రహ్మా చ వేదా దేవా స్తథర్షయః.
11 ఇరువదవ అధ్యాయము బ్రహ్మయజ్ఞ విధానము శ్రీనారాయణు డిట్లనెను: ద్విజులు మొట్టమొదట ముమ్మా రాచమించి రెండుమార్లు మార్జనము చేసికొనవలయును. కుడిచేయి కడుగుకొని పోదములపై నీళ్లు చల్లుకొనవలయువయును పిదప శిరము-కన్నులు-ముక్కులు-చెవులు-హృదయము-తల వీనిని నీటితో ప్రోక్షించవలయును. దేశకాలములు చెప్పి బ్రహ్మయజ్ఞ మాచరించవలయును. కుడిచేతి రెండు నెడమచేత మూడు ఆసనమున నొకటియు జందెమున శిఖయందు పాదమూలమందు నొక్కొక్కటి చొప్పున దర్బ లుంచవలయును. ఇట్లు సర్వపాప నివృత్తికి ముక్తికి నాచరించవలయును. సూత్రమందు చెప్పబడిన దేవతా ప్రీతికి బ్రహ్మయజ్ఞము చేయుచున్నానని సంకల్పించవలయును. మొదట మూడుమార్లు గాయత్రిని జపించి తర్వాత "అగ్నిమీళే" మంత్ర ముచ్చరించ వలయును. తరువాత "యదంగ" "అగ్నిర్వై" మంత్రములు మహావ్రతం-పంథా ఏతచ్చ-చెప్పవలయును. ఆ తర్వాత అథాతః సంహితాయాః "విదామఘవత్" ''మహావ్రతస్య'' ''ఇషేత్వోర్జే త్వా'' ''అగ్నఅయాహి'' ''శంనోదేవీ'' అను మంత్రములను అథైతస్య-సమామ్నాయః- వృద్ధి రాదైచ్ అథశిక్షాం ప్రపక్ష్యామి పంచ సంవత్సరమయం మయరతజతభనలగ గౌర్‌గ్లా అనియు నుచ్చరించవలయును. ఆ పిమ్మటం ''ఆథాతో ధర్మజిజ్ఞాసా'' ''అథాదో బ్రహ్మజిజ్ఞాసా'' ''తచ్చంయో'' ''నమో బ్రహ్మణ'' మంత్రము లుచ్చరించవలయును. తర్వాత దేవతలకు తర్పణమును ప్రదక్షిణమును చేయవలయును. ప్రజాపతి-బ్రహ్మ-వేదములు-దేవతలు-ఋషులు- సర్వాణి చైవ చ్ఛందాంసి తథోంకారస్త థైవచ | వషట్కారో వ్యాహృతయః సావిత్రీ చ తతః పరమ్.
12 గాయత్రీ చైవ యజ్ఞా శ్చ ద్యావాపృథివీ ఇత్యపి | అంతరిక్షం త్వహోరాత్రాణి చ సాంఖ్యా అతః పరమ్.
13 సిద్ధాః సముద్రా నద్య శ్చ గిరియశ్చ తతః పరమ్ | క్షేత్రౌషధివనస్పత్యో గంధర్వాప్సరస స్తథా.
14 నాగా వయాంసి గావశ్చ సాధ్యా విప్రా స్తథైవ చ | యక్షా రక్షాంసి భూతానీ త్యేవ మంతాని కీర్తయేత్.
15 అథో నివీతీ భూత్వా చ ఋషీ న్సంతర్పయే దపి | శతర్చితో మాధ్యమాశ్చ గృత్స మద స్తథైవ చ.
16 విశ్వామిత్రో వామదేవో7త్రి ర్బరద్వాజ ఏవ చ | వసిష్ఠ శ్చ ప్రగాథశ్చ పావమాన్య స్తతః పరమ్.
17 క్షుద్రసూక్తా మహాసూక్తా సనకశ్చ సనందనః | సనాతన స్తథైవా7త్ర సనత్కుమార ఏవచ.
