Sri Devi Bagavatham-2
Chapters
అథ ద్వావింశో೭ధ్యాయః. శ్రీనారాయణ ఉవాచ : అథా తః శ్రూయతాం బ్రహ్మ న్వైశ్వదేవధానకమ్ |
పురశ్చర్యా ప్రసంగేన మమాపి స్మృతి మాగతమ్.
1 దేవయజ్ఞో బ్రహ్మయజ్ఞో భూతయజ్ఞ స్తథైవచ | పితృయజ్ఞో మనుష్యస్య యజ్ఞశ్చైవతు పంచమః.
2 పంచసూనా గృహస్థస్య చుల్లీ పేషణ్యుపస్కరః | కండణీ చోదకుంభ శ్చ తేషాం పాపస్య శాంతయే.
3 న చుల్ల్యాం నాయసే పాత్రే న భూమౌ న చ ఖర్పరే | వైశ్వదేవం ప్రకుర్వీత కుండే వా స్థండిలే೭పి వా. 4 న పాణినా న శూర్పేణ న చ మేధ్యాజినాదిభిః | ముఖే నోపధమే దగ్నిం ముఖాదేవ వ్యజాయత. 5 పటకేన భ##వే ద్వ్యాధిః శూర్పేణ ధననాశనమ్ | పాణినా మృత్యు మాప్నోతి కర్మసిద్ధి ర్ముఖేన తు. 6 ఫలై ర్దధిఘృతైః కుర్యా న్మూలశాకోదకాదిభిః | అలాభే యేన కేనాపి కాష్ఠమూలతృణాదిభిః. 7 జుహుయా త్సర్పిషాభ్యక్తం తౌలక్షారవివర్చితమ్ | దధ్యక్తం వా పాయసాక్తం తదాభావే೭ంభసా పివా. 8 శుషై#్కః పర్యుషితైః కుష్ఠీ ఉచ్చిష్టేన ద్విషాం వశీ | రూక్షై ర్దరిద్రతాం యాతి క్షారం హుత్వా వ్రజత్యధః,. 9 అంగారాన్బస్మమిశ్రాంస్తు నిర్హృత్యోత్తరతో೭నలాత్ | జుముయాద్వైశ్వదేవం తు న క్షారదివిమిశ్రితమ్. 10 అకృత్వా వైశ్వదేవం తు యో భుంక్తే మూఢధీర్ద్విజః | స మూఢో నరకం యాతి కాలసూత్ర మవాక్ఛిరాః.11 శాకం వా యది వా త్రకం మూలం వా యది వా ఫలమ్ | సంకల్పయే ద్యదాహారం తేనాగ్నౌ జుహుయా దపి. 12 ఆకృతే వైశ్వదేవే తు భిక్షౌ భిక్షార్థ మాగతే | ఉద్ధృత్య వైశ్వ దేవార్థం భిక్షాందత్త్వా విసర్జయేత్. 13 వైశ్వదేవ కృతం దోషం శక్తో భిక్షు ర్వ్యపోహితుమ్ | న తు భిక్షుకృతం దోషం వైశ్వదేవో వ్యపోహతి. 14 యతి శ్చ బ్రహ్మచారీ చ పక్వాన్నస్వామినావుభౌ | తయో ర్న మదత్త్వా తు భుక్త్వా చాంద్రాయణం చరేత్. 15 ఇరువదిరెండవ అధ్యాయము వైశ్వదేవ విధానము - ప్రాణాగ్ని హోత్రవిద్య శ్రీనారాయణ డిట్లనెను : బ్రాహ్మణోత్తమా ! ఇపుడు వైశ్వదేవ విధానము చెవుల పాపములు పోవ వినుము. పురశ్చరణ సందర్బమున నిదియును నాకు జ్ఞప్తికి వచ్చినది. దేవయజ్ఞము - బ్రహ్మ యజ్ఞము పితృయజ్ఞము - భూతయజ్ఞము - మనుష్యయజ్ఞము నని పంచ యజ్ఞములు గలవు. గృహస్థునకు పంచ పాతకములు గల్గును. ఊడ్చుట - పిసుకుట - అలుకుట - దంచుట - విసరుట యనెడు పనులందు క్రిములు పడి చచ్చును. కాన పాపశాంతి చేసికొనవలయును. ప్రొయ్యి - లోహపాత్ర - నేల ఖర్పరము మున్నగుచోట్ల వైశ్వదేవము చేయరాదు. అగ్నికుండమున లేక స్థండిలమున చేయవలయును. చేయి - చేట - జింకతోలు వీనితో నగ్నిని జ్వలింపజేయరాదు. నోటితో నూదవలయును. ఏలన నగ్ని నోటినుండియే యుద్బవించెను గదా. అగ్నిని వస్త్రముతో విసరిన వ్యాధియు చేటతో దారిద్ర్యమును చేతితో మృత్యువును నోటితో నూదిన కార్యసిద్ధియును గల్గును. అగ్నిలో ఫలములు - పెరుగు -నెయ్యి - కూరలు - గడ్డలు - లేనిచో కట్టెలు - వేళ్లు - గడి - ఉప్పు - నూనెకాక నెయ్యి - పెరుగు - పాలతో ఇవి దొరకనిచో కనీసము నీటితోనైన తడిపివేల్చవలయును. ఎండిన - పాసిన యున్నము వేల్చిన కుష్ఠరోగమును - ఎంగిలి వేల్చిన శత్రులకు వశుడు నగును. ఎండిన వస్తులవలన పేదఱికము నుప్పు వేల్చిన నరకమును గల్గును. పచనాగ్నిలో నుత్తరభాగము నుండిబూదిగప్పిన నిప్పును వైశ్వదేవమునకు తేవలయును. క్షారములు మున్నగునవి కలిసిన యగ్నితో వైశ్వదేవము చేయరాదు. వైశ్వదేవము చేయక తినుమూఢుడు కాలసూత్ర నరకమందు గూలును. కూరలు - దుంపలు - పత్రము - ఫలమువీనిలోనేదైన నగ్నిలో వేల్చి తర్వాత భుజించవలయును. వైశ్వదేవము చేయకముందే భిక్ష చేయవలసివచ్చినచో వైశ్వదేవభాగము వేరు గదీసి మిగిలినది భిక్షచేయవలయును. వైశ్వదేవము చేయని దోషమును భిక్షుకుడు తొలగించగలడు - కాని భిక్షుకునికి పెట్టని దోషమును వైశ్వదేవము తొలగించజాలదు. బ్రహ్మచారి - యతి వీరిర్వురును సిద్ధాన్నస్వాములు - వీరికి పెట్టక తినువాడు చాంద్రాయణ వ్రతమాచరించవలయును. వైశ్వదేవానంతరం చ గోగ్రాసం ప్రతి పాదయేత్ | తద్విధానం ప్రవక్ష్యామి శృణు దేవర్షి పూజిత. 16 సురభిర్వైష్ణవీ మాతా నిత్యం విష్ణుపదే స్థితా | గోగ్రాసం చ మయాదత్తం సురభే ప్రతిగృహ్యతామ్. 17 గోభ్య శ్చ నమ ఇత్యేవ పూజాం కృత్వా గవే೭ర్పయేత్ | గోగ్రాసేన తు గోమాతా సురభిః సంప్రసీదతి. 18 తతో గోదాహనం కాలం తిష్ఠేచ్చైవ గృహాంగణ | అతిథి ర్యత్ర భగ్నాశో గృహా త్ర్పతినివర్తతే. 19 స తసై#్మ దుష్కృతం దత్త్వా పుణ్య మాదాయ గచ్ఛతి | మాతా పితా గురు ర్బ్రాతా ప్రజా దాసః సమాశ్రితః. 20 అభ్యాగతో೭తిథి శ్చాగ్నిరేతే పోష్యా ఉదాహృతాః | ఏవం జ్ఞాత్వా తు యో మోహాన్న కరోతి గృహాశ్రమమ్. 