18 కపిలాసురినామానౌ వోహలిః పంచశీర్షకః | ప్రాచీనావీతినా తచ్చ కర్తవ్య మథ తర్పణమ్.
19 సుమంతు ర్జైమిని ర్వైశంపాయనః పైలసూత్రయుక్ | భాష్యభారత పూర్వం చ మహాభారత ఇత్యపి.
20 ధర్మాచార్యా ఇమే సర్వే తృప్యంత్వితి చ కీర్తయేత్ | జానంతి బాహవిగార్గ్యగౌ తమాశ్చైవ శాకలః.
21 బాభ్రవ్య మాండవ్యయుతో మాండూకేయ స్తతః పరమ్ | గార్గీ వాచక్నవీ చైవ బడబా ప్రాతిథేయికా.
22 అన్ని చంధములు-ఓంకారము-వషట్కారము-వ్యాహృతులు సావిత్రి-గాయత్రి-యజ్ఞములు-దివిభువులు-అంత రిక్షము-అహోరాత్రములు-సాంఖ్యము-సిద్ధులు-సముద్రాలు-నదులు-గిరులు-ఓషధులు-వనస్పతులు-గంధర్వులు-అప్సరసలు-నాగులు-పక్షులు-గోవులు-విప్రులు-సాధులు-యక్ష-రాక్షసులు-భూతములు-మున్నుగు వానిని పేర్కొని తర్పణము చేయవలయును. తర్వాత జందెము తావళముగ వేసికొని ఋషి తర్పణ మాచరించవలయును. శతర్చిత-మధ్యమ-గత్స్న మద-విశ్వామిత్ర-వామదేవాత్రి-భరద్వాజ-వసిష్ట-ప్రగాథ-పావమాన్య-క్షుద్రసూర్త-మహాసూక్త-సనకన-సనందన-సనాతన-సనత్కుమార-కపిలాసురి-వోహలి-పంచశీర్ష ఋషులకు తర్పణ మాచరించవలయును. తర్వాత ప్రాచీనావీతిగ పితరులకు తర్పణ మొనరించవలయును. సుమంతుడు-జైమిని-వైశంపాయనుడు-పైల-సూత్రభాష్య-భారత-మహాభారత-ధర్మాచార్యులు మొదలగువారు తృప్తి చెంద తర్పణ మీయవలెను. జానంతి-బాహవి-గార్గ్య-గౌతమ-శాకల-బాభ్రవ-మాండవ్య-మాండూకేయ ఋషులకు తర్పణ మీయవలెను. తర్వాత గార్గి-వాచక్నవి-బడబ-ప్రాతిథేయిలకు- సులభాయుక్తమైత్రేయీ కహోలశ్చ తతః పరమ్ | కౌషీతక మ్మహాకౌషీతకం వై తర్పయే త్తతః 23 భారద్వాజం చ పైంగ్యం చ మహాపైంగ్యం సుయజ్ఞకమ్ | సాంఖ్యాయన మైతరేయం మహైతరేయ మేవచ. 24 బాష్కలం శాకలం చైవ సుజాతవక్త్ర మేవచ | ఔదవాహిం చ సౌజామిం శౌనకం చాశ్వలాయనమ్. 25 యే చాన్యే సర్వా ఆచార్యా స్తే సర్వే తృప్తి మాప్నుయుః | యే కే చాస్మత్కులే జాతా అపుత్రా గోత్రిణో మృతాః.