21 తస్య నాయం తు న పరో లోకో భవతి ధర్మతః | యత్ఫలం సోమయాగేన ప్రాప్నోతి ధనవా న్ద్విజః. 22 సమ్యక్పంచ మహాయజ్ఞై ర్దరిద్రస్తేన చాప్నుయాత్ | అథ ప్రాణాగ్ని హోత్రం వక్ష్యామి తు మునిపుంగవః. 23 యద్ జ్ఞాత్వా ముచ్యతే జంతు ర్జన్మమృత్యుజరాదిభిః | పరిజ్ఞానేన ముచ్యంతే నరాః పాతక కిల్బిషైః. 24 విధినా భుజ్యతే యేన ముచ్యతే స ఋణత్రయాత్ | కులాన్యుద్ధరతే విప్రో నరకా నేక వింశతిమ్. 25 సర్వయజ్ఞ ఫలప్రాప్తిః సర్వలోకేషు గచ్చతి | హృత్పుండరీక మరణిర్మనో మంథాన సంజ్ఞకమ్. 26 వాయురజ్జ్వా మథేదగ్నిం చక్షురధ్వర్యు రేవ చ | తర్జనీ మధ్యమాంగుష్ఠైః ప్రాణసై#్యవాహుతిం క్షిపేత్. 27 మధ్యమానామికాంగుష్ఠై రుదానస్యాహుతిం క్షిపేత్ | కనిష్ఠానామికాంగుష్ఠై ర్వ్యానస్య తదనంతరమ్. 28 కనిష్ఠాతర్జన్యంగుష్ఠై రుదానస్యాహుతిం క్షిపేత్ | సర్వాంగుళైర్గృ హీత్వా న్నం సమానస్యాతిం క్షిపేత్. 29 స్వాహాంతా న్ర్పణవాద్యాం శ్చ నామ మంత్రాశ్చ వై పఠేత్ | ముఖే చాహవనీయ స్తు హృదయే గార్హపత్యకః. 30 వైశ్వదేవము నిర్వర్తించిన పిమ్మట గోపూజచేయవలయును. నారదా! దాని విధానము తెలుపుచున్నాను - వినుము - గోమాతా ! వైష్ణవీమాతా ! విష్ణుపదనివాసినీ ! సురభీ ! నీకు గో గ్రాసమిచ్చుచున్నాను. తినుము తల్లీ! ''గోభ్యశ్చనమః'' యనుచు గోమాతను పూజించి గోగ్రాసమీయవలయును. గోగ్రాసమువలన గోమాత - సురభి ప్రసన్నురాలగును. తర్వాత నావును పిదుకునంతవఱకు నతిథికొఱకెదురు చూడవలయును. ఏ యింటి నుండి యతి భగ్నాశుడై వెడలిపోవునో అతడా యజమాని పున్నెము గ్రహించి తన పాతకము యజమాని కిచ్చివేయును. తల్లి - తండ్రి - గురువు - సోదరులు - దాసులు - అశ్రితులు - అతిథి - అభ్యాగతుడు - అగ్ని - వీరందఱును యజమానునిచేత చక్కగ పూజింపబడదగినవారు. ఇట్లె ఱుంగియు నెవడు మోహ భ్రాంతిచే స్వార్థబుద్దితో గృహస్థాశ్రమము చక్కగ నిర్వర్తించడో వాని కీ లోకమునగాని పరలోకమునగాని ధర్మము తోడుగ నుండదు. ధనవంతుడగు ద్విజుడు సోమయాగమున నెట్టి ఫలితమొందునో బీదవాడును పంచ మహాయజ్ఞము లాచరించుటనట్టి ఫలితములు బొందును. మునిపుంగవా! ఇపుడు ప్రాణాగ్ని హోత్రమును తెలుపుచున్నాను. చక్కగ వినుము. దాని నాచ రించినవాడు జన్మమరణములు - ముదిమి మున్నగువాని నుండి విడివడును - దాని నెఱిగినప్పటికిని నరులు పాపముక్తులగుదరు. విధిప్రకారముగ భుజించునతడు ఋణత్రయమునుండి విముక్తుడగును. ఇట్టి విప్రుడు తన యిరువదొక్క తరముల వారిని నరకమునుండి సముద్ధరించగలడు. అతనికి సర్వ యజ్ఞ ఫలప్రాప్తియు సర్వలోక ప్రాప్తియును గల్గును. ఈ హృదయ కమ లము క్రింది యరణి; మనస్సు పై రెండవ యరణి - వాయువు త్రాడుగచేసి యగ్నిని మథించవలయును. కన్ను లధ్వర్యుడు; చూపుడు - నదిమి - బొటన వ్రేళ్లతో ప్రాణాహతులు వేసికొనవలయును. నడిమి - యుంగరపు - బొటనవ్రేళ్లతో నపానాహుతి వేసి కొనవలయును. ఉంగరపు - చిటికెన - బొటనవ్రేళ్లతో వ్యానాహుతి వేసికొనవలయును. చూపుడు - చిటికెన - బొటన వ్రేళ్లతో నుదానాహుతి వేసికొనవలయును. అన్ని వ్రేళ్లతో సమానాహుతి వేసికొనవలయును. ప్రణవము మొదట నుంచి స్వాహాంతముగ ''ప్రాణాయస్వాహా'' అను రీతిగనన్ని యాహుతులు వేసికొనవలయును. ముఖమం దాహవనీయము; హృదయమున గర్హ పత్యము. నాభౌ చ దక్షిణాగ్నిః స్యాదధః సభ్యావసథ్యకౌ | వాగ్ఘోతా ప్రాణ ఉద్గాతా చక్షు రధ్వర్యు రేవ చ. 31 మనో బ్రహ్మ భ##వేచ్చ్రోత్ర మాగ్నీ ధ్రస్థాన ఏవ చ | అహంకారః పశుశ్చాత్ర ప్రణవః పయ ఈరితమ్. 32 బుద్ధి శ్చ పత్నీ సంప్రోక్తా యదధీనో గృహశ్రమీ | ఉరో వేది స్తు రోమాణి దర్బాః స్యుః స్రుక్స్రువౌ కరౌ. 33 ప్రాణ మంత్రస్య చఋషీ రుక్మవర్ణః క్షుధాగ్నికః | దేవతాదిత్య ఏవాత్ర గాయత్రీ చ్ఛంద ఉచ్యతే. 34 ప్రాణాయ చ తథా స్వాహా మంత్రాంతే కీర్తయేదపి | ఇద మాదిత్యదేవాయ న మమేతి వదేదపి. 35 అపానమంత్రస్య తథా గోక్షీర ధవళాకృతిః | శ్రద్ధాగ్ని ఋషి రేవాత్ర సోమా వై దేవతా స్మృతా. 36 ఉష్ణిక్చంత స్తథా೭పానాయ స్వాహేత్యపి కీర్తయేత్ | సోమాయేదం చ నమమేత్యత్రోహః పరికీర్తితః. 37 వ్యానమంత్రస్య చాఖ్యాతో೭ంబుజవర్ణ హుతాశనః | ఋషిరుక్తో దేవతాగ్ని రనుష్టుప్చంద ఈరితమ్. 38 వ్యానాయ చ తథా స్వాహా೭గ్న యేదం నమమేత్యపి | ఉదానమంత్రస్య తథా శక్రగోప సవర్ణకః. 39 ఋషి రగ్నిః సమాఖ్యాతో వాయుర్వై దేవతా స్మృతా | బృహతీ చ్ఛంద ఆఖ్యాత ముదానాయ చ పూర్వవత్. 40 వయవే చేదం నమమ ఏవంచై వోచ్చరే ద్ద్విజః | సమానవాయు మంత్రస్య విద్యుద్వర్ణో విరూపకః. 41 ఋషి రగ్నిః సమాఖ్యాతః పర్జన్యో దేవతా మతా | పంక్తిశ్చందః సమాఖ్యాతం సమానాయ చ పూర్వవత్. 42 పర్జన్యాయేద మిత్యుక్తా షష్ఠీం చైవాహుతిం క్షిపేత్ | వైశ్వానరో మహానగ్నిః ఋషిర్వై పరికీర్తితః. 