26 తే గృహ్ణంతు మయాదత్తం వస్త్రనిష్పీడనోదకమ్ | ఏవం తే బ్రహ్మయజ్ఞస్య విధి రుక్తో మహామునే. 27 యశ్చాం యం కురుతే బ్రహ్మయజ్ఞస్య విధిముత్తమమ్ | సర్వ వేదాంగపాఠస్య ఫలమాప్నోతి సాధకః. 28 వైశ్వదేవం తతః కుర్యా న్నిత్యశ్రాద్ధం తథైవ చ | అతిథిభ్యో7న్నదానం చ నిత్యమేవ సమాచరేత్. 29 గోగ్రాసం చ తతో దత్వా భుంజీత బ్రాహ్మణౖః సహ | అహ్న స్తు పంచమే భాగే ప్రకుర్యాదేత దుత్తమమ్. 30 ఇతిహాస పురాణాద్యైః షష్ఠ సప్తమకౌ నయేత్ | అష్టమే లోకయాత్రా తు బహిః సంధ్యాం తతః పునః. 31 అథ సాయంతనీం సంధ్యాం ప్రవక్ష్యామి మహామునే | యదనుష్ఠాన మాత్రేణ మహామాయా ప్రసీదతి. 32 ఆచమ్య ప్రాణానాయష్యు సాధకః స్థిరమానసః | బద్ధ పద్మాసనో యోగీ సాయంకాలే స్థిరో భ##వేత్. 33 సులభ-మైత్రేయిలకు-కహోల-కౌషీతక-మహా కౌషీతక-ఋషులకు తర్పణ మొనరించవలయును. భారద్వాజుడు - పైంగ్యుడు - మహా పైంగ్యుడు - సుయజ్ఞకుడు - సాంఖ్యాయనుడు - ఐతరేయుడు - మహైతరేయుడు - బాష్కలుడు - శాకలుడు - సుజాత వక్త్రుడు - ఔదవాహి - సౌజామి - శౌనకాశ్వలాయనులు - ఇంకను మిగిలిన యాచార్యులందఱును తృప్తి జెందగ తర్పణ మాచరించవలయును. నా కులములో బుట్టి సంతులేక కాలము చసిన నా వంశమందలి వారెల్లరును నే నొసంగునట్టి వస్త్రనిష్పీడన జలమును గ్రహింతురు గాక. మహామునీ! ఈ విధముగ నీకు బ్రహ్మయజ విధానము తెల్పితిని. ఈ బ్రహ్మయజ్ఞ ముత్తమమైనది. దీన నాచరించినవాడు సర్వ వేదాంగములు చదివిన ఫలము బొందును. దీని తర్వాత సాధకుడు వైశ్వదేవ మాచరింతి నిత్యశ్రాద్ధ మాచరించవలయును. ప్రతిదిన మతిథుల కన్నము పెట్టుట ముఖ్యముగ నాచరించవలయును. పిమ్మట గోవులకు మేతవేసి బ్రాహ్మణులను గూడి భుజించవలయును. ఈ యుత్తమ కార్యము లన్నియును దినములో నైదవ భాగము నందు జరుపవలయును. దినములోని యారవ - యేడవ భాగముల నితిహాస పురాణములు చదువవలయును. ఎనిమిదవ భాగమున లౌకిక నిర్వహించవలయును. పిదప బైట సంధ్యావందన మాచరించవలయును. మునీ! ఇపుడు సాయం సంధ్యను తెల్పుచున్నాను వినుము. దాని నాచరించుట వలమ మహామాయాదేవి ప్రసన్నురా లగును. సాధకుడాచ మించి ప్రాణాయామ మొనర్చి నిశ్చలచిత్తముతో పద్మాసనమున సాయంకాలమున తిరముగ గూర్చొనవలయును. శ్రుతిస్మృత్యాదికర్మాదౌ సగర్బః ప్రాణసంయమః | ఆగర్బో ధ్యానమాత్రం తు సచామంత్రః ప్రకీర్తితః.
34 భూతశుద్ద్యాధికం కృత్వా నాన్యథా కర్మకీర్తితమ్ | సలక్షో దేవతాం ధ్యాత్వా పూరకుంభకరేచకైః.
35 ధ్యానం ప్రకుర్యా త్సం ధ్యాయాం సాయంకాలే విచక్షణః | వృద్ధాం సరస్వతీం దేవీం కృష్ణాంగీం కృష్ణవాససామ్.
36 శంఖచక్ర గదాపద్మహస్తాం గరుడవాహనమ్ | నానారత్నలసద్బూషా క్వణన్మంజీరమేఖలామ్.