43 గాయత్రీ చ్ఛంద ఆఖ్యాతం దేవస్త్వాత్మా భ##వేదపి | స్వాహాంతో మంత్ర ఆఖ్యాతః పరమాత్మ ఉచ్చరేత్. 44 ఇదం న మమ చేత్యేవం జాతం ప్రాణాగ్నిహోత్రకమ్ | ఏతత్ జ్ఞాత్వా విధిం కృత్వా బ్రహ్మభూయాయ కల్పతే. ప్రాణాగ్నిహోత్ర విద్యేయం సంక్షేపాత్కథితా హి తే | 45 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే ద్వావింశో೭ధ్యాయః. నాభియందు దక్షిణాగ్ని - క్రింద సభ్యాగ్ని - అవసథ్యాగ్ని యున్నట్లు భావించవలయును. వాక్కుహోత - ప్రాణము ఉద్గాత - చక్షువు ఆద్వర్యుడు - మనస్సు బ్రహ్మ - శ్రోత్రము ఆగ్నీధ్రుడు - అహంకారము యజ్ఞ పశువు - ప్రణవము క్షీరము - బుద్ధి ఇల్లాలు - గృహస్థు డామెకు వశుడై యుండును. హృదయమువేదిక - రోమములు దర్బలు - రెండు చేతుల స్రుక్ స్రువములు- '' ఓం ప్రాణాయస్వాహా'' అను మంత్రము బంగారు వర్ణము. దీని బుషిక్షుధాగ్ని-దేవత సూర్యుడు - ఛందము గాయత్రి - ''ఓం ప్రాణాయస్వాహా'' అనిన పిదప ''ఇదమాది దేవాయ నమమ'' అని పలుకవలయును. అపాన మంత్రమునకు ఆవుపాల రంగు - శ్రాద్ధాగ్ని ఋషి - సోముడు దేవత - ఉష్ణిక్కు ఛందము - ''ఓం అపానాయ స్వాహా'' అని ''ఇదం సోమాయ న మమ'' అని పలుక వలయును. వ్యానమంత్ర మునకు పద్మము రంగు - హుతాశనాగ్ని ఋషి - అగ్ని దేవత - అనుష్టుప్పు ఛందము - ''ఓం వాయవే న మమ'' అని తర్వాత ''ఇదమగ్నయే నమమ'' అని పలుకవలయును. ఉదానమంత్రమునకు అరుద్రపురుగు రంగు అగ్ని బుషి-వాయువు దేవత-బృహతీఛందము-''ఉదానాయ స్వాహా'' యని పూర్వమువలె చేసి ''ఇదం వాయవే న మమ'' అని పలుకవలయును. నారదా! సమాన వాయుమంత్రమునకు మెఱుపురంగు - అగ్ని ఋషి - పర్జన్యుడు దేవత - పంక్తిఛందము; - ''ఓం సమానాయ స్వాహా'' అని వెనుకటివలె చేసి ''ఇదం పర్జన్యాయ న మమ'' అని యుచ్చరించవలయును. ''ఓం పరమాత్మనే స్వాహా'' అను మంత్రమునకు వైశ్వానరాగ్ని ఋషి; - ఆత్మ దేవత - గాయత్రి ఛందము ''ఓం పరమాత్మనే స్వాహా'' అని ''ఇదమాత్మనే న మమ'' యని పలుకవలయును. ఇదంతయును ప్రాణాగ్ని హోత్ర మనబరగును. దీని నెఱింగి యథా విధిగ నాచరించువానికి బ్రహ్మ భూయత్వము గల్గును. ఈ ప్రాణాగ్నిహోత్ర విద్యను నీకు సంక్షేపముగ తెలిపితిని. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి పదునొకండవ స్కంధమందు నిరువదిరెండవ యధ్యాయము.