37 అనర్ఘ్యరత్నముకుటాం తారహారావళీయుతామ్ | తాటంకబద్ధమాణిక్య కాంతిశోభి కపోలకామ్.
38 పీతాంబరధరాం దేవీం సచ్చిదానందరూపిణీమ్ | సామవేదేన సహితాం సంయుతాం సత్త్వవర్త్మనా.
39 వ్యవస్థితాం చ స్వర్లోకే ఆదిత్యపథగామినీమ్ | ఆవాహయామ్యహం దేవీ మాయాంతీం సూర్యమండలాత్.
40 ఏవం ధ్యాత్వా చ తాం దేవీం సంధ్యాసంకల్ప మాచరేత్ | ఆపోహిష్ఠేతి మంత్రేణ అగ్ని శ్చేతి తథైవ చ.
41 విదధ్యా దాచమనకం శేషం పూర్వవ దీరితం | గాయత్రీ మంత్రముచ్చార్య శ్రీనారాయణ ప్రీతయే.
42 అర్ఘ్యం దద్యా చ్చ సూర్యాయ సాధకః శుద్ధమానసః | ఉభౌ పాదౌ సమౌ కృత్వా జలాంజలిమ్.
43 దేవం ద్యాత్వా మండలస్థం క్షిపేదర్ఘ్యం తతః క్రమాత్ | అర్ఘ్యం దద్యాత్తు యో నీరే మూఢాత్మా జ్ఞాన పర్జితః.
44 శ్రుతి-స్మృతికర్మలందు సగర్బ ప్రాణాయామ మొనరించవలయును. ధ్యానమునందు ఆగర్బ ప్రాణాయామ మాచరించవలయును. అది అమంత్రక మనబరగును. భూతశుద్ధి మొదలగునవి జరిపిన తర్వాత కర్మ లాచరించవలయును. రేచక-కుంభక-పూరకములు చేసి తన యిష్టదేవతను ధ్యానించవలయును. పిదప సాధకుడు సాయం సంధ్యాదేవి నీ రీతిగ ధ్యానము చేయవలయును. కృష్మాంగములు - కృష్ణ వస్త్రములు దాల్చిన వృద్ధ - సరస్వతీదేవి - గరుడవాహన - శంఖచక్రగదా పద్మహస్త - నానా రత్నభూషణభూషిత - మంజీరమేఖల రవళించగా ఎనలేని రతనాల కిరీటము ప్రకాశింపగ - తారహారావళితో తాటంక - మాణిక్య కాంతులతో నునులే చెక్కు టద్దములతో ప్రకాశించు దేవి - పీతాంబరధారిణి - సచ్చిదానంద స్వరూపిణి - సామగానలోల - సత్యమార్గగామిని - స్వర్లోక నివాసిని - రవిమార్గగామిని - యై సూర్యమండలమునందుండి భువికి దిగి వచ్చు సంధ్యా దేవి నావామనము చేయుచున్నాను. ఇట్లు సంధ్యాదేవిని ధ్యానించి సంధ్యావందన సంకల్ప మాచరించవలయును. ''ఆసెహిష్ఠామ'' ''అగ్నిశ్చ'' మంత్రములు చదువవలయును. మిగిలిన దంతయును పూర్వమువలె నాచరించవలయును. శ్రీనారాయణ ప్రీతికి గాయత్రీ మంత్ర ముచ్కరించి సాధకుడు విశుద్ధచిత్తముతో సూర్యున కర్ఘ్య మీయవలయును. రెండు పాదములు సమముగ నుంచి దోసిట నీరు తీసికొని సూర్యమండలమందలి దేవిని ధ్యానించి వరుసగ నర్ఘ్య మీయవలయును. మూఢుడై తెలివిమాలి నీట నర్ఘ్య మిచ్చినవాడు జ్ఞానహీనుడు. ఉల్లంఘ్య స్మృతి మంత్రాం శ్చ ప్రాయశ్చిత్తీ భ##వేద్ద్విజః | తతః సూర్య ముపస్థాయా ప్యసావాదిత్య మంత్రతః.
45 గాయత్ర్యా శ్చ జపం కుర్యాదుపవిశ్యతతో బృసీమ్ | సహస్రం వా తదర్ధం వా శ్రీదేవీధ్యాన పూర్వకమ్.
46 యథా ప్రాతః పున స్తద్వ దుపస్థానాదికం చరేత్ | సాయం సంధ్యాతర్పణ చ క్రమేణ పరికీర్తయేత్.
47 వసిష్ఠ ఋషి రేవా೭త్ర సరస్వత్యాః ప్రకీర్తితః | దేవతా విష్ణురూపా సా ఛందశ్చైవ సరస్వతీ.
48 సాయంకాలీనసంధ్యాయాస్తర్పణ వినియోగకః | స్వరిత్యుక్త్వా చ పురుషం సామవేదం తథైవ చ.
49 మండలం చేతి సంప్రోచ్య హిరణ్యగర్బకం తథా | తథైవ పరమాత్మానం తతో పి చర సరస్వతీమ్.
50 వేదమాతరమేవాత్ర సాంకృతిం తద్వదేవ చ | సంధ్యాం వృద్ధాం తథా విష్ణురూపిణీ ముషసీం తథా.
51 నిమృజాం చ తథా సర్వసిద్ధీనాం కారిణాం తథా | సర్వమంత్రాధిపతికాం భూర్బువః స్వశ్చ పూరుషమ్.
52 ఇత్యేవం తర్పణం కార్యం సంధ్యాయాః శ్రుతిసమ్మతమ్ | సాయం సంధ్యావిధానం చ కథితం పాపనాశనమ్.
53 సర్వదుఃఖహరం వ్యాధినాశకం మోక్షదం తథా | సదాచారేషు సంధ్యాయాః ప్రాధాన్యం మునిపుంగవ.
54 సంధ్యాచరణతో దేవీ భక్తాభీష్టం ప్రయచ్ఛతి | ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే వింశో೭ధ్యాయః. స్మృతి మంత్రములు పాటించని ద్విజుడు ప్రాయశ్చిత్త మొనరించుకొనవలయును. ''అసావాదిత్యో బ్రహ్మ'' మంత్రముతో సూర్యోపస్థాన మొనర్చివలయును. ఆసనమున గూర్చొని దేవినుద్ధేశించి వేయిగాని - ఐదువందలుగాని - జపము చేయవలయును. ఉదయమున చేసినట్లుగ సూర్యోపస్థానము మున్నగునవి యాచరించవలయును. పిదప సాయం సంధ్యాంగ తర్పణ మొనర్చివలయును. ఈ సాయం సంధ్యాదేవి సరస్వతికి వసిష్ఠుడు ఋషి విష్ణువుదేవత సరస్వతి ఛందము. సాయం సంధ్యా తర్పణమున వినియోగము చేయవలయును. ''స్వః'' అని పురుషుడు సామవేదము మండలము హిరణ్యగర్బుడు పరమాత్మ సరస్వతి వేదమాత సాంకృతి - సంధ్య - వృద్ధ - విష్ణురూపిణి - ఉషసి - నిమృజ - సర్వ సిద్ధికారిణి - సర్వ మంత్రాధిపతిక - భూర్బువస్సువములు - పురుషుడు - ననువా రందఱికిని శ్రుతి సమ్మతముగ సంధ్యయందు తర్పణ మాచరించవలయును. ఇట్లు నీకు పాపహరమగు సాయం సంధ్యా విధానమును తెల్పితిని. మునిసత్తమా ! ఇది సర్వ దుఃఖహారము. వ్యాధి నాశకము - మోక్షప్రదము. సదాచారములందు సంధ్యావందనమునకు ప్రాధాన్యము గలదు. సంధ్యావందన మాచరించినవారి యెడల శ్రీదేవి సుప్రసన్నురా లగును. దేవి భక్తుల వాంఛితములు దీర్చును. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి పదునొకండవ స్కంధమున నిరువదవ యధ్యాయము.